కొత్త జిల్లాలు అంటూ ఓ విషయం మరో సారి తెరపైకి వచ్చింది...అయితే ఇదేమీ మొదటి సారి కాదు... కొన్నాళ్ళు వార్తల్లోకి రావడం వివాదాలు వలననో మరి దేని వల్లనో ఈ విషయం తెరమరుగు అవుతోంది...అయినా...కాకపోయినా... ప్రతీ సారీ కొత్త జిల్లాల స్వరూపం అంటూ... వారిచ్చే మేపులు వివాదాస్పదం అవుతున్నాయి... ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్‌ని విభజించినంత అడ్డదిడ్డంగా విభజన చెయ్యటం వలన ఎవరికి లాభం కలుగుతోందో తెలియదు గానీ... ప్రజలకి ఇబ్బందులు పెంచుతోందీ వ్యవహారం.
ఉదాహరణకి... విజయవాడ నగరాన్ని తీసుకుంటే....ఇక్కడో జిల్లా కేంద్రం ఏర్పడుతున్నప్పటికీ ...కొత్త జిల్లాల ప్రకారం నగరంలో మూడో వంతు ప్రక్క జిల్లా మచిలీపట్నం లోనికి వెళుతోంది.... అలా వెళ్లి ఇలా వెళ్ళి పనిచేసుకునే అవకాశం విజయవాడ దగ్గరలో ఉండగా, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నానికి వెళ్ళాలిసి వస్తుంది... దీనికి ఆశాస్త్రీయమైన విభజనే కారణం. జిల్లాల విభజన కోసం పరిగణలోనికి తీసుకున్నది పార్లమెంటు నియోజక వర్గాలని.... వీటిని ఆధారం చేసుకుంటే తేలిగ్గా విభజించేయవచ్చు.... దీని వలన విభజన పని తగ్గచ్చేమోగానీ... ప్రజలకి దశాబ్దాల పాటూ పాట్లు తప్పవు....
అసలు పార్లమెంటు నియోజక వర్గాలని అనుసరించే జిల్లాలు ఉండాలా... లేక ప్రజల అవసరాలని బట్టి ఉండాలా.... ఎందుకంటే... నియోజక వర్గాలు ఆయా ఓటర్ల సంఖ్యని బట్టి... ఎక్కడో దూరంగా ఉన్న ఊళ్ళని కూడా కలిపి చెయ్యాలిసి ఉంటుంది.... ఇందులో ప్రజల అవసరాల కంటే... ఓటర్ల సంఖ్యే ప్రధానంగా కనపడుతుంది.... కాబట్టి వీటిని ఆధారంగా చేసుకుని జిల్లాలని చేస్తే... ప్రజల అవసరాలకి న్యాయం జరగదు....కొత్త జిల్లాల విభజన అంటే... ప్రజలకి పాలన మరింత అందుబాటులోనికి రావటం......ఈ జిల్లాలు కనీసం మరో 50 ఏళ్ల పైన ఇదే స్వరూపంలో ఉండి, ప్రజలకి పాలన అందుబాటులో ఉండేట్లు ఉండాలి.....దీనికి గానూ ఓ కమిటి క్రింది స్థాయి వరకూ వెళ్ళి పరిశీలించాలిసి ఉన్నది....
ఆ కమిటి సభ్యులు ఇప్పటికే ఉన్న 13 జిల్లాలలో పర్యటించి.... ప్రజల అభిప్రాయాలని-అవసరాలని-వారి కదలికలు ఏ నగరం వైపుకి ఉన్నాయో....వారికి ఏది ప్రయాణ సౌకర్యంగా ఉన్నదో చూసి.... దానిబట్టి జిల్లాల విభజన చెయ్యాలి.... ఉదాహరణకి: గన్నవరం మచిలీపట్టణం జిల్లాలోనికి వెళుతుంది....అయితే, గన్నవరం నుండి బస్ లేక రైలు కనెక్టివిటి సౌకర్యం లేదు..... అందువలన పార్లమెంటు పరిధిని పరిగణలోనికి తీసుకోకూడదు.... అలాగే, రాజకీయ ప్రాబల్యం కోసమో... ఉద్యోగుల అవసరాల కోసమో.... లేక సామాజిక వర్గ విభజన కోసమో జిల్లాల తయారి ఉండకూడదు....
ఆంధ్ర రాష్ట్ర విభజన రెండు సార్లు జరిగిన సందర్భంగా అప్పుడు ఉన్న రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం అనేక "తెలుగు--ఊళ్లు--జిల్లాలు"ప్రక్క రాష్ట్రాల వారికి వెళ్ళిపోయినా చూస్తూ ఉండిపోయ్యారు. ఉదాహరణకి...వెల్లూరు-బళ్ళారి-కోలార్-రాయచూర్-భద్రాచలం-అశ్వారావుపేట-సత్తుపల్లి-కోదాడ-గంజాం లాంటి ప్రాతాలు అనేకం ఆంధ్రా నుండి దూరం అయినాయి....
రాజకీయ అవసరాలు మారుతుంటాయి... రాజకీయ నాయకులు వస్తుంటారు..."పోతుంటారు"... కానీ జిల్లాలు ఇలానే ఉండి ప్రజలకి సేవలు అందిస్తుంటాయి....కాబట్టి, ప్రస్తుత అవసరాలు కాకుండా దశాబ్దాల ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని విభజన చెయ్యాలి...
మరో సంగతి.... జిల్లాల పేర్లు... అవి సున్నిత అంశాలుగా..... రాజకీయ అంశాలుగా అవసరాలుగా ఉండ కూడదు.... పేరు పెట్టేటప్పుడు.... ఆయా జిల్లాలని మార్చాలన్నప్పుడు అనేక వర్గాల నుండి "మనోభావాల" పేరుతొ అనవసర గందరగోళం జరిగే అవకాశం ఉన్నది.... అందువలన, జిల్లాలకి రాజకీయ నాయకుల పేర్లు కాకుండా.... ఆయా జిల్లాలలో ఉన్న ఊళ్ళ పేర్లు, కొండల పేర్లు, నదుల పేర్లు, దేవుడి పేర్లు ఉన్నట్లయితే బాగుంటుంది... "దేవుడి పేరైతే అసలు ఏ ఇబ్బంది ఉండదు....ఎందుకంటే.... ఏ అవసరం వచ్చినా ఏ గుడినైనా ఇట్టె కూల్చేయ్యగల సమర్ధ నాయకులు మనకున్నారు"... కాబట్టి....దేవుడి పేరుతొ ఉన్న జిల్లాల విభజనగానీ, పేరు మార్చటానికి ఏ ఇబ్బంది ఉండదు...
"ఇప్పటికి ఉన్న 13 జిల్లాలు వాటివాటి స్వంత సంస్కృతిని ఐడెంటిటీ కలిగి ఉన్నాయి"..... వాటిని అడ్డదిడ్డంగా విభజించటం కొరివితో తలగోక్కున్నట్లు అవుతుంది....అందువల్ల, పదమూడు జిల్లాల స్వరూపం మారకుండా.... ఆయా జిల్లాలనే రెండుగా మారిస్తే ఏ గొడవా ఉండదు.... ప్రక్క జిల్లాలు అన్న మాట ఉండదు.... దీనికి పార్లలమెంటు సెగ్ మెంట్లు ముడి పెట్టకుండా, అసెంబ్లి నియోజక వర్గాలని ఆధారం చేసుకుని........ప్రజల అవసరాలు ఏ ఏ ఊళ్ళ వైపు ఉన్నాయో వాటిని గమనించి వాటిని ముఖ్య పట్టణంగా చేసి జిల్లాలని చేస్తే బాగుంటుంది....దీని ప్రకారం....
శ్రీకాకుళం:
01] పలాస జిల్లా : ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం,
02] శ్రీకాకుళం జిల్లా [అరసవల్లి జిల్లా]: ఎచ్చెర్ల, రాజాం, శ్రీకాకుళం,
ఆమదాలవలస, పాలకొండ.
-----
విజయనగరం:
03] పార్వతీపురం జిల్లా : కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు.
04] విజయనగరం జిల్లా : S.కోట, విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల.
----
విశాఖపట్నం:
05] నర్సీపట్నం జిల్లా: పాడేరు, నర్సీపట్నం, అరకు, మాడుగుల, చోడవరం.
06] విశాఖపట్నం జిల్లా [సింహాద్రి జిల్లా]: భీమిలి,పెందుర్తి, విశాఖ-4, గాజువాక,
అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట.
----
తు.గో జిల్లా:
07] రాజమండ్రి జిల్లా [ రాజమహేంద్రి జిల్లా]:రంపచోడవరం, రాజానగరం, జగ్గంపేట, రాజమండ్రి, రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, కొత్తపేట.
8] కాకినాడ జిల్లా[తు.గో.జిల్లా] : ప్రత్తిపాడు , తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం , ముమ్మడివరం అమలాపురం,గన్నవరం, రాజోలు.
----
ప.గో.జిల్లా :
9] ఏలూరు జిల్లా [ హేలాపురి జిల్లా]:కొవ్వూరు, పోలవరం,గోపాలపురం, చింతలపూడి,
దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు,
10] భీమవరం జిల్లా [ప.గో.జిల్లా]:నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు,
ఉండి, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం.
----
కృష్ణ:
11] విజయవాడ జిల్లా [పశ్చిమ కృష్ణ జిల్లా]: జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు,
గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్.
12] మచిలీపట్టణం జిల్లా[తూర్పు కృష్ణ జిల్లా]: కైకలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్టణం, పెడన.
----
గుంటూరు:
సత్తెనపల్లి,వినుకొండ, నరసరావుపేట.
14] గుంటూరు: మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల,
పత్తిపాడు, వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, చిలకలూరిపేట.
---
ఒంగోలు:
15] మార్కాపురం జిల్లా : యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి,
16] ఒంగోలు జిల్లా: అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు,
ఒంగోలు, కొండెంపి , కందుకూరు,
---
నెల్లూరు:
18] నెల్లూరు జిల్లా[దక్షిణ పెన్నా జిల్లా]: నెల్లూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి,
వేంకటగిరి, గూడూరు, సూళ్ళురిపేట,
---
చిత్తూరు:
20] తిరుపతి జిల్లా [బాలాజీ జిల్లా]: చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, గంగాధర నెల్లూరు.
---
అనంతపురం:
21] అనంతపురం జిల్లా: రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు,
తాడిపత్రి, అనంతపురం, సింగనమల.
22] పుటపర్తి జిల్లా: హిందూపురం, మడకశిర, రాప్తాడు, పెనుకొండ, ధర్మవరం, పుటపర్తి, కదిరి.
----
కర్నూలు:
23] కర్నూలు జిల్లా: పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ.
24] నంద్యాల జిల్లా [శ్రీశైలం జిల్లా]: దొన్. బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికోట్కూరు,శ్రీశైలం.
----
కడప:
25] కడప జిల్లా: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలపురం. కడప, బద్వేల్.
26] పులివెందుల జిల్లా: పులివెందుల. రాయచోటి, రాజంపేట, కోడూరు.
షుమారుగా పై విధంగా చేసి, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రక్క జిల్లా ఊళ్ళని కూడా... ఆయా జిల్లాల ప్రజాభిప్రాం సేకరించి....కలప వచ్చును.... జిల్లాలని చేసేది ప్రజలకి పాలన మరింత చేరువ అవటానికే అని ఉంటే చాలు...చాలా చక్కగా జిల్లాలని విభజన చెయ్యవచ్చును....
ఇది ఇలా ఉంటే...
ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరిన తరవాత కొన్ని చోట్ల ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తుండగా...
చాలా చోట్ల ఇదేదో ప్రభుత్వ వ్యవహారం అనుకుంటున్నారు....
ఎంతో రాజకీయ చైతన్యం ఉన్నదనుకున్న విజయవాడ వాసులకి ఏ మాత్రం చిమ కుట్టినట్లైనా లేదు...
ఓ ప్రక్కన విజయవాడ నగరంలో మూడో భాగం మచిలిపట్నానికి వెళుతున్నా....
మరోప్రక్క, నూజివీడు-కైకలూరు ప్రాంతాలు ప్రక్క జిల్లాలో కలుస్తున్నా ఏ మాత్రం అభ్యంతరాలు చెప్పటం లేదు....
చైతన్యం లేకనా... లేక ఆ ఇది జరిగేనా అన్న అనాసక్తో అర్ధం కాలేదు...
ఏది ఏమైనా ఇదేమీ ప్రభుత్వ వ్యవహారం మాత్రమే అని ప్రజలు ఉదాసీనంగా ఉండకూడదు....
ఇలాంటి వాటిలో పాల్గొని తమ తమ అభిప్రాయాలని తెలిపి....
తమ ఇబ్బందులని అధికారుల దృష్టిలోనికి తీసుకుని వస్తే
తరవాత రోజుల్లో అనవసర ఇబ్బందులు ఉండవు.... విమర్శలు ఉండవు... వ్యంగాలు ఉండవు....
ఈ వ్యంగాలు ఫేస్ బుక్కు-వాట్స్ ఆప్ లలో లైకులకి షేర్లకి పనికొస్తాయేమోగానీ, ప్రజోపయోగానికి పనికిరావు.
కొస చీకటి ఏమంటే... యధావిధిగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు లాగానే...
రాజకీయ ప్రముఖులు తమ తమ వ్యాపారాల్లో ముణిగి ఉన్నారే గానీ
సీరియస్సుగా తీసుకుని...
తమ కార్యకర్తల ద్వారా ప్రజాభిప్రాయాన్ని
ప్రభుత్వానికి తెలియచేయ్యలనే తపన కనపడటం లేదు...
జై హింద్
బొమ్మలు కర్టెసి గూగుల్
MAPS EDITED BY
K.RADHAKRISHNA
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి