LOCAL WEATHER

11, డిసెంబర్ 2014, గురువారం

మీకు ఉన్న గొడవలకి ఇక్కడకొచ్చి అల్లరి పెట్టటం సరైనదేనా తమిళ తంబులు....???

కర్టేసి: సాక్షి 

ఆంధ్రా రాష్ట్ర ప్రజల్ని రాజధాని లేకుండా తరిమికొట్టిన 
తమిళులని ఆదరిస్తున్న రాష్ట్రమిది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు కొట్టటంలో ప్రముఖ పాత్ర పోషించిన
 చిదంబరం అండ్ కో తమిళులని రానిస్తున్న రాష్ట్రమిది, 
మీ రాష్ట్రంలో తమిళం తప్ప మరో భాష కనపడ కూడదని 
తెలుగును కూడా చేరిపేయించినా...
ఇక్కడ తమిళులు తిరిగే ప్రతీచోటా 
తమిళంలో కూడా వ్రాసే పెద్ద మనసు ఉన్న రాష్ట్రమిది...... 
ఇక్కడ మాకూ మాకూ విభజన ఉద్యమాలు జరుగుతుంటే...
గోతికాడ నక్కలులాగా 
"మాకు తిరుపతీ-కాళహస్తిలను ఇప్పించండీ" 
అన్న తమిళ దుర్మార్గ రాజకీయ నాయకుడు 
రామస్వామిలాంటి వారిని కూడా క్షమించిన రాష్ట్రమిది....


"ఒక్క చుక్కనీరు కూడా వదలం..
వరదలు వచ్చి తప్పనిసరి అయిన పరిస్తితులలో మాత్రమే 
కృష్ణ నీళ్ళు వదిలాం" 
అన్న మాజీ కన్నడ ముఖ్యమంత్రి ధర్మసింగుని 
సాదరంగా ఆహ్వానించిన రాష్ట్రమిది...
షిరిడిలో తెలుగువారిపై దౌర్జన్యం చేస్తున్న మరాఠిలని ఏమీ అనని రాష్ట్రమిది...
ఉత్తరాదిన ఉత్తరాఖండ్  వరదలలో చిక్కుకున్న తెలుగు భక్తులని 
వారు అవమానించినా 
ఇక్కడికి వచ్చే ఉత్తరాదివారికీ గౌరవం ఇచ్చి 
వారి భాషలోనే మాట్లాడి
సహాయ సహకారాలు ఇస్తున్న రాష్ట్రమిది....
 చుట్టు ప్రక్కల ఉన్న రాష్ట్రాలలో  
తెలుగు ప్రజలని సెకండ్ సిటిజన్స్ గా  చూస్తున్నా... 
అందరినీ ఆదరిస్తున్న రాష్ట్రమిది...
 ఇలా తెలుగు వారిని 
అనేక ఇబ్బందులు కలిగించిన వారిని కూడా పట్టించుకోకుండా, 
వచ్చినవారికి  సాదరంగా మర్యాదని ఇచ్చే రాష్ట్రం ఇది... 


 అలాంటిది...
ఇంతమంది ఇబ్బంది కలిగించిన వారిని ఏమీ అనని తెలుగువారు...
ఏ మాత్రం సంబంధించని వారిని ఆహ్వానిస్తే తప్పేమున్నది...
 మీకు మీకు ఉన్న గొడవలకి 
ఇక్కడకొచ్చి అల్లరి పెట్టటం సరైనదేనా 
ఆలోచించండి తమిళ తంబులు....
అదీకాకుండా తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం...
అక్కడికి ఎక్కడి నుండో వచ్చి, 
గొడవలు చెయ్యటం సరైన పద్దతి కాదు...  


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


15, నవంబర్ 2014, శనివారం

రాజకీయాల్లో కిడ్నాప్ కలకలం....!!!

ఈ మధ్యకాలంలో ఒక పార్టికి చెందిన నాయకుడిని మరొక పార్టీ వారు వెనకేసుకునే కిడ్నేప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ కిడ్నేప్పులన్నిటికి కారణం ఏమంటే... ఆయా నాయకులని ఎవరికీ వారు తమ తమ పార్టీల స్వంత ఆస్థిగా భావించటమే... వారు దేశానికి ప్రధాని కానియ్యండి లేక దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించనియ్యండి, వారిని ప్రజల ఆస్థిగా కాకుండా పార్టీల ఆస్థిగా చూస్తున్నారు...దీనివల్లనే ఇవి కిడ్నేపులు లాగా కనపడుతున్నాయి...అయితే ఇది వారి మీద ప్రేమ కాదు,  కేవలం తమ ప్రత్యర్ధిని దెబ్బతియ్యటానికి ఈ రాజకీయాన్ని వాడుతున్నారు. ఇందుకోసం అవతల పార్టిలోని మరణించిన లేదా ఆ పార్టిలో పట్టు కోల్పోయిన నాయకులనే ఎంచుకుంటున్నారు..  ఆ నాయకులు పూర్వకాలంలో తమని తిట్టినా లేక తాము వారిని తిట్టినా వాటిని మరచినట్లు నటించి, ఆయా నాయకులని కిడ్నేప్ చేస్తున్నారు. ఈ రాజకీయం  అవతల కేవలం పార్టీ వారి నోరు మూయించటం కోసమే...... అందుబాటులో ఉన్న చరిత్ర ప్రకారం, ముందరగా ఎన్టిఆర్ గారిని తీసుకుంటే... ఆయన ఒక ప్రభంజనంలాగా వస్తూనే... "కాంగ్రెస్సు మూల ధనమైన" గాంధీ గారిని విపరీతంగా మెచ్చేసుకుని ఆయన సిద్ధాంతాలని కాంగ్రెస్సు వారు నిర్లక్ష్యం చేస్తున్నారని, వారు గాంధీగారు కలగన్న రాజ్యాన్ని  తేలేరని, ఆపనిని తాము చేస్తామని...కాంగ్రెస్సు నుండి గాంధీగారిని కిడ్నేప్ చేసే ప్రయత్నం చేశారు....


ఆ తరవాత కాలంలో ఎన్టిఆర్ గారు తమ పార్టీ నాయకుడైన చంద్రబాబు వలన దెబ్బతినటం, అధికారం కోల్పోవటం జరిగింది...ఇక అప్పుడు కాంగ్రెస్సు వారి వంతు వచ్చింది... తమని, తమ పార్టిని భయంకరంగా తిట్టి, అధికారం పోయ్యేట్లు చేసిన ఎన్టిఆర్ గారిని వేనేకేసుకుని వచ్చి, ఆయనని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని దరిదాపుల రెండు దశాబ్దాలుగా చంద్రబాబుని దెప్పి పొడుస్తూనే ఉన్నారు... ఈ కార్యక్రమంలో చాలా చక్కగా తన పాత్రని పోషించిన వారు వైఎస్సార్ గారు...దరిదాపుల తన 7 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించినా ఎంటీఆర్‌నే ఆయుధంగా తీసుకోని నోరేత్తనియ్యలేదు...ఈ విధంగా కాంగ్రెస్సు వారు  పెద్ద మనస్సుతో, చనిపోయిన ఎం.టీ.ఆర్‌ని కిడ్నేప్ చేసిపారేసారు...ఎన్టిఆర్ సహజంగానే కాంగ్రెస్సు వ్యతిరేకి అయినప్పటికీ....ఇక్కడ తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయిన ఎంటీఆర్‌ని తెలుగుదేశం వారే అవమానించటం కాగ్రేస్సుకి చక్కగా కలిసి వచ్చింది.


ఇక ఆ తరవాతి కాలంలో వైఎస్సార్ గారు మరణించటం, కాంగ్రేస్సుకి ఆయన కుమారుడు జగన్‌కి  సంబంధాలు చెడిపోవటం, ఆయన స్వంతంగా ఒక పార్టిని పెట్టెయ్యటం చకచకా జరిగిపొయినాయి... దాంతో మూల నేత కిడ్నేప్ కధ మళ్ళి మొదలైయ్యింది...ఆయన కుమారుడు ఊరూరా తిరుగుతూ తన తండ్రి విగ్రహాలని ప్రతిష్టిస్తూ తమ పార్టికి పునాదులు వేసుకుంటూ పోతుంటే...కాంగ్రెస్సు వారు చూస్తూ ఊరుకుంటారా.... జగన్‌ను ఎదిరించటానికి వేరెవరో ఎందుకు అని, అతని తండ్రి పేరును ఉపయోగించి, "వైఎస్సారు మా కాంగ్రెస్సు నాయకుడే" అనీ, ఆయనకీ ఈ కొత్త పార్టికి ఏమి సంబంధంలేదని, ఆయన విగ్రహాన్ని స్వంతంగా కాంగ్రెస్సు వారే ఆవిష్కరించేశారు. ఆయన ఆశయాలని కాంగ్రెస్సు వారు మాత్రమే తీర్చగలరు అనీ.... అప్పటిదాకా కాంగ్రెస్సులో వైఎస్సార్ వ్యతిరేక వర్గంలోఉన్న వారు కూడా వైఎస్సారుని కిడ్నేప్ చేసేశారు. అయితే, ఇక్కడ ఎవరి లేడర్ని ఎవరు కిడ్నేప్ చేశారన్నది చెప్పటం కష్టమే ... ఎందుకంటే, వైఎస్సార్ చనిపోయ్యేవరకు కాంగ్రెస్సు పార్టీలోనే ఉన్నారు...ఇదే ట్రెండు అంటే మన ఏంటిఆర్ మొదలెట్టిన సిద్దాంతాన్నే ఉత్తర దేశీయులు కూడా కాపి కొట్టి, తామూ రాజకీయాల్లో ఏమీ తక్కువ తినలేదని చూపిస్తున్నారు...మోడీ వలన దెబ్బతిన్న అద్వాని మీద కాంగ్రెస్సు వారు ఎనలేని జాలిని కురిపించి నిజానికి అద్వానీ మాత్రమే సరైన నాయకుడని, ఆయనే సెక్యులర్ వాది అని, రకరకాలుగా ప్రస్తుతించి, తాము  ఇంతకు ముందు అద్వానీని తిట్టిపోసినవి మరియూ ఆయనని అనేక కేసుల్లో పెట్టి నానా తిప్పలు పెట్టినవి మరచినట్లు నటించి మోడీ నుండి అద్వానీని కిడ్నేప్ చేసేసారు. తన రధయాత్ర ద్వారా ...బిజేపికీ పార్లమెంటులో ఒక సీటు నుండి వందల సీట్ల వరకూ తెచ్చిన అద్వానీ గారిని... మొదట వాజపేయి తరవాత మోడీ నిర్లక్ష్యం చెయ్యటం ప్రతిపక్షాలకి బాగా కలిసివచ్చింది...అయితే వడ్డీ వ్యాపారాలలో పేరొందిన గుజరాతు నుండి వచ్చిన మోడీ గారు తక్కువ తింటారా....అసలుతో పాటు వడ్డీ కూడా కాంగ్రెస్సు నుండి వసులు చెయ్యటం మొదలెట్టారు.... పాపం స్వాతంత్రం తరవాత కాంగ్రెస్సు వాళ్లకి తమకంటూ చెప్పుకోటానికి సరైన నాయకులు లేక అంతకు ముందు ఉన్న వాళ్ళతోనే ఏదో పబ్బం గడుపుకోస్తుంటే... వారి మీద మన మోదిగారికి కూడా కన్ను పడింది.... ముందరగా తమ రాష్ట్రానికే చెందిన ... కాంగ్రెస్సు వారు నిర్లలక్ష్యం చేసిన పటేల్ గారిని పైకి తెచ్చారు...అయితే, కాంగ్రెస్సు వారికి గాంధీ కుటుంబం కాని వారి మీద అంత ప్రేమ లేదు[వారు తమ పార్టీ వారు అయినప్పటికీ] కాబట్టి, పెద్దగా పట్టించుకోలేదు...

కానీ, మోదిగారు అక్కడతో ఆగుతారా...  వడ్డీ క్రింద స్వచ్చ భారత్  అని గాంధీగారిని కాంగ్రెస్సు నుండి వేరు చేస్తూనే ... స్వచ్చ భారత్‌కు  వాడే చిపిరి కట్టతో దిల్లోలోని ఆ గుర్తుగల పార్టిని ఊడ్చిపారేయ్యాలని నిర్ణయించుకున్నారు...(అయితే మోదిగారు పగ తిర్చుకోవాలిసినంత లెవెల్ ఈ చిపిరి పార్టీకీ లేదనుకోండి....)ఇక గాంధీగారి కిడ్నేప్ తరవాత... కాంగ్రెస్సు వారు గొప్పగా చెప్పుకునే నేహృని మడుకు ఎందుకు వదలాలి అని, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్సులో మిగిలేది ఒక ఇందిరాగాంధీ మాత్రమే...మరో సంవత్సరంలో చక్రవడ్డి క్రింద ఆవిడని కూడా మోదిగారు లాగేసుకుంటారనుకోండి... ఇక్కడ  కొసమెరుపు ఏమంటే...కాంగ్రెస్సు వారు మోడీని తిట్టటానికి నెహ్రు జయంతిని వాడుకోవటం... తప్పదు మరి వారికి....!!! 

@@@@@@@@@@@@@@@@@@@
బొమ్మల కర్టేసి గూగుల్ 

@@@@@@@@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


9, నవంబర్ 2014, ఆదివారం

అన్నం వండటం ఎలా...{ఇది నిజంగా వంట గురించే} HOW TO COOK RICE...?


ఈ మధ్యన విభజన వంటకాలలో పడి, బ్లాగులో... వంటకాల గురించి అంతగా వ్రాయలేదు... సరే, ఏదైనా కొత్తది వ్రాద్దాము అనుకుని చూస్తుంటే...ఫేసు బుక్కులో లేపాక్షి గారి "నీ వంటా నేను తింటా" కార్టూను చూసి నవ్వుకున్న తరవాత... అవును నిజమే... నిజంగా బియ్యంతో అన్నం సవ్యంగా వండటం తెలికేనా....ఒక్కొక్కసారి చాలా తేలిక అనుకునే విషయం కూడా నిజంగానే తేలిక కాదు. ఈ సంగతిని మనకు ఎదురైయ్యే మన చుట్టాలుగాని, స్నేహితులని గాని చూసినప్పుడు తెలుస్తుంది... 

నా చిన్నప్పుడు మా చుట్టాల అబ్బాయి అన్నం వండుకున్న విధానం గురించి చెప్పుకుని, మా పెద్దవాళ్ళు నవ్వుకున్నది చూశాను... అతను, మంచి ఉద్యోగం వచ్చి వేరే ఊరిలో ఉండి, వండుకోవాలిసిన పని పడింది. అతను... గిన్నె నిండా నీళ్ళు పోసి, అందులో మడుకు తనకి కావాలిసినంత బియ్యాన్నే వేసి ఉడకబెట్టేశాడుట... ఏమున్నది.. అది కాస్తా అన్నం కాకుండా జావై కూర్చుంది...ఇది కనీసం పాతికేళ్ళ నాటి సంఘటన...  అయితే, ఇది చాలామందికి వచ్చనుకోండి..అయితే రాని వాళ్ళకి "రాదు" అని చెప్పుకోవటం ఇబ్బంది కాబట్టి, వారు చెప్పుకోకపోవచ్చును ... అందుకని, అన్నం వండటం ఎలాగో  తెలుసుకుందాము...

కావాలిసినవి...

1] బియ్యం
2] నీళ్ళు
3] నిప్పులు[అదేలెండి గ్యాస్/కరెంటు మంట]
4] సరిపొయ్యే గిన్నె 

జాగ్రత్తలు: అన్నం వండటం తేలికే... కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోనితీరాలి.....మొదటిది...మంచి బియ్యాన్ని ఎంచుకోవటంలోనే అసలైన విషయం ఉన్నది. బియ్యానికి ఉన్న పేర్లతో సంబంధం లేకుండా...కొత్త బియ్యం, పాత బియ్యం అని ఉంటాయి...పాత బియ్యం వండటం తేలిక...తగినన్ని నీళ్ళు పోసి వాడితే సరిపోతుంది... అయితే, కొత్త బియ్యం వండేప్పుడు సరిగ్గా చూసుకోకపోతే అన్నం ముద్దై పోతుంది. అందుకని...ఎక్కువ నీళ్ళు [ఎసరు] పోసి ఒకసారి మరిగిన తరవాత, దానిలో కడిగిన బియ్యం వెయ్యాలి...ఒక ఉడుకు వచ్చిన తరవాత... ఎక్కువగా ఉన్న నీళ్ళని తగ్గించాలి[వార్చాలి]..ఆ వచ్చిన తెల్లని నీళ్ళే గంజి. ఇది కొత్త బియ్యం వండినప్పుడు ఎక్కువ వస్తుంది. దీనిని బట్టలకి స్టిఫ్‌గా ఉండటానికి పెట్టుకోవచ్చును.రెండవది... నీళ్ళు. నీళ్ళు కూడానా అని అనవద్దు. బ్లీచింగు/క్లోరిన్ కలిపిన మునిసిపల్ పంపు నీళ్ళు తగినన్ని పోస్తే చాలు, తొందరగా ఉడుకుతుంది...అవి కలపని మామూలు బోరింగు పంపు నీళ్ళలో నిమ్మదిగా అన్నం ఉడుకుతుంది... కాబట్టి నీళ్ళ ఎంపిక కూడా ముఖ్యమే. బోరింగు నీళ్ళు అయితే... అన్నం ఉడికేలోపల నీళ్ళు అయిపోకుండా కొద్దిగా ఎక్కువ పొయ్యాలి.  

ఇక మూడవది మంట ఎప్పుడు ఎంత మంట పెట్టాలి అనేది కూడా ముఖ్యమే ... మొదలు ఒకసారి పైకి నీళ్ళు పొంగేవరకు ఎక్కువ మంట పెట్టాలి...ఆ తరవాత అన్నం ఉడికేదాకా...తక్కువ మంట[సింలో]పెట్టాలి. కుక్కరుకైతే ఎక్కువ మంటనే పెట్టాలి.


పోసిన బియ్యానికి వచ్చిన ఉడికిన అన్నం 

నాలుగవది గిన్నె...ఇది రెండు రకాలుగా చూడాలి... గిన్నెలో నీళ్ళు-బియ్యం పోసినప్పుడు సరిపోయినది, ఉడికిన తరవాత సరిపోదు... అందుకని అన్నం ఎంత వండాలి అనే దాని మీద ఆధారపడి గిన్నె సైజు ఉండాలి...బియ్యం,నీళ్ళు పోయ్యగా, పైన తగినంత ఖాళి ఉండే గిన్నెని పెట్టాలి. ఏ గిన్నెలో అయినా బియ్యాన్ని సగం పైన కొద్దిగా మాత్రమే పొయ్యాలి. అంతకన్నా ఎక్కువ పోస్తే, ఉడికిన అన్నం సరిపోక...పొంగి పాడవుతుంది. రెండవది పలుచటి గిన్నెలు వాడరాదు. వీటిలో, పైన అన్నం ఉడికేలోపల... క్రింద ఉన్న అన్నం మాడిపోతుంది... అందుకని, స్టీలు అయినా ఇత్తడి గిన్నె అయినా మందంగా ఉన్నది వాడితే, గిన్నెలోని అన్నం మొత్తం ఒకేలాగా సరిగ్గా ఉడుకుతుంది.  ఇత్తడి గిన్నె అయితే అన్నం రుచిగా చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు అవి దొరకటం కష్టం, దొరికినా ఎక్కువ ధర ఉంటాయి...

కొలతలు:

సామాన్యంగా అన్నం వండేప్పుడు...ఒక డబ్బాడు బియ్యం లేక రెండు డబ్బాల బియ్యం అంటారేగానీ, అరకిలో/ఒక కిలో అని అనరు. ఒక డబ్బా అంటే షుమారు 400 గ్రాములు ఉండచ్చు. దానికి సరిపొయ్యే నీళ్ళు...బోరింగు నీళ్ళు అయితే మరికాస్త...బియ్యాన్నిబట్టి కూడా కొద్దిగా మార్పులు ఉంటాయి...

వండే విధానం:

కుక్కరు: 

కుక్కరులో క్రింద భాగంలో మూడు టి గ్లాసుల నీళ్ళు పోసి, బోరింగు నీళ్ళు అయితే దానిలో కొద్దిగా చింతపండు కానీ, వాడేసిన నిమ్మకాయ తోన గానీ, వెయ్యాలి...దీనివల్ల కుక్కరు అడుగు భాగం నల్లబడకుండా ఉంటుంది. సరే, కుక్కరు గిన్నెలో కావాలిసిన బియ్యం పోసుకొని... ఆ బియ్యం పైన రెండు వేలి గీతాలు[రెండు అంగుళాలు]ముణిగేట్లుగా నీళ్ళు పోసుకోవాలి. ఈ గిన్నెని కుక్కరులో పెట్టి మూతని చక్కగా లాక్ అయ్యేట్లుగా బిగించాలి...దాని మీద విజిల్ పెట్టాలి. ఇప్పుడు దానిని స్టవ్వు మీద పెట్టి...ఎక్కువ మంట పెట్టాలి.[సింలొ పెట్ట కూడదు]., రెండు లేక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి, కుక్కరును దింపెయ్యాలి... ఆ తరవాత, 15 నిమిషాల వరకూ మూత తీసే ప్రయత్నం చెయ్యకూడదు.... మంటని సింలొ పెట్టినా లేక మూడు విజిల్స్ కూతలు దాటి ఊరుకున్నా... అన్నం గిన్నెలో నుండి పొంగి కుక్కరులో పడిపోతుంది. ఈ కుక్కరుతో వచ్చెన ప్రమాదం ఏమంటే... కుక్కరు అడుగున తక్కువ నీళ్ళు పోసినా, అసలు నీళ్ళు పోయ్యకపోయినా, దానిలో ఉన్న నీళ్ళు పూర్తిగా ఆవిరి అయిన తరవాత కూడా స్టవ్వు మీద ఉంచినా... కుక్కరు పేలి పోతుంది.

గిన్నెలో ఎసరు విధానం:

ఇది కొత్త బియ్యంతో గానీ, తొందరగా మెత్తబడిపోయ్యే బియ్యంతోగాని వండే పద్దతి. ఇందులో...ముందరగా ఎక్కువ నీళ్ళు గిన్నెలో పోసి దానిని స్టవ్వు మీద పెట్టి బాగా మరగనివ్వాలి. అంతకు ముందే బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళు పోయ్యేట్లు చిల్లులు ఉన్న పళ్ళెంలో ఆరబెట్టాలి. నీళ్ళు బాగా మరగిన తరవాత... ఆ బియ్యాన్ని ఆ మరిగిన నీళ్ళలో వెయ్యాలి. అలా కొద్ది నిమిషాల ఉడికిన అనంతరం...ఎక్కువగా ఉన్న నీళ్ళ మొత్తాన్నీ వంచేసి...తిరిగి ఆ గిన్నెని  స్టవ్వు మీద పెట్టి[గిన్నె మీద మూత పెట్టి ఉంచాలి] సన్నని మంటతో రెండు మూడు నిమిషాలు ఉంచి దింపెయ్యాలి...అంతే, కొత్త బియ్యంతో కూడా అన్నం మెత్తబడకుండా చక్కగా వస్తుంది....

గిన్నెలో మాములుగా:


పోసిన బియ్యం పై నుండి చూడాలి 

ఒక డబ్బాడు బియ్యం... దీనిలో తగినన్ని నీళ్ళు...ఈ తగినన్ని నీళ్ళు పోయ్యటంలోనే అన్నం ఆకారం ఉంటుంది. దీనికిగాను, నీళ్ళు కొలవఖర్లేదు. బియ్యం పోసి... పోసిన బియ్యంపైన[గిన్నె అడుగు నుండి కాదు] చేతివేళ్లు పెట్టి, రెండున్నర వేళ్ళ గీతలు మునిగేదాకా నీళ్ళు పొయ్యాలి.[పంపు నీళ్ళు అయితే రెండు, బోరింగు అయితే రెండున్నర గీతలు ముణగాలి].


తరవాత గిన్నె మీద మూత పెట్టి...స్టవ్వు మీద పెట్టి,  స్టవ్వు వెలిగించి పెద్ద మంట పెట్టాలి. అది ఉడుకుతూ పొంగుతుంది...అప్పుడు మూతని కొద్దిగా ప్రక్కకి తొలగించి పెట్టి... 
మంటని  సింలో పెట్టాలి. అలా అన్నం ఉడికేదాకా ఉంచాలి... 
ఉడికింది అని తెలియాలంటే...  గిన్నెలో నుండి తెల్లటి నీటి ఆవిరి వస్తుంది 
 అప్పుడు గిన్నెని దింపెయ్యాలి. 
ఇంకా అనుమానంగా ఉంటే...గట్టు మీద కొద్దిగా నీళ్ళు పోసి... 
దాని మీద గిన్నెని పెడితే, ఆ నీళ్ళు కాలిన సౌండ్ కొద్దిగా వస్తుంది...


అంతే అన్నం ఉడికినట్లే....అయితే, అన్నం ఉడికిన వెంటనే కాకుండా ఒక అరగంట తరవాత  తింటే,
దానిలో నీళ్ళు తగ్గుతాయి, మెత్తగా  లేకుండా  చక్కగా ఉంటుంది.
@@@@@@@@@@@@@@


ఇందులో ఇంతకు ముందు వచ్చినవి 


22, అక్టోబర్ 2014, బుధవారం

నేరం నాయకులది...శిక్ష రాహుల్ గాంధీకా...!!!

కాంగ్రెస్సు ఓటమికి తామేమి కారణం కాదు, 
అంతా రాహుల్ దేనని, 
ప్రియాంకా కావాలని 
కార్యకర్తలచే ఎంతో అమాయకంగా నాటకం ఆడిస్తున్నారు... 
లోకల్ అవినీతి నాయకులు. 
ప్రియాంక కన్నా రాహుల్ 1000 రెట్లు బెటర్.
కానీ, కాంగ్రెస్ నాయకులు 
తాము చేసిన తప్పులకి రాహుల్ గాంధిని బాధ్యుడిని చేసి 
తమ తప్పుల  నుండి తప్పుకుంటున్నారు. 
చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు 
కాంగ్రెస్స్ నాయకులు రాహుల్ గాంధిని అడిగి పరిపాలన చెయ్యలేదు...
అవినీతి చెయ్యలేదు... 
అది కేవలం కాంగ్రెస్స్ అధిష్టానమే చూసుకుంది...
నిజానికి రాహుల్ గాంధి అవినీతిపరుడా...కాదు. 
ఎందుకంటే ఏ అవినీతి ఆరోపణలలో లేడు. 
ఉంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారేగాని రాహుల్ లేడు... 
కేవలం ఎన్నికలప్పుడే రాహుల్‌ని తెచ్చి ముందర నుంచోబెట్టి, 
"ఇతను సరైన నాయకుడు కాదు" అని ఎలా చెప్పగలరు...?  
రేపు ప్రియాంకా వధేరా వస్తే సాధించేది ఏమున్నది...???
 ఈవిడ భార్తగారు చేసిన అవినీతి పనులు ఇప్పటికే కాంగ్రేస్సును ముంచేసినాయి..
ఆ పాపం కూడా రాహులే మోయ్యాలిసి వచ్చింది...
పైగా ఇది మోడీ సమయం...
కాబట్టి, కాంగ్రెస్సు నాయకులలాగా కాకుండా 
పక్షపాతం లేకుండా 
కాంగ్రెస్సు దేశవ్యాప్తంగా ఓడిపోవటానికిగల కొన్ని కారణాలు చూద్దాం...

1] ఆంధ్రా....విభజన పాపం మరియూ  10 సవత్సరాల దిక్కుమాలిన పరిపాలన. 
2] తెలంగాణా....విభజన జరిగిన విధానం...ఐకమత్యం లేని 
   స్వయం ప్రకాశంలేని మసిబట్టిన లోకల్  కాంగ్రెస్ నాయకులు.  
3] హర్యాణా...10 సంవత్సరాల అవినీతి పాలన...మోడీ హవా...
4] గుజరాత్... మోడీ హవా...
5] మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్...ఐకమత్యం లేకపోవటం... ఉడిగిన లోకల్  నాయకత్వం, 
6] మహారాష్ట్రా, రాజస్థాన్... లోకల్ నాయకుల అవినీతి మరియూ పనికి మాలిన పరిపాలన 
7] ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఝార్‌ఖండ్, వెస్టు  బెంగాల్... 
   వీటిలో కాంగ్రెస్స్ మట్టి కరచి ఎన్నో "ఎన్నికలు గడుస్తున్నాయి"...!!! 
8] భారతదేశ ఎన్నికలు... కాంగ్రెస్సు 10 సంవత్సరాల 
   చదువోచ్చిన పిచ్చి పరిపాలన...మోడీ హవా... 
9] శనిలా పట్టిన కాంగ్రెస్సు సీనియర్ నాయకులు. 

పైవన్నీ మోడికి ఎలా కలిసి వచ్చినాయో... రాహుల్‌కి అలా మైనస్ పాయింట్లు అయినాయి. ఈ కారణాల్లో ఎక్కడా రాహుల్ ప్రమేయం ప్రత్యేక్షంగా లేదు... అయితే, పెద్ద పార్టీలలో "పార్టీ గెలుపు కేవలం ముఖ్యనాయకుడి వల్లనే వస్తోంది" అని అనిపించుకోటానికి, ఆయా నాయకులు, వారి సొంత దారులు తాపత్రయపడుతున్నారు...ఇలా రాజకీయాల్లో విజయం మొత్తం... తమ నాయకుడి వల్లనే వస్తుందనే భావం సృష్టించటం వల్లనే, అపజయాల భారం నాయకుడు మోయ్యవలసి వస్తోంది...క్రింది నాయకులకి కూడా ఇది హాయిగానే ఉన్నది...తాము లోకల్‌గా ఎన్ని పాడు పనులు చేసినా... అది పెద్ద నాయకుడి మీదుగానే పోతుంది గాని వీరికి తగలదు... కాబట్టి, గెలిచినా ఓడినా వారికి తగలటంలేదు. నిజానికి "ఇది సమిష్టి బాధ్యతే గాని ఏ ఒక్కరిదో కాదు". ఇలా అని పార్టీ పెద్దలు కూడా ప్రచారం చేస్తే, అప్పుడు తప్పొప్పుల భారాన్ని అందరూ పాలు పచుకోవటమే కాకుండా...లోకల్‌గా ఉండే నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజల కోసం పనిచేస్తారు...దీనిని ఆమోదించాలి అంటే... రాజకీయాలలో వ్యక్తి సామ్యం/ఆరాధన పోవాలి, ప్రజలనే నాయకులుగా/హీరోలగా గుర్తించాలి... అప్పుడే నిజమైన ఫలితాల విశ్లేషణ వస్తుంది. 

ఇక్కడ, మన ఎన్నికల విశ్లేషకుల గురించి చెప్పుకోవాలి....ఎంతో ఘనత వహించిన వీరు కూడా ఎన్నో వివరించి, అసలు విషయం అయిన ప్రజలని... మరచి పోతున్నారు. ఎంత గొప్ప నాయకులనబడే వారున్నప్పటికి, ప్రజలని పరిగణలోనికి తీసుకోకుండా... ఆ నాయకుడుంటే గెలుస్తారు, ఈ నాయకుడుంటే ఓడిపోతారు అని తమకి తోచిన విధంగా విశ్లేషణలు చేసిపారేస్తున్నారు... జరిగేది, జరిపించేది ప్రజలే... ప్రజలు పార్టీని ఆమోదించినప్పుడు ఈ విశ్లేషకులు అది పరిగణలోనికి తీసుకోకుండా ఆ నాయకుడిని పైకేత్తేస్తారు...

ఉదాహరణకి...ఆంధ్రాలో వైఎస్సార్ చంద్రబాబుని దింపినప్పుడు 220 సీట్ల దాకా వచ్చినాయి.... అది వై ఎస్సార్ గొప్పతనమన్నారు.... అదే అయిదేళ్ళ వై ఎస్సార్ పరిపాలన తరవాత కాంగ్రెస్సుకి 157 మాత్రమే వచ్చినాయి... ఇక్కడ తెలుసుకోవలసింది నాయకుడి గొప్పతనం కాదు... పాత అధికార పార్టి వాళ్ళు చేసిన తప్పులు అధికారం లేని నాయకులకి కలిసి వస్తాయి అనేది. అలా కలసి రావటానికి మూలం ప్రజలే... వారిని ఎవరు సంతృప్తి పరుస్తారో వారికి ఓట్లు వెయ్యటమే కాకుండా...అసంతృప్తి పరచిన వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. దీనిని నాయకుల గొప్పతనం అనుకుంటే...ఓటమిలో కాలిసినట్లే... 

ఇక రాహుల్ గాంధి విషయానికి వస్తే... 
తమ పిల్లలకి ఏమి ఇబ్బంది వస్తుందో అని 
ముద్దు చేసే తల్లిదండ్రులు ప్రక్కన ఉండి పిల్లలని నడిపిస్తే, 
వారికి మొద్దులుగా ఎలా పేరు వస్తుందో...
అదే రాహుల్‌కి వచ్చింది... 
నిజంగా రాహుల్ గాంధి నాయకత్వం ఏమిటో తెలియాలంటే... 
సోనియా పూర్తిగా విశ్రాంతి తీసుకొని,  
ఇప్పుడు రాబొయ్యే ఐదేళ్ళు 
అతనినే దేశంలోని కాంగ్రెస్సు మొత్తానికి నాయకుడిని చేసి,  
కాంగ్రెస్సు నాయకులందరూ రాహుల్ మాట మీదే నడచి... 
అతని మాటతోనే కాంగ్రెస్సుని నడిపించి... 
ఆ తరవాత వచ్చే ఎన్నికల ఫలితాలని చూస్తే గాని 
అతని నాయకత్వ పటిమ తెలియదు...
 రాహుల్ గాంధి కూడా మోడీ తరహాలో 
ఏ అమిత్ షా లాంటి వాడినో సహచరుడిగానో...
సలహాదారుడిగానో పెట్టుకుంటే...
మోడీ అంతటి నాయకుడు కాకపోయినా 
కనీసం మోడికి పోటి అయినా ఇవ్వగల నాయకుడిగా అవుతాడు....
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నాయకుడు 
మోడీ తరవాత రాహులే...
ఈ సంగతి సోనియాకి ఎవరు చేప్తారబ్బా...!!! 

ఇది కేవలం భారతదేశంలో జరిగిన ఎన్నికల విశ్లేషణ గురించేగాని... కాంగ్రేస్సునుగానీ, రాహుల్ గాంధిని గానీ వెనకేసుకుని రావటం కోసం కాదు.  కాంగ్రెస్సు లాంటి దేశవ్యాప్త పార్టి మరొకటి లేదనే చెప్పాలి...అయితే, ఇప్పుడిప్పుడే బిజెపి కూడా అలాంటి వ్యవస్థని దేశవ్యాప్తంగా ఏర్పరచుకుంటోంది. బిజెపి "కాంగ్రెస్సు హఠావో" అంటోంది కాని, దాని స్థానాన్ని భర్తీ చేసే మరో పార్టి వచ్చే దాకా కాంగ్రెస్సు ఉండాలిసిదే...అది ఎలాంటి పార్టి అయినప్పటికీ... ఎందుకంటే, కాంగ్రెస్సు పార్టీకి పల్లెల నుండి మహానగరాల వరకూ...కేరళా నుండి మిజోరాం వరకు ఉన్న వ్యవస్థ మరొక పార్టికి లేదనే చెప్పవచ్చును... అందుకని కాంగ్రెస్సు హఠావో అనేకన్నా "స్వచ్చ కాంగ్రెస్" అంటే దేశానికి మంచిది. దేశంలో కనీసం రెండు బలమైన పార్టీలు ఉంటేనే అది ప్రజాసామ్య దేశం అవుతుంది...కాంగ్రెస్సులో  ప్రస్తుతం ఉన్న వ్యక్తుల్ని చూసి, ఆ పార్టీని హఠావో అనటం సరికాదు. 

దీనికి ఉదాహరణగా... 
ఒంగోలులోని ఒక ఆటో డ్రైవరు మాటలు. 
ఆటో ఎక్కినాయన... 
"విభజన ఇంత భయంకరంగా చేసిన కాంగ్రెస్ జెండా 
కనపడకుండా చెయ్యాలి" అని 
 విభజన తరవాత వచ్చిన ఎన్నికల సందర్భంగా అన్నాడు... 
దానికి  ఆటో డ్రైవరు జవాబు...
"బాధ్యత వహించాలిసిన ఆ పార్టిలో ఉన్న వారు
వేరే పార్టిలలో దూరిపోతే...
మిగిలిన ఆ జెండా ఏం పాపం చేసింది" అని అన్నాడు.
నిజమే... 
పార్టి అంటే జెండా లేక పేరు కాదు కదా.. 
అందులో ఉన్న వ్యక్తులే కదా. 
ఆ పార్టిలో ఉండి, చెయ్యాలిసిన చెత్త అంతా చేసేసి...
ఆ తప్పుని పార్టి మీదకు తోసేసి,
వారు కాస్తా ఏ మాత్రం బాధ్యతా వహించకుండా
వేరొక పార్టీలోనికి పొతే.. 
వారిని చక్కగా తమ తమ పార్టీలలోనికి ఆహ్వానిస్తే
అది కాంగ్రెస్ హఠావో అవుతుందా....???

ఇదంతా ఎందుకంటే...
ఎలాగూ ఏ ఐదేళ్ళకో పదేళ్లకో
మళ్ళి కాంగ్రెస్సే కీలక పార్టి అవుతుంది
" ఏ నాయకత్వం ఉన్నప్పటికీ"...
అప్పుడు ప్రియాంకా వధేరా కన్నా
రాహుల్ గాంధీ ఉంటేనే దేశానికి మంచిది...


@@@@@@@@@@@@@


\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
అంరికి దీపాళి శుభాకాంక్షలు
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి:సాక్షి 18, అక్టోబర్ 2014, శనివారం

హుదూద్ తుఫానా లేక టోర్నడోనా...ఫోటోలు

హుదూద్ తుఫాను.
అక్టోబర్ 8 నుండి 12 సాయంత్రం వరకు.
అండమాన్స్ దగ్గర బయలుదేరి విశాఖ మీదుగా దాటి ఛత్తీస్ఘర్ వరకు 
హుదూద్ పయనం.
ఈ తుఫాను విశాఖ మీదుగా వెళ్లి ధ్వంసం చేసిన సందర్భంగా
 మన మీడియా వాళ్ళు రకరకాలైన పేర్లు పెట్టారు. 
విషాద పట్టణం
విశోక పట్టణం
విషాక్ నగరం
 ఏ పేర్లు పెట్టినా...తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల 
మనోభావాలు దెబ్బతినకుండా...
వారికి ఆర్ధికంగా బలాన్ని ఇవ్వలేకపోయినా, 
కనీసం మానశిక బలాన్ని ఇచ్చేట్లు 
మీడియా వారు, 
ఫేస్ బుక్ లాంటి సోషల్  మీడియా వారు వ్యవహరిస్తే మంచిది.

అంతేగానీ, ఎవరినో సపోర్టు చేయ్యలేదనో...
వేరేవారి ప్రాంతానికి అన్యాయం చేసారనో...
మరింకేదనో...అంటూ... 
మానవత్వం మరచి 
పిశాచులు లాగా ప్రవర్తించి 
రాక్షసానందం పొందాలి అనుకుంటే... 
అది అలా ప్రవర్తించే వారి మనుగడకే మంచిది కాదు.
ఆంధ్రాలోని విశాఖ మీద రకరకాలుగా ఆధారపడి 
ప్రక్కనున్న తెలంగాణా, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్  వంటి రాష్ట్రాలు 
బ్రతుకుతున్నాయని తెలుసుకుంటే మంచిది.
భారతదేశ తూర్పు తీర రక్షణ మొత్తం 
ఇక్కడి నుండే జరుగుతుంది.
అంతేకాదు,
దేశంలోని ఏ ప్రాంతానికి ఇబ్బంది వచ్చినా 
ప్రత్యేక్షంగానో పరోక్షంగానో అందరికి ఇబ్బందే...


 తుఫాను భీభత్స దృశ్యాలు...
ఈ క్రింది లింకు నొక్కండి...
78 PHOTOS

------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------
తుఫాను బాధితులకి 
సహాయం చెయ్యాలి అనుకునే వారికి
Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  
 రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు.
బ్బులు వేసే ముందర ఈ అక్కౌంట్ ని నిర్ధారణ చేసుకోండి.
------------------------------------------------------------------------------------------------ 
------------------------------------------------------------------------------------------------ 


చివరిగా, 
ఈ తుఫానులకి పేర్లు పెట్టేప్పుడు అందమైన, 
ప్రశాంతమైన వాటిని ఎంచుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే...
ఈ తుఫానులు చేసే భీభత్సం 
ఏ పాపం తెలియని వాటికి 
 చెడ్డ పేరు తెస్తుంది. 
అందుకని,
ప్రతీదానికి మేమున్నాము 
మా ముత్తాతల పేర్లు పెట్టండి...
మా తాతల, తండ్రుల పేర్లు పెట్టండి...
మా వాళ్ళ పేరే పెట్టండి 
అనే రాజకీయ నాయకుల పేర్లు 
తుఫానులకి పెడితే సమంజసంగా ఉంటుంది.
అర్ధవంతంగా కూడా ఉంటుంది. 

****
తుఫాను కదలికల్ని వివరించిన క్రిందటి పోష్టు.
లింకు నొక్కండి
****


@@@@@@@@@@@@@@@@@
ఆంధ్రప్రదేశ్ లో  ఇంతకు ముందు వచ్చిన
1977 నవంబర్ 19న వచ్చిన భీకర తుఫాను లింక్ 


ఈ తుఫాను వచ్చిన కాలంలో...
దేశమంతా జనతా పార్టి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది.
జనతాపార్టికి చెందిన "రాజ్ నారాయణ్" అనే రాజకీయ వేత్త...
"మా జనతా పార్టిని ఓడించారు, అందుకనే మీకు తుఫాను దెబ్బ తగిలింది" 
అని కామెంటు చేసి విమర్శల పాలు అయ్యాడు.
తరవాతి కాలంలో 
ఆ నాయకుడు "రాజకీయ జోకర్"గా ప్రసిద్ది గాంచాడు...
ఆ పార్టి కూడా మట్టిలో కలిసిపోయింది. 
@@@@@@@@@@@@@@@@@