LOCAL WEATHER

28, నవంబర్ 2013, గురువారం

మునిగిపోయిన లెహర్ తుఫాను

మునిగిపోయిన లెహర్ తుఫాను

తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.

మచిలీపట్టణం వద్దకు వచ్చేప్పటికే  సముద్రంలోనే బలహిన-పడిపోయింది.

దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ

భారి వర్షాలు పడతాయని అంటున్నారు.

అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.

అయితే, తుఫాను తీవ్రత తగ్గినప్పటికి

నర్సాపురం/మచిలీపట్టణం తీరప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండటం మంచిది.

ఈ విధంగా

నూటొక్క  గంటల

లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా

కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.


నిన్న రాత్రి 9.25  ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం  లెహర్ తుఫాను మొదలు నుండి చివరిదాకా నడిచిన దారి 
23-11-2013 సాయంత్రం 4.25 నుండి 28-11-2013 ఉదయం 7.25 వరకు 
ఊహా చిత్రం కాదు. సేటిలైట్ గంట గంటకి తీసిన ఫోటోల GIF .

లేహర్ తుఫాను ప్రయాణంలో  రెండు టర్నింగు పాయింట్లు...

ఒకటి అండమాన్ దగ్గర దాటుతున్నప్పుడు 

NORTH-WEST నుండి WESTకు దిశ మారటం,

రెండవది చెన్నయి వైపుకి వస్తు NORTH-WESTకు దారి మళ్ళటం.

బహుశా తీరం దగ్గర నీళ్ళు-గాలి NORTH దిశగా కదులుతూ ఉండి ఉండవచ్చును.

రెండవ  టర్నింగు పాయింటు దగ్గరే తుఫాను బలహినపడింది.

*******************

కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు 

రకరకాలైన భయంకరమైన మ్యూజిక్కులు పెట్టి... భయపెట్టిన మన మీడియావారు, 

ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి, 

యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే

ప్రజల నెత్తిన రుద్దారు.

మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,

తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న 

కనీస సామాజిక బాధ్యతని మరచారు.
  


@@@@@@@@@@@@
తుఫాను గురించి నిన్న వేసినది 
లింకు నొక్కండి 
@@@@@@@@@@@@ 


కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com 

@@@@@@@@@@@@

భయంకరమైన తుఫాను తప్పిపోయింది 
 హాయిగా చల్లగా ఉన్నది...కొద్దిగా వర్షం పడుతోంది.
ఇప్పుడు ప్రశాంతమైన కిషోర్ కుమార్ పాట వినండి.

Ruk jana nahi tu kahin haar ke


కర్టేసి యు ట్యూబ్ 27, నవంబర్ 2013, బుధవారం

ముందుకి దూకుతున్న "లెహర్" తుఫాను...

23-11-2013న ACCUWEATHER.COMలో పేరు పెట్టక ముందే ఉంచిన లెహర్ తుఫాను ఊహా చిత్రం.

మరొక సైట్  gdacs.org లో పెట్టిన లెహర్ తుఫాను ఊహా చిత్రం 


 లెహర్  పుట్టిన దగ్గర నుండి ఇప్పటి దాకా
[FROM 23-11-2013 సాయంత్రం 4.25 నుండి  27-11-2013 ఉదయం 6.25 వరకు]
 accuweather.com వారు పెట్టిన సేటిలైట్ చిత్రాలని Gif చేసి పెట్టాను. ఈ క్రింద చూడండి.
ఇది ఊహా చిత్రం కాదు...
23 సాయంత్రం 4.25నుండి ఈ రోజు ఉదయం 6.25 వరకూ గంట గంటకి 
 సేటిలైట్ తీసిన ఫోటోల సమాహారం


skymetweather.com లో ఇచ్చిన వాతారావరణ హెచ్చరికను 
ఈ లింకు నొక్కి   
చూడండి.

వీరి ప్రకారం 
ఇవ్వాళా రేపట్లో 
కాకినాడా-విశాఖపట్టణం మధ్య 
లెహర్ తుఫాను 
దాటే అవకాశం ఉన్నది.

వీరు చెప్పినట్లే ఈ లెహర్ తుఫాను అదే స్పీడులో తగిలితే 
చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది. 
ఈ సందర్భంలో కేవలం కాకినాడ ప్రాంతమే కాకుండా, 
నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది.  ఎందుకంటే...ఇప్పటిదాకా పైన ఉన్న ఊహాచిత్రాల ప్రకారమే లెహర్ తుఫాను నడిచినా....
తీరం దగ్గరపడేప్పటికి అది సరిగ్గా ఎక్కడ ఎక్కుతుందో చెప్పటం కష్టం.... 
ప్రకృతి విపత్తులు వస్తున్నప్పుడు... 
క్కువ నష్టం కలగకూడదని దేవుణ్ణి ప్రార్ధించటంతో పాటు 
సంయమనంతో వ్యవహరించి, అధికారులకి సహకరిస్తే 
ప్రాణనష్టాన్నైనా తగ్గించే అవకాశం ఉన్నది.

@@@@@@@@@@@@

27-11-2013 సాయంత్రం 5 గంటలు 

ఈ లెహర్ తుఫాను అండమాన్ మీదుగా దాటినప్పుడే తన దిశ మార్చుకున్నట్లుగా  కనపడుతోంది. 
ఇది మొన్న 25 రాత్రి నుండే కనపడినప్పటికి, ఇవాళ మధ్యాన్నం వరకు ఏ శాఖవారు గుర్తించలేదు. 
ఇది అక్కడి వరకు NORTH-WESTగా ప్రయాణించినా, అండమాన్ దాటినా తరవాత కేవలం WEST వైపునకే ప్రయాణం మొదలు పెట్టినది.
బహుశా 
ఇది చెన్నయి-నెల్లూరు వైపుకి 
బయలుదేరినట్లు కనపడుతోంది.

25వ తారీకు రాత్రి 9.25 నుండి 27వ తారీకు సాయంత్రం 4.25 వరకు 
మోన్న రాత్రి నుండి ఇప్పటి వరకు WEST దిక్కుగా  లేహర్ తుఫాను కదలిక.....@@@@@@@@@@@@

27-11-2013 రాత్రి  11 గంటలు

లెహర్ తుఫాను మధ్యాహ్నం 3 గంటలు వరకు WEST కు ప్రయాణం చేసి 
తరవాత NORTH దిక్కుకి కదలటం మొదలెట్టింది.
ఈ క్రమంలో తుఫాను యొక్క శక్తి తగ్గినా, తిరిగి కొంత పుంజుకొని 
 NORTH మరియూ NORTH-WEST కు ప్రయాణిస్తూ 
 కాకినాడకి, మచిలీపట్టణానికి మధ్య  ఉన్న 
కోనసీమ నర్సాపురం-అమలాపురం  
వద్ద దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నది.

ఈ రోజు మధ్యాహ్నం 2.25 నుండి రాత్రి 10.25 వరకు తుఫాను కదలికలు...
తుఫాను NORTH-WEST దిక్కుగా కదలటం  చూడవచ్చును.


    @@@@@@@@@@@@

28-11-2013 ఉదయం 7 గంటలు

మునిగిపోయిన లేహర్ తుఫాను

తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.
మచిలీపట్టణం వద్ద సముద్రంలోనే బలహిన-పడిపోయింది.
 దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ
భారి వర్షాలు పడతాయని అంటున్నారు.
అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.
ఈ విధంగా
నూటొక్క  గంటల 
లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా
కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.

నిన్న రాత్రి 9.25  ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం  @@@@@@@@@@@@

కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు 
రకరకాలైన భయంకరమైన ముజిక్కులు పెట్టి భయపెట్టిన మన మీడియావారు, 
ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి, 
యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే
ప్రజల నెత్తిన రుద్దారు.
మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,
తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న 
కనీస సామాజిక బాధ్యతని మరచారు.
  
@@@@@@@@@@@@

మునిగిపోయిన లేహర్ తుఫాను

@@@@@@@@@@@@కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com 

24, నవంబర్ 2013, ఆదివారం

నేతిబీరకాయ పచ్చడి...


బీరకాయలాగా ఉంటుందనే కానీ... దీనికి బీరకాయకి అసలు సబంధమే లేదు. 
అలాగే, పేరులో నెయ్యి ఉన్నప్పటికీ, నేతితో సంబంధం లేకపోయినప్పటికీ... 
ఈ కాయలతో పచ్చడి చేసుకుని తింటే, నెయ్యంత రుచిగా ఉంటుంది. 
బహుశా అందుకే నేతిబీరకాయ అని పేరు పెట్టారేమో.....


ఇది పాదు. అంటే తీగాలాగా పాకేది.  
సామాన్యంగా కార్తీకమాసంలోనే నేతిబీరకాయలు వస్తాయి. 
ఈ కాయలు కార్తీకమాసంలో తింటే చాలా పుణ్యం అని చెపుతారు.... 
ఈ కాలంలో మాత్రమే దొరికే నేతిబీరకాయలు తింటే
ఈ కాయలలోని పీచు గుణాలు ఆరోగ్యానికి మంచిది
అని ఉద్దేశ్యం అయి ఉంటుంది. 
మాములుగా తినమంటే మనవారికి సరిపడదు కదా... 
పుణ్యమో పురుషార్ధమో అంటే తప్ప....!!! 
పైగా  ఈ పాదులనే పెంచకపోవచ్చును...


ఈ నేతిబీరకాయాలలో పీచు ఎక్కువ ఉండటం వలన  పచ్చడికే ఉపయోగిస్తారు... 
ఈ పచ్చడిని రెండు రకాలుగా చెయ్యవచ్చును. 
ఒకటి...కాయని ముక్కలుగా కోసి, వాటిని వేయించి పచ్చడి చెయ్యటం.  
రెండవది... మరియూ పాతకాలం పద్దతి ప్రకారం 
కాయని పొయ్యి మీద కాల్చి పచ్చడి చెయ్యటం.

1. నేతిబీరకాయ ముక్కలు పచ్చడి.

కావాలిసినవి

1.నేతిబీరకాయ ఒకటి
2.చింతపండు కొద్దిగా 
3.నూనె కొద్దిగా
4.పచ్చిమెరపకాయలు 6 లేక 8 [నేతి బీరకాయ సైజుకి తగినన్ని]
5.కొత్తిమీర ఒక కట్టలో సగం 
6.తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]


చేసే విధానం:


ముందుగా కొద్ది నూనెను మూకుడులో వేసి వేడి చేసి... దానిలో తరిగిన నేతిబీరకాయ ముక్కలని వెయ్యాలి. అయితే, ముక్కలు వేగకూడదు...ఉడకాలి. కాబట్టి, అవి వేగకుండా ఉండటానికి, మూకుడు పైన మూత పెట్టాలి. అవి కొద్దిగా ఉడకగానే, దానిలో కొంచం చింతపండుని వేసి కలిపి, తిరిగి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడకబెట్టాలి. 


ఇప్పుడు,  పచ్చిమెరపకాయాలని  మిక్సీలో వేసి...అవి నలిగినా తరవాత, 
దానిలోనే ఉడికిన నేతిబీరకాయ ముక్కలని వేసి మిక్సీని కొద్ది కొద్దిగా తిప్పాలి.  
మిక్సీని పూర్తిగా తిప్పితే
 మొత్తం ముక్కలు కనపడకుండా రసంలాగా చూర్ణం అయ్యే ప్రమాదం ఉన్నది. 
ఈ  పచ్చడిలో సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకోవాలి. 
అంతే నేతిబీరకాయ ముక్కల  పచ్చడి తయారైనట్లే.....
ఇక అన్నంలో కలుపుకొని తినటమే తరువాయి......
2. నేతిబీరకాయ కాల్చిన పచ్చడి.


కావాలిసినవి:

1.నేతిబీరకాయ ఒకటి
2.ఎండు మెరపకాయలు 8 [నేతిబీరకాయ కాయ సైజునిబట్టి] 
3.నూనె మూడు చెంచాలు 
4.మినపప్పు ఒక చెంచా 
5.ఆవాలు, జీలకర్ర కొంచం 
6.ఇంగువ కొద్దిగా, తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]       


చేసే విధానం:ముందుగా నేతిబీరకాయ పైన నూనెను రాసి దానిని స్టవ్వు మీద కాల్చాలి.
 తిప్పుతూ అది అన్ని వైపులా తగిన విధంగా కాలేట్టుగా  చూసుకోవాలి. 
 అది బాగా కాలినా తరవాత, చల్లారే వరకు ఆగి, దానిమీద ఉన్న చెక్కును తీసివెయ్యాలి.
  ఈ కాయలో పీచు ఎక్కువ కాబట్టి,  క్రింద ఒక గిన్నె పెట్టుకొని, 
కాలిన నేతిబీరకాయ  తలకాయ భాగాన్ని పట్టుకొని క్రింద వరకు నొక్కుతూపోవాలి. 
అప్పుడు ఆ కాయలోని గుజ్జు మరియు గింజలు ఆన్ని క్రింద పెట్టిన గిన్నేలోనికి వస్తాయి.
 చేతిలో మిగిలిన పీచులో మెత్తటి భాగాన్ని కూడా గిన్నేలోనికి వేసుకోవాలి. 


ఇప్పుడు,   ఆవాలు, జీలకర్రా ఎండు మెరపకాయాలలో కొద్దిగా ఇంగువ వేసి  వేయించాలి.
 ఈ వేయించిన వాటిని మిక్సీలో వేసి తిప్పిన అనంతరం, 
దానిలో నేతిబీరకాయ గుజ్జుని కూడా కలిపి మరొకసారి కొద్దిగా మిక్సీని తిప్పాలి.
 అంతే... కాల్చిన నేతిబీరకాయ పచ్చడి తయ్యారైనట్లే......ఈ నేతిబీరకాయ చట్నిలని అన్నంలో కలుపుకుని తినటమే కాదు,  
దోశలలో నలుచుకుని తిన్నా బాగుంటాయి.@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@

23, నవంబర్ 2013, శనివారం

హెలెన్ తుఫాను నిజంగా మచిలీపట్టణం దగ్గరే దాటిందా....!!!???

నిన్న వచ్చిన హెలెన్ తుఫాను 
నిజంగా మచిలీపట్టణం దగ్గరే దాటిందా....

లేదు అని ఈ క్రింది శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
మీరే చూడండి....

తుఫాను తీరం దాటుతున్నాప్పుడు దాని  కేంద్రం మచిలిపట్నానికి దూరంగా ఉన్నది.
పైన మెప్ కదలికలు నిన్న[22-11-2013]ఉదయం 7.25 నుండి సాయంత్రం 4.25వరకు 
accuweather.comలో పెట్టిన సేటిలైట్ దృశ్యాలు.

దీని ప్రకారం ఈ తుఫాను నర్సాపురం అమలాపురం దగ్గర దాటింది.
అయినా, మన టివీ వారు మరియు వాతావరణ శాఖ వారు 
మచిలీపట్టణం వద్ద దాటిందనే చెపుతున్నారు.
నిన్న తెల్లవారు ఝాము  నుండి 
నర్సాపురం అమలాపురం ప్రాంతాలలో విధ్వంసం సృష్టించిన తరవాతే 
సాయంత్రానికి మచిలిపట్టణం ప్రాంతంలో  కొద్ది ఎఫ్ఫెక్టు చూపింది. 
మచిలీపట్నం దగ్గర దాటితే 
పాలకొల్లు, నర్సాపురం, అమలాపురం ప్రాంతాలలో 
ఎక్కువ ఎందుకు నష్టం జరిగిందో వీరికే తెలియాలి.


తుఫాను దిశ గురించి మొదటి నుండి తప్పే చెప్పారు. 
అది ఏ దశలోనూ దిశ మార్చుకోకుండా 
ఉత్తరం... మరియు కొద్ది తూర్పు దిక్కుగా కదులుతూ,
తీరానికి దగ్గరయ్యిందీ.  
అమలాపురం ప్రాంతాలలోనే తగిలింది.
ముందర చెన్నై,కావలి, ఒంగోలు అని... 
తరవాత మచిలీపట్టణం అని చెపుతోవచ్చారు.
అయితే ఇది అమలాపురం-నర్సాపురం దగ్గర దాటింది.
ముందు జాగ్రత్త తీసుకోవటం మంచిదే కాని, 
అసలు తగిలే చోటుని చివరిదాకా గుర్తించకపోవటం...
అందులోనూ ఇంత టెక్నాలజీ పెరిగిన తరవాత కూడా 
వెంట వెంటనే స్పందించకపోవటం శోచనీయం.... 

మన పని మనం చేసుకుంటూ కొద్దిగా దృష్టి పెట్టిన 
మనలాంటి  సామాన్యులకే తుఫానుకి సంబంధిచిన వివరాలు నెట్ లో దొరుకుతుంటే
ఇదే ఉద్యోగంగా ఉండి, ఎన్నో ఉపకరణాలు అందుబాటులో ఉండే 
 వాతావరణ శాఖ వారికి ముందరగా ఎందుకు తెలియటం లేదు...
జీతాలకోసం మాత్రమె ఉద్యోగాలా...
బాధ్యతకోసం కాదా...

మన మీడియా వారు కూడా 
రాజకీయనాయకుల భవిష్యత్తు మీద దృష్టి  పెట్టినంత శ్రద్ద 
ప్రజల ప్రాణాల మీద పెట్టటం లేదు.

తుఫాను నష్టం మీద ఈ రోజు వచ్చిన తెలుగు వార్తా పత్రికలని 
ఈ క్రింది లింకు నొక్కి చూడండి.
తుఫాను తగిలింది... అన్న కృష్ణ జిల్లా మచిలీపట్టణం కన్నా 
పచ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, బీమవరం, నరసాపురంలలో,
మరియు 
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో జరిగిన విధ్వంసం వివరాలు.
తెలుగు వార్తాపత్రికలు లింకు నొక్కండి 

@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@

10, నవంబర్ 2013, ఆదివారం

నాకిష్టమే అయినా నేనే ఎందుకు చెయ్యాలీ...!!! అనే పట్టుదల-ప్రేమ


ఈ పట్టుదలకీ, ప్రేమకీ నిర్వచనాలు చెప్పటం కష్టం, విషయం చిన్నదే విశ్లేషణే కష్టం... కానీ, వీటీలో ఒకదానికొకటి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రం... ఎంతమందికి ఎంత బాధ కలుగుతుందో చెప్పటం తేలికే. 

నేనే ఎందుకు చెయ్యాలీ... 
నేనే ఎందుకు.. వేరొకరు చెయ్యచ్చు కదా... 
అన్నీనేనే చెయ్యాలా...
నా వాడే కానీ, నేనే ఎందుకు లొంగాలీ...
 వాడు కూడా నాలాంటి వాడే కదా.. వాడినెందుకు అడగరు..
వాడంటే నాకిష్టమే కానీ, వాడొచ్చి నన్నెందుకు అడగడు...
వీడు చెప్పేదేమిటి నేను వినేదేమిటి...
వీడు నాకు చెప్పేంతటివాడైనాడా... 
ఇలా పట్టుదలకి సంబంధించిన ఆలోచనలు 
ఒక్కొక్కరిలో పేరుకునిపోయిన కొద్దీ 
మనుషుల మధ్య అంతరం[దూరం]పెరుగుతూ పోతుంది. 
విచిత్రంగా ఇవేమీ ఆర్దికమైనవి... అంటే డబ్బుకి సంబంధించినవి కావు...

మరి దీనికి విరుగుడు లేదా..???
 ఉన్నది.
 తేలికగా కనపడే కష్టమైన పరిష్కారం... 
పరిష్కారాం అనే మాట చిన్నది 
అని 
ఇతరులకి చెప్పేప్పుడు మాత్రం అనిపిస్తుంది...
 అదే 
మనకి వర్తింపచేసుకున్నప్పుడు
 అదెంత కష్టమో తెలిసి వస్తుంది... 
ఎందుకూ...?? 
ఎందుకంటే పట్టుదలని ఓడించాలి అంటే ప్రేమ కలగాలి...
 కానీ 
ఆ ప్రేమని కూడా ముంచేసేది "ఇగొ" 
అదే అహం...

మరి ఈ అహాన్ని జయించాలి అంటే కుదిరే పనేనా... 
దీనికి అనేక ధర్మ సూత్రాలు,
 న్యాయంగా కనపడే విషయాలు అడ్డొస్తాయి... 
నిజమే... 
ఎవడి అహాన్ని వాడు కాపాడుకోవటానికి 
అనేకమైన న్యాయబద్ధంగా కనపడే విషయాలని సపొర్టు చేసుకుని
 ఎవడికి వాడు ఆత్మని సంతృప్తిపరచుకొని
 తన అహాన్ని కాపాడుకుంటాడు... 

ఇంత మానసిక సంఘర్షణ గురించి ఎందుకు ఇంత కంఫ్యుజన్‌గా వివరణ 
అని అనిపిస్తోందా...
 అవును నిజమే కానీ,
 ఈ చిన్నపాటి షంఘర్షణల వల్లనే 
సమాజంలో మనిషికి మనిషి దూరం అయిపొతున్నాడు...
 ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుండీ పిల్లలూ... 
పిల్లల దగ్గర నుండీ తల్లిదండ్రులు... 
భార్యాభర్తలు...
స్నేహితులు...చుట్టాలు...ఒకరికొకరు...
చివరికి సమాజమే...

ముందుగా తల్లిదండ్రుల దగ్గర నుండీ పిల్లల ప్రేమకాస్తా పట్టుదలగా మారి... జారిపొవటం చూద్దాము... ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలని చేస్తుండటంతో పని విభజన చేసుకుతీరవలసిన పరిస్థితి వచ్చింది. కానీ, సమాజపరంగా అటువంటి మార్పులు పెద్దగా రాలేదు... తల్లి ఉద్యోగం చేసొచ్చినా సరే... ఇంటికి వచ్చి వంటా వార్పు చెయ్యవలసిందే... పిల్లలని కూడా చూడవలసినదే మరి... కానీ ఆ అలసిన తల్లి వంటపనులైతే విసుక్కుంటూ అయినా చెయ్యగలదు కానీ, ప్రేమగా పిల్లల పనులు చెయ్యకలదా...?? పిల్లలు వస్తువులు కాదు కాబట్టి వారికి ఒపిగ్గా చెయ్యాలి అంటే అలసిన తల్లికి కుదిరే పనా... కుదురుతుంది. ఎప్పుడూ... వేరే వారు చెయ్యటానికి ఎవరూ లేనప్పుడు... కానీ మొద్దులాగా మొగుడు ఎదురుగా కూర్చుని టీవీ చూస్తూ ఉంటే, తాను మాత్రం ఎందుకు ఇవ్వన్నీ చెయ్యాలీ అనే ఆలోచనలో పడుతుంది... ఇక అప్పటి నుండీ ఆ తల్లిదండ్రుల పట్టుదలలో పడి పిల్లల మీద ప్రేమ కాస్తా ప్రక్కకి జారిపోతుంది... 

ఇక పిల్లల దగ్గర నుండీ తల్లిదంద్రుల ప్రేమ పట్టుదలలో చిక్కుకునిపోవటం... ఇద్దరు ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకి ఇది పూర్తిగా స్వానుభవం... పిల్లలు తల్లిదండ్రులని చూడాలి. చూస్తారు. ప్రేమా ఉంటుంది... కానీ, పిల్లలలో ఒకరి మీద ఒకరు వంతులు వేసుకోవటం వలన పట్టుదలగా మారి, అదికాస్తా చెదిరిపోతుంది. ఇది ఎంత డబ్బున్న తల్లి తండ్రులకైనా తప్పదు. సామాన్యంగా ఎవరు ఆర్ధికంగా తక్కువగా ఉన్నారో వారి పంచన చేరి వారికి సహాయం చెయ్యాలీ అని తల్లిదండ్రులు చూస్తారు... ఇది మిగిలిన వారికి కోపకారణం అవుతుంది. నిజానికి అంతరాలలో అర్ధమైనప్పటికీ, అహం అడ్డంపడి తల్లిదండ్రుల మీద కొపాన్ని తెప్పిస్తుంది... మరొక కారణంలో... ఇద్దరూ సమమైన ఆర్ధిక పరిస్థితికల పిల్లలున్నప్పటికీ, ఒకరు చూడలేదని మరొకరు ఆరొపించుకొని...తల్లి తండ్రులని రోడ్డున పడేస్తారు...ఇంతకీ ఆ తల్లి తండ్రులకి ఏమన్నా లక్షలు ఖర్చు పెట్టాలా... అఖర్లేదు. కానీ "వాడికి పట్టంది నాకెందుకు..." అనే పట్టుదల... అంతే;  అలా జీవిత కాలం గడచిపొతుంది... ప్రేమ లేకనా... ఉంటుంది. అది అహం/పట్టుదల క్రిందపడి నలిగిపొతుంది. తీరా ఆ తల్లిదండ్రులకి ఏదైనా అవుతే, అప్పుడు వీటన్నిటినీ చేదించుకొని ఆ ప్రేమ బయటపడుతుంది. కానీ ఏమి లాభం... ప్రేమ ల్లిదండ్రులని ఆనందపెట్టప్పుడు...!!! 

ఇంతకీ ఇందులో తల్లిదండ్రులకి కానీ, కన్న పిల్లలకి కానీ కావాలిసినది ఏమిటి... డబ్బా లేక తిండా... ఈ రెండూ కావు... ఒక ప్రేమతో కూడిన పలకరింపు. అంతె. ఇది చేసేప్పుడు "నేనే ఎందుకు చెయ్యాలి అనే ఆఫీసు బుద్ధిని" ప్రక్కన పెడితే చాలు....


పిల్లలు సాయంత్రం స్కూలు నుండో లేక కాలేజి నుండో రాగానే, వారిని కాసేపు దగ్గర కూర్చూపెట్టుకొని వారు చెప్పే విషయాలని ఓపికగా వింటే చాలు... వారు చెప్పేవన్నీ మనకి తెలిసినవే అయినా వారికి అవి కొత్తే; వాటిని పంచుకుంటే వారికి పరమానందం అవుతుంది. అలాగే మనం కూడా వారితో పిచ్చాపాటి మాట్లాడితే...[అదీ కూడా చదువు గురించి తప్ప...] వారి భావాలని పంచుకునే మంచి స్నేహితులైపోవచ్చును...ఒంటరితనం లేకపోవటంతో చెడు సావాసాలకి పోరు... 


ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే, వారికి కావాలిసింది కూడా తమతో కాసేపు గడిపేవారే... అందులోనూ వారి పాత అనుభవాలని చెపుతుంటే మంచి శ్రోతలాగా కనుక నిజాయతీగా వినగలిగితే, వారి ఆయుస్షుని పెంచినవారవుతాము. ఒంటరితనం దరిచేరనంతవరకూ పెద్దలకి అనారోగ్య సమస్యలూ ఏమీ రావు... 


ఇక చుట్టరికాలలోనూ, స్నేహితుల మధ్య పట్టుదలలు ఇగోలు అడ్డంపడి ఒకరొ మొఖం ఒకరు చూసుకోవటానికి అనేక ఏళ్ళు పట్టవచ్చునూ... లేక అదీ జరగక ముందే పైకి ఎగిరిపోవచ్చునూ ... కాబట్టి ఏదైనా మనం భూమ్మిద ఉన్నప్పుడే చూడాలి కానీ, తరవాత సాధించేది ఏముంటుంది. అదే కనుక, ప్రక్కవాడికి కూడా కాస్త సమయాన్ని కేటాయించి గౌరవించి,  మన అహాన్ని కాసేపు ప్రక్కన పెడితే చాలు. పట్టుదలలు పంతాలూ.. వంతులూ... భాగాలూ... అన్నీ ఇట్టే కరిగిపోతాయి... అలాగే భార్యాభర్తలలో... ఇద్దరూ   ఇంటిపనిని ఇష్టంగా పంచుకుంటే చాలు...


ఇదే సమాజం మొత్తం మీద పనిచేస్తుంది... కానీ, సమాజం కోసం మన ఇగోని చంపుకోవద్దు...ఎవడి ఇగో వాడికి అందం...  అయితే... తల్లిదండ్రుల దగ్గరా,  కన్నపిల్లల దగ్గరా, భార్యాభర్తల మధ్యా,  పెద్ద వయసు వారి దగ్గరా ఈ ఇగోలని పట్టుదలలని ప్రక్కన పెడితే, అనేక కుటుంబాలు సంతోషంగా ఉంటాయి... కుటుంబాలు సంతోషంగా ఉంటే సమాజమే సంతోషంగా ఉంటుంది...


శుభం 

****


ఇందులోని బొమ్మలన్నీ గూగల్ లోనివే 


8, నవంబర్ 2013, శుక్రవారం

రాష్ట్ర విభజన అంటే ఎందుకు ఇన్ని భయాందోళనలు.....?!?!

రాష్ట్ర విభజన అందరు ఎదో భయంకరమైనదేదో జరిగిపోతున్నట్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రాష్ట్ర విభజన అంటే దేశం నుండి విడిపోయి వేరే దేశంగా మారటం కాదుకదా...!!! మరి ఎందుకు ఈ ఆందోళనలు....?? దీనికి భారత దేశ విభజన సమయంలో ఏర్పడిన గాయమే కారణం.... దీనికి దానికి ఏమిటి సంబంధం... అంటారా.... అప్పుడు భారత్ పాకిస్తానులుగా విడిపోయినప్పుడు ఏర్పడిన ఆందోళన కరమైన వాతావరణాన్ని కొందరు నాయకులు కల్పిస్తున్నారు. అప్పట్లో ఒక దేశం నుండి మరో దేశానికి కనపడిన వాహనాన్ని ఎక్కి పారిపోయినట్లుగా పోవాలి అని అనిపించే విధంగా కొందరు తమ స్వార్ధం కోసం దుర్మార్గమైన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ కారణం చేతనే విభజనలో హైదరాబాదు కేంద్ర బిందువు అయ్యింది... 

ఇప్పటి దాకా జరిగిన ఉద్యమ క్రమంలో కొందరు దుష్ట శక్తుల ప్రాపకంతో ... బయట వారిని తరిమేస్తాం.... మా నీళ్ళని క్రింద వారు దోచేస్తున్నారు.... వారు కుక్కలు.... మెడలు నరకాలి.... తలలు కొయ్యాలి... మా మాట ఒప్పుకోకపోతే  తీవ్ర పరిణామాలు ఉంటాయి.... మాది మాకొచ్చిన తరవాత ఇక్కడ బయటవారినెవ్వరిని ఉండనియ్యం.... పండక్కి వెళ్ళినవారు తిరిగి రారు....మా చేతికి వచ్చాక అంతుచూస్తాం...ఒక్క చుక్క నీరు వెళ్ళనియ్యం...నదులలో గోడలు కట్టేస్తాం...[ఇలాంటి దుడుకు మాటల వలన నమ్మకం పోయి నీళ్ళ పంపిణి కూడా ఒక సమస్య అయింది....]ఇలా పలు విధాలుగా చిన్న గల్లి నాయకుల దగ్గర నుండి... జాతీయ పార్టికి చెందిన నాయకులదాకా ప్రేలనలు పేలి,  సామాన్య ప్రజలందరినీ భయభ్రాంతులని చేశారు.  వీరి వలన ఇప్పటికి కూడా ప్రశాంతంగానే బ్రతుకుతున్న "ఇతరుల రక్షణ కోసం ఒక చట్టం చెయ్యాలి"  అని ప్రభుత్వమే ఆలోచనలో పడాలిసి వచ్చింది...!!!

ఇదే క్రమంలో రాజ్యాంగాన్ని పూర్తిగా స్కేన్ చెసినా దొరకని మాటలని వాడుతూ  ఈ నేతలూ... కొందరు అతితెలివిగల మేధావులూ.... చదువురాని ప్రజల లాగా మాట్లాడుతున్నారు. అదే మీ ప్రాంతం... మా ప్రాంతం... సెటిలర్స్. వలసదారులు... అంటే ఎవరూ... ఇలాంటి మాటలని మన భారత ప్రభుత్వం సహిస్తుందా...??? రాజ్యాంగం అమోదించినదా....??? ఎదో కొన్ని ప్రాంతాలకి రక్షణ కల్పించే నిమిత్తం కొన్ని ఆర్టికల్స్‌ని రాజ్యాంగంలో పెట్టినంత మాత్రాన... ఆ ఆర్టికల్స్ రక్షణ ఉన్న ప్రదేశాలలోనూ...లేని ప్రదేశాలలోనూ భారతీయ పౌరులందరూ రాజ్యాంగం ముందర సమానులే... వారికి ఇచ్చింది ఒకే రకమైన పౌరసత్వం.... అదే భారతీయ పౌరసత్వం మాత్రమే.....భారత దేశంలొ బానిసత్వపు పౌరసత్వం...అదే సెకండు సిటిజన్ షిప్పు  అనేది లేదు కదా ....!?!?!

రాష్ట్ర విభజన అంటే దేశం నుండి విడిపోవటం కాదు. స్వంత రాజ్యాంగం ఉండటం కాదు. కేవలం  అక్కడి ప్రభుత్వం నుండి వచ్చే లాభాలని లోకల్ గా ఉన్న వారికి అందివ్వటానికి మాత్రమే... ఆ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఇతరులకి రావు. అంతే.. ఇక మిగిలినవి అన్నీ... దేశంలోని ప్రజలందరితో పాటు సమానంగా అనుభవించాలిసిందే కానీ.... లోకల్ గా ఉండే వారు వేరొక బయట నుండి వచ్చిన రాష్ట్ర ప్రజల కన్నా అతీతులేమీ కాదు.. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల వారికి సమానమే...అసలు ఎవరు ఎక్కడికి కదలకుండా ఉంటే దేశంలో నగరాలు అభివృద్ధి చెందవు... దేశమూ అభివృద్ధి చెందదు.

ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా, దేశాన్ని పరిపాలనకో లేక స్వార్ధ నాయకుల పదవులకోసమో దేని కోసమైనా ముక్కలు చెయ్య వచ్చునేమోగానీ... ప్రజలని విభజించే హక్కుని రాజ్యాంగం ఎవ్వరికీ ఇవ్వలేదు.  ఫలానా వారు ఇక్కడ ఉండచ్చు... లేదా వెళ్లిపోవాలి అనే మాటలు మాట్లాడుతున్న వారికి రాజ్యాంగం శక్తి ఏమిటో తెలుసా...?  లేక ఎవరు ఏమి చేస్తారు మేమే మొనార్కులం అని అనుకుంటున్నారా...  ఒకడేమో పొమ్మంటాడు. మరొకడు అభయ హస్తం ఇస్తాడు... వీళ్ళెవరు పోమ్మంటానికి... లేక అభయం ఇవ్వటానికి... అందరిని కాపాడేందుకు చట్టాలున్నాయి.. దేశం ఉన్నది... రాజ్యాంగం ఉన్నది... వీళ్ళు వాటికన్నా అతీతులా....??? ఇంత ఆందోళనకరంగా విడిపోయేటప్పుడు రాష్ట్ర సరిహద్దుల గురించి, ఉద్యోగ వాటాల గురించి... నీటి వాడకం గురించి ఏవిధమైన సానుకూల వాతావరణంలో చర్చించగలరు...? ఏ విధంగా పరస్పర నమ్మకాన్ని పొందగలరు...?? 

మొన్నటికి మొన్న, ముంబాయిలో ఓ పార్టీవారు.... వేరొక రాష్ట్రంవారు రావటాన్ని వ్యతిరేకించటం కోసమే పుట్టిని ఈ పార్టి వారు... బయట నుండి ముంబాయికి వచ్చినవారిని తరిమిగోట్టే ప్రయత్నం చేశారు...వారి పార్టీ పుట్టుకే రాజ్యంగా విరుద్దం... వారు రాజ్యాంగం ప్రకారం ఎలా నడుచుకుంటారు...??ముంబాయి అనే మత్యకారుల పల్లె... బాంబేగా మారటానికి మరాఠిలు మాత్రమే కారణం కాదు అన్న సంగతి వీరికి తెలియదా..??? తెలుసు... కానీ,  వీరు లోకల్ అన్న ఫీలింగుతో తమ  ప్రతాపం చూపించారు... వీరు తమ రాష్ట్రం దాటితే ఎందుకు పనికి రారు.  వీరికి చట్టం రుచి చూపించటంతో వెనక్కి తగ్గారు.

కేవలం ముంబాయే కాదు దేశంలోని నగరాలే కాదు... ప్రపంచంలో ఏ పెద్ద నగరం అయినా నగరంగా అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ప్రాంతీయులవల్లన మాత్రమే కుదరదు. ప్రపంచం మానవ సంఘటితంతోనే అది సాధ్యం. ఇది తెలుసుకోకుండా తమ ప్రాంతం అభివృద్ధి చెందగానే... అప్పటిదాకా ఇటుకలు పేర్చిన వారిని పరాయి వారుగా చూడటం కన్నా కృతఘ్నత ఇంకోటి లేదు. అందుకనే,  దశాబ్ద కాలం క్రిందటే హాంకాంగు చైనాలో కలిసినా దానిని అలానే ఉంచారు మన నిరంకుశ చైనా వారు కూడా.... ఎందుకంటే అందులోని అభివృద్ధికి అనేక దేశాల వారికి పాత్ర ఉన్నది... దానిని కనుక చైనా పద్దతిలో కెలికితే అది విచ్చిన్నం అవుతుందన్న సంగతి మన నిరంకుశ చైనా వారికి తెలుసు. "ఆ నష్టం కూడా వారికే" అన్న సంగతి తెలుసును... అందుకనే ఇచ్చిన మాటని నిలుపుకుంటున్నారు. 

ఇక విషయానికి వస్తే.... ఆంద్ర రాష్ట్ర విభజన సమయంలో  సెటిలర్స్ అనే మాటని తెలిసో తెలియకో విరివిగా అందరూ వాడేస్తున్నారు. ఎలాగు వాడుతున్నారు కదా అని ఏకంగా "సెటిలర్స్ ఫోరం" అని ఒక సంఘమే ఏర్పడిపోయింది. ఈ పేరు దేశంలోని ప్రజలని ఉద్దేశించి ఉచ్చరించటానికే రాజ్యాంగం అనుమతించదు... అలాంటిది ఒక సంఘమే ఏర్పడి పోయింది... ఇది దేశ దుర్గతి. ఎవడో ఎదో అన్నాడని ఆ పేరుతోనే సంఘం పెట్టుకోటానికి... ఈ సంఘం పెద్దలు ఏమి చదువుకోని వారేమి కాదు. కాకపొతే వారికి భద్రత లేకపోవటం వలన... అలా వారికి వారుగా సెకండ్ సిటిజన్ షిప్పుని పుచ్చేసుకున్నారు. వీరికి ధైర్యం చెప్పేందుకు ఒక్క రాజకీయ దురంధర దుర్మార్గులు లేకపొగా...వారిని అలాగే పిలుస్తున్నారు. విచిత్రం ఏమంటే ఇలా పిలిపించుకునే వారందరూ రెండు మూడు జిల్లాల నుండి వచ్చిన ఈ రాష్ట్రం వారే కానీ బయట రాష్ట్రం వారు కాదు. ఆ బయట రాష్ట్రం వారిని కూడా సెటిలర్స్ అని పిలవటం లేదు ... కాబట్టి వీరేమి చేస్తారు.. చుట్టూ ఉన్న పరిస్థితులకి లొంగక...!!! 

ఇంతకీ "సెటిలర్స్" అంటే అలా మాట్లాడే ఏ నాయకుడికైనా, రాజకీయ నాయకుడికైనా అర్ధం తెలుసా...? ఏ అర్ధంతో [లింకు నొక్కండి] వాడతారో తెలుసా...???  [ మాట అర్ధం కన్నా... ఏ భావంతో ఆ మాట వాడుతున్నారురొ చూస్తే... ఆ మాటని వాడే వారందరూ శిక్షార్హులే.....] ఒకే భాష వారు, రెండు మూడు జిల్లాలు అవతల నుండి వచ్చినవారిని పట్టుకొని "సెటిలర్స్" అనే మాటని వాడటం ఎంతవరకూ సమంజసం.  ఒకే దేశంలో నివసించే వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళగానే సేటిలర్స్ అయిపోతారా....??? ఆ మాటకొస్తే, ఎవరిని తీసుకున్నా వెనక్కి రెండు మూడు తరాలు చూస్తే ఎక్కడి నుండో తరలివచ్చిన వారే....!!! అలా రెండు జిల్లాల దాటి వచ్చిన వారే సెటిలర్స్ అవుతే మరి హైదరాబాదులో ఉన్న భిన్న దేశాల సంస్కృతులు కలిగిన వారిని ఏమనాలి... ఏమిటీ సంకుచిత్వం... కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేక రాజకీయ పదవుల కోసమో, లేక కోట్లు గడించే అవకాశాలు ఉన్న కాంట్రాక్టుల కోసం సాటి భారతీయులని రెండో తరగతి సిటిజన్లుగా గుర్తించటం ఎంతవరకూ సమంజసం?? 

ఇలాంటివి దేశంలో ఎన్నో... కొన్ని టీవీలు పేపర్ల దాకా వస్తాయి... చాలా వరకు అన్ని సమాజాలలో ఇటువంటి వివక్షతలు నడుస్తూనే ఉన్నాయి. మతపరమైనవి, కులపరమైన వారికంటే ఇలాంటి వితండ వాదుల వల్లనే దేశానికి ప్రమాదం. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే వారు దేశంలో ఎక్కడికైనా వెళ్లి బ్రతికే వీలున్నప్పుడే వారికి దేశ స్వేచ్చ మీద నమ్మకం ఉండి... దేశాన్ని గౌరవిస్తారు. ఎలాంటి హక్కులు లేకుండా... జిల్లా దాటంగానే వివక్షత మొదలైతే ప్రజలలో దేశభక్తి ఉండటానికి అవకాశం ఎక్కడున్నది...?

ఇక అసలు విషయానికి వస్తే....  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు భయపడటం వల్లనే ఈ విభజన వివాదాస్పదం అయినది. ఏదేని రాష్ట్రం విడిపోతే పొయ్యేది కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే.... కానీ, ఇక్కడ కొందరు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మాట్లాడటం....వారిని సమర్ధించేవారే కానీ, వారించే వారు కరువు అవ్వటంతో మరియు  ఈ విభజన ఏదో దేశం విడిపోతుందన్న స్థాయికి దిగజారటంతో  ప్రజలలో అభద్రతా భావం ఏర్పడింది. ,  

కాబట్టి, 
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 
ఇటువంటి విషయాలలో శ్రద్ద తీసుకొని కఠినంగా వ్యవహరించి,
 ఇలాంటి వివక్షత కలిగినవారికి దేశం పట్ల భయం కలిగించి
 తగిన శిక్షలు వెయ్యటం ద్వారా
జిల్లాల భక్తీ లేక రాష్ట్రాల భక్తీ ముదరకుండా చేసి,
 దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల భయాందోళనలు పోగొట్టి... 
వారిలో దేశం పట్ల భక్తీ ఏర్పడేట్లు చెయ్యాలి. 
అలా చేసి, 
ప్రజల భయాన్ని తొలగిస్తే 
ఒక రాష్ట్రం ఏమిటి... పది రాష్ట్రాలు ఏర్పడినా ఎవరు కలత చెందరు.
లేకపోతే,
 పాతకాలపు సంస్థానాల వాసనలు తిరిగి మొదలై 
దేశ సమగ్రతకి, భద్రతకి ముప్పు తెచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. 

జైహింద్ 

రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???


--------------------------------------------------------------------------------------------------------------------


[మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కి ఎడం ప్రక్కకి స్క్రోల్ చెయ్యండి ఫిలిప్పైన్స్  తుఫాను శాటిలైట్ ఫోటో కనపడుతుంది] 
బహుశా... దీని వలన మనకు కొద్ది రోజులలో చలి పెరిగే అవకాశం ఉన్నది.

కర్టేసి:accuweather.com
--------------------------------------------------------------------------------------------------------------------