LOCAL WEATHER

24, ఆగస్టు 2012, శుక్రవారం

"ప్రైవేటు" ....?? అంటే అదేమన్నా అంటరానిదా......???


గత రెండు రోజులు కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిరసన తెలియజేసినాయి.... బాగానే ఉన్నది.......ఎవరైనా తమ ఉనికి కోసం ఏదైనా చెయ్యచ్చు....కానీప్రైవేటు అంటే అదేదో అంటరానిది అయినట్లు, భూత పిశాచాలైనట్లు చిత్రీకరించి వారి నాయకులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది.

ఎందుకంటే, "ప్రైవేటు వ్యతిరేకులు" మిగిలిన రంగాలలో విదేశీయులు వస్తున్నారనీ, ప్రైవేటు పరమైపోయినాయనిగానీ ఏమాత్రం చింత లేకపోగా......అవి రావటం వలననే పోటి తత్వం పెరిగి రేట్లు తగ్గుతాయనీ, మంచి సేవలు అందుబాటులోనికి వస్తాయనీ వాదించి, సేవలను పొందుతున్నవారే......పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థల  మీద  ఆధార పడి బ్రతికేవారే........

విధంగా ద్వంద విధానంగా మాట్లాడే " జాతీయవాదులలో జాతీయతత్వం ఎంత ఉన్నదో" తెలుసుకోవాలంటే వీరి కొన్ని కార్య కలాపాలను పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది.

1] ఏదైనా బ్యాంకులు   కానీ ప్రభుత్వ రంగ ఆఫీసులలో వారి వారి ఉత్తర ప్రత్యుత్తరాలను భారత ప్రభుత్వ సంస్థ అయిన తపాల శాఖను వినియోగిస్తున్నారా....?

@ ఉపయోగించరు. కారణం తమ ఆఫీసుకు వచ్చి ఉత్తరాలను తీసుకెళ్ళరనీ, ప్రైవేటు కొరియర్లు అయితే సర్వీసు బాగుంటుందనీ వీరి వాదన.......తమ సాటి సంస్థ పైకి రావటానికి, కనీసం వీరు తమ సీట్లలో నుండి కూడా కదలరు.........


2] వీరిలో ఎవరైనా తమకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళతారా......?


@ వెళ్ళరు... అక్కడ  సరిగా చూడరట.....అందుకని కార్పొరేటు  ఆసుపత్రికే  వెళతారు.......కాస్త జ్వరం వచ్చినా సరే......ఇలాంటి వారందరూ
ప్రభుత్వాసుపత్రికి  వెళితే  అక్కడి వారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు కదా...!!!

3] వీరి పిల్లలను మునిసిపల్, గవర్నమెంటు స్కూళ్ళలో చేరిపిస్తున్నారా......?


@ చదివించరు, అక్కడ ఎవరుపడితే వారు చదువుతారట......తమ పిల్లలు చెడిపోతారు, అందుకని కార్పొరేటు స్కూళ్ళలోనే చేర్పిస్తారు.....!!!


4] తమ పిల్లలల ఉద్యోగాలకి నెలకు లక్షలు వచ్చే ప్రైవేటు సంస్థలే కావాలి... లేదా "బాగా" డబ్బులోచ్చే  మాటైతే  గవర్నమెంటు  ఆఫీలైనా పరవాలేదు....  మరి.....సేవే పరమావధిగా ఉన్న గవర్నమెంటు ఆఫిసులలో చేరి ప్రజలకి సేవ చెయ్యచ్చుగా........?

@ చెయ్యరు, దానికి  వేరెవరో బలైపోవాలి.....


5] ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంటు సెల్ ఫోనులు వాడుతున్నారు....? వారి కార్యాలయాల్లో గానీ బీఎస్సెన్ఎల్  ఫొనులు వాడబడుతున్నాయి....?@ వాడరు....ప్రైవేటు స్కీములకి లొంగి,  తమ జాతీయతత్వాన్ని ప్రైవేటు  స్కిములకి బలిస్తారు.......

ఇలా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. వారు మటుకూ ప్రభుత్వరంగ  సంస్థలని ప్రొత్సహించరు, కానీ తాము మటుకూ ప్రభుత్వరంగ  సంస్థల్లోనే ఉండాలి........ ఇంతకీ వీరి కౌంటరు ముందుకు వచ్చి కోట్లూ లక్షలూ డబ్బులు కట్టి వీరి లావాదేవీలని నడిపేదెవరూ....??? కేవలం గవర్నమెంటుకి చెందినవారేనా, కానే కాదు......కనీసం 98 శాతం  ప్రైవేటు సంస్థలకి చెందినవారే.....సొమ్ము ప్రజలది,  సోకు ఉద్యోగులదీ అయింది.......


విధమైన ద్వంద విధానాలతో చాలా వర్గాలవారే తయారైనారు. తమకి కావాలిసిన సర్వీసు మటుకూ చక్కగా జవాబుదారీ విధానంలో ఉండి.....వీరికి ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద ఫిర్యాదు చెయ్యగానే వారిని ఉద్యోగాలనుండి తొలగించెయ్యాలి.....తాము మటుకూ ఏమాత్రం జవాబుదారులుగా ఉండకుండా.......ఏదైనా సమస్య వస్తే "కావాలంటే  మెనేజరుకు కంప్లైంటు చేసుకోండని" సవాలుగా మాట్లాడుతారు......


వీరికి
మటుకూ పేద్ద పెద్ద షాపింగు మాల్సూ, విదేశీ వస్తువులూ, విదేశీ సేవలు కావాలి......దానివలన నలిగి, మునిగిపోయే సామాన్యుల బాధ మడుకూ అఖర్లేదు......తమదాకా వస్తే ప్రైవేటు అనేది భూతాలూ పిశాచాలునూ......కొసమెరుపేమంటే
పేద బడుగు వర్గాల వారికి అండదండగా ఉండాలిసిన 
మన ఎర్ర జెండాల వారు
ఖచ్చితంగా నెలవారీ జీతాలు పొందే వారి తోకను పట్టుకొని తిరగటం, ......అన్ని చోట్లా ఎర్ర జెండాలని వ్యతిరేకించే ఉద్యోగస్తులు
తామే ఎర్ర జెండాలని పట్టుకొని ఉద్యమించటం........


@@@@@@@@@@@@@@@
జై హింద్
@@@@@@@@@@@@@@@