LOCAL WEATHER

13, అక్టోబర్ 2013, ఆదివారం

రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు......???

నిరంకుశంగానా.....?? ప్రజాసామ్యికంగానా.......? 


రాస్జ్ట్రాన్ని విభజిస్తామని అంటున్నారు... 
కానీ, రెండు నెలలైంది... ఒట్టి బెదిరింపు మాటలే కానీ,  పని మొదలెట్టింది లేదు.... 
దాని వలన అవకాశవాదులైన రాజకీయ నాయకులకి మంచి అవకాశం దొరికింది...
ఒకే పార్టి వారైనా...  
ప్రాంతానికోవిధంగా ఎవరికీ తోచినది వారు మాట్లాడి,  
ప్రజలని రెచ్చగోట్టేస్తున్నారు. 
దీంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య... 
ఎదో రెండు శత్రు దేశాల మధ్య ఉన్నంత వైషమ్యాలు మరింత పెరిగినాయి....
ఎవడి రాజకీయ స్వార్ధం వాడిది....
వీరికి ప్రజల అతీగతీ అఖర్లేదు....
ప్రజల మనోభావాలకి గౌరవం లేదు...
వీరు మనం ప్రజాసామ్య పద్దతిలో ఎన్నుకున్న పాలకులేనా...? 
మన చేత ఎన్నుకోబడ్డ వారేనా...?? 
మన మంచి కోసం రాజ్యాంగబద్ధంగా ప్రమాణాలు చేసిన వారేనా...??? 
లేక బ్రిటీషు పాలకులలాగా ప్రజలని విభజించి దోచుకునే వారా... 
ఏది లాభం ఏది నష్టం అని అంచనాలు వేసే 
ఈస్టు ఇండియా కంపెనీ వారా అని అనిపించక మానదు.... 
ఎందుకంటే, మన పాలకులు బెంగాలు విభజన జరిగినప్పుడు 
బ్రిటిషు వారి లాగా ప్రవర్తిస్తున్నారు. 
అయినా, 
"ఆదిస్థానం" అనే మాట వాడే వారికి,  
ఎన్నుకున్న ప్రజల మీద గౌరవం ఎక్కడుంటుంది లెండి.... 

బెంగాలు పెద్ద ప్రాంతమైనా.... మొత్తం తమ పాలనలో లేదన్న అక్కసుతో దానిని విభజించి...తద్వారా అక్కడి ప్రజలని విభజించి తమ లాభం చూసుకోవాలని చూసినవారు.... మన కాంగ్రెస్సు వ్యవస్తాపకుని [A.O.HUME]  దేశంవారు. వారికి తమ ప్రాభవం ఎలా పెంచుకోవాలనే తపనే తప్ప,  ప్రజల బాధలు పట్టలేదు. అందుకనే బెంగాలు విభజనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగి... తిరిగి బెంగాలు ఐకమత్యం జరిగింది...అయితే, జరగాలిసిన నష్టం జరిగిపోయింది.... బ్రిటీషు పెద్దలు ఏది కోరుకున్నారో, మన ప్రజలే చేసి పెట్టారు. తిరిగి బెంగాలు ఐకమత్యం చెందే సమయానికి...బీహారు, ఒరిస్సా, అస్సాము ప్రజలు సహకరించక వేరే ప్రాంతాలుగానే మిగిలిపొయ్యారు., బ్రిటీషు వారు రగిలించిన విభజన వాదంలో చిక్కుకొనిపొయ్యారు. ఎందుకంటే విభజనకే మొగ్గిన వారికి... తాము ఆధారపడుతున్న  కలకత్తా లేక ధాకా లాంటి ...అప్పటికే బాగా అబివృద్ధి చెందిన నగరాలు దూరమైపోయినాయి. దీని ఫలితంగా అప్పటికే కాదు.... ఇప్పటిదాకా కూడా ఒరిస్సా, బీహారు మరియూ అస్సాము రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడిపోయి బీద రాష్ట్రాలుగానే మిగిలిపొయినాయి. బ్రిటీషువారే కాదు;  తరవాత వచ్చిన మనవారు కూడా  రాష్ట్రాల్ని అభివృద్ధి  చెయ్యాలనే ఆలోచన లేకుండా,... తమ స్వార్ధం తాము చూసుకొని, ఆ రాష్ట్రాల ప్రజలని దరిదృలుగానే ఉంచి, తాము కోటీస్వరులైనారు... 

అది ఎప్పుడో పాత గాధ అని అనుకుంటే కాంగ్రెస్సు రాజకీయంలో కాలు ఇరుక్కుపోయినట్లే.....ఎందుకంటే బ్రిటీషువారి వారు వెళ్ళిపోయినా... వారి అడుగుజాడలనే ఎంచుకొన్న మన భారతీయ పెద్దలు... వారి వ్రాత ప్రతులనే ఎంచుకొన్నారు[1935 Act]...రాజ్యాంగం కోసం అక్కడా... ఎక్కడో వెతీకి వెతీకి... ఎక్కడో ఉన్నదేశాలకి సంభందిన ప్రజల మనోభిష్ట్రాన్ని గమనించి మన రాజ్యాంగానికి అతికించారే కానీ, ఎక్కడా మన దేశంలో ప్రజల మనోభావాలని అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. అందునా... 80 శాతం ఉన్న గ్రామీణ ప్రజల్ని....ఇక విషయానికొస్తే... తెలుగు వారి విభజన కోసం మిగిలిన తెలుగు వారిని ఎవరిని సంప్రదించాలిసిన పనిలేదని....రాజ్యాంగం ప్రకారం అక్కడి వారిని ఆడకుండానే విభజించే అవకాశం ఉన్నది కాబట్టి...... ఆ ఆర్టికల్స్‌ని  ఉపయోగిస్తామని చెపుతున్నారు... మన నిరంకుశ పాలకులు....మరి తెలుగు ప్రజల కన్నా కాశ్మీరి ప్రజలు తమ విభజనని [దేశం నుండే కాదు రాష్ట్రాన్ని కూడా విభజించమని] కోరుతున్నారు...మరి ఆ ప్రజల ఆకాంక్షని కూడా మన రాజ్యాంగం ప్రకారమే కానిస్తారా....??? మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ప్రపంచంలోని మరే దేశాధినేతకూ లేవు... మరి వాటిని ఉపయోగించి ప్రజాబద్ధంగా గెలిచిన పార్లమెంటుని రద్దు చేస్తే... అప్పుడు ఈ పాలకులు ఏమంటారు....??? ఆ... ఏమున్నదీ నిరంకుశం అంటారే కానీ.... రాజ్యాంగం ఆ అధికారాన్ని ఇచ్చింది కాబట్టి...  ఆ నిర్ణయం సరైనది అని ఎవరైనా అంటారా...??? దేశానికి కాదు కేవలం రాష్ట్రాలలో రాజ్యంగ సూత్రం ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టినా నానాయాగీ చేసే అన్ని పార్టీలు, మరియు మేథావులు{!!!} ఇప్పటి పరిస్థితికి వంత పలకటం విచారకరం....


తమకి సరిపొయ్యెట్లుగా ఉన్నప్పుడు,  నిరంకుశ అధికారాలని ఉపయోగించమని ప్రొత్సాహిస్తే.... రేపు అలాంటి అధికారాలే నెత్తికి చుట్టుకునే అవకాశం ఉన్నదని... అందరూ గమనించాలి. ఎందుకంటే, ఇవ్వాళ ప్రక్క ప్రజల మనోభావాల్ని లెక్క చెయ్యకుండా రాజ్యాంగ లెక్కలని చూపించే వారికి....రేపు ఇలాంటి పరిస్థితే ఎదురైతే... దానిని సమర్ధిస్తారా...??? ప్రతిదీ సూత్రాల ప్రకారమే చేసి ప్రజలని విస్మరిస్తే... అది ప్రజాసామ్యం అవదు....రాజ'రిక నిరంకుశ పాలన అవుతుంది.....అందుకనే పాలకులు తమ విచక్షణని కూడా ఉపయోగించాలి.   కానీ, మన పాలకులు తమ విచక్షణని తమ కుళ్ళు రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు.....దేశం ఎప్పుడైనా విపత్కర పరిస్తితుల్ని ఎదుర్కొంటే వాడమని రాజ్యాంగంలో ఉంచిన ఆర్టికల్స్‌ని తమ రాజకీయ ఎదుగుదలకి....... ఎత్తుగడలకి... ప్రత్యర్దులని ఎదుర్కోవటానికి వాడుకుని,  రాజ్యాంగాన్ని అపహాస్యంపాలు చెయ్యటమే కాకుండా... దాని మీద ప్రజలకి నమ్మకాన్ని పొయ్యేట్లు చేస్తున్నారు.

ఇంతకు ముందు రాష్ట్రాలు ఏర్పడినప్పటి సంప్రదాయాన్ని కాదని చేస్తే... అది మంచి పరిణామం కాదు. దీని మీద ఒక రాజకీయ పెద్ద మనిషి అంటాడు.... "ఆ... ఏమున్నది ఇదొక కొత్త సంప్రదాయం అవుతుంది......" అని.....  మరి, ఈ కొత్త సంప్రదాయం ప్రకారం హైదరాబాదుని యునియన్ టెరిటరిచేస్తే....... లేక, ఉత్తర తెలంగాణా దక్షిణ తెలంగాణాగా రెండు రాష్ట్రాలు చేస్తే...... ఈ పెద్ద మనిషి ఒప్పుకుంటాడా....??? ఈ విధంగా చేయ్యటమనే సాంప్రదాయం మొదలైతే, రాజకీయ నాయకులు తమ లాభ నష్టాల కోసం ఎవరూ అడగకుండానే రాష్ట్రాలని విభజించి పారేయ్యవచ్చును... 

ఇలా రాష్ట్రాల వారు అడగక పోయినా రాజ్యాంగం ప్రకారం ఇచేస్తే........  

మహారాష్ట్రాని మూడు రాష్ట్రాలుగా అంటే; కొంకణ్ ముంబై... నాగపూర్ విదర్భ... ఔరంగాబాదులుగా రాజ్యాంగం ప్రకారం విభజిస్తే మన షిండే గారు ఒప్పుకుంటారా....షోలాపూర్కి ముంబై దూరమైతే సహిస్తారా....

రాష్ట్రం అంతా ఒక భాష మాట్లాడని కర్ణాటకాని కన్నడ కొడంబ..... తుళు... కూర్గు.... మంగళూరు... ఉర్దూ బిజాపూర్లుగా విభజిస్తే సుష్మాగారు సంతోషంగా సహకరిస్తారా......

రకరకాల తెగలు ఉన్న కాశ్మీరును ......జమ్ముగాను...... లడక్ గాను........ ఆక్సాయిచిన్‌గానూ  విభజిస్తే మన ఆజాద్ గారి చిరునవ్వు అలాగే ఉంటుందా....

మదరాసుతో చారిత్రిక సంబంధం లేకపోయినా "మదరాసే తమ సంస్కృతి"  అని అనుకుంటున్నా తమిళనాడుని   చోళ... పాండ్య... చేన్నయిలుగా విభజిస్తే చిదంబరంగారు నిబ్బరంగా ఉండగలరా....[ఇలా చేస్తే,  అక్కడ దశాబ్దాలుగా గెలవని తమ పార్టి గెలిచే అవకాశం కూడా ఉండవచ్చు...]

గుజరాతులో ఎప్పటి నుండో అడుగుతున్న... భౌతికంగా కూడా చాలా భాగం విడిగా ఉన్న సౌరాష్ట్రా మరియు కచ్ రాష్ట్రాల సంగతిని... తానూ అధికారంలోనికి రాగానే చూస్తారా... మన మోదిగారు.....

అసలు దేశంలో చారితాత్మకంగా  ఒకే రాజ్యంలో లేని మధ్యప్రదేశ్  దిగ్గు రాజా  గారికేమి తెలుస్తుంది... చారిత్రాత్మక నేపద్యం....

ఏదైనా మనదాకా వస్తే కానీ తెలియదు అని... వీరిదేమి పోయింది...
ఇక్కడ రాష్ట్ర విభజన అంశం కాదు.....దానిని విభజించే విధానమే ప్రజాసామ్యకంగా ఉండాలి....
మరి రాష్ట్రం అడిగే వారు ప్రజలు కారా...ప్రజలే...
కానీ రాష్ట్రం అడగని ప్రజలకి కూడా రాష్ట్ర విభజన ఇబ్బంది కలిగించినప్పుడు... 
వారిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి కదా...
వారిని అడిగి, వారి ఇబ్బందులని తీరుస్తామని ఒప్పించి రాష్ట్రం ఇవ్వచ్చును కదా... 
ఇలా అడుగుతూ పొతే జరుగుతుందా...?
"ఇదేమన్నా గుప్తుల కాలమా"  అని మరో పెద్ద మనిషి అన్నాడు...
నిజమే. ఇది నిరంకుశ రాజరిక పాలన ఉన్న గుప్తుల కాలం కాదు....
 లేక, అరాచక పాలన ఉన్న ఔరంగజేబు కాలం కానే కాదు.......
మనం ఉన్నది "ప్రజాసామ్యక  భారతదేశంలో".....

కాబట్టి, రాష్ట్రాం ఇవ్వాలీ,  లేక వద్దూ అనే వాదనల మాయలో పడి......... పాలకులని గుప్తుల కాలానికో లేక మొఘల్ కాలానికో తీసుకెళ్ల  వద్దు.  ప్రజల మధ్య ఉన్న అనుమానాలని తొలగిస్తే ఎన్ని రాష్ట్రాలకైనా ఒప్పుకుంటారు.... ప్రజలమధ్య ఇలాంటి అపోహలని అనుమానాలని సృష్టించే వారిపట్ల రాజ్యాంగం పవరేమిటో చూపించాలే కానీ.... ఇప్పటికి మనకి సరిపోయిందని పాలకుల నిరంకుశ వాదానికి ఒప్పుకుంటే, రాబోయే తరాలకి నిరంకుశ పాలకులని తయారు చేసి ఇచ్చినట్లవుతుంది... రాజ్యాంగాన్ని దుర్వినియోగపరిచేందుకు ముందు ముందు రాబోయే పాలకులకి లైసెన్సు ఇచ్చినవారవుతారు....!!!
జైహింద్


*****************************************
<><><><><><><><><><><>
 అందరికి దసరా శుభాకాంక్షలు 
<><><><><><><><><><><>
 *************ప్పగంతురాధాకృష్ణ 
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి