LOCAL WEATHER

28, జులై 2014, సోమవారం

వరాల వాన...




వరాల వాన అంటే 
ఏ రాజకీయ నాయకుడో పనికిమాలిన పధకాలు పెట్టటం కాదు...
 నిజ్జంగా వానే...
వర్షాలు లేక విపరీత ఇబ్బందులకి గువావుతున్న 
తెలుగు ప్రజలకి 
ఇప్పుడు పడే వర్షాలు నిజంగా వరమే...

[26-6-14 TO 28-7-14]
శనివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు 
తీసిన శాటిలైట్ ఫోటోల సమాహారం[జిఫ్]
కర్టేసి: http://www.accuweather.com/

ఈ సమయములో కనుక సరైన వర్షాలు పడక 
ప్రకృతి కొంత ఇబ్బంది పెట్టినట్టైతే 
మిగిలిన ఇబ్బంది
 మన తెలుగు రాష్ట్రాల దిక్కుమాలిన 
రాజకీయ నాయకులు పెట్టేవారు.
ఆ నీళ్ళు మావి...ఈ నీళ్ళు మావి 
మిగిలినవి ఎవరివి...
 అంటూ 
ఎవరికీ అవసరమైన వాదనని వారు చేస్తూ 
నిజంగా ఎవరికీ అవసరమో వారికి 
సమయానికి అందించకుండా 
కాలయాపన చేసి
ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారే...
అయితే,
మన "వరుణ-ఖాతం" పుణ్యమా అని 
పుష్కలంగా వర్షాలు పడుతుండటంతో
నీళ్ళ రాజకీయాలకి తాత్కాలికంగా అయినా 
బ్రేక్ పడినట్లయ్యింది.

@@@@@@@@@@@@@







26, జులై 2014, శనివారం

రాష్ట్రాన్ని గభాలున సొరకాయా తెగ్గొట్టినట్లుగా తెగ్గోసిన నాయకులకి, ఉద్యోగుల విషయాలలో ఎందుకు ఇంత కష్ష్టమైపోయింది... ???

రాష్ట్రాన్ని గభాలున సొరకాయా తెగ్గొట్టినట్లుగా తెగ్గోసిన నాయకులకి, 
ఉద్యోగుల విషయాలలో ఎందుకు ఇంత కష్టమైపోయింది... 

విభజన సందర్భంగా ఉద్యోగుల విభజనే వివాదస్పదం అవుతోంది. కేవలం 30 ఏళ్ళ సర్వీసు ఉన్న ఉద్యోగాల కోసం ఇంత తర్జన భర్జన పడుతున్న వీరు... అనేకమైన శాశ్వత విషయాలపట్ల శ్రద్ధ వహించటంలేదు. సరే, ఎంత చెప్పినా వీరికి ఇదే ప్రాణప్రదమైనది...అవును మరీ, ఈ ఉద్యోగాలు-ఉద్యోగుల కోసమే కదా విభజన తంటా...మిగిలిన కోట్లాది ప్రజలు ఏమైతే ఎవడికంటా...

ఎందుకంటే... మొదలులో ఈ ఉద్యోగాలని ప్రజల సేవకోసం సృష్టించినా తరవాతి కాలంలో అవి కేవలం ఉద్యోగుల సంక్షేమ నిధులుగానూ...పధకాలుగానూ తయారైనాయి... ఏ ఉద్యోగి సంఘానికి వారే... దేశాధినేతకన్నా ఎక్కువైనట్లుగా భావించుకుని...మిగిలిన ప్రజల కన్నా ఎక్కువ హక్కులని పొంది...వాటిని సంరక్షించుకునే క్రమంలో...తమకి ఉద్యోగాలిచ్చిన రాష్ట్రాన్ని తెగ్గొట్టైనా తమ ఉద్యోగ సౌకర్యాల హక్కులని కాపాడుకుంటున్నారు. ఆ క్రమంలో వీరికి దేశమూ...ప్రజలూ లాంటి చిన్న చిన్న విషయాలు కనపడటం లేదు.

ఉద్యోగుల ప్రపంచంలో ఉద్యోగాలు,ఉద్యోగులు,ప్రమోషన్లూ,ట్రాన్సఫర్లు,టీయ్యేలూ... డీయ్యేలూ లాంటి పదాలకి తప్ప మిగిలిన వాటికి స్థానం లేదు. ఈ ఉద్యోగుల్లో ఏ శాఖకి చెందిన వారు అయినా పెళ్ళిళ్ళలో కానీ మరెక్కడైనా కలిసినా సరే...పై పదాలని ఉపయోగించకుండా వారి మాటలు రావు... ఇక ఒకే శాఖ వారు అయితే "మీ మేనేజరు వాడా...వీడా" అని తప్ప మరో ప్రపంచం ఉండదు... వీరి ఉద్యోగాలు ప్రజల కోసమే పుట్టినప్పటికీ...వీరికి మాత్రం ప్రజల సేవ అంటే అదేదో ఘోరమైన వెట్టి చాకిరీ క్రిందే లెఖ. ఎవరైనా కొద్దిగా ప్రజల కోసం పనిచేసే ఆఫీసరు కనుక వస్తే ఇక అతని పని అయినట్లే... క్రింది స్తాయి ఉద్యోగుల చేత తనకి కావాలిసిన పనిని రాబట్టుకోలేక...ఆ ప్రయత్నంలో విరోధాలకి కూడా గురై...చివరకి ట్రాన్సఫర్లు అవుతాడు...!!! ఇదీ ఉద్యోగుల సామ్యం...

మరి ఇటువంటి ఉద్యోగుల మూలంగా జరిగిన రాష్ట్ర విభజన జరిగినప్పుడు...వారి విభజన ఎంతైనా కష్టంగానే ఉంటుంది కదా మన నాయకులకి... ఎవరికి చెందాలో తెలియని ఏ హక్కులు లేని మట్టి, నీళ్ళు, కరెంటు లాంటి చిన్న విషయాలని విభజించి పారేసినట్లుగా ఉద్యోగులని విభజించ లేరు కదా...వీరికున్న హక్కులు మన రాష్ట్రపతి గారికి కూడా లేవు కదా...!!!

విషయంలోనికి వస్తే...ఈ ఉద్యోగులని విభజన చెయ్యటానికి స్థానికతని ప్రాతిపదికగా చేసుకోవాలని నిర్ణయించారుష... ఇంతకీ స్థానికత అంటే ఏమిటో సరైన నిర్వచనాన్ని ఏమిటీ...???  ప్రపంచలో మరెక్కడైనా లోకల్ అంటే అక్కడే పుట్టటం, ఎక్కువ కాలం ఒకే చోట నివశించటం లాటి విషయాలని ప్రతిపదికని చేసుకుని ఉంటున్నారు...కానీ, ఈ విషయంలో ప్రపంచానికున్నంత క్లారిటీ మన రాష్ట్రంలో[23జిల్లాలలో]మటుకూ లేదు...  

1] ఎక్కడ పుట్టారో అక్కడేనా...?
2] ఎక్కడ చదివారో అక్కడేనా...?
3] ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడేనా...?
4] ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైరు అయ్యారో అక్కడేనా...?
5] ఎక్కడ వారి స్వంత ఇల్లు ఉన్నదో అక్కడేనా...?
6] ఎక్కడ వారు నివశిస్తున్నారో అక్కడేనా...?
7] ఎక్కడ వారి పిల్లలు ఉద్యోగం చేస్తున్నారో అక్కడేనా...?
8] ఎక్కడ వారి పిల్లలకి నివాసం ఉన్నదో అక్కడేనా...?
9] ఎక్కడ ఎక్కువ కాలం ఉద్యోగం ఉద్యోగం లేక నివాసం ఉన్నదో
   అక్కడేనా...?

ఇలా అనేకమైనటువంటి విషయాలున్నాయి...ఈ స్థానికతతో ఉద్యోగం లేదా పెన్షనూ పొందటం లేదా నిలుపుకోవటానికి  స్థానిక ప్రాతిపదిక ఏది... స్థానికతని నిర్దేశించేది ఏది...ఈ విషయంలో అందరూ సమానులే... ఎందుకంటే వీరెవ్వరూ రకరకాలైన దేశాల నుండి వచ్చిన వారు కాదు...  అయితే, దేశాలు విడిపోతున్నప్పుడే ఎక్కడి వారికి అక్కడ జాతీయత వస్తుంటే, అంతకన్నా ఎక్కువా... ఒక దేశంలో ఉన్న రాష్ట్రానికి...???

మరి స్థానికతని కాదనే విషయాలు ఇవ్వేనా...

1] స్తానిక జిల్లాలో పుట్టక పోవటం.
2] స్తానిక భాష రాకపోవటం.
3] స్థానిక భాష వారైనప్పటికీ...యాస తేడా రావటం
4] తండ్రి-తల్లి వేరే ప్రదేశం నుండి రావటం.
5] రాష్ట్రాలు విభజించక ముందో లేక తరవాతో పుట్టటం. 

ఇలాంటి విషయాలేనా స్థానికతకి అడ్డం...ఇవ్వే కనుక అడ్డం అయినట్లైతే, ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలు వారి తల్లిదండ్రుల ట్రాన్సఫర్ల వలన రక రకాలైన చోట్ల పుట్టటం, చదవటం జరుగుతుంది... మరి వారి స్థానికతని ఎలా నిర్వచించటం...

కనుక 
రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఉద్యోగుల హక్కులని ప్రక్కనపెట్టి 
ఈ విధంగా చేస్తే బాగుండచ్చు... 

బాగుండచ్చు అని ఎందుకంటే... 
ఈ ఉద్యోగులు తమకి ఏ పాయింటు నచ్చితే దానిని ఆమోదిస్తారు...
అది రాజ్యంగ వ్యతిరేకమైనప్పటికీ...
అదే కనుక నచ్చలేదో...
రాజ్యంగంలో ఎన్ని ఆర్టికల్స్‌లో పొందుపరచినా 
వాటిని లెక్కచెయ్యరు...

వీరిని అనేకన్నా...
తమ అవసరాల కోసం 
ఇలా ఉద్యోగులను అచ్చేసి ఒదిలేసిన 
రాజకీయ వ్యవస్థనీ, నాయకులనీ తప్పుబట్టాలి...
వీరి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగులకి, 
సామాన్య ప్రజలకి లేనటువంటి నిరంకుశ హక్కులని ఇచ్చారు.

స్థానికతని నిర్ణయించటానికి...  
అనేకమైనటువంటి స్వంత లాభం కలిగించేవీ 
మరియూ 
రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండి మిగిలిన ప్రజలకి వర్తించనటువంటివి
తాత్కాలిక లాభం కోసం శాస్వతంగా దేశ ప్రజలని విభజించేవీ, 
స్వార్ధ పరమైనవి కాకుండా...
సమంజసంగా ఉండే విధంగా  
"ఉద్యోగి ఎక్కువ కాలం తన సర్వీసుని ఇచ్చిన ప్రాంతాన్ని
 స్థానికతగా తీసుకోవచ్చును: 
ఎందుకంటే 
తాను ఈ ప్రదేశంలో తన సర్వీసుని 
అక్కడ ఉన్న ప్రజలకి అందజేశారు కాబట్టి... 
అయితే జీతం తీసుకోలేదా 
అని సందేహం వస్తుంది సహజంగా... 
ఆ తీసుకున్న జీతం కూడా ఆ ప్రాంతంలోనే ఖర్చుపెట్టి...
లోకల్‌గా ఉన్న ప్రజలకి ఆదాయాన్ని ఇచ్చారు కదా...
అంటే జీతం తీసుకున్న ప్రాంతంలోనే ఖర్చుపెట్టటం అన్నమాట. 
పెన్షన్లు కూడా ఇదే విధంగా ఇవ్వచ్చును...

అయినా...
స్థానికతా... కధా అంటూ 
ఉద్యోగులని రెండు రాష్ట్రాలకీ పంచేప్పుడు, 
వాటి అవసరాలబట్టీ పంచుతారా లేక... 
ఒక రాష్ట్రానికి అవసరమైనదానికన్నా ఎక్కువగానూ...
మరొక రాష్ట్రానికి అవసరమైనదానికన్నా తక్కువగానూ పంచుతారా...???
మిగిలిన ఆస్తులని పంచినట్లే పంచాలి.

ఈ సందర్భంగా ఒక నాయకుడు అంటాడు  
"ఇక రాష్ట్రాన్ని విడగొట్టి ప్రయోజనమేమున్నది"
 "వేరే వాళ్ళు మన దానిలో ఉంటే, మన రహస్యాలు వారికి తెలిస్తాయి కదా" అని... 
ఇదేమన్నా విదేశీయులని నియమించటమా... 
వీదేశీయులే మన దేశీయులుగా చలమణి అవుతున్న ఈ కాలంలో
 ఒకే ప్రాంతపు ప్రజలని రహస్యాల పేరుతో అవమానించటం సరైన పద్ధతా...?? 
అలా అయితే, రాష్ట్రాన్ని విడగొట్టటం దగ్గర నుండీ 
ముఖ్యమైన సెక్రటరీల దగ్గర దాకా 
కనీసం మన భాషే రాని ఇతర రాష్ట్రాల వారు పని చేస్తున్నప్పుడు 
వీరికి ఇటువంటి "దివ్య జ్ఞానం" కలగలేదా...??? 

వీరికి హక్కులు కావాలిసినప్పుడు/అవసరం పడినప్పుడు 
సమైక్య రాష్ట్ర చట్టాలు కావాలి...
ముఖ్యంగా కరెంటు విషయంలో 
విభజనకి ముందున్న ఒప్పందాలని గౌరవించి తీరాలని 
వీరి వాదన...
మరి అదే సమయంలో 
పౌరులకి సంబందించిన అనేక ఒప్పందాలు 
రాష్ట్రం విడిపోయ్యాక పోతాయా...???
 ఈ ప్రశ్నకి సమాధానం లేదు... 
దానికి కేవలం 1956 మాత్రమే డేడ్ ఎండ్... 
"మరి మిగిలిన అన్ని విషయాలకి ఆ సంవత్సరమే సరిపడుతుందా" 
అని 
ఆ ఉద్యమ పార్టీ/వారి అనుకూలురులను 
ఎవరు అడగగలరు...???
రేపు ఇదే విషయంపై వారికే వ్యతిరేకత వస్తే ఏమంటారు...???

ఆ... ఇదంతా మా[మీ]కెందుకూ... 
మేం ఉద్యోగులం; అంటే భారత రాజ్యాంగానికి అతీతులం. 
కాబట్టి, 
మా విషయాన్ని మేమే నిర్ణయించుకుంటాము కానీ...
ఇందులో వేరోకరికి సలహా కూడా ఇచ్చే హక్కు లేదు 
అని అంటే సరే...ఏ బాధా లేదు. 
కానీ, 
మీరు మీరు కొట్టుకొని 
అనవసరంగా ప్రాంతీయతని రెచ్చగొట్టి
 ప్రజల మీద పడి 
ఇబ్బందులపాలు చెయ్యకుండా ఉంటే చాలు... 
"ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటే మడుకూ 
సామాన్య ప్రజలకి 
ఒరిగేదేమున్నది కనుక"...!!!  



@@@@@@@

రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@




@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@













13, జులై 2014, ఆదివారం

త్యాగాలకి సిద్ధంగా ఉండాలిసింది ప్రజలేనా... మోదిగారు...???

ప్రతీ వాడూ పైకొచ్చే వరకూ ఒక మాటా...తరవాత మరొక మాట చెప్పేస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రధాన మంత్రిగారు కూడా ప్రజలు త్యాగాలు చెయ్యవలసిందే అని చెప్పి తన పదవికి త్యాగం చెయ్యవలసి వచ్చింది. దానితోబాటూ చెడ్డ పేరు కూడా 
మూటగట్టుకోవలసి వచ్చింది.


గొప్ప మాటలతో పైకొచ్చిన మోడీ...
తన సమర్ధతతో 
ప్రభుత్వంలో ఉన్న అసమర్ధతని తొలగించటం ద్వారా 
అభివృద్ధిని సాధించాలే కానీ....  
అసమర్ధత వలన కలిగిన నష్టాన్ని, 
ధరలు పెంచటం ద్వారా 
పూడ్చాలని అనుకునే పద్ధతిని అనుసరిస్తే 
అది మోడీ ఇజం కాదు...
మన్-మొహనిజమే అవుతుంది.... 

ఉదాహరణకి 
ఈ మధ్యన పెంచిన రైల్వే చార్జీలు... ఈ సంస్థలో జరుగుతున్న భయంకరమైన దూబరాని ఆపకుండా... 
చార్జీలని పెంచటమే దానికి మందని, ఇదివరకూ ఉన్న అతి తెలివి ప్రభుత్వం అనుకున్నది...  
అయితే...
ఏవో గొప్ప మాటలు చెప్పిన ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా దీని గురించి సమూలంగా చర్చించకుండానే 
ధరలని అమాంతం పెంచి... పైగా అది మా తప్పు కాదు క్రిందటి ప్రభుత్వ నిర్వాకం అంటోంది...
వీరికి, 
ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక బీజేపీనో.. స్పృహ తెలియాలిసి ఉన్నది...

ఎదైనా ప్రభుత్వ పరమైన ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలే పంచుకోవాలి అని చెప్పటమే మన నాయకులు ప్రజలకిచ్చే సందేశమే "త్యాగాలు". ఈ మాటతో ప్రజలకి బ్లాక్ మైల్ చేస్తున్నారనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే దేశం కోసం త్యాగాలు చెయ్యటం అనే మాటని ఎవరూ కూడా తిరస్కరించలేరు కదా... అయితే, ఆ త్యాగాలని ప్రజలే చెయ్యాలని రాజకీయ నాయకులు అనటం ఎలా ఉన్నది అంటే..."రాజుగారి భార్య పతివ్రత" అని రాజుగారి ఎదుట అనవలసిన పరిస్థితిలాంటిదే...దీనిని ఎవరూ కాదనలేకుండా ఉండేట్లుగా, ప్రజలని మోసం చేస్తున్నారు మన నాయకులూ మరియూ అధికార గణం...


ఎలాగంటే, 
ఈ త్యాగాల గురించి 
అధికార గణం ఒక చెంప రాజకీయ నాయకులకి నూరిపోస్తూనే...
తమకు రావాలిసిన జీతాలని పెంచమనటం, 
సౌకర్యాలని పెంచమనటం చేస్తునే ఉన్నారు. 
అలాగే 
రాజకీయ నాయకులు కూడా తాము చెప్పేది ప్రజలకి మాత్రమే అన్నట్లుగా...
తమ ఖర్చులని ఏ మాత్రం తగ్గించుకోవటం లేదు. 
కేవలం అధికార పక్ష నేతలే కాకుండా, 
ప్రతిపక్ష నేతలు కూడా 
ఈ విషయంలో చాలా ఐక్యంగా మెలుగుతూ 
తమ సౌకర్యాల కోసం 
వేల కోట్లు తగలేసే బిల్లులకి 
తమ సపోర్టుని ఇచ్చేస్తున్నారు. 
ఎంతైనా వారూ వారూ ఒకటే కదా...

వీరిలో ఒకడు వాస్తు సరిపోలేదని ప్రభుత్వ భవనాలని మార్పుచేసే వాడు, మరొకరు తమ లక్కీ నంబరు సరిగా లేదని కొత్త కారులు కొనమనే వారూ...ప్రజల వద్ద పోగుచేసిన పన్నులు ఉద్యోగుల జీతాలకే సరిపోవట్లేదంటూనే తమ విదేశీ పర్యటనలకి ఉపయోగించే అధికారులూ... ఇలా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములని లెక్కా పత్రం లేకుండా ఖర్చులు పెట్టేస్తూ... "అభివృద్ధి కావాలంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలని" ప్రతీ వాడూ కుయ్యటమే కానీ, తమ ప్రక్క నుండీ ఈ "త్యాగాన్ని" ఎంత చేస్తున్నారో చెప్పరు. అందుకనే, వీరు ప్రజలకి చెప్పే ముందర తాము ఎంత ఖర్చులు పెడుతున్నామో ప్రజలకి వివరించాలిసి ఉన్నది...


అంతేకాదు,
దేశ భక్తి పేరుతొ త్యాగాలు అంటే...
ఏ పనికి మాలిన హిందీనో నెర్చుకోవటమో... 
లేక  
అడ్డమైన పన్నులు కట్టటమో 
లేక
 పెంచిన అధిక ధరలని 
నోరు మూసుకొని భరించటం లాంటి అర్ధాన్ని కనుక 
మన నాయకులు ప్రజల మనస్సులో కలిగించినట్లైతే...
అది 
ప్రజలలో ఉన్న అసలైన దేశభక్తికి
విఘాతం కలిగే అవకాశం ఉన్నది.

అందువలన, దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలతో పాటూ నాయకులూ...ఉద్యోగులూ త్యాగాలు ఈ విధంగా చేస్తే వారు ప్రజలకి ఆదర్శంగా ఉంటారు...

1] అన్ని రకాలైన రాజకీయ నాయకులకీ మరియూ ఉద్యోగులకీ ఇచ్చే పెన్షన్లనీ ఆపివెయ్యాలి. ఒకడిని ఒక ఐదేళ్ళకి ఎన్నుకున్న పాపానికి...జీవితాంతం పొషించాలా...??? ఇది రాష్ట్రపతి నుండీ తాలూకా ప్యూను వరకూ వర్తింప చెయ్యాలి. 

2] ఉద్యోగుల/రాజకీయ నాయకుల జీతాలు కూడా దేశ ప్రజల తలసరి ఆధాయాన్ని మించి ఎన్నో రెట్లు ఇస్తున్నారు. అది మానాలి. డీయ్యే పేరుతో... నెలకెంత వస్తుందో తెలియని బడుగు ప్రజలని దోచి, నిర్దుష్టంగా నెలవారీ జీతాలొచ్చె ఉద్యోగులని పోషిస్తున్నారు. ఇది సామాన్యులైన ప్రజల మీద పెద్ద భారాన్ని మోపుతోంది.

3] సరదాల పేరుతో కూడా ఇటు రాజకీయ నాయకులూ, ఉద్యోగులూ కూడా ప్రజల డబ్బుతో ఆటలాడుకుంటున్నారు. ఇది పూర్తిగా ఎత్తివెయ్యాలి. ఏదైనా వారికొచ్చే జీతాల నుండే చెయ్యాలి.

4] ఉద్యోగులకి జీతాలని పూర్తిగా ఎటువంటి కటింగులూ లేకుండా ఇచ్చెయ్యాలి... ఒక ఉద్యోగి రిటైరు అయిన తరవాత, ఆ ఉద్యోగికీ...ప్రభుత్వానికీ ఎటువంటి సంబంధం ఉండరాదు... అలాగే ఆ ఉద్యోగికి కూడా సాయంత్రం 5 గంటల నుండీ ఉదయం 9 గంటల వరకూ పూర్తి స్వేచ్చని ఇవ్వాలి. అంటే, కార్యాలయంలో పనిచేసే 8 గంటల సమయం వరకే వారు ప్రభుత్వ పనులు చెయ్యాలి...ఆ తరవాత వారు ఎటువంటి పనులైనా చేసుకునె అవకాశం ఉండాలి.

5] ఉద్యోగుల సంక్షేమానికి సమంధించిన ఎటువంటి పనినైనా ఉద్యోగ సంఘాలే నిర్వర్తించాలే కానీ... దానిలో ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం ఉండరాదు.

6] ప్రస్తుతం ప్రజలకి సేవ నిమిత్తం ఉన్న రాజకీయ నాయకులకి తప్ప, మిగిలిన అందరికీ... డబ్బుతో కూడిన సౌకర్యాలని నిలిపివెయ్యాలి. ప్రబుత్వ ఖర్చులతో వీరికి కాపలాలు పెట్టటం కానీ, వీరికి ఉండటానికి నివాసాలు ఏర్పర్చటం లాంటి తదితర విషయాలని పూర్తిగా వదిలెయ్యాలి.

7] మాజీలకి లేక మరెవరికైనా ప్రాణ హాని ఉన్నదంటే వారికి రక్షణని ఇచ్చేందుకు కొన్ని "రక్షణ సెంటర్లని" ఏర్పరచి అందులో వారిని పెట్టాలే కానీ... ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ ఖర్చుతో రక్షణని ఇవ్వరాదు.

8] అలాగే సైన్యానికి చెందిన ఖర్చుని ప్రజలకి చెప్పకపోయినా, సరైన పద్ధతిలో చెయ్యటానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చెయ్యాలి.

ఈ విధంగా చేసే,
దేనికైనా ధరలు పెంచటమే పరమావధిగా భావించే కాంగ్రెస్సు ప్రభుత్వ విధానాలనే తామూ ఆచరించ కుండా... తప్పు ఎక్కడున్నదీ...రూపాయ ఖరీదు చేసే వస్తువుకి రైల్వేలోగానీ, మరే ప్రభుత్వ రంగ సంస్థలలో గానీ 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కేవలం రైల్వేలోనే కాదు... అన్ని ప్రభుత్వ శాఖల బండారం బయట పడుతుంది అని మోది గారు తెలుసుకోవాలి...

సమర్ధ పాలన అంటే ధరలు పెంచి పాలన చెయ్యటం కాదు...
ఆ పనిని ఎంతటి అసమర్ధుడైన పాలకుడు కూడా చెయ్యగలడు.
సమర్ధత అంటే 
ప్రభుత్వ పరంగా ఉన్న సమర్ధతని పెంచటమే కాదు...
అసమర్ధతని, అవినీతిని తొలగించటం....
ఈ పనిని తమ అవసరం కొద్దో 
లేక 
తమ అస్మదీయులని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేకో 
ఇంతకు ముందున్న  పాలకులు అలక్ష్యం చేసారు.... 

ఎక్కడో ఉన్న నల్ల ధన్నాన్ని 
బయటకు తీసుకు రావటం కాదు... 
ఆ "నల్ల ధనాన్ని తయారు చేసే ఫ్యాక్టరీలు"గా ఉన్న 
ప్రభుత్వ సంస్తలనీ, ప్రభుత్వ విధానాలనీ 
తరచి చూసుకుంటే...
కొత్తగా నల్లధనం తయారు కాకుండా ఉంటుంది. 
రాక్షస సంహారం అంటే 
పుట్టిన రాక్షసులని అంతమొందించే మార్గం కాదు...
అసలు రాక్షసత్వం పుట్టే మూలం ఎక్కడున్నదో కనిపెట్టి 
దానిని ధ్వంసం చెయ్యటమే...
ఆలాగే 
అవినీతి అంతం అంటే,
దానిని చేస్తున్న వారిని వల వేసి పట్టటం కాదు.
ఆ అవినీతికి మూలంపై 
ఆటం బాంబుని వెయ్యటం.

ఆ... ఇవన్నీ కుదిరే పనా, మేము చెయ్యలేముం, ఇవన్నీ చేస్తే మాకు కష్టం లాంటి మాటలు మాట్లాడినప్పుడు... ప్రజలని  కూడా త్యాగాలని చెయ్యాలని చెప్పద్దు. ముందర మీరు  ఏసి రూముల్లోంచి బయటకి వచ్చి ప్రజలకి ఆదర్శంగా ఉండి, తరవాతే ప్రజలకి చెప్పవలసి ఉన్నది.






జై హింద్