LOCAL WEATHER

24, జనవరి 2014, శుక్రవారం

2005 కి ముందరున్నవన్నీ దొంగానోట్లేనా...??? ప్రభుత్వం ఒప్పేసుకున్నదా....!!!

ఈ నోట్లు చెల్లవని చెప్పింది 
ఏ అమెరికానో, పాకిస్తాను వాళ్ళో కాదు మన ప్రబుద్దులే...

కర్టేసి ఈనాడు 

2005కి ముందున్న నోట్లు చెల్లవంట... 
ఇది కొత్తగా మన ప్రభుత్వ బ్యాంకు నుండి వచ్చిపడ్డ ఉత్తర్వు...
దీనికి గానూ, ప్రజలు నోట్లు వెనక్కి తిప్పి, 
దాని మీద సంవత్సరం ఉందో లేదో చూసి, ఒక వేళ లేకపొతే,  
దానిని బ్యాంకులలొ మార్చుకోవాలట... 
ఇదెందుకయ్యా బాబూ అంటే 
సరైన సమాధానం లేదు కానీ, 
యధావిధిగా మన పెపరోళ్ళు ఊహించిన విషయం ఏమంటే... 
దొంగ నోట్లూ మరియూ బ్లాక్ మని వెలికి తియ్యటానికట...

సరే బాగానే ఉన్నది... దీనికొసం ప్రామిస్ చేసి మరీ ఇచ్చిన మన స్వంత నొట్లనే చెల్లవని చెప్పటానికి వీరికి మొహం ఎలా చెల్లింది... ఇదెలా ఉన్నదంటే ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తున్నారని, ఇల్లే పడగొట్టి కొత్తది కట్టుకోవలన్నట్లుగా ఉన్నది... వీరి ప్రకారమే కనీసం 7000 కొట్ల పైగా ఉన్న నోట్లని మార్చాలట... ఇది జరిగే పనేనా... దీని బదులు వేలల్లో ఉన్న దొంగలనే పట్టుకోవచ్చును కదా... ఇలా నోట్లనే మార్చటం వలన "మాకు ఆ దమ్ము లేదు" అని ప్రభుత్వం ఒప్పేసుకొన్నట్లే కదా... ఇంత నీచ ప్రాజెక్టు బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా మొదలెట్టి ఉండదు... 

చరిత్ర ప్రకారం దీనిని ఇప్పటి దాకా ఒకే ఒకరు చేశారు ఆయన గారే "తుగ్లక్"... ఆయనగారు కూడా బంగారు నాణాల నుండీ తోళ్ళ నాణేల వరకూ రకరకాలైన ప్రయోగాలని చేసి చరిత్రలో నిలిచిపొయ్యారు. మన మనమొహనం గారి ఆర్ధిక పరిపాలన ఇప్పటిదాకా జరిగిన తీరు చూసుంటే, పాపం తుగ్లక్ గారు చిన్నబుచ్చుకొని చరిత్రలో నుండి తప్పించుకొని పోతున్నారు...తన స్థానం ఆక్రమించటానికి మరొకరు వస్తున్నారని....

"I PROMISE TO PAY THE BEARER THE SUM OF...." అని అచ్చు వేసి నమ్మకాన్ని కలిగించిన "మా నొట్లు మార్చండీ పాతవి చెల్లవు"...

చాలా దేశాలతో పొల్చితే మన దేశంలో నొట్ల వాడుక ఎక్కువగా ఉన్నది... అలాంటి మన దేశంలో నోట్లని మార్చటం అనేది దుస్సాహసమే అవుతుంది. అందువల్లన, ఇలాంటి వెర్రి ఆలోచనలు చెయ్యకుండా ప్రజలకి ప్రభుత్వం మీద... వారు జారీ చేసిన నొట్ల మీద నమ్మకం పోకుండా మంచి నిర్ణయాలని తీసుకొని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న దొంగ నొట్లు మరియూ బ్లాక్ మని వ్యవహారాలని నిర్మూలించాలే కానీ,  ప్రభుత్వమే "I PROMISE TO PAY THE BEARER THE SUM OF...." అని అచ్చు వేసి మరీ నమ్మకాన్ని కలిగించిన "మా నోట్లు మార్చండీ... పాతవి చెల్లవు" అనీ, మేమిచ్చే కొత్త నొట్లని పుచ్చుకోండని చెప్పటం ద్వారా ప్రభుత్వం యొక్క అసమర్ధత బయటపడటమే కాదు...ప్రభుత్వం పై ప్రజల విశ్వాసం కూడా పొయ్యే అవకాశం ఉన్నది.....కదా...

దీనికి మార్చవలసినది నోట్లని కాదు, చట్టాలనీ...వాటిని అమలుపరచే అధికారగణాల్నీ, చట్టాలకి అడ్డం వచ్చే ప్రతీ వారినీ... 

దొంగ నోట్లు/బ్లాక్ మని పొవాలంటే మార్చ వలసినది నొట్లు కాదు... దానికి కావాలిసినవి:

1]  ప్రజల చేత నోట్ల వాడకాన్ని తగ్గించాలి/మానిపించాలి...

2] దానికి గానూ ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకాన్ని కలిగించాలి. ఈ నమ్మకం పోవటానికి మూలం ఒక "అరాచక ఆర్ధిక మంత్రి"... ప్రజలేదో దొంగాలైనట్లుగా ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర నిఘా మొదలెట్టాడో... అప్పటి నుండే బ్లాక్ మనీ ప్రవాహం ఎక్కువైంది...లావాదేవీలు అన్ని బ్యాంకుల బయటే... నోట్ల రూపంలో జరగటం ఎక్కువైయింది.... చిట్ ఫండ్ కంపనీల మోసాలు ఎక్కువైనాయి... ఇలా అనేక ఆర్ధిక నేరాలు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ నిఘా తొలగించాలి...అంటే...

   A] ప్రజల ప్రతీ లావాదేవీల మీద పనికి మాలిన నిఘా పెట్టటం మానుకోవాలి.

B] అనేక నీతి మాలిన పన్నులని ఉపసంహరించాలి...
వడ్డీ మీద TDSలు,
సేవా పన్ను..లావాదేవీల పన్ను లాంటివి...
[కావాలంటే ఈ పన్నులను వేరే పెరుతో మరెక్కడైనా దండుకోవచ్చును.]
   
C] ప్రభుత్వ పన్నులు సామాన్య ప్రజల వరకూ వెళ్ళకుండా చూడాలి. 
మీరు 16A ఫాం ఇవ్వండీ, 16H ఫారం ఇవ్వండి అని ప్రజలని పీడీంచ కూడదు.
   
D] ప్రజలని ఎదో దొంగలు పారిపొతుంటే వారిని పట్టుకుంటానికి 
రోడ్డు మొదలులో నుంచున్నట్లుగా...,
వారి ఆర్ధీక లావాదేవీలకి నిలయమైన బ్యాంకుల దగ్గర పెట్టిన
ప్రభుత్వ నిఘాని తొలగించాలి...
అప్పుడే ప్రజలు నిర్భయంగా తమ లావాదేవీలని బాంకుల ద్వారా చేసుకుంటారు...
  
3] ప్రభుత్వంలో ఎన్నిటికో దిక్కుమాలిన కార్పొరేషన్లు మరియూ విభాగాలున్నాయి 
కానీ, అన్నిటికన్నా అతి ముఖ్యమైన 
దేశ కరెన్సీ రక్షణకి సంబంధించి ప్రత్యేకంగా ఏ విభాగమూ లేదు. 
అలాంటి ఒక విభాగం ఏర్పాటు చేసి, 
దానికి నిజాయతీగల అధికారులని ఈ విషయంపై నియమించి, 
వారి పనికి ఎవరు ఆటంకపరచినా... 
వారిని కఠినమైన శిక్షకి గురైట్లు చెయ్యాలి. 
ఇలా కావలిసినవి ఎన్నో  కొన్ని జాగ్రత్తలూ తీసుకొని, 
వాటికోసం ఒక ప్రత్యేక విభాన్ని ఏర్పాటు చేసి... 
ఎప్పటికీ కుదరకపొతే... 
అప్పుడు కూడా చెయ్య కూడని పనిని, 
ఇప్పుడు మన ఘనత వహించిన ఆర్ధిక శాస్త్రవేత్తలతో  నిండిన మూర్ఖ ప్రభుత్వం చేస్తొంది. 

మన దేశంలో నిజాయతీగల ఆఫీసర్లని గుర్తించటం కష్టమైన పనేమీ కాదు..ఎవరైతే ఎక్కువగా ట్రాన్స్ఫర్లకి గురవుతారో, ఎవరైతే మనవ వనరులు, సామాజిక అటవీ శాఖ, వ్యవసాయ అభివృద్ధి, వాతావరణ విశ్లేషణ లాంటి విభాగాలకి అధిపతులుగా ఉంటారో వారే "పండు గార్లు" ... అదే... అదే... నిజాయితీగల ఆఫీసర్లు...

4] బ్లాక్ మని విషయానికొస్తే... 
"ఉద్యోగ విరమణతో వచ్చిన సొమ్ముతో కాలం వెళ్ళదీసే ముసలివారిని, 
పిల్లలు చూడక ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని బ్రతికే పేద్ద వయసు వారిని, 
జీవితంలో ఖరీదైన అనుభవాలని పొందకుండా... 
తనవారి కోసం దాచుకుంటున్న మధ్య తరగతి అమాయకులని 
ఏడిపించటం అనేది... బ్లాక్ మని పట్టించే గొప్ప ఆర్ధిక సంస్కరణ కాదు"... 

అసలు ఈ బ్లాక్ మని మన దేశంలో కన్నా స్విస్ బాంక్ లోనే ఎక్కువ ఉన్నదని ఇప్పటికే ఋజువు అయ్యింది కదా... ప్రభుత్వానికి  దమ్ముంటే దీనికి ఒకే ఒక చట్టం చేస్తే చాలు. అదేమిటంటే..."భారతీయ పౌరసత్వం ఉన్నవారికి విదేశీ బాంకులలో ఖాతాలు ఉండకూడదనీ". అలా ఇప్పటికే ఉన్న వారంతా వారి సొమ్ముని ఏదేని భారతీయ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనీ... అలా చెయ్యని పక్షంలో వారికి యావజ్జీవం శిక్షతో పాటు, వారి ఆస్తులని జప్తుచేస్తాము అనీ...ఒక వేళ అవసరార్ధం బయట బ్యాంకులలో ఖాతాలుండాలి అన్నా,  అవి భారతీయ బ్యాంకులతో మాత్రమే అనుసంధానంగా ఉండాలనీ....

ఇలా చేసే దమ్ము లేనప్పుడు... 
ప్రస్తుతం ఇచ్చిన "నోట్లు చెల్లవు" అనే మాటని ప్రక్కన పెట్టి... 
నోరు మూసుకొని ఉంటే మంచిది... 
లేకపోతే వీరి పనికిమాలిన చర్యల వలన 
బ్లాక్ మని పోదు, దొంగ నోట్లు పోవు 
కాని, 
సామాన్య జనం విపరీత క్షోభకి గురి అవ్వటమే కాకుండా...
వారికి ప్రభుత్వం మీద నమ్మకం పొయ్యే ప్రమాదం ఉన్నది...

అదే కనుక జరిగితే, ప్రభుత్వం ఏదైతే వద్దని అనుకుంటోందో...అదే మన ప్రజలు చేస్తారు. అదే... బంగారం కొనుగోలు. ప్రజలకి నోట్ల మీద నమ్మకం పొతే, వాటి బదులు బంగారాన్ని వాడటం మొదలు పెడతారు... దాని వలన ఏదో ఇబ్బంది వచ్చి పడిందని మన ఆర్ధిక మూర్ఖులు ఇప్పటికే వగచారు కదా...

సరే, ఏమి చెప్పినప్పటికీ....ఎవరి మాట వీనిని సితయ్యాలు లాగా[ఇప్పటి దాకా ఎవరి మాట విన్నారు కనుక] కాదూ...కూడదు నోట్లని మార్చి తీరాలని DAలు, TAలు లెక్కలు మాత్రమే తెలిసున్న ఆర్దిక మూర్ఖ ఉద్యోగులు అనుకుంటే... ఇలా ముందుగానే ప్రకటన చేసేది... సామాన్య ప్రజల కోసమా లేక దొంగ నోట్లు/బ్లాక్ మని ఉన్న వారి కోసమా...??? ప్రజలైనా మార్చుకునేది బ్యాంకుల వద్దే అయినప్పుడు,  ప్రజలకి చెప్పకుండానే ఈ నోట్లని క్రమంగా బ్యాంకులలోనే మార్చ వచ్చును కదా...

అంటే, 
ఇప్పటికే బ్యాంకులలో ఉన్న ఇటువంటే నోట్లని మార్చి, 
ఆయా బ్యాంకులే డైరెక్టుగా రిజర్వు బ్యాంకుకి పంపించి మార్చ వచ్చును కదా...!!!  
అప్పుడు 
కనీసం మన దేశంలో ఉన్న బ్లాక్ మని దారులు అయినా 
ఇట్టె పట్టుబడతారు కదా... 
ముందరగా చెప్పి బ్లాక్ మనిదారులని/దొంగ నోట్ల దొంగలని హెచ్చరించారా...
లేక 
జాగ్రత్తపడమని చెప్పారో వారికే తెలియాలి...
నిజంగా ఆర్ధిక రుగ్మతలు వదలాలంటే 
ఇలాంటి చింపిరి పనులు చెయ్యాలా... 
ప్రభుత్వానికి, దానిని నడిపించే నాయకులకి, 
అధికార గణానికి చిత్తశుద్ధి నిజాయతి ఉంటే 
పరిస్థితి ఇంతవరకు వచ్చేదా....??? 
ఈ నోట్ల మార్పిడి విషయంపై  బాగా తెలిసినవారు 
సుప్రీంను ఆశ్రయిస్తే పరిస్తితి చక్కబడవచ్చును...

ఏదిఏమైనా....వంద కోట్ల పైగా జనాభా ఉండి, ఎక్కువ మంది  కరెన్సీనోట్లనే వాడుతున్న మన దేశంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే, మన ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటమే కాకుండా నమ్మకాన్ని కూడా కోల్పోతుంది. దేశం మనకేమి ఇవ్వకపోయినా పరవాలేదు...దేశానికి మనమేం ఇచ్చాము అని "దేశభక్తిని కూడా బ్లాక్ మెయిల్‌కి వాడుతున్న" మన నాయక గణం.... ప్రజలకి ఏమి ఇవ్వకపోయినా పరవాలేదు...కాని, కనీసం దేశం పట్ల నమ్మకాన్ని పోగొట్టకుండా ఉండే పనులు చేస్తే మంచిది. దేశమంటే నమ్మకాన్ని ఇచ్చేదిగా ప్రజలు నమ్మినప్పుడే ఆ దేశం... దేశంగా ఉంటుంది....



జై హింద్ 


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే