
రోడ్లమీద నడిచే రైళ్ళు..... అదే ట్రాములు మన దేశంలో ఒక్క కలకత్తా నగరంలోనే కనపడతాయి. 130 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన ఈ ట్రాములు సామాన్య జనంలో కలిసి మెలిసి పోయినాయి. ఎప్పుడో బ్రిటీషు వారి కాలంలో ప్రవేశ పెట్టిన ఈ ట్రాములు ఇప్పటికీ కోల్కతా జనానికే కాదు...అక్కడికి అతిధులుగా వచ్చిన వారికి కూడా తమ సేవలు అందిస్తున్నాయి. మొదట్లో గుర్రాలు లాగేవట....తరవత రోజులలో బొగ్గుతో నడిచే ఇంజన్లూ.....తరవాత, కరెంటు ఇంజన్లూ వాడకంలోనికి వచ్చినాయి. వీటికి రెండు బోగీలు మాత్రమే ఉంటాయి. అందుల్లో ఒకటి ఫస్టు క్లాసూ....అదీ చవుకే....వీటి గురించి మరింత తెలుసుకోవలంటే ఈ లింకు నొక్కండి. TRAMS

వీటిలో ప్రయాణం అతిచవుక. మనం మన సిటీ బస్సుల్లో 10, 15 రూపాయలు పెట్టే దూరాన్ని కేవలం మూడున్నర, నాలుగున్నర రూపాయలకే చేరవచ్చును. మూడున్నరా...నాలుగున్నారా..ఇదెక్కడో విన్నట్లు లేదూ....!!! అవును, మనమెప్పుడో మరిచిపోయిన అర్ధరూపాయ నాణేన్ని ఈ ట్రాము కండెక్టర్లు చూపించారు. ఈ సందర్భంగా వీటి కండెక్టర్ల గురించి కూడా చెప్పుకోవలసినదే ..... ఒక్క అర్ధరూపాయకూడా మిగుల్చుకోకుండా చక్కగా చిల్లర ఇచ్చేస్తారు. ఈ అర్ధరూపాయలు మన దగ్గర చెల్లుబాటే కాకున్నాయి. వాటి పనైపోయిందని మనం అనుకుంటున్నాము. అయితే, రిజర్వు బాంకు వారు కొత్తగా కూడా అర్ధరూపాయలను ముద్రిస్తున్నారన్న సంగతి ఈ ట్రాముల పుణ్యాన తెలిసింది.

ఒకనొక టైములో వీటిని ట్రాఫిక్కుకి అంతరాయంగా ఉన్నాయన్న కారణం చూపించి, వారి ఎర్ర ప్రభుత్వం తొలగించాలని చూసింది.....కానీ, కాళీఘాట్ ప్రజలు కన్నెర్రజేయటంతో ఆ ప్రతిపాదన విరమించుకొన్నారు. అయితే, వీటి సేవలను కుందించారు. ఒకప్పుడు కలకత్తా రైల్వే స్టేషను[హవురా]నుండీ నగరంలో అన్ని వైపులకీ విస్తరించి వుండేవి.....స్టేషను నుండి హవురా బ్రిడ్జి వరకూ ఉండే లైనులు తొలగించారు. తరవాత, వీటి కాలాన్ని కూడా కుదించి సాయంత్రం ఆరులోపలే మెయిన్ రోడ్లవైపులకి రాకుండా చేశారు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి