LOCAL WEATHER

28, జులై 2012, శనివారం

చిట్టెంటి పొట్టు కూర



ఇదేమిటి ఇదేమి కూర అనుకుంటున్నారా.........? అవును, ఇప్పటి వారికి చాలా మందికి దీని గురించి తెలియదు. ఇంతకీ ఇదొక ఆకు కూర. దీనిని "చిట్టెంట ఆకు" అంటారు. మిగిలిన ప్రాంతాలలో ఎమో గానీ; ఇది ఎక్కువగా క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో పొలం గట్ల వెంబడి లబ్యం అవుతుంది. దీనికి ఒక సీజను ఉన్నది. అప్పుడు మాత్రమే ఆకును బాగా ఎండబెట్టి మనకు అమ్ముతారు. ప్రస్తుతం "శేరు" 50/- రూపాయలున్నది. కొన్న వెంటనే ఆకును బాగా ఎండబెట్టి తరవాతే ఒక డబ్బాలో పొసి దాచుకోవాలి. ఎండిన ఆకును ఎప్పుడైనా వండుకోవచ్చును.

కావాలిసినవి:
1] చిట్టెంటు ఆకు పొట్టు 1 చిన్న డబ్బాడు

2] పెసర పప్పు ..1 చారెడు

3] ఎండు మెరపకాయలు --- 4 లేక 5

4] తాలింపులోనికి శనగపప్పు, ఆవాలు,

ఇక దీనిని వండుకునే పద్దతి ఏమంటే....ముందరగా ఆకులోని పుల్లలనూ గడ్డీ గాదంలను తీసేసి శుబ్రం చేసుకోవాలి. ఆకు బాగా ఎండిపోయి ఉండాలి. దానిని కొద్దిగా నలిపి ఆకులను ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా ఉన్న ఆకునే "చిట్టెంట పొట్టు" అంటారు.

తరవాత, ఆకును బాగా ఉడకబెట్టుకోవాలి. ఊడకబెట్టేముందరే దీనిలో "పెసరపప్పును" వేసుకోవాలి. తీసుకున్న కూర బట్టి నీళ్ళు పోయాలి. నీరు ఇగిరిపోయే వరకూ ఉడక బెట్టాలి. నీళ్ళను వార్చ రాదు. అనగా పోసిన మొత్తం నీళ్ళు ఆవిరి అయ్యే వరకూ ఆకును ఉడకబెట్టాలి. అలా అయిన తరవాత, ఉడికిన ఆకును ఒక పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి.


ఇప్పుడు, కొద్దిగా నూనెలో ఆవాలూ, జీలకర్రా, శెనగపప్పు, మినప్పప్పు కొద్ది వేయాలి. ఇందులో ఎండు మెరపకాయలు 5 లేక 6 వేసుకోవాలి. విధంగా తయారైన తాలింపులో, ముందుగా సిద్దం చేసుకొన్న ఉడికిన చిట్టెంటి పొట్టుని వెయ్యాలి. అటుతరవాత, ఉడికిన కూరలోని నీరు బాగా ఆవిరి అయ్యేవరకూ వేయించుకోవాలి........అంతే, చిట్టెంట పొట్టు కూర సిద్దం. ఆకు ఎండినప్పటికీ మంచి విటమన్లు ఉండటం వలన....కళ్ళకి, జీర్ణ వ్యవస్థకీ చాలా మంచిది.


అన్నంలో
కలుపుకుని తినేటప్పుడు వేయించిన ఎండుమెరపకాయలు నలుచుకొని తింటే చాలా బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి