LOCAL WEATHER

22, అక్టోబర్ 2014, బుధవారం

నేరం నాయకులది...శిక్ష రాహుల్ గాంధీకా...!!!

కాంగ్రెస్సు ఓటమికి తామేమి కారణం కాదు, 
అంతా రాహుల్ దేనని, 
ప్రియాంకా కావాలని 
కార్యకర్తలచే ఎంతో అమాయకంగా నాటకం ఆడిస్తున్నారు... 
లోకల్ అవినీతి నాయకులు. 
ప్రియాంక కన్నా రాహుల్ 1000 రెట్లు బెటర్.
కానీ, కాంగ్రెస్ నాయకులు 
తాము చేసిన తప్పులకి రాహుల్ గాంధిని బాధ్యుడిని చేసి 
తమ తప్పుల  నుండి తప్పుకుంటున్నారు. 
చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు 
కాంగ్రెస్స్ నాయకులు రాహుల్ గాంధిని అడిగి పరిపాలన చెయ్యలేదు...
అవినీతి చెయ్యలేదు... 
అది కేవలం కాంగ్రెస్స్ అధిష్టానమే చూసుకుంది...
నిజానికి రాహుల్ గాంధి అవినీతిపరుడా...కాదు. 
ఎందుకంటే ఏ అవినీతి ఆరోపణలలో లేడు. 
ఉంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారేగాని రాహుల్ లేడు... 
కేవలం ఎన్నికలప్పుడే రాహుల్‌ని తెచ్చి ముందర నుంచోబెట్టి, 
"ఇతను సరైన నాయకుడు కాదు" అని ఎలా చెప్పగలరు...?  
రేపు ప్రియాంకా వధేరా వస్తే సాధించేది ఏమున్నది...???
 ఈవిడ భార్తగారు చేసిన అవినీతి పనులు ఇప్పటికే కాంగ్రేస్సును ముంచేసినాయి..
ఆ పాపం కూడా రాహులే మోయ్యాలిసి వచ్చింది...
పైగా ఇది మోడీ సమయం...
కాబట్టి, కాంగ్రెస్సు నాయకులలాగా కాకుండా 
పక్షపాతం లేకుండా 
కాంగ్రెస్సు దేశవ్యాప్తంగా ఓడిపోవటానికిగల కొన్ని కారణాలు చూద్దాం...

1] ఆంధ్రా....విభజన పాపం మరియూ  10 సవత్సరాల దిక్కుమాలిన పరిపాలన. 
2] తెలంగాణా....విభజన జరిగిన విధానం...ఐకమత్యం లేని 
   స్వయం ప్రకాశంలేని మసిబట్టిన లోకల్  కాంగ్రెస్ నాయకులు.  
3] హర్యాణా...10 సంవత్సరాల అవినీతి పాలన...మోడీ హవా...
4] గుజరాత్... మోడీ హవా...
5] మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్...ఐకమత్యం లేకపోవటం... ఉడిగిన లోకల్  నాయకత్వం, 
6] మహారాష్ట్రా, రాజస్థాన్... లోకల్ నాయకుల అవినీతి మరియూ పనికి మాలిన పరిపాలన 
7] ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, బీహార్, ఝార్‌ఖండ్, వెస్టు  బెంగాల్... 
   వీటిలో కాంగ్రెస్స్ మట్టి కరచి ఎన్నో "ఎన్నికలు గడుస్తున్నాయి"...!!! 
8] భారతదేశ ఎన్నికలు... కాంగ్రెస్సు 10 సంవత్సరాల 
   చదువోచ్చిన పిచ్చి పరిపాలన...మోడీ హవా... 
9] శనిలా పట్టిన కాంగ్రెస్సు సీనియర్ నాయకులు. 

పైవన్నీ మోడికి ఎలా కలిసి వచ్చినాయో... రాహుల్‌కి అలా మైనస్ పాయింట్లు అయినాయి. ఈ కారణాల్లో ఎక్కడా రాహుల్ ప్రమేయం ప్రత్యేక్షంగా లేదు... అయితే, పెద్ద పార్టీలలో "పార్టీ గెలుపు కేవలం ముఖ్యనాయకుడి వల్లనే వస్తోంది" అని అనిపించుకోటానికి, ఆయా నాయకులు, వారి సొంత దారులు తాపత్రయపడుతున్నారు...ఇలా రాజకీయాల్లో విజయం మొత్తం... తమ నాయకుడి వల్లనే వస్తుందనే భావం సృష్టించటం వల్లనే, అపజయాల భారం నాయకుడు మోయ్యవలసి వస్తోంది...క్రింది నాయకులకి కూడా ఇది హాయిగానే ఉన్నది...తాము లోకల్‌గా ఎన్ని పాడు పనులు చేసినా... అది పెద్ద నాయకుడి మీదుగానే పోతుంది గాని వీరికి తగలదు... కాబట్టి, గెలిచినా ఓడినా వారికి తగలటంలేదు. నిజానికి "ఇది సమిష్టి బాధ్యతే గాని ఏ ఒక్కరిదో కాదు". ఇలా అని పార్టీ పెద్దలు కూడా ప్రచారం చేస్తే, అప్పుడు తప్పొప్పుల భారాన్ని అందరూ పాలు పచుకోవటమే కాకుండా...లోకల్‌గా ఉండే నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రజల కోసం పనిచేస్తారు...దీనిని ఆమోదించాలి అంటే... రాజకీయాలలో వ్యక్తి సామ్యం/ఆరాధన పోవాలి, ప్రజలనే నాయకులుగా/హీరోలగా గుర్తించాలి... అప్పుడే నిజమైన ఫలితాల విశ్లేషణ వస్తుంది. 

ఇక్కడ, మన ఎన్నికల విశ్లేషకుల గురించి చెప్పుకోవాలి....ఎంతో ఘనత వహించిన వీరు కూడా ఎన్నో వివరించి, అసలు విషయం అయిన ప్రజలని... మరచి పోతున్నారు. ఎంత గొప్ప నాయకులనబడే వారున్నప్పటికి, ప్రజలని పరిగణలోనికి తీసుకోకుండా... ఆ నాయకుడుంటే గెలుస్తారు, ఈ నాయకుడుంటే ఓడిపోతారు అని తమకి తోచిన విధంగా విశ్లేషణలు చేసిపారేస్తున్నారు... జరిగేది, జరిపించేది ప్రజలే... ప్రజలు పార్టీని ఆమోదించినప్పుడు ఈ విశ్లేషకులు అది పరిగణలోనికి తీసుకోకుండా ఆ నాయకుడిని పైకేత్తేస్తారు...

ఉదాహరణకి...ఆంధ్రాలో వైఎస్సార్ చంద్రబాబుని దింపినప్పుడు 220 సీట్ల దాకా వచ్చినాయి.... అది వై ఎస్సార్ గొప్పతనమన్నారు.... అదే అయిదేళ్ళ వై ఎస్సార్ పరిపాలన తరవాత కాంగ్రెస్సుకి 157 మాత్రమే వచ్చినాయి... ఇక్కడ తెలుసుకోవలసింది నాయకుడి గొప్పతనం కాదు... పాత అధికార పార్టి వాళ్ళు చేసిన తప్పులు అధికారం లేని నాయకులకి కలిసి వస్తాయి అనేది. అలా కలసి రావటానికి మూలం ప్రజలే... వారిని ఎవరు సంతృప్తి పరుస్తారో వారికి ఓట్లు వెయ్యటమే కాకుండా...అసంతృప్తి పరచిన వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. దీనిని నాయకుల గొప్పతనం అనుకుంటే...ఓటమిలో కాలిసినట్లే... 

ఇక రాహుల్ గాంధి విషయానికి వస్తే... 
తమ పిల్లలకి ఏమి ఇబ్బంది వస్తుందో అని 
ముద్దు చేసే తల్లిదండ్రులు ప్రక్కన ఉండి పిల్లలని నడిపిస్తే, 
వారికి మొద్దులుగా ఎలా పేరు వస్తుందో...
అదే రాహుల్‌కి వచ్చింది... 
నిజంగా రాహుల్ గాంధి నాయకత్వం ఏమిటో తెలియాలంటే... 
సోనియా పూర్తిగా విశ్రాంతి తీసుకొని,  
ఇప్పుడు రాబొయ్యే ఐదేళ్ళు 
అతనినే దేశంలోని కాంగ్రెస్సు మొత్తానికి నాయకుడిని చేసి,  
కాంగ్రెస్సు నాయకులందరూ రాహుల్ మాట మీదే నడచి... 
అతని మాటతోనే కాంగ్రెస్సుని నడిపించి... 
ఆ తరవాత వచ్చే ఎన్నికల ఫలితాలని చూస్తే గాని 
అతని నాయకత్వ పటిమ తెలియదు...
 రాహుల్ గాంధి కూడా మోడీ తరహాలో 
ఏ అమిత్ షా లాంటి వాడినో సహచరుడిగానో...
సలహాదారుడిగానో పెట్టుకుంటే...
మోడీ అంతటి నాయకుడు కాకపోయినా 
కనీసం మోడికి పోటి అయినా ఇవ్వగల నాయకుడిగా అవుతాడు....
దేశంలోని అన్ని రాష్ట్రాలలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నాయకుడు 
మోడీ తరవాత రాహులే...
ఈ సంగతి సోనియాకి ఎవరు చేప్తారబ్బా...!!! 

ఇది కేవలం భారతదేశంలో జరిగిన ఎన్నికల విశ్లేషణ గురించేగాని... కాంగ్రేస్సునుగానీ, రాహుల్ గాంధిని గానీ వెనకేసుకుని రావటం కోసం కాదు.  కాంగ్రెస్సు లాంటి దేశవ్యాప్త పార్టి మరొకటి లేదనే చెప్పాలి...అయితే, ఇప్పుడిప్పుడే బిజెపి కూడా అలాంటి వ్యవస్థని దేశవ్యాప్తంగా ఏర్పరచుకుంటోంది. బిజెపి "కాంగ్రెస్సు హఠావో" అంటోంది కాని, దాని స్థానాన్ని భర్తీ చేసే మరో పార్టి వచ్చే దాకా కాంగ్రెస్సు ఉండాలిసిదే...అది ఎలాంటి పార్టి అయినప్పటికీ... ఎందుకంటే, కాంగ్రెస్సు పార్టీకి పల్లెల నుండి మహానగరాల వరకూ...కేరళా నుండి మిజోరాం వరకు ఉన్న వ్యవస్థ మరొక పార్టికి లేదనే చెప్పవచ్చును... అందుకని కాంగ్రెస్సు హఠావో అనేకన్నా "స్వచ్చ కాంగ్రెస్" అంటే దేశానికి మంచిది. దేశంలో కనీసం రెండు బలమైన పార్టీలు ఉంటేనే అది ప్రజాసామ్య దేశం అవుతుంది...కాంగ్రెస్సులో  ప్రస్తుతం ఉన్న వ్యక్తుల్ని చూసి, ఆ పార్టీని హఠావో అనటం సరికాదు. 

దీనికి ఉదాహరణగా... 
ఒంగోలులోని ఒక ఆటో డ్రైవరు మాటలు. 
ఆటో ఎక్కినాయన... 
"విభజన ఇంత భయంకరంగా చేసిన కాంగ్రెస్ జెండా 
కనపడకుండా చెయ్యాలి" అని 
 విభజన తరవాత వచ్చిన ఎన్నికల సందర్భంగా అన్నాడు... 
దానికి  ఆటో డ్రైవరు జవాబు...
"బాధ్యత వహించాలిసిన ఆ పార్టిలో ఉన్న వారు
వేరే పార్టిలలో దూరిపోతే...
మిగిలిన ఆ జెండా ఏం పాపం చేసింది" అని అన్నాడు.
నిజమే... 
పార్టి అంటే జెండా లేక పేరు కాదు కదా.. 
అందులో ఉన్న వ్యక్తులే కదా. 
ఆ పార్టిలో ఉండి, చెయ్యాలిసిన చెత్త అంతా చేసేసి...
ఆ తప్పుని పార్టి మీదకు తోసేసి,
వారు కాస్తా ఏ మాత్రం బాధ్యతా వహించకుండా
వేరొక పార్టీలోనికి పొతే.. 
వారిని చక్కగా తమ తమ పార్టీలలోనికి ఆహ్వానిస్తే
అది కాంగ్రెస్ హఠావో అవుతుందా....???

ఇదంతా ఎందుకంటే...
ఎలాగూ ఏ ఐదేళ్ళకో పదేళ్లకో
మళ్ళి కాంగ్రెస్సే కీలక పార్టి అవుతుంది
" ఏ నాయకత్వం ఉన్నప్పటికీ"...
అప్పుడు ప్రియాంకా వధేరా కన్నా
రాహుల్ గాంధీ ఉంటేనే దేశానికి మంచిది...


@@@@@@@@@@@@@


\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
అంరికి దీపాళి శుభాకాంక్షలు
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
\_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/  \_()_/
@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి:సాక్షి 18, అక్టోబర్ 2014, శనివారం

హుదూద్ తుఫానా లేక టోర్నడోనా...ఫోటోలు

హుదూద్ తుఫాను.
అక్టోబర్ 8 నుండి 12 సాయంత్రం వరకు.
అండమాన్స్ దగ్గర బయలుదేరి విశాఖ మీదుగా దాటి ఛత్తీస్ఘర్ వరకు 
హుదూద్ పయనం.
ఈ తుఫాను విశాఖ మీదుగా వెళ్లి ధ్వంసం చేసిన సందర్భంగా
 మన మీడియా వాళ్ళు రకరకాలైన పేర్లు పెట్టారు. 
విషాద పట్టణం
విశోక పట్టణం
విషాక్ నగరం
 ఏ పేర్లు పెట్టినా...తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల 
మనోభావాలు దెబ్బతినకుండా...
వారికి ఆర్ధికంగా బలాన్ని ఇవ్వలేకపోయినా, 
కనీసం మానశిక బలాన్ని ఇచ్చేట్లు 
మీడియా వారు, 
ఫేస్ బుక్ లాంటి సోషల్  మీడియా వారు వ్యవహరిస్తే మంచిది.

అంతేగానీ, ఎవరినో సపోర్టు చేయ్యలేదనో...
వేరేవారి ప్రాంతానికి అన్యాయం చేసారనో...
మరింకేదనో...అంటూ... 
మానవత్వం మరచి 
పిశాచులు లాగా ప్రవర్తించి 
రాక్షసానందం పొందాలి అనుకుంటే... 
అది అలా ప్రవర్తించే వారి మనుగడకే మంచిది కాదు.
ఆంధ్రాలోని విశాఖ మీద రకరకాలుగా ఆధారపడి 
ప్రక్కనున్న తెలంగాణా, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్  వంటి రాష్ట్రాలు 
బ్రతుకుతున్నాయని తెలుసుకుంటే మంచిది.
భారతదేశ తూర్పు తీర రక్షణ మొత్తం 
ఇక్కడి నుండే జరుగుతుంది.
అంతేకాదు,
దేశంలోని ఏ ప్రాంతానికి ఇబ్బంది వచ్చినా 
ప్రత్యేక్షంగానో పరోక్షంగానో అందరికి ఇబ్బందే...


 తుఫాను భీభత్స దృశ్యాలు...
ఈ క్రింది లింకు నొక్కండి...
78 PHOTOS

------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------
తుఫాను బాధితులకి 
సహాయం చెయ్యాలి అనుకునే వారికి
Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  Rs Rs  Rs  
 రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు. రు.
బ్బులు వేసే ముందర ఈ అక్కౌంట్ ని నిర్ధారణ చేసుకోండి.
------------------------------------------------------------------------------------------------ 
------------------------------------------------------------------------------------------------ 


చివరిగా, 
ఈ తుఫానులకి పేర్లు పెట్టేప్పుడు అందమైన, 
ప్రశాంతమైన వాటిని ఎంచుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే...
ఈ తుఫానులు చేసే భీభత్సం 
ఏ పాపం తెలియని వాటికి 
 చెడ్డ పేరు తెస్తుంది. 
అందుకని,
ప్రతీదానికి మేమున్నాము 
మా ముత్తాతల పేర్లు పెట్టండి...
మా తాతల, తండ్రుల పేర్లు పెట్టండి...
మా వాళ్ళ పేరే పెట్టండి 
అనే రాజకీయ నాయకుల పేర్లు 
తుఫానులకి పెడితే సమంజసంగా ఉంటుంది.
అర్ధవంతంగా కూడా ఉంటుంది. 

****
తుఫాను కదలికల్ని వివరించిన క్రిందటి పోష్టు.
లింకు నొక్కండి
****


@@@@@@@@@@@@@@@@@
ఆంధ్రప్రదేశ్ లో  ఇంతకు ముందు వచ్చిన
1977 నవంబర్ 19న వచ్చిన భీకర తుఫాను లింక్ 


ఈ తుఫాను వచ్చిన కాలంలో...
దేశమంతా జనతా పార్టి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది.
జనతాపార్టికి చెందిన "రాజ్ నారాయణ్" అనే రాజకీయ వేత్త...
"మా జనతా పార్టిని ఓడించారు, అందుకనే మీకు తుఫాను దెబ్బ తగిలింది" 
అని కామెంటు చేసి విమర్శల పాలు అయ్యాడు.
తరవాతి కాలంలో 
ఆ నాయకుడు "రాజకీయ జోకర్"గా ప్రసిద్ది గాంచాడు...
ఆ పార్టి కూడా మట్టిలో కలిసిపోయింది. 
@@@@@@@@@@@@@@@@@


10, అక్టోబర్ 2014, శుక్రవారం

హుదూద్ తుఫాను విశాఖనే చేరుతుందా...???

కోస్తాకు మరో తుఫాను... 
ఈ సారి భారసాల చేసి 
దానికి హుదూద్ అని పెరేట్టినవారు ఒమన్* దేశం వారు. 
అది అక్కడి ఒక పిట్ట పేరు...

కర్టేసి:సాక్షి

సరే, తుఫాను విషయానికి వస్తే...
అది మొన్న అండమాన్స్ దగ్గర దాటి, 
అక్కడి నుండి భారత ఖండం వైపునకు రావటం మొదలెట్టింది...
ఇది పశ్చిమం..పశ్చిమ-ఉత్తరంగా కదులుతూ ఉన్నది.
ఇది విశాఖ మరియూ గోపాల్ పూర్[ఒరిస్సా]మధ్యలో దాటుతుందని మొదలు అనుకున్నారు...
అయితే, అది పశ్చిమానికి ఎక్కువ కదులుతూ ఉండటంతో...
విశాఖ నగరం దగ్గర దాటుతుందని దరిదాపుల అన్ని పేపర్లలో వేశారు.

కర్టేసి: తెలుగు వార్తాపత్రికలు 

ఈ తుఫాను యొక్క కదలికలని
 http://www.accuweather.com/ లో 
ఫోటోలు పెడుతున్నారు. వాటన్నిటిని కలిపి జిఫ్ చేశాను...

ఈ నెల 8వ తారీకు నుండి 10తారీకు ఉదయం 7 గంటల వరకూ 
సేటిలైట్ తీసిన ఫోటోల సమాహారం.
కర్టేసి: accuweather

ఈ పైన ఉన్న తుఫాను కదలికలని చూస్తే 
అది విశాఖ వైపు వస్తున్నట్లు కనపడుతున్నా...
దారి తప్పి ఒరిస్సా-బెంగాలు వైపుకి వెళ్ళేట్లే ఉన్నది.
తీరం వెంబడి సముద్ర కదలికలు మరియూ గాలి 
ఉత్తరం మరియూ ఉత్తరం-తూర్పువైపుగా ఉండటం వలన 
అది అరవై శాతం ఒరిస్సాకి తాకేట్లే ఉన్నది.
లేదా 
ఇంకా పైకి పోయి బెంగాలుకి తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
ఎందుకంటే అది తుఫాను కదా...
టార్గెటెడ్ మిస్సైల్ కాదు కదా...!!!

చూద్దాం...

ఏది ఎలా ఉన్నా 
ప్రభావం ఉన్నదని చెపుతున్న ప్రాంతాల ప్రజలు 
అప్రమత్తతతో ఉండి
 ప్రభుత్వ అధికారులకి సహకరిస్తే 
ఆస్థి నష్టాన్ని ఆపలేకపోయినా 
కనీసం 
ప్రాణ నష్టం అయినా లేకుండా చెయ్యొచ్చు.

--------------------------------------------------
10-10-2014 రాత్రి 10 గంటలకి 
ఈ రోజు ఉదయం 6.25 నుండి రాత్రి 9.25 వరకు తుఫాను కదలికలు. 
దీని వరస చూస్తే, విశాఖా మరియు భువనేశ్వర్‌ల మధ్య 
ఏ శ్రీకాకుళం దగ్గరో దాటేట్టుంది...
విశాఖా-భువనేశ్వర్ ప్రాంతం...ఇంకొంచం క్లోజప్పులో....

--------------------------------------------------
11-10-2014 ఉదయం 9.30 నిమిషాలు.
ఈ రోజు ఉదయానికి 
తుఫాను విశాఖకి దగ్గరగా వచ్చి 
కొద్దిగా దక్షిణానికి దిగినట్లు కనపడుతున్నది.
 అలా జరిగితే, 
దీని వల్ల కాకినాడకి కూడా 
పెద్ద ప్రభావం ఉండే అవకాశం ఉన్నది.

అయితే... 
విజయనగరం, విశాఖా, తుని, కాకినాడలలోని 
మాకు తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి కనుక్కుంటే
అక్కడ ఇప్పటివరకు[9.30AM] 
తుఫాను ఎఫ్ఫెక్టు ఏమీ లేదనే చెప్పారు.
ఈ హుదూద్ తుఫాను కూడా లేహర్ తుఫానులాగా 
సముద్రంలోనే కలిసిపోయ్యే అవకాశం ఉన్నది.
 ఏ సంగతి ఈ రోజు సాయంత్రానికి తేలిపోతుంది.
--------------------------------------------------
11-10-2014 సాయంత్రం 7గంటలు 
తుఫాను ఈ విధంగా రావచ్చును...
కర్టేసి:http://in.weather.com/

తుఫాను దగ్గర నుండి మరో అయిదు రోజులు 
ఈ విధంగా వర్షాలు పడచ్చును.
కర్టేసి:http://in.weather.com/
--------------------------------------------------

12-10-2014 ఉదయం 6 గంటలు 
విశాఖ మీదకే తుఫాను...
ఈ రోజు మధ్యాన్నం దాటే అవకాశం...

--------------------------------------------------
12-10-2014 మధ్యాహ్నం 12 గంటలు
విశాఖ మీదే ఉన్న తుఫాను...
వాతావరణ శాస్త్రవేత్తలు సూచించిన విధంగానే 
విశాఖ నగరం మీదుగా దాటుతోంది. 
అక్కడ విపరీతం సృష్టిస్తోంది.
సెల్ టవర్స్, ప్రకటన బోర్డులు, చెట్లు కూలి 
భీభత్స  వాతావరణం ఉన్నదని 
విజయవాడ దూరదర్శన్ "సప్తగిరి" లో  
లైవ్ చూపిస్తున్నారు.
--------------------------------------------------
12-10-2014 మధ్యాహ్నం 12.56


CYCLONE EYE
మధ్యాహ్నం 12.25 సమయంలో 
విశాఖ మీద ఉన్న "తుఫాను కన్ను".
ఈ సమయంలో తుఫాను ప్రశాంతంగా ఉంటుంది.
ఈ తుఫాను కన్ను చుట్టు భీభత్సం ఉంటుంది.
అంటే, కొద్ది సేపట్లో మళ్ళి తుఫాను విజృంభిస్తుంది. 
--------------------------------------------------

కర్టేసి: accuweather

@@@@@@@@@@@@@
*తుఫానులకి పేర్లు పెట్టటం...కొంతకాలం క్రిందే మొదలయ్యింది. 
ఇదివరకు తుఫానుని, అది వచ్చిన సంవత్సరం బట్టి గుర్తించేవారు. 
అయితే, ఒకే సంవత్సరంలో అనేక తుఫానులు వస్తే వాటిని గుర్తించటం కష్టం. 
అందుకనే తుఫానులు వచ్చే ప్రదేశంలోని దేశాలన్నీ కలిసి 
తుఫానుల పేర్ల లిస్టుని తయారు చేసి, 
అందులో నుండి పేర్లు పెట్టటం మొదలు పెట్టారు. 
ఆ పేర్లని తుఫాను వచ్చిన ప్రదేశంతో సంబంధం లేకుండా... 
దేశాల వరుస క్రమంలోని దేశాలకి అవకాశం ఇస్తారు... 
ఈసారి ఒమాన్ వంతు వచ్చింది.
@@@@@@@@@@@@@
1, అక్టోబర్ 2014, బుధవారం

"మేకిన్ ఇండియానా" లేక "ఫెక్ ఇన్ ఇండియానా".....!!!


ఈ మధ్యన మనకు వినపడుతున్న మాట "మేడ్ ఇన్ ఇండియా" లేక "మేకిన్ ఇండియా"... ఐడియా మంచిదే ... అయితే దీనికి మన భారత దేశ ప్రజల/అధికారుల సహకారం ఎంతున్నదీ...??? మన క్రొత్త ప్రధాని గారు వచ్చిన తరవాత అనేక క్రొత్త పంధాలూ... కొత్త ఆలోచనలూ అంటూ విపరీతంగా ప్రచారంలోనికి వస్తున్నాయి... అవినీతి అంతమొందటం, ఆర్ధిక వ్యవస్థ గట్టి పడటం, శక్తివంతమైన భారత్, స్వచమైన భారత్, స్వేచ్చ్జా భారత్....ఇలా అనేకమైనటువంటివి వినపడుతున్నాయి... నిజానికి ఇవన్నీ పాత మాటలే...ఒకప్పుడు మన దేశంలో ఇలాంటి వన్నీ జరిగినవే... అయితే, కాల క్రమేణా... జనాభా పెరుగుదల ఉండటం వల్లనో, ప్రజల అవసరాలు పెరగటం వల్లనో, లేక శక్తికి మించిన ఆలోచనలతో అడ్డదారిన పైకి ఎదగాలని అనుకోవటం వల్లనో పై మాటలని తిరిగి ఉపయోగించాలిసిన ఖర్మగతి మన దేశానికి పట్టింది...

మరి, దీనికి కారణం ఎవరూ...? ప్రజలా... రాజకీయ నాయకులా, జనాభా సమస్యా, గ్లోబలైజేషన్ సమస్యా... ఇలా అనేకమైనటువంటి పేర్లు పెట్టి కారణాన్ని ఎవరి మీదకో తోసివెయ్యటం జరుగుతోంది... దానివల్లన సమస్య పెరుగుతూ పోతోందే కానీ, ఓ కొలిక్కి రావటం లేదు... అంటే, సమస్య మూలాన్ని గుర్తించటంలో మన దేశం ఆపసోపాలు పడుతున్నదని చెప్పవచ్చును. సమస్య ఉంటే... దాని మూలాన్ని గుర్తించటం కష్టమా... లేదు. అయితే, ఆ సమస్య మూలాన్ని గుర్తిస్తున్న సమయంలో...దానికి సంబంధించిన కారణాలలో గుర్తించే వారు కూడా ఉంటే...వెంటనే స్యమస్యని ప్రక్కదారి పట్టించి, మరోకోణంలోనికి మార్చి..."ఎవరికి వారు సమస్య మూలం మేము మడుకూ కాదు" అని అనిపించుకుంటున్నారు... దీని వల్లనే సమస్య మూలాన్ని కనుగొనలేకపోతున్నాము. మూలాన్ని కనుగొనటానికే తప్పుదార్లు వెదుకుతున్నప్పుడు...ఆ సమస్య నుండి బయటకు ఎలా బయట పడతాము...??? 

ఇప్పుడు విషయంలోనికి వస్తే, మేడ్ ఇన్ ఇండియాకి పేరు రావాలంటే ముందర అలా పేరు వచ్చే వస్తువులకి ప్రజలలో గిరాకీ ఉండాలి కదా...మన దేశ ప్రజలలో అనేక మంది వస్తువులు తక్కువ ధరలో దొరకాలి అనే కాన్సెప్టు మీదే తమ కొనుగోళ్ళు చేస్తున్నారు... ఉదాహరణకి ఒక వస్తువు వంద రూపాయలకి దొరుకుతుంటే, అలాంటిదే మరొకటి 125/-రూపాయలకి దొరికితే మన వాళ్ళు కొనరు... "ఇది ఎందుకు 25/-రూపాయలు ఎక్కువ ఉన్నది"...అని ఆలోచన కూడా చెయ్యకుండా... "వందకే వస్తుంటే ఎందుకు పాతిక రూపాయలు దండగ" అని అనుకుని, కేవలం పాతిక రూపాయలకి కక్కుర్తిపడి, నాణ్యమైన వస్తువుకు ప్రొత్సాహం ఇవ్వటం లేదు... ఇక ఆ సమయంలో ఏ చైనా వస్తువో కేవలం రు.60/-కే దొరికితే మన దేశం వారిలో దేశ భక్తి కనపడుతుందని అనుకోవటం దురాశే...

మన వాళ్ళు ఒక వస్తువు తక్కువకి వస్తే, ఆ వస్తువులో నాణ్యత ఉండదేమో అనే ఆలోచనే చెయ్యపోవటం వల్లన మన దేశంలో నాణ్యత లేని చైనా వస్తువులకి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అలా అని చైనావారు పనికి మాలిన వస్తువులే తయారు చేస్తారని కాదు... అక్కడ  భారత దేశం వస్తువులంత నాణ్యత కలిగిన వస్తువులని కూడా తయ్యారు చేస్తారు... కానీ, వాటి విలువ మన దేశ వస్తువుల కన్నా ఎక్కువ ఉండటంతో, వాటిని మన వ్యాపారులు కొంటే గిట్టుబాటు కావు... ఈ విధంగా ఈ మధ్యకాలంలో చైనా వస్తువులు వచ్చినట్లే...అంతకు ముందు ఢిల్లీ వస్తువులు అని వచ్చేవి...అంటే అవి అన్ని  కంపెనీ బ్రాండ్ల డూప్లికేట్లు... వాటి దెబ్బకే మన మంచి వస్తువులు తయారు చేసే కంపనీలు నేల మట్టం అయితే ...ఇక ఇప్పుడు చైనా వస్తువులు వచ్చిన తరవాత చెప్పేదేమున్నది...???

ఉదాహరణకి, 
పాతకాలంలో మనదేశంలో తయారయ్యే సీలింగు ఫేనులు కొంటే, 
అవి దశాబ్దాలపాటు పనిచేసేవి ... చేస్తున్నాయి కూడా... 
వాటికి ఆ కంపెనీ వారు 7 నుండి 10 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చేవారు. 
మరి ఇప్పుడు... 
అదే కంపెనీ వారు తమ ఫేనులకి ఒక సంవత్సరం గ్యారంటీని మాత్రమే ఇస్తున్నారు... 
కారణం... 
ఇప్పుడు వచ్చే అన్ని కంపెనీల ఫేనులూ భారతదేశ వర్కర్లు తయారు చెయటం లేదు... 
వారి ఉద్యోగాలు ఊడి సంవత్సరాలు అవుతున్నాయి... 
ఇప్పుడు వచ్చే ఫేనులకి
 "పైన పేర్లు భారత్‌వి -- ప్రాణం చైనాది"...
అంటే లోపల వైండింగ్ చైనా నుండి వస్తే, ఇక్కడ మన దేశంలో కేవలం అసెంబ్లింగు మాత్రమే చేస్తున్నారు...  
ఒక ఫేన్లే కాదు అన్ని రకాల వస్తువులూ అలానే ఉన్నాయి. 
ఏదైనా దేశం క్రింద నుండి పైకి ఎదుగుతుంది... 
కానీ, 
మన దేశం... 
ఒకప్పుడు ఎంతో క్వాలిటీతో వచ్చే వస్తువులని ఇచ్చిన మన దేశం 
ప్రజల సహకారం లేకపోవటం వలన
 వస్తూత్పత్తి[MANUFACTURING] నుండీ నేలకి దిగి 
వస్తువులని అమర్చటం[ASSEMBLING]లోనికి దిగజారిపోయింది. 


అలాగే, 
ఎవరైనా ఓ కొత్త కంపెనీ లేదా స్వంతంగా ఏదైనా చేద్దాము అంటే...
ముందర దానికి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి,  
ఎలా మార్కెట్టు చెయ్యాలి, 
దానికి కావాలిసిన పనిమంతులు ఎక్కడ దొరుకుతారు అని కాదు చూసేది... 
మనం మొదలెట్టే దానికి ఏ ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకోవాలి...
వాడికి ఎంత ఇవ్వాలి...దానికోసం ఎవడి కాళ్ళు పట్టుకోవాలి...
దాని అనుమతి/లైసెన్సుల  కోసం ఎంత ఖర్చు పెట్టాలి.. 
ఇది ఆలోచించాలి... 
దీనికి TATA గారు[లింకు నొక్కండి]కామెంటు చేసినదానినే 
ఉదాహరణ తీసుకోవఖర్లేదు...
రైలులో అమ్మే ఆహార పదార్ధాల క్వాలిటిని చూస్తే 
అధికార గణం కుళ్ళు ఎంత ఉన్నదో ఇట్టే తెలిసిపోతుంది... 
కేవలం 5/-రుపాయలకే మంచి కాఫీ బయట దొరుకుతుంటే... 
కాఫీ కంపుకొట్టే వేడి నీళ్ళని 10/- రూపాయలకి రైల్లో ఇస్తున్నారు..
వాళ్లకి తయారు చెయ్యటం తెలియక కాదు...
వీరిలో ఎక్కువమంది కేరళా కాంట్రాక్టర్లే...
వీరు ఖర్చుపెట్టే పెట్టుబడి, క్వాలిటి కోసం కాకుండా 
అధికారుల లంచాలకి వాడటం వల్లనే....

కాబట్టి, ఏదైనా జరగాలంటే దేశ ప్రజలందరి సహకారం దానితో పాటు ప్రభుత్వ అధికార గణంలో మార్పు ఉండాలే కానీ, ఎవరో గభాలున వచ్చి ఎదో మాయా జాలం చేసి ఎవరినీ ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా దేశాన్ని పైకి తీసుకుని రావాలని అనుకుంటే అంతకన్నా స్వార్ధం\అమాయకత్వము కానీ మరొకటి ఉండదు...కొత్త ప్రధాన మంత్రిగారు వచ్చి ఎదో మార్చేస్తారు అని అంటే...  వ్యవస్తలో మార్పు రానిదే... ఆ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే చర్యలు తీసుకోనిదే ఏ మాయా జాలంతో కూడా దేశం బాగుపడదని ఇదివరలో ఇదే బ్లాగులో వచ్చిన "త్యాగాలకి సిద్ధంగా ఉండాలిసింది ప్రజలేనా... మోదిగారు...???" లో[లింకు నొక్కండి]వివరించటం జరిగినది... 

ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ... ఇప్పుడొచ్చిన కొత్త ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని సినిమా హీరోల కన్నా ఎక్కువగా అభిమానించే వారు ఎక్కువయ్యారు... ఫేన్సు వలన పాపం హీరోగారు వెయ్యాలి అనుకున్న వేషం ఎలా వెయ్యలేకపోతున్నాడో, అలాగే మన మోడీగారి మీద ఆయన అభిమానుల విపరీత విశ్వాసం వల్ల కూడా ఆయన "చెయ్యాలీ" అని అనుకున్న పనిని సక్రమంగా చెయ్యటంలో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పవచ్చును. ఎదో ఎల్కేజీ పిల్లాడిని వెనకేసుకొచ్చినట్లుగా ఈ అభిమానులు ఆయనను వెనకేసుకొచ్చి ఇబ్బందులలోనికి నెడుతున్నారు...ఇంతకీ ఆయన చెపుతున్న మాటల్ని మాత్రం ఎవరికి వారు తమకి అప్లై చేసుకోకుండా ఇతరుల వైపు చూపెడుతున్నారు. ఇలా ఎవరికి వారు ఇతరుల వైపు చూపెడితే మోదీగారి ఇబ్బందులేమోగానీ, మన దేశంలో మడుకూ ఏ మార్పూ వచ్చే అవకాశం లేదు.

కాబట్టి, మన మోడీగారు చెప్పిన "మేడ్ ఇన్ ఇండియా" లేక "మేకిన్ ఇండియా" ఐడియా పనిచెయ్యాలంటే... దేశ ప్రజలూ మరియూ దేశ ప్రదానిగారు   చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని...

ముందరగా దేశ  ప్రజలు:

1] మనం కొనే వస్తువు మనదేశంది అయినా కాకపోయినా కూడా మన దేశంలోనే తయారై ఉండాలి...అంటే..మన దేశంలో తయారైయ్యే వస్తువుకి మనమిచ్చిన డబ్బులు మనలాంటి మన దేశ ఉద్యోగులకే జీతాలుగా వెళతాయన్న విషయం మీద అవగాహన కలిగి ఉండాలి... మన దేశ సంస్థలో పనిచేసి మనం జీతం పొందుతున్నట్లే...మనం కొనే దేశీయ వస్తువుల కంపేనీలలో పనిచేసే వాళ్ళు కూడా అలాగే జీతం పొందాలి అని అనుకోవాలి...అలా అనుకోవాలంటే మన దేశంలో తయారైన వస్తువులనే కొనాలి...అప్పుడే మన డబ్బు వారికి జీతంగా వెళుతుంది.

2] మనం కొనే వస్తువులలో ధరలలో తేడాలు ఉంటే... ఆ తేడా వలన నిజంగానే ఆ వస్తువు యొక్క నాణ్యత ఎక్కువ ఉన్నదా... ఉంటే అదే  కొందాము అని అనుకోవాలి...

3]నాణ్యత లేని వస్తువులని తయారు చేసే కంపనీలనీ, అవి అమ్మే దుకాణదారులనీ దూరంగా ఉంచాలి.

4] పైరసీ వస్తువులనీ అంటే డూప్లికేట్ వస్తువులని...వేరొక కంపెనీ పేరుతో చవుకరకం వస్తువులు తయారు చేసే కంపనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వారికి శిక్షలు పడేట్లు చెయ్యాలి...[సినిమాల గురించి కాదు..."పైరసీ సామాజిక వేత్తలూ"...ఏది పైరసీ...? లింకు నొక్కండి]

5] ఏ సంస్థలో పనిచేసే వారైనా హక్కులుతో పాటు బాధ్యతల పట్ల కూడా బాధ్యతగా ఉండాలి.దేశ ప్రధాని చెయ్యవలసినవి:

1] మనదేశంలో తయారైయ్యే వస్తువులు లాంటివి మరొక దేశం నుండీ రానియ్యకుండా కట్టుదిట్టం చెయ్యటం ... ఇలాంటి ఆంక్షలు కొత్తవేమీ కాదు. ఇదివరలో ఒక జపాన్ టేప్ రికార్డరును కొనాలంటే దొంగతనంగా స్మగుల్డు షాపులో కొనాలిసివచ్చేది... మరల అలాంటి పరిస్థితినే కల్పించాలి...

2] ప్రభుత్వానికి అవసరమయ్యే కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు లాంటి మొదలైన వస్తువులని దేశీయంగా తయారైనవే కొని ప్రోత్సాహించాలి.

3]ఇతర దేశాల వారి చేత మన దేశంలో పెట్టుబడిని మాత్రమే పెట్టించి, వారి పరిశ్రమలని మన దేశంలో నెలకొల్పాలి...ఆయా పరిశ్రమలలో తయారైయ్యే వస్తువులు ఇప్పటికే మన దేశంలో అధిక భాగం మంది ప్రజలు తయారు చెయ్యనివై ఉండాలి...

4]మన దేశంలో నాణ్యమైన వస్తువులని తయారు చేసే దేశీయ కంపెనీలకి అనేక రాయతీలు కల్పించి ప్రోత్సాహించాలి.

5]వస్తువుల కల్తీలపై కఠినమైన చట్టాలు చేసి వాటిని అమలు అయ్యే విధమైన "స్వచ్చమైన" అధికార వ్యవస్థని రూపొందించాలి.

6] ప్రతీ విషయానికీ లింకు ఉన్న ప్రభుత్వ అధికార అవినీతి వ్యవస్తని రూపుమాపే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి... జీతం కాకుండా పై డబ్బు తీసుకుంటే అసలుకే మోసం అనే భయాన్ని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికీ కల్పించాలి.

7] అవినీతిని ప్రొత్సాహించే వారిని వారు ఎవరైనాగాని...మరల అటువంటి ఆలోచనే రాకుండా ఉండే విధంగా శిక్షలు విధించాలి.

8] పెట్టుబడుల గురించి ఎక్కడికో పోనవసరం లేదు... మన దేశంలోనే ప్రోత్సాహకాలు ఇస్తే, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి... ఎన్.ఆర్.ఐ ల కన్నా ఎన్నో రెట్లు పెట్టుబడులు వస్తాయి...


9] దేశంలో ఉన్న వాళ్ళనేమో పార్టీఫండ్స్ పేరిట పిడించి స్వంత లాభాలు పొందుతూ, దేశం కోసం బయట దేశాల వారి దగ్గర బిచ్చమెత్తటం మానాలి.10] స్వ దేశీయులు పెట్టుబడి పెట్టాలంటే రూల్స్ సరళ తరం చెయ్యాలి...కానీ దీనికి వ్యతిరేకం జరుగుతోంది. బయట వారి పెట్టుబడులకి రూల్స్ అఖర్లేదు అనే స్థితికి ప్రభుత్వం దిగజారింది...ఇది మారాలి.

11] ప్రపంచంలోని అనేక దేశాలు, మన దేశంలో ఉన్న  లక్షల కోట్ల విలువ గల వాడకందారుల [CONSUMER MARKET] మీద పడుతుంటే... మన దేశం మడుకు వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. క్వాలిటి వస్తువులని వీరికి దొరికేట్లు చేస్తే మన కంపనీలకి దేశీయ ఆదరణ ద్వారా బలం చేకూరుతుంది.


ఇలాంటివి అనేకం 
దేశంలో మార్పునకి కావాలిసి ఉన్నాయి... 
అందుకుగాను
ఒక నిజాయతి/స్వేచ్చని కలిగిన 
నిపుణుల కమిటిని ఏర్పాటు చేస్తే
 మరిన్ని ముఖ్యమైన విషయాలు 
తెలిసే అవకాశం ఉన్నది. 
అలాగే, 
ఇవన్నీ చెయ్యటానికి 
ప్రభుత్వ అధికారుల మీద పట్టూ, 
ప్రజలలో గౌరవంతోపాటూ భయాన్ని కలిగించి 
తన దమ్ము\శక్తీని ప్రధాని ఉపయోగించాలే కానీ...
 ఏదో ప్రాస కుదిరే మాటలు వాడి, 
మాటల మాయాజాలం చేస్తే 
మన దేశం 
"మేడ్ ఇన్ ఇండియా"--"మేకిన్ ఇండియా"
అవదు. 
ఫేక్ ఇన్ ఇండియాలోనే ఉంటుంది.


జై హింద్                  అంరికి                   
                                                                           
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 
                    1953 అక్టోబర్ 1                   
 అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు