ఏదైనా ఊరగాయ కానీ, కూర కానీ చేసేటప్పుడు వాటిలో పదార్ధాలను సాద్యమైనంత
వరకూ చేతితోనే తీసుకొని వెయ్యటం మంచిది............గరిటలు వాడకుండా ఉంటే
మంచిది.......ఎందుకంటే గరిటకి రుచి తెలియదు కదా...........చేతితో వెయ్యటం వలన
మనకున్న అతీత[ఆటోమేటిక్]శక్తి వలన పదార్ధాలు అన్నీ సమపాళ్ళలో పడతాయి. అయినా, ఏది ఎంత వెయ్యాలో కొంత పరిమితి తెలియాలి కనుక క్రింద
వ్రాస్తున్నాను........
టమేటా ఊరగాయ
కావాలిసినవి:
దోరగా పండిన దేశవాళీ టమోటాలు......... 1కేజీ.
చింతపండు ...........................................125 గ్రాములు నుండి 150 గ్రాములు
కారం.....................................................250 గ్రాములు
ఉప్పు......................................................200 గ్రాములు[లేక తగినంత]
నూనె....................................................100 గ్రాములు
మెంతి పిండి........................................... 50 గ్రాములు
ఎండు మెరపకాయలు.............................2 లేక 3 కాయలు
ఆవాలు..................................................1 చెంచాడు
చాయ మినప పప్పు...................................2 చెంచాలు
ఇంగువ..................................................1/2 చెంచా
చాయ మినప పప్పు...................................2 చెంచాలు
ఇంగువ..................................................1/2 చెంచా
తయారు చేసే విధానం:
మొదటగా టమేటాలని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. తరువాత, టమేటాలని 6 సమ భాగాలుగా కొసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, చింతపండులో గింజలు తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే, తినేటప్పుడు చింతపండు ముక్కలుగా వుండి ఇబ్బందిగా ఉంటుంది. ఆ తరవాత, విడిగా కారం మరియూ మెంతిపిండిలని బాగా కలిపి పెట్టుకోవాలి.
ఇక, స్టవ్వు వెలిగించి దానిమీద మూకుడు పెట్టి, దానిలో నూనె వెసి, అది
కాగంగానే, మినప పప్పు, ఆవాలూ, ఇంగువ వేసి కొంచం వేగనిచ్చి....... అప్పుడు ఎండు
మెరపకాయలని మధ్యకి తుంచి వేసి వెయించుకోవాలి. అది వేగిన తరవాత........దానిలో టమేటా
ముక్కలనీ, మిక్సీలో వేసి తీసిన చింతపండునీ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి......ఆ తరవాత స్టవ్వుని
పూర్తిగా తగ్గించి పెట్టి అప్పుడు......... ఉప్పును దానిలో వెయ్యాలి. ఒక నిమిషం
వరకూ అలాగే ఉంచి, స్టవ్వుని ఆపివేయాలి. ఇప్పుడు దానిలో కారం-మెంతి పిండిల
మిశ్రమాన్ని వేసి గరిటతో జాగ్రత్తగా ముక్కలు చితికిపోకుండా
కలుపుకోవాలి....
అంతే, టమేటా ఊరగాయ తయారైనట్లే.......ఇందులో కావాలనుకొనే వారు...కరివేపాకు
కూడా తాలింపు వెగేటప్పుడు వేసుకోవచ్చును. ఇందులో ఇంకా నూనె కావాలనుకొనే
వారు....కావలిసిన నూనె తీసుకొని దానిని వేడి చేసి అందులో కొద్దిగా ఇంగువ
వేసి కలిపిన తర్వాతే ఆ నూనెను ఊరగాయలో కలపాలి. ఈ టమేటా ఊరగాయలో.......... నూనే, ఉప్పూ మరియూ
కారం తగిన జాగ్రత్తగా వేసినట్లైతే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది......."మరీ
సంవత్సరానికి సరిపడా పెట్టుకోకుండా ఉంటం మంచిది".
@@@@@@@@@@@@@@@@@@
elaa chEyaalO chakkagaa vivarinchaaru..
రిప్లయితొలగించండిTHANK YOU.
రిప్లయితొలగించండి