ఈ మధ్య కాలంలో భారత్‌లో కల్లా వీళ్ళు ధనవంతులు... వాళ్ళు ధనవంతులు....
ప్రపంచంలోనే ర్యాంకులు అంటూ చర్చ సాగుతోంది....
ఇవన్నీ చూస్తుంటే.... సినిమా యాక్టర్ల ఫ్యాన్స్
"మా హిరో మొదటి వారం కలెక్షన్ ఇంత...అంత" అని
చెప్పుకునే ఉత్సాహంలా కనపడుతూ ఉన్నది....
ఎలా అంటే.... ఈ ఫ్యాన్సుకి లాజిక్... ప్రయోజనం... ఇతర విషయాలతో పనిలేదు...
కేవలం వారి వారి హీరోల హిరో ఇన్నుల గొప్పతనం తప్ప
మిగిలిన లౌకిక విషయాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ...
వారికున్న అభిమానం సముద్రంలో అవి ముణిగి కొట్టుకు పోతాయే తప్ప...
నిజాలు నిజాయితీగా మాట్లాడుకుందాం అనే ధ్యాసే ఉండదు...
ఎందుకంటే ఏం మాట్లాడితే...తమ అభిమాన వ్యక్తుల గ్రేడ్ ఎక్కడ తగ్గుతుందో అన్న భయం..!!
ఓ పాత సినిమా వివరాలు....
సరే... వాళ్ళంటే కుర్రకారు...ఆ సినిమా యాక్టర్ల వలన వారికి మంచి ఎంటర్ టైన్ మెంట్ [వినోదం] ఉంటుంది కాబట్టి ఆవిధంగా వారిని వెనకేసుకేస్తుంటారు.... కానీ, ఈ మధ్య కొన్ని కార్పోరేట్ కంపెనీలని వెనకేసుకొస్తున్నారు... పోనీ కనీసం వారు అందులో పనిచేస్తున్నారా...ఆ షేర్లు కొన్నారా...ఆ వస్తువులు కొంటున్నారా అంటే అది కారణం కాదు.... మరి ఎందుకు వెనకేసుకోస్తున్నారో అర్ధం కాలేదు...
ఆసియాలో బాగా డబ్బున్నోళ్ళు
ఇక విషయానికొస్తే...
ఈ మధ్యన బాగా వార్తల్లోకి వచ్చిన కంపెనీ రిలయన్స్ అంబానీ గ్రూప్.. వీరు ఆసియాలోనే నంబర్ 1 ధనవంతులు... ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో ఉన్నారని చెప్పుకొస్తున్నారు... అది ఒక సారి అయితే పరవాలేదు... పదే పదే చెపుతుండటంతో...."అబ్బో మన దేశంలో కూడా డబ్బున్నోళ్ళున్నారు అని అనుకోటానికా" లేక నిజంగా ఈ టాప్ టెన్ ధనవంతులైన భారతీయుల వలన ఏదన్నా ప్రజలకి ఉపయోగం ఉన్నదా ...ఇలా ధనవంతులైన భారతీయుల వలన భారతీయ ప్రజలకి బాగా లాభం ఉన్నదేమో... అందుకే ఇలా చెప్పుకుంటున్నారు అని అనిపించింది ...!!!
అయితే, ఎవరి వలన డైరెక్టుగా ఎక్కువ లాభం భారతీయ ప్రజలకి కలుగుతోందో చూద్దాం అని అనిపించింది....
ఇంకేమున్నది....గూగులమ్మ ఉండనే ఉన్నది..... అందులో ఫ్యాన్సుకి కాకుండా.... ప్రజలకి ఉపయోగం దృష్టితో సెర్చ్ చేస్తే ఈ వివరాలు వచ్చాయి....
మొదటగా అదాని... డబ్బున్న ర్యాంకులో 2 ...
వారి దగ్గరున్న ఉద్యోగులు 17,000 మంది

బజాజ్...ర్యాంకు లేదు...ఉద్యోగులు 60,000 మంది
బిర్ల గ్రూప్...ర్యాంక్ 8...ఉద్యోగులు 1,20,000
D మార్ట్...ర్యాంక్ 4...ఉద్యోగులు పరిమినెంట్ 9,400
తాత్కాలికం....38,952
HCL...ర్యాంక్ 3...ఉద్యోగులు 1,59,000
HINDUJA...ర్యాంక్ ...ఉద్యోగులు 1,50,000
JSW ర్యాంక్.... ఉద్యోగులు....55,000
KOTAK...ర్యాంక్ 6...ఉద్యోగులు....33,000
L&T ర్యాంక్.....ఉద్యోగులు APROX 44,000
MITTAL ర్యాంకర్...ఉద్యోగులు షుమారు 3,20,000[2006]
RELIANCE GROUP ర్యాంక్...1....ఉద్యోగులు...1,95,618
TATA GROUP.....ఉద్యోగులు 7,50,000
పైవి కొన్ని ఉదాహరణలు.... వీటి బట్టి చూస్తే ర్యాంకర్ల కన్నా... ఏ ర్యాంకు లేని కంపనీల వల్లనే ప్రజలకి డైరెక్టుగా ఎక్కువ లాభం ఉన్నట్లు కనపడుతుంది... సరే బాగా డబ్బున్న కంపనీల వలన ప్రభుత్వానికి పన్నులు కొద్దిగా ఎక్కువ రావచ్చును...
"మన దేశంలో కూడా కోట్లు ఉన్నోడు ఉన్నాడు" అని
అనుకోవటానికి తప్ప పెద్దగా ప్రయోజనం అయితే లేదు....
అభిమానుల అభిమానాన్ని ప్రక్కన పెడితే...
ఎవరికి ఎంత డబ్బు ఉంటే ఎవరికి లాభం....
వారి వలన ఎంత మంది బ్రతుకుతున్నారనేదే సామాన్య ప్రజలకి ముఖ్యం...
---------------------------------
జై హింద్
---------------------------------
దీనికి ముందు పోష్టు....
విషయం: విశాఖా స్టీల్ ప్లాంట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి