అనగనగా ఒక రాజ్యం ఉండేది.....ఉన్నది......ఉంటో ఉన్నది. దానిలో అనేక మంది రాజులు వారికి తోచిన విధంగా బ్రతుకుతున్నారు. వారికి కావాలిసినవి సమకూర్చటానికి కొందరు మంత్రులు/మేనేజర్లు ఉన్నారు. వారు ఈ రాజులకి కావాలిసిన సౌకర్యాలను కల్పిస్తూ, చుట్టు ప్రక్కన వారితో మంచి సంబంధాలను కలిగి ఉంటున్నారు.
ఆ మాంచి కాలంలోనే ఆ రాజ్యానికి కావాలిసిన నీరు అంధించటానికి కొండల మధ్య ఒక పేద్ద చెరువు తవ్వించారు.....దానిని ప్రారంభించటానికి చక్రవర్తి గార్ని పిలిచారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను మంచి చేసుకొని అలాంటిదే మరొక చెరువుకి కావాలిసిన నిధులు కూడా తెచ్చుకొని, దానిని కూడా పూర్తి చేశారు. చుట్టు ప్రక్కల వారితో మంచిగా ఉండటం వలన వారి దగ్గర నుండీ నీరు తెచ్చుకొని చెరువులు నింపుకొనే వారు. ఆ రాజ్యానికి కరెంటు కావాలి.....దానితో ఈ మంత్రులు తమ దగ్గర ఉన్న రాజుల సంపద నుండి కొంత తీసి మాంచి జనరేటర్లు కొనుగోలు చేశారు. వాటిలో కొన్ని కొండల మీద ఉన్న పెద్ద చేరువులకి బిగించి తక్కువ ఖర్చుతో కరెంటు వచ్చేట్లు చేసారు. ఇంకేమున్నది........ఆ రాజ్యంలో వెలుగులు చాక్కగా విరజిమ్ముతో ఉన్నాయి. ఇలా రాజ్యం మొత్తానికి సమానంగా సౌకర్యాలని కల్ప్లిస్తూ వస్తున్నారు. ఇక రాజూలందరూ మహా వైభవంగా కాకపోయినా హాయిగానే బ్రతుకుతున్నారు.
సరే, ఒక తరం గడిచింది. ఈ మంత్రులు మారేరు. కొత్త మంత్రులు వచ్చారు. అక్కడ తమ అవసరం ఎంత ఉన్నదో గమనించినాక, పాత వారిలాగా వినయంతో కాకుండా గర్వం, అహంకారంతో మీసాలు మెలేశారు. ఇంకేమున్నది....ఇంత కష్టపడుతున్న తాము ఎక్కువ సౌకర్యాలను ఎందుకు పొందకూడదు.......? ఇలా అనుకోగానే రాజుల సంపదను వాడుకొని తమకి చెందినా భవనాలని పెద్దవి చేసుకొని, రంగులు వేయుంచుకొన్నారు....ఏసీలు పెట్టించుకొన్నారు.....ఇక అక్కడ నుండీ రాజుల సొమ్ముతో మంత్రులు సోకు చేసుకోనారంభించారు. పైగా ఇలా తాము అనేక సౌకర్యాలని పొందటం రాజుల కోసమేనని నమ్మబలికారు. వీరు రాజ్యంలో ఒకే చోట భవనాలని కట్టుకొని ఆ ప్రాంతానికే ఎక్కువ ఖర్చు చేసి సౌకర్యాలని పెంచారు... దానితో ఆ ప్రాంతానికి విపరీతంగా ప్రాధాన్యత పెరిగింది.
ఒకప్పుడు "మంత్రి పదవి ..... అంటే చాలా కష్టంతో మరియూ బాధ్యతతో కూడుకొన్న పని అని, డబ్బులు సంపాయించుకుందాము అని అనుకొన్న వారెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు". కానీ, కొత్త మంత్రుల వైభవం చూసిన తరవాత, ఆ ఉద్యోగం కోసం పోటీ ప్రారంభమైనది..... దానితో ఎవరికి వారు వచ్చి రాజులకి అది చేస్తాము ఇది చేస్తాము అని ఊదరగొట్టేశారు..... వారి తెడ్డేమి పోయింది, స్వంత సొమ్ము కాదుగా.... సొమ్ము అంతా రాజులదే.....కదా!!! రాజులకి కొత్త సౌకర్యాల ఎర చూపించారు. రాజులు కూడా మంత్రుల సౌకర్యాలని చూసి ఆకర్షితులైనారు. దానితో ఈ మంత్రులు రాజులకి మరి కొన్ని సౌకర్యాలని కలిపిస్తామని చెప్పటం ద్వారా రాజుల సొమ్ముని కాజెయ్యటం మొదలు పెట్టారు. ఇదే అదనుగా ఎవరికి వారు అందినంత రాజుల సొమ్ముని ఖర్చు పెడుతో ఉన్న మంత్రులు, ఆ రాజ్యంలోనే బ్రహ్మాణ్ణమైన భవనాలను కట్టుకొని సుఖంగాజీవించ సాగేరు.
అంతా బాగానే ఉన్నది. ఈ ఖర్చు అంతా రాజులదే కదా.....క్రమంగా సొమ్ములు కరిగిపోసాగినాయి....మంత్రుల సొమ్ము పెరగ సాగింది. మంత్రుల మధ్య పోటి పెరిగింది. మంత్రుల పోటీ వలన పెద్ద పెద్ద మంత్రులు వచ్చి....రాజులకి పనిమీద ఆశక్తి తగ్గేంత సౌకర్యాలని కల్పించారు.........కొందరు రాజులు పనీ పాటా మానేసి మంత్రులు ఇచ్చిన మందు కొట్ట సాగారు. దానితో సొమ్ములు ఖర్చే కానీ.....కానీ ఆదాయం లేకుండా పోయింది. శ్రమపడే రాజులని మరింత సొమ్ములు తెమ్మని మంత్రులు వత్తిడి పెంచారు..... సుఖాలు కావాలంటే కష్టపడి కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదని మంత్రులు చెప్పారు. వారు మడుకూ ఏసీ రూములని వదలకుండా "కష్టపడి" రాజభవనాన్ని చూసుకోసాగారు.
మంత్రులు లెక్కలు చెప్పేటప్పుడు, తమ లెక్కల్ని దాచిపెట్టి చెప్పేవారు. మిగిలిన లెక్కల్ని పేద్ద పేద్ద 'ఆర్ధిక లెక్కల వేత్తల" చేత లెక్కలు వేయించి లాభ నష్టాలని చూపించారు..........
HGJKHJ=KYH54542/5254254+9LI0-9TFFDJKJ=46757689798770909/-
-KJGCN7575HU/YrYU587HG+KJ4G78HK>Y<H=98798798789787878/-
TOTAL..............................................................---4547958891008983031/-
కాబట్టి రాజులకి పెట్టే ఖర్చు వల్లనే రాజ్యానికి నష్టం వస్తోంది.........అని తేల్చారు....

రాజులందరూ కలిస్తే కదా లెక్కల భాగోతం తెలిసేది అని మంత్రుల ధీమా.........
ఇక రాజ్యంలో ఉన్న మంత్రులు డబ్బు సంపాదనలో పడి చుట్టు ప్రక్కవారితో మంచి కన్నా..... డబ్బు సంబంధాలనే పెట్టుకొన్నారు. ఈ మంత్రులు తమ దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారాలని, కాంట్రాక్టులని చేసి డబ్బు విపరీతంగా సంపాయించసాగారు. తమ వ్యాపారంలో భాగంగా ప్రక్క వారికి చెరువులు కట్టించి వాటిలో లాభం పొదారు. దానివలన, చుట్టుప్రక్కల వారు నీరు సరిగా ఇవ్వటం మానేశారు.....దానితో రాజ్యంలోని తోటలన్నీ ఎండిపోసాగినాయి...కనీసం త్రాగటానికి నీరు వస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.రాజులు ఎంత కష్టపడినా ఆ డబ్బులు మంత్రుల జీతాలకీ, సౌకర్యాలకే సరిపోతున్నాయి. ఎంత తెచ్చినా మంత్రులు సరిపొలేదనే చెపుతూ వచ్చేరు.... క్రమంగా జనరేటర్లకి కావాలిసిన ఆయిల్ బిల్లులు సరిగా చెల్లించక పోవటం వలన అవి పూర్తి స్తాయిలో పని చేసే అవకాశం పోయింది. చెరువులో నీళ్ళు లేకపోవటం వలన అక్కడి కరెంటు కూడా ఆగిపోయింది. దానితో రాజ్యంలో చికట్లు ముసురుకోసాగినాయి... మంత్రులకి మాత్రం కరెంటు సప్లై నిరంతరంగా ఉన్నది మరి..... ఎందుకంటే వీరు పని చెస్తే కదా రాజులు సవ్యంగా బ్రతికేది......!!!!!

మంత్రుల డబ్బు సంపాదన ముదిరి, ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకి సిద్ధమైనారు. దీనితో రాజుల రక్షణ కన్నా మంత్రుల రక్షణకే ఎక్కువ ఖర్చు కాసాగింది. ఈ గోల రాజులకి తెలియకుండా ఉండటానికి వారిలో వారికి గొడవలు తెప్పించారు... ఇందుకోసం రాజులకి మంత్రులు లేనిపోనివి కల్పించి చెప్పసాగారు. రాజులకి ఇచ్చే సౌకర్యాలని తగ్గించి, ఇది ప్రక్క రాజుల వల్లనే జరిగిందని ఒకరిపైకి ఒకరిని ఎగదోశారు. ఇక రాజుల సంగతికి వస్తే వారికి క్రమంగా సౌకర్యాలు తగ్గటంతో, అప్పటిదాకా ఎవరిదీ, ఏమిటీ అని పట్టించుకోని వారు, తమలో తాము ఆస్థుల కోసం కొట్టుకోనారంభించారు. అసలే ఎండిపోతున్న చెరువులోని నీళ్ళని వివాదాలలోనికి లాగారు...... నువ్వు నా రాజ్యంలోకి ఎందుకొచ్చావు......? అసలు ఇదంతా నాదే.. మీరెవరు....?? నేనే ఇదంతా బాగు చేసింది........ అంటూ తమలో తాము తగాదాలు పడుతుంటే..... మంత్రులు కూడా కొట్టుకొన్నట్లు నటించి, ఏ రాజు దగ్గరికి వెడితే ఆ రాజుకి అనుకూలంగా మాట్లాడుతూ ఈ గోలను మరింత పెంచారు. వ్యాపారాలు చేసుకొనే మంత్రులు మరింత ఆజ్యం పోశారు. రాజులకి రాజులకి పడకపోతే వారిలో వారు మాట్లాడుకో వలసింది పోయి........ మంత్రుల్ని పంపించారు... మంత్రులకి కావాలిసింది రాజ్యం మీద ఆధిపత్యమే కానీ, రాజుల మధ్య సామరస్యం కాదుగా...., గొడవలెందుకు తగ్గిస్తారు........???
డబ్బులూ లేవూ, రాజ్యం అంతా అశాంతిగా ఉన్నది; పోనీ బయటవారెవరైనా వద్దామంటే లో[కల్‌గా]పల పాతుకుపోయిన వారు రానీయరు. ఇదీ ప్రస్తుత పరిస్తితి.... దీనికి మంత్రులని మాత్రమే తప్పు పట్టల్సిన పనిలేదు.....రాజూలైన వారిది కూడా తప్పు ఉన్నది. కానీ ఏమి లాభం...? ఈ సంగతి రాజులు గమనించుకోవటం లేదు.....!!! "రాజులకి తెలిసేటట్లు చేసే మంత్రులు కూడా లేరు"......!!! ఒక వేళ అటువంటి వారు ఉన్నా, వారు ఆస్తుల గొడవ మానండి; రాజ్యం బాగుపడాలంటే అందరి తెలివితేటలూ, సహకారం కావాలనే నిజం చెప్పటం వలన, రాజుల మనస్సుని గెలవలేక పోతున్నారు. ఎవరికీ వారు ప్రక్క రాజు వెళ్ళిపోతే సమస్య తీరుతుందని కొందరు, తాములేందే ప్రక్క రాజులు బ్రతకలేరని ఇంకొందరు, మంత్రులందరు మా వారే వారి వల్లనే మీరు బాగుపడ్డారు అని మరికొందరు అనుకోసాగారు..... రాజులని విభజిస్తే తమ పని మరింత సానుకూలం అవుతుందని మంత్రులు అనుకోసాగారు. ఈ విధంగా ఆ రాజ్యాన్ని మంత్రులు ఆక్రమిస్తున్నారన్న సంగతి రాజులు తెలుసుకోలేకపోతున్నారు........ఇక ఆ రాజ్యాన్ని దేవుడు కూడా కాపాడలేడేమో....!!!
...........ఇంకా ఉన్నది.
...............మిగిలినది .......2021లో
...............మిగిలినది .......2021లో
@@@@@@@@@@
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...
3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!
4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????
5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!
6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
చిత్రాలు గూగుల్ లోనివి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి