LOCAL WEATHER

2, సెప్టెంబర్ 2015, బుధవారం

మూడు అమరావతి ఎక్స్‌ప్రెస్సుల కధ....

ఒకప్పుడు రైల్వేలో చాలా రైళ్ళు పేర్లు లేకుండానే నడిచేవి....తరవాత రోజుల్లో వాటికి రకరకాలైన పేర్లు పెట్టటం మొదలెట్టారు.... అప్పుడు వచ్చిన రైళ్లకు హౌరా మెయిల్, చెన్నై మెయిల్, సర్కార్ ఎక్స్‌ప్రెస్  అని ఉన్నాయి... 

క్రమంగా.....  

నదుల పేర్లతో...కృష్ణా, పినాకిని[పెన్నా], గోదావరి, గౌతమీ, గంగా-కావేరీ ఇలా అనేక  నదుల పేర్లతో రైళ్ళు వచ్చాయి....

కొండల పేర్లతో.. రత్నాచల్[అన్నవరం కొండ], కొండవీడు[గుంటూరు దగ్గర], గోల్కొండ... ఇలా కొండల పేర్లతో.... 

ప్రాంతాల పేర్లతో... ఫలక్ నుమా, చెన్నై మెయిల్, హౌరా మెయిల్, ముంబై  మెయిల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్సు...

ఈ పేర్లు ఎంత ప్రాముఖ్యం వహించాయి అంటే....ఆ రైళ్ళు ఆయా పేర్లతోనే... అవి ఎక్కడి నుండి ఎక్కడికి వెళతాయో ప్రజలకి తెలిసేంత... 

అంతా బాగానే ఉన్నా... సమస్యల్లా ఒక్క పేరుతోనే.... 
అదే "అమరావతి ఎక్స్‌ప్రెస్" తో.....

మొదట్లో ఇది గుంటూరు నుండి హుబ్లికి మీటర్ గేజి ట్రైనుగా నడచేది....తరవాతి కాలంలో గేజి మార్పిడి వలన...దీనిని విజయవాడ వరకూ పెంచారు....అప్పటి నుండి వారానికి అయిదు రోజులు విజయవాడ నుండి హుబ్లికి, మిగిలిన రెండు రోజులు వాస్కోడ గామా[గోవా]కి నడిచేది.....

అయితే, రైల్వే రాజకీయాలు వలన, ఈ  ట్రైన్ ఇదే పేరుతొ... వారానికి నాలుగు రోజులు హౌరా నుండి వాస్కో[వయా విజయవాడ-గుంటూరు]నడవటం  మొదలు పెట్టింది.... దీని వలన ఇక్కడి ప్రజలకి అందుబాటులో లేదని గొడవలు చెయ్యటంతో....హౌరా అమరావతి ఎక్స్‌ప్రెస్‌ని అలాగే ఉంచి...విజయవాడ నుండి హుబ్లికి మూడు రోజులు నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ని 7 రోజులు నడపటం మొదలెట్టారు.... అక్కడే ప్రజలకి కన్ఫ్యూజన్ మొదలైయ్యింది.... వారంలో నాలుగు రోజులు దరిదాపులు ఒకే సమయంలో రెండు అమరావతి ఎక్స్‌ప్రెస్సులు రావటంతో ... జనాలకి ఏది తాము రిజర్వు చేసుకున్న అమరావతి ఎక్స్‌ప్రెస్షో  తెలియకుండా  పోయింది.....

దీనికి తోడు మరొక సమస్య ఆన్ లైనులో వచ్చిపడింది.....ఆన్  లైనులో ఈ ట్రైనుకి టిక్కెట్టు బుక్ చేసుకుందా చూస్తే , ఇప్పటికే ఒకటికి రెండు అయినాయి అనుకుంటే...మరొక అమరావతి ఎక్స్‌ప్రెస్‌ కనపడటం జరిగింది....ఇది మహారాష్ట్రాలోని అమరావతి నుండి ముంబాయికి వెళుతుంది.....దీంతో కలపి అమరావతి ఎక్స్‌ప్రెస్సులు 3 అయినాయి..... విజయవాడ/గుంటూరు దగ్గర నుండి రెండు అమరావతులు ఒకేసారి ప్లాట్ ఫాం మీదకి వస్తుంటే...ఆన్ లైనులో ఒకే సారి మూడు అమరావతి ఎక్స్‌ప్రెస్సులు వస్తున్నాయి.... పాపం  ఈ రైళ్ళును ఉపయోగించే వారు ఏది ఎదో తెలియక ఒకదాని బదులు  ఒకటి రిజర్వేషన్ చేసుకుంటే... లేక ఎక్కితే... వారి గతి జనరల్  బోగీ పాలే....

కాబట్టి, ఇప్పటికీ  బ్రిటిష్ వారి రుల్సుతోనే నడుస్తూ .... భారత  ప్రజల మాటవినని ఓ ఘనత వహించిన రైల్వే వాళ్ళ లారా... ఈ ఎక్స్ ప్రెస్సు రైళ్ళ పేర్లు అన్నీ మార్చండి....ఈ మూడు రైళ్ళకి వేరే పేర్లు పెట్టి జనాలని కాపాడండి...మూడూ రైళ్ళకి అమరావతి పేరు ఎందుకు తిసెయ్యాలంటే....ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ప్రాంతానికి  "అమరావతి" అని నామకరణం చేశారు....రేపు ఈ పేరుతొ ఏ దిల్లికో రైలు వెయ్యాలిసి రావచ్చును.... అందుకని అమరావతి పేరును ఇప్పటికే ఉన్న మూడు రైళ్ళ కు తీసేస్తే... ప్రజలకి కన్ఫుజన్  లేకుండా  ఉంటుంది....


********

ఆన్ లైనులో ఇబ్బంది లేకుండా ఈ ట్రైను నంబర్లు చూసి బుక్ చేసుకోండి.....వాటి టైం టేబుల్ కోసం క్రింద ఉన్న రైళ్ళ నంబర్ల మీద నొక్కండి....

అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 1
విజయవాడ-హుబ్లి-విజయవాడ


అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 2
హౌరా-వాస్కో-హౌరా


అమరావతి  ఎక్స్‌ప్రెస్‌ 3
అమరావతి-ముంబై-అమరావతి



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ఇంకా ఇలాంటి రైళ్ళు  ఒకే పేరుతొ నడిచేవి ఉంటే 
తెలియజేయండి
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

టైం టేబుల్ కర్టేసి:http://indiarailinfo.com
మేపులు కర్టేసి : సహజంగానే గూగుల్ 




27, ఆగస్టు 2015, గురువారం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???

ఐదు కోట్ల జనాభా ఉన్న ఓ రాష్త్రం ఇలా తలా తోకా లేకుండా అల్లాడుతుంటే...ఇలాంటి సమయములో ఆదుకోవాలిసిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు, కేవలం ప్రెక్షక పాత్ర పోషించినా పరవాలేదు...అయితే, దానికి మించి అనేక పనులకి అడ్డుపడుతూ ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు... అదేదో తమ పరిధి కానట్లుగా కేంద్ర ప్రభుత్వాధినేత మొడీ గారు ప్రవర్తిస్తున్నారు...ఓ ప్రక్కన కాంగ్రెస్సుతో జత కలిసి రాష్ట్రాన్ని విడదీసి...ఈ రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన వారు, ఈ రోజున "ఏ సహాయం చేస్తే మరెవరికో పెరొస్తుందో" అన్న పనికి మాలిన ఆలొచనలతో...రాష్ట్రానికి రావాలిసినవి రాకుండా అడ్డుపడుతూ...రాష్ట్రాన్ని మరింత సంక్షొభంలోనికి నెడుతున్నారు....వీరు అధికార పార్టికి మిత్రులులాగా కాకుండా కక్షగట్టిన ప్రతిపక్షం లాగా  ప్రవర్తిస్తున్నారు.....

ఇప్పుడు మన రాష్ట్రంలొ జరిగే పరిణామాలని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది... తెలుగుదేశం పార్టీకి శత్రువు కాంగ్రెస్ అనుకుంటే...ఆ  పార్టీ వ్యక్తులందరూ జరిగిన ఎలక్షన్లొ చక్కగా తెలుగుదేశానికి సహకరించారు...  అయితే, ఎన్నికల అనంతరం ఎంతో సహకారం లభిస్తుందన్న బీజేపీ నుండి మటుకూ అవమానకరమైన భావనలే ఎదురవుతున్నాయి....ఎప్పుడైతే కేంద్రంలో మరో పార్టీ అవసరం లేకుండా స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో...అప్పటి నుండీ బీజేపీ శ్రేణుల ప్రవర్తన....ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...మారిపోయింది. ఒంటరిగా నుంచుంటే కనీసం ఇండిపెండెంట్లకి వచ్చేనన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీ వారు... చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు...తమ మాటే నెగ్గాలనే విపరీత ప్రవర్తనలు చేస్తున్నారు... దీని వలన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బందేమిటో మనకి అకవసరం లేదు.... అయితే, వీరి వల్ల రాజధాని లేకుండా ఏర్పడిన ఈ రాష్ట్రం మటుకూ మరింత ఇబ్బందులలో పడుతోంది.... ఈ పరిస్థితిని  బీజేపీ లోకల్ నాయకులు దృష్టిలో పెట్టుకోవటం లేదు ....వారి ఆలొచనలన్నీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిపారెయ్యాలనే కోణంలోనే తిరుగుతున్నాయి...వీరికి అలా అనుకోవటమే కాదు...కనీసం కలగనే అర్హత కూడా లేదని వారి లోకల్ నాయకులకి తెలుసును. ఎందుకంటే... వారుగానీ ఏ పార్టీ సహకారం లేకుండా నుంచుంటే....ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఇండిపెండెంట్లకి వచ్చినన్ని ఓట్లు కూడా రావు....

 రాష్ట్రానికి చెందినా విశాల హృదయం కలిగిన బిజెపి ఒక నేత సంగతి...
Inline image 1


ఫోటో కర్టేసి: సాక్షి 

ఈ వెంకయ్య గారు లేకుంటే మన రాష్ట్రానికి దిక్కు లేదంట....
ఈయనగారు లేకపోతే రాష్ట్రానికి నిధులు రావంట.... 
ఒక్క మాటలో అదే వెంకయ్యగారి మాటలో చెప్పాలంటే....
వెంకయ్య లేకపోతే దిక్కు లేదంట.... 
మరి మోడీ గారికి కూడా మనస్సులో ఇదే ఉన్నదా... 
కేవలం వెంకయ్య మొహమాటంతోనే మన రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారా....???
పైగా వెంకయ్యని విమర్శిస్తే నిధులు రావు అని ఓ బ్లాక్ మెయిల్ బెదిరింపు.....
ఫోటో కర్టేసి: ఈనాడు 

మరో నేత బిజెపికి సంబంధించిన విశాఖ ఎంపి
కొత్త రైల్వే జోన్ విషయంలో  పట్టుదలగా తిసుకుంటున్నారే గానీ..
సమస్య గురించి  తెలియటం లేదు...ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందినది...
పైగా ఆ అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలు సీమాంధ్రులు కంటే...
ఒరిస్సా-ఛత్తీస్ ఘర్-బెంగాలి యువతే కొట్టేసింది...
ఇక అక్కడ రైల్వే జోన్ వస్తే,  
ఆ ప్రయోజనం సీమాంధ్ర ప్రజలకి దక్కదు... 
అయినా, 
బిజెపి ఎంపి ఆ విషయాన్ని 
తెలుగుదేశం పార్టీ మీద ఒక ఆధిపత్య ధోరణినిగానే చూస్తున్నారు....
ఆ రైల్వే జోన్ విజయవాడ-గుంటూరు లేక గుంతకల్లులో పెట్టినట్లయితే 
సీమాద్రులందరికి అందుబాటులో ఉండటమే కాకుండా...
ఇక్కడి వారికే ఉద్యోగావకాశాలు దక్కుతాయి....
ఇప్పటికే ఏపి ఎక్స్ ప్రెస్సును దేశంలో ఎక్కడా లేనట్లుగా 
రాజధాని నుండి బయలుదేరే రైలుని 
విశాఖ నుండి నడిపి భువనేశ్వరు వారి చేతులలో పడేశారు...
ఇదంతా చూస్తుంటే...
అన్నీ మేమే చేశాం అని అనిపించుకుని  
ఎదో  సాధిద్దాం అన్న దుగ్ధ బిజెపిలో కనపడుతోంది...
అందుకే, CM వెళ్లి  అడిగితే...
నేను తిరుపతి వచ్చినప్పుడు ప్రకటన చేస్తాను అని సమాధానం వచ్చింది....
అదేదో ఇప్పుడే  చెప్పవచ్చును కదా.... 
అలా చెపితే తెలుగుదేశానికీ పెరోస్తుందనీ వీరి బాధ....
ఇలా  చేస్తుండటం వల్లనే  
ఏపిలో ఇప్పటికే బిజెపికి ఉన్న  కాస్తో కూస్తో ఉన్న పేరు...
మంచిగా  మారక ముందే  చెడ్డ పేరుగా  అయ్యింది....
కాబట్టి, 
ఇప్పటికైనా బిజెపి వారు  ఆధిపత్య ధోరణితో అడ్డు పడకుండా కళ్ళు తెరిస్తే మంచిది....  

ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షానికి... రాష్ట్ర  ప్రయోజనం కన్నా....తాము  ఎన్నికల్లో  కొద్ది తేడాలో ఓడిపోయామన్న కసే ఎక్కువగా కనపడుతున్నది...అధికారపక్షం వారు చేసే ప్రతీ పనిని అడ్డగోలుగా అడ్డుకోవడమేగానీ...దానికి పరిష్కార మార్గాన్ని మడుకు చూపించటం లేదు... కేవలం రాష్ట్రమే కాదు-దేశమే కాదు మొత్తం ప్రపంచంలో భూసేకరణ అనేది  చెయ్యకుండా ఎటువంటి ప్రాజక్టు రాదు అని వీరికి తెలియదా ... అంతదాకా ఎందుకు...వీరికి సంబంధించిన వారు.... అనేక ప్రాజెక్టులకి మూలం  అయిన వై ఎస్ ఆర్ గారు భూసేకరణ చెయ్యకుండానే అన్ని  అభివృద్ధి పనులు చేపట్టారా....???  తెలుసు...అయినాకూడా వీరు ప్రజలని రెచ్చగొట్టే ధోరణిలోనే ఉన్నారు....వీరికి కావాలిసింది...ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవటం...తాము అధికారంలోనికి రావటం తప్పిస్తే వేరే ఆలోచన లేదు....రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది....ఇటువంటి సమయంలో అనవసర రాజకీయాలు కూడదు అనే మెచ్యురిటి కనపడటం లేదు...

కర్టేసి: ఈనాడు-శ్రీధర్ 

ఈ విధంగా కొత్త రాష్త్రం ఏర్పడి సంవత్సరంన్నర అయినా కూడా...రాష్ట్రానికి కావాలిసినవి, అటు దిల్లి నుండి కానీ...ఇటు ఉమ్మడి రాజధాని  నుండిగానీ.. రాబట్టుకో లేక చతికలపడిపోయారు అధికార-ప్రతిపక్ష నాయకులు ... వీరికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తమ రాజకీయాలే ముఖ్యమైపోయాయి...ఒకరు అవునన్నది మరొకరు కాదంటం, ఒకరిపై మరొకరు బురద జల్లుకోవటం...ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి....దానికి వారి పార్టీల నాయకులు...కొందరు కార్యకర్తలు చక్కటి సహకారాన్ని అంధించటం... ఇలాంటి పనుల్లో నిమజ్ఞమైన వీరు... రాష్ట్ర ప్రజలకి...ముఖ్యంగా విద్యార్ధులకి సంబంధించిన విషయాలని ప్రక్క రాష్ట్రం వారు ప్రక్కదోవ పట్టిస్తుంటే పట్టించుకోవటం లేదు...అలాగే  రాష్ట్ర ప్రభుత్వానికి రావాలిసిన ఆస్తుల పంపకం పై కూడా దృష్టి పెట్టటంలేదు.... ఎంత సేపు తమ పగలూ-ప్రతీకారాలు-ఆధిపత్యాలే గానీ, ప్రజల బాబోగుల సంగతి వారికి పట్టటం లేదు......

వీళ్ళు ఇలా ఉంటే....ఉమ్మడి గవర్నరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది... ఆయన ఉమ్మడి గవర్నరుగా కాకుండా కేవలం ప్రక్క రాష్త్ర గవర్నరుగానే వ్యవ్యహరిస్తున్నాడు...ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ప్రభుత్వం గుర్తింపులేని ఒక సంస్థ మాత్రమే....ఇటువంటి ధోరణిలో ఉన్న ఆ అరవాయన సీమాంధ్రుల అసలు కష్టాలని ఎలా పట్టించుకుంటారు.... కావాలంటే తిరుపతి ఓ యాభైసార్లు రమ్మనకుండానే వస్తారుగానీ....

కాబట్టి, అర్హతలు-అవినీతి ఆరోపణలు-ఆధిపత్యాలు లాంటివి ప్రక్కట పెట్టి, ముందర రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఓ దారిలో పెట్టి.... తలకాయలేని రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి...కావాలంటే అప్పుడు అందులో పడి ఏ రాజకీయం కావాలంటే అది చేసుకోవచ్చును కదా... అప్పుడు అది... ఇప్పుడు జరిగే వీధి నాటకం లాగా కాకుండా కాస్తంత మర్యాదగా ఉంటుంది కదా... రాజధాని అంటే ఏ రాజకీయ పార్టీ సొంత సోత్తో కాదు కదా... అందుకని దాని కోసం రాష్ట్రంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "రసకందాయ రాజకీయాలు" మాని...కలసి కట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పడే వరకూ కొట్టుకుని చావకుండా ఉంటే....హైదరాబాదు నాటకాల టివీల వారు ఏడ్చినా...ప్రజలు మటుకూ సంతోషిస్తారు.....

ఈ సందర్భంగా హైదరాబాదు మీడియా గురించి "కోస్త లైఫ్లో"  వచ్చిన  కధనం....





@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???

25] సొమ్ము సీమాద్రులది...సోకు తెలుగుదేశం పార్టీకి...!!!

26] ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???ం పార్టీకి...!!!
27] దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....




@@@@@@@@@@@@











   

4, మార్చి 2015, బుధవారం

సొమ్ము సీమాద్రులది...సోకు తెలుగుదేశం పార్టీకి...!!!

"అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" అనేది సామెత...అత్త సొమ్ము అల్లుడి దానం చేసినా... అది తన స్వంత ప్రయోజనం కోసం చేసినట్లు సామెతలో కూడా చెప్పలేదు..ఆ సామెతని మించి పొయ్యారు మన బాబుగారు...తన స్వప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అధికారాల్ని దుర్వినియోగం చేసి, తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో ఉన్నారు అయ్యగారు...ఇలాంటి దాని గురించి గురించి ఎన్నికల ముందే[7-3-2014] "సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం..." [లింకు నొక్కండి]  అని వ్రాయటం జరిగింది 


బొమ్మ కర్టేసి: సాక్షి

బాబుగారు కరెంటు ఇస్తారుట....వేట్ వదులు కుంటారుట...అసలే లోటు బడ్జెట్టుతో ఉన్న ఏపి ని పట్టించుకోకుండా తన పార్టీ పటిష్టం చెయ్యటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు బాబుగారు......ఎవరి బాబుగాడి సొమ్ము...అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు...."సొమ్ము ఆంధ్రాది..సోకులు తెలుగుదేశం పార్టీకా"... టి.ఆర్.ఎస్ ది కూడా తెలుగుదేశం స్కూలేనంట...బహుశా అందుకనే ఇక్కడి ముఖ్యమంత్రి అయి కూడా... సీమాంధ్రకీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు...అక్కడి నుండి ఏమీ అడగనవసరం లేదు...[అడిగే టైములో మీరందరూ విదేశీయానంలో బిజీగా ఉన్నారనుకోండి...]ఇక్కడివి పోకుండా చూడండి చాలు... చూడబోతే...మీకు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండకుండా అక్కడ ప్రతిపక్ష నేతగా ఉంటేనే బాగున్నట్లుంది.... 


కనీసం విభజన చట్టాన్ని చూడనుకూడా చూడకుండానే
 ముఖ్యమంత్రిగా అయిన తరవాతే 
జై రాం రమేష్‌గారి దగ్గర చట్టం ప్రతిని 
తెచ్చుకున్నారు మన బాబు గారు... 

పైగా ఆంధ్రాకి ఎవరో అన్యాయం చేస్తున్నారుట...వారి సంగతి సరే వాళ్ళు బయటివారు; పైగా మార్వారీ వ్యాపార వేత్తలు, లాభం లేనిదే ఏమీ చెయ్యరు...మరి అయ్యా బాబుగారు మీరు చేసిందేమిటి...దిల్లికి పోయినప్పుడల్లా...తెలుగు రాష్ట్రాలకి న్యాయం అంటిరి....అది ఏ రాష్ట్రమో తెలియక అసలుకే మోసం వచ్చింది...అయినా ప్రక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దాని గోల మీకేల...బాబూ... ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అడిగితే వాళ్లకి తప్పించుకునేందుకు సాకు దొరకదు...

బాబుగారు... కనీసం తన రాష్ట్రం పిల్లల చదువులకి కూడా సహకరించని అక్కడి ప్రభుత్వంతో స్నేహానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు...? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇల్లు వాకిలి లేకుండా, ప్రభుత్వ నిర్వాహణకే డబ్బులు లేక అల్లాడుతుంటే , మీరు వరాలు ఇతరులకి ఇవ్వటం ఏమిటి...? ఇది ఎలా ఉన్నదంటే స్వంత దేశంలో ఖర్చు పెట్టాలంటే లెక్కలు చెప్పే ప్రధానమంత్రి-ఆర్ధిక మంత్రులు నేపాలు-బురిండి లాంటి దేశాలకు వేల కోట్లు దానం చేసినట్లు ఉన్నది...వారికి మీకు తేడా ఏమున్నది... అదీకాక తమ రాష్ట్రం ధనవంతపు రాష్ట్రం అని ఆ ముఖ్యమంత్రే అంటుంటే...బాగోలేని ఆంధ్రప్రదేశ్ వంక చూడకుండా స్వప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలని నాశనం చేస్తున్నారు ... మనసొక చోట...మనువొక చోట అన్నట్లున్నది ఈయనగారిని చూస్తే...ఇలాగే పనిచేస్తే రెండికి చెడ్డ రేవడిలా..ప్రతిపక్షానికి కూడా పనికిరాని పార్టిగా మిగిలిపోతారు...



చివరిగా "తెలుగు రాష్ట్రాల" బిజేపి వారికి...మీకేం కావాలో అడగండి.. అంతేగాని మరొకళ్ళకి ఇవ్వద్దు అనే దిక్కుమాలిన రాజకీయం చెయ్యకండి...అది రాజకీయ కనీస మర్యాద కూడా లేని వాళ్ళు చేసే పని...కాంగ్రెస్సు ఎలాంటి రాజకీయం చేసినా... ఇప్పుడు మీరు చేసే రాజకీయం ముందర దిగదుడుపే...ఇదే మీకు మొదటి అవకాశం...దీనిని దుర్వినియోగం చేసుకుంటే...ఇదే చివరి అవకాశం అవుతుంది... దేశ ప్రజలు మీ పార్టీ మీద ప్రేమతో మీకు ఓటు వెయ్యలేదు..మీ మోడీ గారిని చూసి ఓటు వెయ్యలేదు...కాంగ్రెస్ రాజకీయం నచ్చక వేరే దిక్కులేక మీ మాటల వలలో పడి మిమ్మల్ని కేంద్రంలో నిలబెట్టింది... సరిగా నిలబడి సరియిన అడుగులు వేస్తే సరి; లేకపోతే మళ్ళా ప్రతిపక్ష పార్టీగా...బాధ్యతలేని మాటలు మాట్లాడుతూ హాయిగా గడిపెయ్యచ్చు...బహుశా మీకు అదే బాగుంటుందేమో....




రాజకీయాలు మానండి...
పార్టీల భవిష్యత్తు కోసం కాదు 
దేశ భవిష్యత్తు గురించి పనిచెయ్యండి...



@@@@@@@@@@@@@@@@@
జై హింద్
@@@@@@@@@@@@@@@@@@
కర్టేసి: ఇందులో బొమ్మలన్నీ సాక్షి-ఈనాడు-టీవీ 9 లోనివి



ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???

25] సొమ్ము సీమాద్రులది...సోకు తెలుగుదేశం పార్టీకి...!!!

26] ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???ం పార్టీకి...!!!
27] దేశ సంఘ సేవకులకి అమరావతి మీదున్న ప్రేమ ధిల్లి మీద లేకపోయే....




@@@@@@@@@@@@