వాక్కాయలు సీజనల్‌గా వచ్చే కూరలలో ఒకటి......ఇవి మా చిన్నప్పుడు ఒకే రంగులో కనపడేవి....ఇవి మాంచి ఘాటుగా ఉంటాయి.
కానీ, ఇప్పుడు ఈ రంగులో కాయలు కూడా ఎక్కువ కనపడుతూ బాగా దొరుకుతున్నాయి.....
సరే, ఈ కాయలు అన్ని చోట్లా దొరుకుతాయో లేదో తెలియదు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాలలో చాలా బాగా దొరుకుతాయి......వీటితో వాక్కాయ పప్పు, వాక్కాయ పచ్చడి చేసుకోవచ్చును.
పప్పు అంటే ఏమున్నది......మామిడికాయ పప్పు, దోసకాయ పప్పులాగానే కందిపప్పు ఉడుకుతున్న సమయంలో వీటిని వేసి మిగిలిన పప్పులు లాగానే చెయ్య వచ్చును....కాకపోతే ముందుగా వీటిని మధ్యకు తరిగి వాటిలో ఉన్న గింజ భాగాన్ని తోలగించాలి....ఇదిగొ ఇలాగ....

పచ్చడి చేసే విధానం.....
కావాల్సిన వస్తువులు....
1] వాక్కాయలు ఒక చిన్న డబ్బాడు ....

2] ఎండుమెరపకాయలు కారానికి తగ్గట్టు, ఆవాలూ, జీలకర్ర ....కొద్దిగా, మినపప్పు, శనగ పప్పు ....కొంచం.
ముందుగా కాయలను బాగా కడిగి వాటిని మధ్యకు తరిగి వాటిలొ ఉన్న గింజలను తొలగించాలి. తరవాత, వాటిని నూనెలో చక్కగా మెత్తగా ఉడికేటట్లు వేయించాలి ......కాయలుగా కూడా నూనెలో ఉడక పెట్టుకోవచ్చును. కానీ పగిలి మీద పడే అవకాశం ఉన్నది..........[దీనిని ఇంకోలాగా కూడా చెయ్య వచ్చును.....ముందరగా నూనెలో తాలింపు ఎండుమెరపకాయలతో సహా వేయించి.......దానిలోని వేగిన ఎండుమెరపకాయలను మాత్రం తీసి, ఆ తాలింపు నూనెలోనే మధ్యకు తరిగి గింజలు తీసేసిన వాక్కాయలను వేయించుకోవటం చెయ్య వచ్చును. ఇప్పుడు ఎండుమెరపకాయలను మాత్రం మిక్సీలో వేసుకోవాలి......ఇదొక పద్ధతి.]

ఎండుమెరపకాయలూ, శనగపప్పు, మినప పప్పు, జీలకర్ర, ఆవాలను కొద్ది నూనెలో వేయించుకోవాలి. వీటిని మిక్సీలో వేసి ఒకసారి కొద్దిగా తిప్పి వదిలిలేస్తే మనకు కావాలిసిన పద్దతిలో కారం మిక్సు తయారవుతుంది.

ఇప్పుడూ, వేయించి పెట్టుకొన్న వాక్కాయలూ, ఎండుమెరపకాయల మిక్సింగునూ ఒక గిన్నెలో వేసి, సగం చెంచాడు పంచదార.....తగినంత ఉప్పు వేసి చెంచాతో కలపాలి. అంతే వాక్కాయ పచ్చడి మంచి వాసనతో, రుచితో రెడి అవుతుంది. బాగా ఆకుపచ్చగా ఉన్నకాయలు మంచి రుచితో పాటూ ఘాటుగా కూడా ఉంటాయి....


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి