LOCAL WEATHER

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రాయలసీమ నాయకుల్లారా చూస్తున్నారా...చూస్తూనే ఉండిపోతారా...???

ఈ మధ్యన 
పేకేజినా లేక  హోదానా  అనే  విషయంలో  
రాష్ట్రం  అంతా  గొడవలు  జరుగుతుంటే...
ఆ  మంటలో  చలి కాచుకునే  బిజెపి వారు  రాష్ట్రంలో 
 ఉన్న  ప్రాధాన్యతలని  మరచి 
స్థానికంగా ఉన్న ప్రజలని 
మనోభావాల  పేరుతొ రెచ్చగొడుతున్నారు....
వారు  తాము ఎలాగో అలా  గెలిచే  విశాఖ మీదే  దృష్టి పెడుతున్నారేగానీ,  
బాగా  వెనుకబడి ఉద్యోగ  అవకాశాలు  లేని  
రాయలసీమ వంక  చూడటం లేదు...
బహుశా అక్కడ ఎలాగూ గెలవలేమని అయ్యుంటుంది!!!

బొమ్మలో పై భాగం కర్టేసి: ఈనాడు 

 మనోభావాలు-పార్టీల  అవసరాలు లాంటివి ప్రక్కన పెట్టి 
 సవ్యంగా ఆలోచించి  చూస్తే 
నిజమైన విషయం  బయటికి వస్తుంది....

ముందరగా  విజయవాడ, 
ఇప్పటికే  రాజధాని ప్రాంతంగా  గుర్తించబడి 
అభివృద్ధి  పధంలో శరవేగంగా  దూసుకుని  పోతోంది....
ఇక్కడి  జనాభా కేవలం  రెండేళ్ళలో  కనీసం  అయిదు లక్షలు  పెరిగింది  
అని మన  భారతీయ  సంస్థ  కాదు  
ఓ  అమెరికన్  సంస్థే చెప్పింది...
ప్రపంచంలో  
అత్యదిక జన  సాంద్రత  కలిగిన  నగరాలలో  చ.కిమీకి 32000 జనాభా  ఉండి 
మూడవదిగా  ఉన్నది....
అది కూడా కేవలం  రెండు సంవత్సరాలలోనే....
నిజానికి ఇక్కడ  ప్రభుత్వ-పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు  లేనప్పటికీ
వ్యాపార పరంగా ప్రజలకి ఉపాధి లభించే ప్రాంతంగా గుర్తించ బడింది....
ఇక్కడ  రైల్వే జోను  పెట్టి మరీ వృద్ధి  చెయ్యవలసిన  పనిలేదు...

ఇక  విశాఖ...
మనోభావాలు  తప్ప  వేరొక  అర్హత లేని  నగరం....
ఎందుకంటే ఇప్పటికే  ఇది  రాష్ట్రంలో అతి పెద్ద దైన మొదటి నగరం.
ఇక్కడ ప్రారిశ్రామిక  అభివృద్ధి  ఈనాటిది కాదు....
అనేక  పెద్ద సంస్థలు ఇక్కడ ఉండి  అనేక లక్షల మందికి ఉపాధిని  అందిస్తున్నాయి...
సహజ సిద్ధంగా ఉన్న ఓడ రేవు  ఇక్కడే  ఉన్నది....
ఇన్ని  అవకాశాలు ఉన్న  ఊరు  మరొకటి  ఆంద్ర  రాష్ట్రంలో   
కనీసం దరిదాపుల కూడా  మరొకటి లేదు...
పైగా, 
ఇక్కడ  ఉన్న  ఉద్యోగ  అవకాశాలని తన్నుకుని పోతున్న  
ఒరిస్సా/ఛత్తీష్  ఘర్ ప్రజలకి చాలా అందుబాటులో ఉన్నది...
ఇప్పటికే వారిని ఎదిరించలేని జనానికి 
రైల్వే జోను పేరుతొ మరొక  అవకాశం వచ్చినా  ప్రయోజనం లేదు...

రాష్టం  విడిపోయ్యాక ప్రభుత్వం దృష్టి అంతా విజయవాడ-విశాఖల మీదే ఉన్నదేగాని
రాయల సీమ  ప్రాతంపై పెట్టలేదు...

కాబట్టి,
అన్ని విధాలా వెనుకబడిన  ప్రాంతమైన రాయలసీమలో 
గుంతకల్లుగాని
గుత్తి కానీ
కడపలోగానీ 
ఈ రైల్వే జోను పెడితే...
మరొక  లాభం  ఏమిటంటే, 
ఈ  ఊళ్ళు   ఇతర  రాష్ట్రాలకి  దూరంగా ఉండటమే  కాకుండా
రైల్వే ఉద్యోగాలని  ఎగరేసుకుని  పొయ్యే ఉత్తరాది  వారికి-అరవోళ్ళ కి  దూరంగా ఉండి
మన  ఆంధ్రప్రదేశ్  ప్రజలకి ఉద్యోగ  విషయంలో చాలా  ఉపయోగకరంగా ఉంటుంది...
ఒకటి రెండు గొంతుకలు తిరిపతిలో జోన్ కావాలని  అడుగుతున్నాయిగానీ,
అక్కడ పెడితే అది సాంబారియుల పాలబడుతుంది.
వ్యవసాయం  కష్టంగా ఉన్న  రాయలసీమలో 
ఇటువంటివి పెడితే ఇక్కడి అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది....
అదీకాకుండా,
రాయలసీమ ప్రజల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా
వారిలో వేర్పాటు ధోరణిని కూడా అధిగమిస్తుంది....

ఏవంటారు రాష్ట్ర రాజకీయ పార్టీల వారు....
కేవలం  మనోభావాలకే  పరిమితం  అయ్యి పార్టీలని  కాపాడుకునే ప్రయత్నం చేస్తారా....
లేక వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఉద్యమం చేస్తారా.... 

 రాయలసీమ  రాజకియనాయకులారా చూస్తున్నారా....
చూస్తూనే ఉంటారా....


@@@@@@@@@@@@@@@@@@@@@@@@
2, సెప్టెంబర్ 2016, శుక్రవారం

దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....


దిల్లీలో ఎండాకాలంలో  అయితే...
48నుండి 50 డిగ్రీల  సెంటి గ్రేడ్...
మాడటమే కాదు మనకు  లేని మరో  స్పెషల్ ఎఫెక్ట్ 
ఇసుక దుమారం  అనేకంటే  తుఫానే  అనవచ్చును....
చూడాలంటే  ఈ  దిగువ  లింకు  నొక్కండి...వర్షాకాలం గురించి చెప్ప వలసిన పనే  లేదు....
ఈ క్రింది లింక్ నొక్కండి....
ఫేస్ బుక్ నరేంద్ర సింగ్  గారి  సౌజన్యంతో....
01-09-2016 రోజున దిల్లీలో తీసిన వీడియో...


చలికాలంలో డిల్లి  పరిస్థితి....
పగలే  వీధి లైట్లు  వేసుకోవాలిసిన  పని...
చలికాలంలో పేదలకు ఏ  మాత్రం  రక్షణ లేని  పరిస్థితి...

ఇలా  సంవత్సరం  మొత్తం  ఏ  కాలంలో  కూడా  అనుకూలంగా  లేని
  ఈ  దిల్లి నేల కూడా  ప్రమాదకరమైనదే....
అత్యంత ప్రమాదకరమైన భూకంపం జోనులో దిల్లి...


ఇక ప్రస్తుతానికి వస్తే....

బొమ్మ కర్టేసి ఈనాడు[02-09-2016]

ఇక  విషయానికి  వస్తే....

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నట్లుగా.... 
అనేకమంది సంఘసేవకులు- సలహాదారులు-
కోర్టులకి వెళ్లి మరీ ఆపి ఆంధ్రప్రదేశ్ రాజధాని శ్రేయస్సు కోరే రకం జనం....
పాపం దేశ రాజధానికి లేకపొయ్యారు.... 
అందుకనే భూకంపం జోనులో కట్టుకున్నారు....
ఇసుక తుఫానులు వస్తాయి...
ఇక వర్షాకాలం సంగతి చూస్తే... సరే సరి ....
చలీ కాలం అయితే, పగలే అర్ధరాత్రి లాగా కళ్ళు కనపడవు... 
కాబట్టి,
ఓ ఆంద్ర రాజధాని శ్రేయస్సు కోరే సజ్జనులారా... 
కాస్త దేశ రాజధాని గురించి కూడా ఆలోచించి...
అక్కడి నుండి ఎలాంటి విపత్తు రానిచోటికి మార్చే పనేదో చూడండి.....!!!


@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@

జై  హింద్ 

@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@పైన  వాడిన బొమ్మలన్నీ గూగుల్ లోనివే...


దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....


దిల్లీలో ఎండాకాలంలో  అయితే...
48నుండి 50 డిగ్రీల  సెంటి గ్రేడ్...
మాడటమే కాదు మనకు  లేని మరో  స్పెషల్ ఎఫెక్ట్ 
ఇసుక దుమారం  అనేకంటే  తుఫానే  అనవచ్చును....
చూడాలంటే  ఈ  దిగువ  లింకు  నొక్కండి...వర్షాకాలం గురించి చెప్ప వలసిన పనే  లేదు....
ఈ క్రింది లింక్ నొక్కండి....
ఫేస్ బుక్ నరేంద్ర సింగ్  గారి  సౌజన్యంతో....
01-09-2016 రోజున దిల్లీలో తీసిన వీడియో...చలికాలంలో డిల్లి  పరిస్థితి....
పగలే  వీధి లైట్లు  వేసుకోవాలిసిన  పని...
చలికాలంలో పేదలకు ఏ  మాత్రం  రక్షణ లేని  పరిస్థితి...

ఇలా  సంవత్సరం  మొత్తం  ఏ  కాలంలో  కూడా  అనుకూలంగా  లేని
  ఈ  దిల్లి నేల కూడా  ప్రమాదకరమైనదే....
అత్యంత ప్రమాదకరమైన భూకంపం జోనులో దిల్లి...


ఇక ప్రస్తుతానికి వస్తే....

బొమ్మ కర్టేసి ఈనాడు[02-09-2016]

ఇక  విషయానికి  వస్తే....

ఇక  విషయానికి  వస్తే....

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నట్లుగా.... 
అనేకమంది సంఘసేవకులు- సలహాదారులు-
కోర్టులకి వెళ్లి మరీ ఆపి ఆంధ్రప్రదేశ్ రాజధాని శ్రేయస్సు కోరే రకం జనం....
పాపం దేశ రాజధానికి లేకపొయ్యారు.... 
అందుకనే భూకంపం జోనులో కట్టుకున్నారు....
ఇసుక తుఫానులు వస్తాయి...
ఇక వర్షాకాలం సంగతి చూస్తే... సరే సరి ....
చలీ కాలం అయితే, పగలే అర్ధరాత్రి లాగా కళ్ళు కనపడవు... 
కాబట్టి,
ఓ ఆంద్ర రాజధాని శ్రేయస్సు కోరే సజ్జనులారా... 
కాస్త దేశ రాజధాని గురించి కూడా ఆలోచించి...
అక్కడి నుండి ఎలాంటి విపత్తు రానిచోటికి మార్చే పనేదో చూడండి.....!!!@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@

జై  హింద్ 

@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@పైన  వాడిన బొమ్మలన్నీ గూగుల్ లోనివే...