LOCAL WEATHER

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఆంధ్రా రాజధానిలో "సాంబారు భూకంప రాజకీయం"..???

రాజధానికోసం కమిటీని వేశారు బాగానే ఉన్నది... దానిలో ఒక్కరూ తెలుగు వారు లేరు "ఇది మరీ బాగుంది...!!!" కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఒక రిపొర్టు కూడా ఇచ్చింది... మరీ మరీ బాగా ఉన్నది...  అయితే, ఆ రిపొర్టులో అక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అక్కడి నీటి లభ్యత 20 ఏళ్ళపాటు లెక్కలోనికి తీసుకోవాలి అని అనటంతోబాటు... ఫలానా చోట పెడితే ఎండ బాగుంటుంది....మరో చోట భూకంపాలు వస్తాయి, ఇంకొక చోట నీళ్ళు దొరకవు అనేవి కూడా బ్రహ్మాణ్ణంగా వివరించేశారు... అయితే, దీనిలో ఉప్పులేని సాంబారు రాజకీయం కనపడుతోంది...!!!

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
జోన్ 4 లో ఢిల్లీ,  ముంబాయ్, కలకత్తాలు[పార్ట్] ఉన్నాయి,
జోన్ 3లో చెన్నయ్,కలకత్తాలతోబాటు విజయవాడ ఉన్నది.
భయంకరమైన భూకంపం వచ్చిన లాతూరు... జోన్ లో 2 లో ఉన్నది...
విచారకరమైన విషయం ఏమంటే హైదరాబాదు కూడా జోన్ 2 లోనే ఉన్నది...
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎందుకంటే, రాజధానిని పెట్టేప్పుడు ఎండలెక్కువా, భూకంపాలున్నాయా, నీళ్ళుంటాయా అనికాదు చూసేది... ఈ పైన చెప్పిన మూడు దుర్లక్షణాలు హైదరాబాదులోనూ, మరియూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉన్నాయి... ఒక్క సునామీ వస్తే క్షణాలలో లక్షలలో ప్రాణాలు, వేల కోట్ల రూపాయల పరిశ్రమలు నీటిలో కలిసి పోయే సునామి జోన్‌లో ఉన్నాయి చెన్నయి, ముంబాయిలు. ఎండలు ఎక్కడ లేవు...ఢిల్లీలో మండే ఎండతోబాటు రాజస్తాన్ ఇసుక వానకూడా వస్తుంది... అయినా, వీరు చెప్పిన విజయవాడ[విజిటి] పరిధిలో గత 100 ఏళ్ల పైన ప్రాణాంతక భూకంపాలు వచ్చిన చరిత్ర లేదు....

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇందులో కూడా విజయవాడ-చెన్నయిలు జోన్ ౩ మోడరేట్ లో ఉన్నాయి.
ఢిల్లి,ముంబై,కొలకత్తాలు జోన్ 4 హై రిస్క్ లో ఉన్నాయి.
లాతూర్, హైద్రాబాదులు జోన్ 2 లీస్టు అక్టివ్‌లో ఉన్నాయి.
లీస్టు అక్టివ్‌లో ఉన్న 
10 వేలమంది ప్రాణాలు పొయ్యాయి, 30 వేలమంది గాయపడ్డారు, బోలెడు ఆస్తి నష్టం జరిగింది.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

విజయవాడ ప్రాంతంలో పెట్టటం ఇష్టం లేకపోతే 
సరైన కారణం చెప్పాలే కానీ
వందల సంవత్సరాలుగా జరగని ఉపద్రవాన్ని 
ఆ ప్రాంతం మీద ఆపాదించటం ఎంతవరకు సరైనది...???  
"ఈ ప్రాంతంలో గత రెండు మూడు వందల సంవత్సరాలుగా 
ఎన్ని భూకంపాలు వచ్చినాయి...?
వాటి వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది...
ఎంత ఆస్థి నష్టం జరిగింది...
లాంటి వివరాలని ఆయన తన రిపోర్టులో ఇచ్చుంటే బాగుండేది"...
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

విజయవాడకి దగ్గరలో రాని భూకంపాలు... కర్టేసి:http://earthquaketrack.com/
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈయనగారు చెప్పిన వినుకొండ-దొనకొండ-అద్దంకి ప్రాంతాలలో 
నెలకోకసారైనా భూమి కంపిస్తుంది...
ఈ సంగతి అక్కడి ప్రజలకి తెలుసు...వీరు పెద్దగా కంగారు కూడా పడరు. 
ఇలాంటి ప్రదేశాన్ని ఎందుకు సేఫ్ జోన్ అన్నారో ఆయనకే తెలియాలి. 
అయితే, ఇందులో రాజకీయం ఏమంటే...
విభజన తరవాత విజయవాడ ప్రాంతం
తప్పనిసరిగా అభివృద్ధి చెందే ప్రాంతం...
"రాజధాని అయినా కాకపోయినా",
ఆ అభివృద్ధి ఫలితం
చెన్నయి మీద చెడుగా పడుతుందనే
అరవ భయం అయ్యుంటుంది...
అందువల్లనే
బయటివారి పెట్టుబడులు వచ్చే...
త్వరగా అభివృద్ధి చెందే 
విజయవాడ ప్రాంతంపై అనవసర రాద్దాంతం చెయ్యటం....

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
గత 200 సంవత్సరాలుగా భారతదేశంలో వచ్చిన భూకంపాలు 
33TE
EPICENTER

Lat(Deg N)      Long(Deg E)
LOCATION
MAGNITUDE
1819 June 16
  23.6                    68.6
KUTCH, GUJARAT
8.0 
1869 JAN 10
  25                        93
NEAR CACHAR, ASSAM
7.5
1885 MAY 30
  34.1                    74.6
SOPOR, J&K
7.0
1897 JUN 12
  26                        91
SHILLONG PLATEAU
8.7
1905 APR 04
  32.3                    76.3
KANGRA, H.P
8.0
1918 JUL 08
  24.5                    91.0
SRIMANGAL, ASSAM
7.6
1930 JUL 02
  25.8                    90.2
DHUBRI, ASSAM
7.1
1934 JAN 15
  26.6                    86.8
BIHAR-NEPAL BORDER
8.3
1941 JUN 26
  12.4                    92.5
ANDAMAN ISLANDS
8.1
1943 OCT 23
  26.8                    94.0
ASSAM
7.4
1950 AUG 15
  28.5                    96.7
ARUNACHAL PRADESH-CHINA BORDER
8.5
1956 JUL 21
  23.3                    70.0
ANJAR, GUJARAT
7.0
1967 DEC 10
  17.37                    73.75
KOYNA, MAHARASHTRA
6.5
1975 JAN 19
  32.38                    78.49
KINNAUR, HP
6.2
1988 AUG 06
  25.13                    95.15
MANIPUR-MYANMAR BORDER
6.6
1988 AUG 21
  26.72                    86.63
BIHAR-NEPAL BORDER
6.4
1991 OCT 20
  30.75                    78.86
UTTARKASHI, UP HILLS
6.6
1993 SEP 30
  18.07                    76.62
LATUR-OSMANABAD, MAHARASHTRA
6.3
1997 MAY 22
  23.08                    80.06
JABALPUR,MP
6.0
1999 MAR 29
  30.41                    79.42
CHAMOLI DIST, UP
6.8

భారత్‌లో వచ్చిన భూకంపాల లిస్టు. కర్టేసి:http://theconstructor.org/[లింకు నొక్కండి] ఇంట్లో కూర్చుని కాసేపు గూగుల్ దేవతని ఆరాధిస్తేనే ఇన్ని విషయాలు తెలిసినాయి.  మన రాజధాని కమిటిన్ వారు "ఎక్కడెక్కడ" తిరిగారో మరి....!!! దక్షిణాన గత 195 సంవత్సరాలలో  భూకంపం రాలేదు. అయితే, 1900లో తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వచ్చినా పెద్దగా నష్టం జరగలేదు... దగ్గరగా మహారాష్ట్రాలో మాత్రమే రెండు సార్లు వచ్చింది. 
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఇక మీడియా వారి సంగతి చెప్పనే అఖర్లేదు... ఆయన చెప్పాడు... మేము వ్రాస్తాము అన్న చందాన..నిజానిజాలు తెలుసుకోకుండానే తమ న్యూస్ పేపర్ల నిండా "భూకంపాల జోను" అంటూ ఒకటే ఊదర కొట్టేస్తున్నారు...కాస్త బుద్ధితో ఆలోచిస్తే ఇట్టే తెలిసిపోతుంది కదా...అదేక్కోడో మెక్సికోలో కాదు కదా...ఇక్కడ ఉండే విజయవాడే కదా... "విజయవాడ పరిసర ప్రాంతాల చరిత్రలో ప్పుడైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించే భూకంపం వచ్చిందా"అని ఒక సారి చూసుకుంటే సరిపోతుంది కదా... కానీ చూసుకోరు...మనకి కావాలిసింది సెన్సేషనల్ న్యూస్ అంతే. మనకి వేరెవరో శత్రువులు అఖర్లేదు... మన మీడియానే పెద్ద విచ్చిన్న కారి శత్రువు... ఒకప్పుడు విభజనకి ఆజ్యం పోశారు... మరిప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ మీద ఎవరో ఎదో చెప్పాడని క్రిందా మీదా చూసుకోకుండా ఒకటే రభస....

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------------------------------------------------------------------

అండమాన్/నికోబార్ ప్రాంతం... ఇది భయంకరమైన భూకంపాల జోన్...
పైగా ఇక్కడ రెండు అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి... 
ఇక్కడ వచ్చే భూకంపాల వలన వచ్చే సునామీ ఎఫ్ఫెక్టు చెన్నయ్ మీద ఉంటుంది...
దానికి ఉదాహరణ 2004లో వచ్చిన సునామినే...
దీనికి వెనుకాల ఉన్న మలేషియాలో వస్తేనే అది చెన్నయ్ వరకూ వచ్చింది.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్నో మనకి చెప్పినాయన రాష్ట్ర రాజధాని  చెన్నై... సునామి వస్తే మునిగిపోతుంది. అది 10 ఏళ్ళ క్రిందట వచ్చి ఆస్తి ప్రాణ నష్టం కలిగించింది కూడా...మరి ఈ 10 ఏళ్ళలొ వారు తమ రాజధానిని మార్చుకున్నారా ... లేదు...చెన్నయికి ఆంద్రా వాళ్లు తెలుగు గంగ ఇస్తేనే నీళ్ళు, ఇక ఎండలూ చెమటల గురించి చెప్పాలిసిన పని లేదు...వర్షం వస్తే మునిగిపోయే రోడ్లే ఎక్కువ...రాష్ట్రానికి మధ్యలో ఉన్నదా...అదీలేదు. ఇంతకీ అసలు భయం... రాజధానిని ఏ మధ్యలో ఉన్న పాత తమిళ రాజధానులు అయిన మదురైకో, తిరుచినాపల్లికో మారిస్తే ...చెన్నయిలో తిరిగి తెలుగువారి ప్రాభవం వస్తుందని భయం...ఇది పైకి చెప్పలేరు కదా...!!! మరి ఇప్పటి భయం...

విజయవాడ భూకంపాల జోనులో ఉన్నదో లేదో తెలియదుగానీ, 
"విజయవాడ కంపం" పరిధిలో 
చెన్నయి మడుకూ ఉన్నది అని... వాళ్లకి తెలుసు... 
విజయవాడ అభివృద్ధి చెందితే మొదట దెబ్బ తినేది చెన్నైయ్యే.

సరే, విషయానికి వస్తే... ఇన్ని చెప్పిన కమిటిన్ వారు...రాజధానికి కావాలిసిన అసలైన అర్హతని మరచినట్లున్నారు ....!!! ఇప్పటికే రెండు సార్లు తరిమెయ్యబడ్డ వారికి మొదలు తీసుకోవలిసిన జాగ్రత్త ఏది...??? నిజానికి ఏదైతే ముఖ్యమైన విషయం ఉన్నదో దానిని పరిగణలోనికి తీసుకోలేదు... "ఎక్కడ పెడితే హైద్రాబాదు తరహాలో మిగిలిన జనాన్ని తరిమెయ్యకుండా ఉంటారో" అది మడుకూ చెప్పలేదు... కమిటిన్ వారు చెప్పినదానిలో మరొక విష[య]౦ ఉన్నది...తమ రిపోర్టులో శ్రీకాళహస్తి మీద ఎనలేని ప్రేమ చూపించారు...ఇదేదో చిత్తూరు జిల్లామీద ప్రేమ కాదు. ఎందుకో తెలుసా...అది తమిళనాడుకి కూత వేటు దూరంలో ఉన్నది...అక్కడేదో సైన్సు సిటితోబాటు...ఇప్పటికే కొట్టుకుంటున్నవిజయవాడ, గుంతకల్, విశాఖలు కాకుండా శ్రీకాళహస్తిలో రైల్వే జోను పెట్టాలిట...!!!

నిజానికి, హైదరాబాదుని రాజధానిగా చేసేప్పుడు శివరామ కృష్ణన్ కమిటివారు చెప్పిన విషయాలులాంటివి చాలానే ఆలోచించారు... పెద్ద ప్రదేశం ఉన్నది... బోలెడు భవనాలున్నాయి...మరిన్ని కట్టటానికి కావాలిసినంత ఖాళీ ప్రదేశాలున్నాయి... దీని చుట్టూ వ్యవసాయ భూములు లేవు... నగరం కావాలిసినంత విస్తరించుకోవచ్చు అన్నీ ఉన్నాయి కానీ... ఏమి లాభం...తీసుకోవలిసిన అసలైన జాగ్రత్త తీసుకోకుండా కేవలం భౌతికమైనవిషయాలని పరిగణలోనికి తీసుకున్నారు...అది నిజాం క్రూరంగా పాలిచిన ప్రాంతం, అక్కడ బయటి వారికి సరైన భద్రత లేదు...అక్కడి సంస్కృతి సీమాంధ్ర జిల్లాల సంస్కృతికి చాలా భిన్నంగా ఉంటుంది లాంటి ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించలేదు. కేవలం భౌతికమైన విషయాల పట్లే శ్రద్ధ చూపించారు. అందువల్లనే అక్కడి నుండీ మూటా ముల్లే సర్దుకోవాలిసిన దుర్గతి సీమాంధ్రులకి పట్టింది... 

పై ముఖ్యమైన విషయాలని దృష్టిలో ఉంచుకొని కమిటి వారు ఇవి చూసారా...

అ] ఎక్కడ రాజధాని పెడితే ఆ ప్రజలు మిగిలిన వారి శ్రమని దోచుకొని తరవాత తరిమెయ్యకుండా ఉంటారు...

ఆ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడ ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమాలు ఉన్నాయా...

ఇ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడి ప్రజలు మిగిలిన వారిని ఆదరించే స్థితిలో ఉన్నారా...

ఈ]ఎక్కడ పెడితే మరో మదరాసు, మరొక విధ్వంసక హైదరాబాదు కాకుండా ఉంటుందో 
ఈ కమిటి సూచించిందా...???

ఉ] ఎక్కడ పెట్టబోతున్నారో అక్కడ ప్రజలకి సామాజిక భద్రత ఉన్నదా... 

ఊ] రాజధానిని పెట్టబొయ్యే ప్రదేశంలో ప్రకృతి విలయాలు చూశారు, 
మరి చూడవలసిన మానవ హృదయాన్ని చూసారా... చూడలేదు...                  

ఖాళీ ప్రదేశాలు దొరకటం లేక భూకంపాల జొన్ అవటం లేక 20 యేళ్ళో 30 ఏళ్ళో నీటి లభ్యత స్థలాల లభ్యతా కాదు. చూడాలిసింది ఎప్పటికీ పెట్టే బేడా సర్దుకొని పోకుండా ఉండాలిసిన సామాజిక వాతావరణం ఉన్న ప్రదేశం... ఇటువంటి మానశిక  విషయాలని కూడా ఇదే బ్లాగులో [లింకు నొక్కండి] "సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు... ?!?!?లో 24 ఫిబ్రవరి 2014న వివరించటం జరిగింది.

కమిటి రిపోర్టు విషయానికి వస్తే కూరంతా వండేసి దానిలో ఉప్పెయ్యటం మరిచిపోయినట్లున్నది... పోనీ ఇదేమన్నా అనుభవంలోనికి రాని విషయమా... కాదు కదా రెండు సార్లు మోసపోయిన జాతికి రాజధానిని వెదికేప్పుడు తీసుకోవలిసిన ముఖ్యమైన విషయాన్ని పరిగణలోనికి తీసుకోలేదు...ఇది మన రాష్ట్ర విషయంలో ఏమిటి... మన దేశ విషయంలోనే ఇటువంటి జాగ్రత్త తీసుకోలేదు... అదేమిటంటే... విదేశీయుల వలన వందల సంవత్సరాలు బాధపడి తరవాత స్వాతంత్రాన్ని తెచ్చుకొని, అప్పుడు వ్రాసిన రాజ్యాంగంలోనే "విదేశీయులు భారత దేశంలో ఎటువంటి రాజకీయ పదవులు/అధికారాన్ని పొంద కూడదు" అని ఎక్కడా వ్రాయబడలేదు...ఎన్నో బాధలు విదేశీయులచే/దురాక్రమణదారులచే పడిన తరవాత, స్వంతంగా  వ్రాసుకొన్న రాజ్యాంగంలోనే ఆ విషయాన్ని పొందుపరచలేదు...

సరే సంగతికొస్తే...
రాజధానికి కావాలిసిన ముఖ్యమైన విషయాలు... 

1] అందరికీ అందుబాటులో ఉండటం 

2] అక్కడ అప్పటికే విభజన వాదాలు ఉద్యమాలు లేకుండా ఉండటం

3] రాజధాని పెట్టబోయె ప్రాంతంలో 13జిల్లాలలో ఎక్కువ జిల్లాల సంస్కృతి కనపడుతూ ఉండటం.  

4] రాజధాని పెట్టబోయే ప్రదేశంలోని ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారా 
లాంటి ముఖ్యమైన విషయాలని కూడా పరిగణలోనికి తీసుకు తీరాలిసి ఉన్నది... 

5] రాజధాని ప్రదేశంలో ప్రకృతి భద్రతా కన్నా సమాజ భద్రతా ఉండటం ముఖ్యమైనది.

ఇలాంటి విషయాలని చూడాలే కానీ, లేనిపోని విష[0]యాన్నిపెట్టి రాజధాని అయినా కాకపోయినా అభివృద్ధి చెందబోయే  ప్రాంతం పై అనవసర అభాండాలు వెయ్యకూడదు...ఇలా లేనిది ఉన్నట్లుగా చెప్పటంతో...రాజధాని వికేంద్రికరణ  అనే ముఖ్యమైన విషయాన్ని కూడా నమ్మని పరిస్థితికి తెచ్చారు మన కమిటి వారు...అందుకనే మన విషయాలని  మనమే చూసుకోవాలేగాని, ఇతరుల మీద...అందులో ఒకప్పుడు మనని అవమానించిన వారిని, అరవ చరిత్రలో ఎప్పుడూ రాజధానిగా లేని మన చంద్రగిరి రాజులు నిర్మించిన పట్టణాన్ని లాక్కున్న వారిని నమ్మటం సరైనది కాదు...

@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@

రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి

2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...

3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!

4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????

5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!

6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???

 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???

@@@@@@@@@@@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి