పై వార్త కర్టేసి ఈనాడు...
మొన్న జరిగిన పార్లమెంటు గొడవలో మన దేశ పార్లమెంటు పరువు పోయిందని... పాపం ఒక బిహారీ గారు, బిహారులోనే కోర్టుకెళ్ళాడుట... ఆయనేదో ఒక సోషల్ వర్కరో లేక ఒక చిరుద్యోగో అయ్యుంటే, పాపం ఏదో లోక జ్ఞానం లేక కేసు పెట్టాడని అనుకోవచ్చును. కానీ, ఆయన సాక్షాత్తూ ఒక న్యాయవాది[లాయరు]. బీహారు గొడవలు గురించి బాగా తెలియటానికి వీలున్న వృత్తి.... అయినా ఆయన గారికి, బిహారీల కన్నా కూడా మన తెలుగు వారి గొడవే ఎక్కువగా కనపడిందిట....కనీసం పేసెంజరు రైల్లొ కూడా రెండు రూపాయల టిక్కెట్లు కొనని వాళ్ళకి, ఆంధ్రా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైనట్లు కనపడింది... అసలు బిహారులో ప్రభుత్వము, చట్టము లాంటివి ఉంటాయా... అని దేశ వాసులే ఆశ్చర్యపొయ్యెట్లుగా ఉండే బీహారులోని ఒక బిహారీ గారికి... మన పార్లమెంటు ఎంపీల భాగోతం దౌర్జన్యంగా కనపడింది...!!! బహుశా వాళ్ళలాగా గొడ్డళ్ళు, కత్తులూ, తుపాకులూ వాడలేదని, అందుకనే "దౌర్జన్యం యొక్క పరువు పోయిందని" ఆయనగారి ఉద్దేశ్యం అయ్యుంటుంది...!!!
చట్టాలని చేసేదే మేము, మాకు ఏ చట్టం వర్తించదు... అన్నట్లు ప్రవర్తిస్తారు ఉత్తరదేశీయులు. వీరు వచ్చి మనవారికి నీతులు చెప్పే అర్హత ఉన్నదా...? అందులోనూ బీహారీలు అంటేనే చట్టాన్ని ఎంత బాగా గౌరవిస్తారో భారతీయులందరికీ తెలిసిందే... ఒకప్పుడు, బీహారులో ఒక ప్రకృతి విలయం సంభవిస్తే, మన కేంద్రం స్పందించే లోపలే, అక్కడి కాంగ్రెస్సు ముఖ్యమంత్రి చైనా వారి సహాయం కోరాడు... ఇదీ బీహారీయుల దేశ భక్తి...చివరికి వీళ్ళా మన దక్షిణ దేశం వారికి నీతులు చెప్పేది...!!!
అందుకనే అనిపిస్తుంది, ఇదంతా హిందీ మరియూ ఉత్తర దేశం వారి కుట్ర అని. ఎందుకంటే; జగన్, గాలి జనార్ధన్ రెడ్డీ, రాజా, కనిమోళీ లాంటి వారి ఆర్ధిక నేరాలని... ఉత్తర దేశ నాయకులు/ప్రజల అవినీతితో పోలిస్తే...వారి ముందు మన వారు చిన్న పిల్లలు లాంటి వారుగా కనపడతారు. శాంతి భద్రతల విషయంలోనూ మనకంటే వెయ్యాకులు ఎక్కువ చదివిన వారే... ఉత్తర దేశంతో పోలిస్తే, దక్షిణ దేశం దేవలోకం లాంటిదే... అయినప్పటికీ, దక్షిణ దేశం వారిని వేలెత్తి చూపించి....తామెంతో మహా పతివ్రతలైనట్లు మహ ఫోజు కొడతారు ఈ హిందీ బానిసలు. ఎన్నో వేల కోట్లు అడ్డగోలుగా సంపాయించుకుంటున్న ఉత్తరాదివారు...తమలాంటి పనే దక్షిణాది నుండి ఎవరైనా చేస్తే మాత్రం వారికి చట్టం, రాజ్యాంగం రుచి చూపిస్తారు. తమదాకా వస్తే...సాధ్యమైనంతవరకు చట్టాన్ని పట్టించుకోరు... కుదరకపోతే, చట్టాన్నే మార్చివేస్తారు... ఇక దక్షిణ దేశం నుండీ ఎవరైనా ఎదిగితే వీరికి పడదు. వారిని ఎదో విధంగా పడదొయ్యాలనే చూస్తారు.
దక్షిణాది వారిని పడదోసి వారు పైకి రావాలనే ఉద్దేశ్యం, ఉత్తరాది వారి ప్రతీ కదలికలోను కనపడుతుంది. ముఖ్యమైన పరిశ్రమలన్నీ వారివైపే పెట్టుకున్నారు. అలాంటి పరిశ్రమలు మనకి రాకుండా మన వారి చేతే నాటకాలు ఆడిస్తారు. అలా వారికి మడుగులు ఒత్తుతూ ఉన్న దక్షినాదివారినే వారు రాజకీయాలలో పైకి రానిస్తారు. ఈ విషయంలో... దక్షిణాదిలో మిగిలిన వారి కన్నా తమిళులు తెలివైన వారు. వీరు కూడా హిందీ వారి ఆధిపత్యాన్ని ముందరగా ఎదిరించినా, అది కుదరదని గ్రహించి... లౌక్యంగా లొంగి నట్లుగా కనపడి...వారి పనులు వారు చేసుకుని, మిగిలిన వారికన్నా పైకి వచ్చారు... అలా దేశానికి పనికొచ్చే వస్తువుల పరిశ్రమలని సాధించుకున్నారు. అయితే, వీరికి కూడా హిందీవారి ఆధిపత్య జాడ్యం లాంటిది ఉండటం వల్లనే వీరు హిందీ వారితో స్నేహం చెయ్యగలిగారు.
అలా చెన్నయి, బెంగళూరు, కొచ్చిన్ అభివృద్ధి పధంలోనికి నడుస్తుంటే...అవి ఎలాగు బాగుపడుతున్నాయి... కానీ, దానిలో భాగాసామ్యం అక్కడి వారి కన్నా బయట నుండి వచ్చిన రాజస్తాన్, బిహార్, యు.పీ., గుజరాత్ వారికి పనికొచ్చేట్లుగా తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు మన ఉత్తరాది వారు. దీనికి చిన్న ఉదాహరణ....మనం ఎన్ని నాళ్ళుగా మొత్తుకున్నా మనకు వెయ్యని రైళ్ళను.... వారి ప్రాంతం యువతకి పనికొచ్చేట్లుగా రైళ్ళని వేసి, ఆక్కడి వారు తేలిగ్గా దక్షిణాదిన అభివృద్ధి చెందిన ప్రాంతానికి చేరుకునేట్లుగా తెలివిగా రైళ్ళని వేస్తారు....వేస్తున్నారు... ఎక్కువ భాగం రైళ్ళు, ఉత్తరాది వెనుకబడిన ప్రాంతాల నుండి చెన్నయికి, బెంగళూరుకి, ఎర్నాకుళానికి[కొచ్చిన్] మరియు యశ్వంత్‌పూర్ [బెంగళూరు]కి ఉంటాయి. అదే, మన వెనుకబడిన ప్రాంతాల నుండి ముంబాయి నుండి కాన్పూర్ వరకు ఉన్న అభివృద్ధి చెందిన కారిడార్లకి రైళ్ళు వేస్తారా...?? వెయ్యమని అడిగినా కూడా వెయ్యరు. ఎందుకంటే, వారి యువతకి దక్షిణాది యువత కాంపిటిషన్ వస్తుంది కదా.... ఇలా ఉంటాయి ఉత్తరాది కుళ్ళు రాజకీయాలు.
ఈ విషయంలో రాజకీయ పార్టీలలో అది కాంగ్రేసు అయినా మరే ఉత్తరాది పార్టీలు అయినా ఒకటే... చివరికి బిజెపి అయినా... వీరందరికీ కావాలిసింది హిందీ'స్తానే కానీ, హిందూస్తాన్ కాదు..... అందుకని, మన ప్రాంతపు రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన ప్రాంతాలకి జరుగుతున్నా అన్యాయాన్ని, వివక్షతని గమనించి మెలగాలి. మనమంటే లెక్కలేని ఆ ఉత్తరాది వారిని న్యాయం అడిగితే... వారేమి చెపుతారు... వారికేది లాభమో అదే చెపుతారు. ఇక దక్షిణాన్నే ఉన్న ఆషాడ భూతులైన కొందరు ఇతర భాషల వారికి కావాలిసింది కూడా మనం నాశనం అవటమే...కారణం...హైదరాబాదు నగరం కూడా మిగిలిన నగరాలలాగానే అబివృద్ధి వెలుగులనివ్వటమే... అందుకనే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని వ్యంగంగానే అందరు చూస్తున్నారే కానీ, అందులో నిజాయతీ లేదు. మన దిక్కుమాలిన నాయకులకేమో కాళ్ళు పట్టుకుని పదవి సంపాయించటం...కాంట్రాక్టులు సంపాయించటం తప్ప, ఉత్తరాది వారి వెకిలి నవ్వుల, దక్షిణాది ఆషాడభూతుల కుళ్ళు రాజకీయం తెలియని మూర్ఖులు. వీరికల్లా ఉన్నది విపరీత స్వార్ధం అంతే....దీనికి వీరు... రాష్ట్ర ప్రజలనే తాకట్టు పెట్టేస్తారు....
ఈ విషయంలో రాజకీయ పార్టీలలో అది కాంగ్రేసు అయినా మరే ఉత్తరాది పార్టీలు అయినా ఒకటే... చివరికి బిజెపి అయినా... వీరందరికీ కావాలిసింది హిందీ'స్తానే కానీ, హిందూస్తాన్ కాదు..... అందుకని, మన ప్రాంతపు రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన ప్రాంతాలకి జరుగుతున్నా అన్యాయాన్ని, వివక్షతని గమనించి మెలగాలి. మనమంటే లెక్కలేని ఆ ఉత్తరాది వారిని న్యాయం అడిగితే... వారేమి చెపుతారు... వారికేది లాభమో అదే చెపుతారు. ఇక దక్షిణాన్నే ఉన్న ఆషాడ భూతులైన కొందరు ఇతర భాషల వారికి కావాలిసింది కూడా మనం నాశనం అవటమే...కారణం...హైదరాబాదు నగరం కూడా మిగిలిన నగరాలలాగానే అబివృద్ధి వెలుగులనివ్వటమే... అందుకనే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని వ్యంగంగానే అందరు చూస్తున్నారే కానీ, అందులో నిజాయతీ లేదు. మన దిక్కుమాలిన నాయకులకేమో కాళ్ళు పట్టుకుని పదవి సంపాయించటం...కాంట్రాక్టులు సంపాయించటం తప్ప, ఉత్తరాది వారి వెకిలి నవ్వుల, దక్షిణాది ఆషాడభూతుల కుళ్ళు రాజకీయం తెలియని మూర్ఖులు. వీరికల్లా ఉన్నది విపరీత స్వార్ధం అంతే....దీనికి వీరు... రాష్ట్ర ప్రజలనే తాకట్టు పెట్టేస్తారు....
ఇక్కడ మన నాయకులనో లేక అవినీతి పరులనో సపోర్టు చేస్తున్నామని కాదు. ఒకే నేరానికి ఉత్తరాది వారికో న్యాయం, దక్షినాది వారికో న్యాయం కనపడుతుంది. దీనికి ఉదాహరణగా రాజానో, లేక గాలినో ఉదాహరణ తీసుకోవలసిన పనిలేదు.... చిన్న రైలు సంఘటనని తీసుకుంటే చాలు... టిక్కెట్టు లేకుండా వందల కొద్ది బీహారీలు రిజర్వేషన్ బోగిలలోనికి ఎక్కితే... గోడవై తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో వారిని అదుపులోనికి తీసుకున్నారు... వారిలో కొందరు ఫోన్ ద్వారా "పై వారిని" సంప్రదించారు... అంతే...వారిని తక్షణం విడిచి పెట్టమని సాక్షాత్తు రైల్వే మంత్రి ఫోన్ చేసి మరి విడిపించే ఏర్పాటు చేసేశాడు. ఇలా మన వారికి ఉత్తరాదిన న్యాయం జరిగే అవకాశం ఉన్నదా....???
"లేదు" అని దేశం అంతా వినిపించెట్లుగా అరచి చెప్పే సంఘటన మొన్నీ మధ్యన జరిగింది..... అదే ఉత్తరాఖండ్ వరదలు.... వాటిలో చిక్కుకుని మనవారు ఎన్నో వేలమంది ఉంటే... మన వారిని పట్టుకుని బాధలో ఉన్నారని కూడా చూడకుండా, బూతులు తిడుతూ... "మీరు మా ప్రాంతానికి ఎందుకొచ్చారు...?? మీ ఖర్మ, మీ చావులు మీరు చావండి" అని ఎన్నో వేలమంది సాక్ష్యంగా నిర్భయంగా నిర్లక్ష్యంగా వారు అనటం చూస్తే.... మనం అంటే ఉత్తరాది వారికి ఎంత గౌరవమో తెలుస్తుంది....ఇక అక్కడి ప్రజలు ఎన్నివిధాల మన వారిని దోచారో ఆ దేవుడికే తెలియాలి....అక్కడివారే కాకుండా సైన్యానికి చెందిన కొందరు వారు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మన వారు చెపుతుంటే...."అసలు మనని ఈ దేశం వారిగా చూస్తున్నారా ఈ ఉత్తరాది మూఢులు...?" అని అనుమానం రాక తప్పదు...
ఉత్తరాది వారు రాజకీయంగా అలా ఉంటే ...ఇక అక్కడి పారిశ్రామిక వేత్తలకి కూడా మనమంటే లోకువే... వారికి కావాలిసింది దక్షిణాది నుండి వినియోగదారులే కానీ, ఉద్యోగులు కాదు. ఒక వేళ ఉద్యోగాలు ఇచ్చినా... అవి షాప్ కీపింగ్ పనులే... రిలయన్సు అంబానిలకి కావాలిసింది మన గేస్ మాత్రమే, వారు స్థాపించే పరిశ్రమ ఎదో... ఇక్కడే గేస్ దొరికే చోటే పెట్టచ్చు కదా... పెట్టారు... ఎందుకంటే, అందులో ఉత్తరాది వారికి ఎక్కువ ఉద్యోగాలు రావు కదా... ఈ విషయంలో టాటా వారి మనస్సు కూడా కఠినమే...టాటా నానోని బెంగాలు వారు పొమ్మన్నా కూడా వారి మీద కొద్దిగా కూడా కోపం రాలేదు...ఆ ప్రాజెక్టు మా రాష్ట్రంలో పెట్టండి మహాప్రభో అని మన రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంత మొత్తుకున్నా వినకుండా తీసుకెళ్ళి గుజరాత్ లో పెట్టారు... ఎంతైనా వారు వారు భాయి భాయి కదా... వీరే కాదు బజాజ్, జిందాల్ లాంటి మొదలైన వారికి... మన వనరులు మాత్రమే కావాలి కానీ, మన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం మనసొప్పదు.. వీరు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించబడే పెద్ద పరిశ్రమలని మన ప్రాంతంలో నెలకొల్పరు...ఒక వేళా ఏదైనా చిన్నా చితకా పరిశ్రమలు వారు స్థాపిస్తే, వారి రాష్ట్రం వారిని తెప్పించుకుని మరీ పెడతారు. ఇంతెందుకు, మన రాష్ట్రంలో తిండి తప్పితే, మిగిలిన వస్తువులు 90 శాతం దాకా బయటి రాష్ట్రాల నుండి వస్తున్నాయి అంటే... ఇంకా చెప్పేదేమున్నది. చివరికి హోళీకి వాడే రంగులు, రాకిలు, దీపావళి టపాసులు, చిన్న పిల్లలు ఆడుకునే రంగు కాయితాలు కూడా బయట రాష్ట్రం నుండి వస్తుంటే...మనం దేనిలో అభివృద్ధి చెందినట్లు...??
ఇకపోతే, ఉత్తరాది ప్రజల గురించి చెప్పాలిసిన పనిలేదు... వారిలో వారు ఎంత స్నేహంగా ఉంటారు. అయితే దక్షినాది వారంటే మాత్రం చులకనే.... వీరికి మనవారంటే ఎంత చులకనంటే... ఒకసారి విజయనగరం బస్‌స్టేండులో ఒక హిందీ వాడు గొణుక్కుంటున్నాదు... "క్యా లోగ్ హై, ఇస్ లోగ్ కో హిందీ భి నహి జాంతా హై"....కేసే దేశ్ వాసీ హై.... అని. ఇంతకీ వాడి గోలేమిటంటే... మన బస్సుల మీద అంతా తెలుగులోనే ఉన్నది. వాడు అడగబోతే... సామాన్యులకి హిందీ రాదు. వాడి అవసరం కోసం మన వూరు వచ్చి... మన వాళ్ళు వాడి భాషలో మాట్లాడటం లేదు అనే అహంకారాన్ని చూపించాడు. అంటే, దిక్కుమాలిన హిందీ రాకపోతే భారతీయులు కానట్లనా...??? ఆ హిందీ అహంకారికి సమాధానంగా ఒక ప్రయాణీకుడు అన్నాడు..."టెర్రరిస్టులు అందరు హిందీలోనే మాట్లాడతారు కానీ, తెలుగులోనూ, కన్నడంలోనూ మాట్లాడరుగా" అని.
ఇక పార్లమెంటు గోడవ దగ్గరికొస్తే...నిజంగా చిత్త శుద్ధి వుంటే తెలంగాణా పార్టీల వారు, సీమాంధ్ర పార్టీల వారు, కొందరు ప్రాంతీయంగా అనుభవం ఉన్నవారు[మేథావులు కాదు] ఒక చోట కూర్చుని, ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలో చక్కటి నిర్ణయం చేసుకొంటే బాగుంటుంది కానీ....ఎవరు కొట్టుకొని క్రిదపడితే మింగుదామా అనే అడవి నక్కలులాగా ఉన్న వారి దగ్గరికా... మనలో మనం కొట్టుకొని న్యాయానికి వెళ్ళేది...???
కాబట్టి, అలాంటి చోట మన తెలుగు నాయకులు వీధిన పడి గొడవ చెయ్యకుండా, మన సమస్యని పద్దతిగా పరిష్కరించుకున్నట్లయితే, పాకిస్తాన్ వారి నుండి యుద్ద నీతులు, చైనా వారి నుండి ప్రజాసామ్యం, అమెరికా వారి నుండి స్వేచ్చ, యురప్పు వారి నుండి చట్టాల గురించి, చివరికి... దేశానికే అపకీర్తి కిరీట ధారులైన బిహారీల నుండి కీర్తి, పరువు మర్యాదల గురించి చెప్పించుకోవలసిన ఖర్మ పట్టదు కదా...!!!
జై హింద్
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి