నేనే ఎందుకు చెయ్యాలీ...
నేనే ఎందుకు.. వేరొకరు చెయ్యచ్చు కదా...
అన్నీనేనే చెయ్యాలా...
నా వాడే కానీ, నేనే ఎందుకు లొంగాలీ...
వాడు కూడా నాలాంటి వాడే కదా.. వాడినెందుకు అడగరు..
వాడంటే నాకిష్టమే కానీ, వాడొచ్చి నన్నెందుకు అడగడు...
వీడు చెప్పేదేమిటి నేను వినేదేమిటి...
వీడు నాకు చెప్పేంతటివాడైనాడా...
ఇలా పట్టుదలకి సంబంధించిన ఆలోచనలు
ఒక్కొక్కరిలో పేరుకునిపోయిన కొద్దీ
మనుషుల మధ్య అంతరం[దూరం]పెరుగుతూ పోతుంది.
విచిత్రంగా ఇవేమీ ఆర్దికమైనవి... అంటే డబ్బుకి సంబంధించినవి కావు...
మరి దీనికి విరుగుడు లేదా..???
ఉన్నది.
తేలికగా కనపడే కష్టమైన పరిష్కారం...
పరిష్కారాం అనే మాట చిన్నది
అని
ఇతరులకి చెప్పేప్పుడు మాత్రం అనిపిస్తుంది...
అదే
మనకి వర్తింపచేసుకున్నప్పుడు
అదెంత కష్టమో తెలిసి వస్తుంది...
ఎందుకూ...??
ఎందుకంటే పట్టుదలని ఓడించాలి అంటే ప్రేమ కలగాలి...
కానీ
ఆ ప్రేమని కూడా ముంచేసేది "ఇగొ"
అదే అహం...
మరి ఈ అహాన్ని జయించాలి అంటే కుదిరే పనేనా...
దీనికి అనేక ధర్మ సూత్రాలు,
న్యాయంగా కనపడే విషయాలు అడ్డొస్తాయి...
నిజమే...
ఎవడి అహాన్ని వాడు కాపాడుకోవటానికి
అనేకమైన న్యాయబద్ధంగా కనపడే విషయాలని సపొర్టు చేసుకుని
ఎవడికి వాడు ఆత్మని సంతృప్తిపరచుకొని
తన అహాన్ని కాపాడుకుంటాడు...
ఇంత మానసిక సంఘర్షణ గురించి ఎందుకు ఇంత కంఫ్యుజన్‌గా వివరణ
అని అనిపిస్తోందా...
అని అనిపిస్తోందా...
అవును నిజమే కానీ,
ఈ చిన్నపాటి షంఘర్షణల వల్లనే
సమాజంలో మనిషికి మనిషి దూరం అయిపొతున్నాడు...
ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుండీ పిల్లలూ...
పిల్లల దగ్గర నుండీ తల్లిదండ్రులు...
భార్యాభర్తలు...
స్నేహితులు...చుట్టాలు...ఒకరికొకరు...
చివరికి సమాజమే...
చివరికి సమాజమే...
ముందుగా తల్లిదండ్రుల దగ్గర నుండీ పిల్లల ప్రేమకాస్తా పట్టుదలగా మారి... జారిపొవటం చూద్దాము... ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలని చేస్తుండటంతో పని విభజన చేసుకుతీరవలసిన పరిస్థితి వచ్చింది. కానీ, సమాజపరంగా అటువంటి మార్పులు పెద్దగా రాలేదు... తల్లి ఉద్యోగం చేసొచ్చినా సరే... ఇంటికి వచ్చి వంటా వార్పు చెయ్యవలసిందే... పిల్లలని కూడా చూడవలసినదే మరి... కానీ ఆ అలసిన తల్లి వంటపనులైతే విసుక్కుంటూ అయినా చెయ్యగలదు కానీ, ప్రేమగా పిల్లల పనులు చెయ్యకలదా...?? పిల్లలు వస్తువులు కాదు కాబట్టి వారికి ఒపిగ్గా చెయ్యాలి అంటే అలసిన తల్లికి కుదిరే పనా... కుదురుతుంది. ఎప్పుడూ... వేరే వారు చెయ్యటానికి ఎవరూ లేనప్పుడు... కానీ మొద్దులాగా మొగుడు ఎదురుగా కూర్చుని టీవీ చూస్తూ ఉంటే, తాను మాత్రం ఎందుకు ఇవ్వన్నీ చెయ్యాలీ అనే ఆలోచనలో పడుతుంది... ఇక అప్పటి నుండీ ఆ తల్లిదండ్రుల పట్టుదలలో పడి పిల్లల మీద ప్రేమ కాస్తా ప్రక్కకి జారిపోతుంది...
ఇక పిల్లల దగ్గర నుండీ తల్లిదంద్రుల ప్రేమ పట్టుదలలో చిక్కుకునిపోవటం... ఇద్దరు ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులకి ఇది పూర్తిగా స్వానుభవం... పిల్లలు తల్లిదండ్రులని చూడాలి. చూస్తారు. ప్రేమా ఉంటుంది... కానీ, పిల్లలలో ఒకరి మీద ఒకరు వంతులు వేసుకోవటం వలన పట్టుదలగా మారి, అదికాస్తా చెదిరిపోతుంది. ఇది ఎంత డబ్బున్న తల్లి తండ్రులకైనా తప్పదు. సామాన్యంగా ఎవరు ఆర్ధికంగా తక్కువగా ఉన్నారో వారి పంచన చేరి వారికి సహాయం చెయ్యాలీ అని తల్లిదండ్రులు చూస్తారు... ఇది మిగిలిన వారికి కోపకారణం అవుతుంది. నిజానికి అంతరాలలో అర్ధమైనప్పటికీ, అహం అడ్డంపడి తల్లిదండ్రుల మీద కొపాన్ని తెప్పిస్తుంది... మరొక కారణంలో... ఇద్దరూ సమమైన ఆర్ధిక పరిస్థితికల పిల్లలున్నప్పటికీ, ఒకరు చూడలేదని మరొకరు ఆరొపించుకొని...తల్లి తండ్రులని రోడ్డున పడేస్తారు...ఇంతకీ ఆ తల్లి తండ్రులకి ఏమన్నా లక్షలు ఖర్చు పెట్టాలా... అఖర్లేదు. కానీ "వాడికి పట్టంది నాకెందుకు..." అనే పట్టుదల... అంతే; అలా జీవిత కాలం గడచిపొతుంది... ప్రేమ లేకనా... ఉంటుంది. అది అహం/పట్టుదల క్రిందపడి నలిగిపొతుంది. తీరా ఆ తల్లిదండ్రులకి ఏదైనా అవుతే, అప్పుడు వీటన్నిటినీ చేదించుకొని ఆ ప్రేమ బయటపడుతుంది. కానీ ఏమి లాభం... ఆ ప్రేమ తల్లిదండ్రులని ఆనందపెట్టనప్పుడు...!!!
ఇంతకీ ఇందులో తల్లిదండ్రులకి కానీ, కన్న పిల్లలకి కానీ కావాలిసినది ఏమిటి... డబ్బా లేక తిండా... ఈ రెండూ కావు... ఒక ప్రేమతో కూడిన పలకరింపు. అంతె. ఇది చేసేప్పుడు "నేనే ఎందుకు చెయ్యాలి అనే ఆఫీసు బుద్ధిని" ప్రక్కన పెడితే చాలు....
పిల్లలు సాయంత్రం స్కూలు నుండో లేక కాలేజి నుండో రాగానే, వారిని కాసేపు దగ్గర కూర్చూపెట్టుకొని వారు చెప్పే విషయాలని ఓపికగా వింటే చాలు... వారు చెప్పేవన్నీ మనకి తెలిసినవే అయినా వారికి అవి కొత్తే; వాటిని పంచుకుంటే వారికి పరమానందం అవుతుంది. అలాగే మనం కూడా వారితో పిచ్చాపాటి మాట్లాడితే...[అదీ కూడా చదువు గురించి తప్ప...] వారి భావాలని పంచుకునే మంచి స్నేహితులైపోవచ్చును...ఒంటరితనం లేకపోవటంతో చెడు సావాసాలకి పోరు...
ఇక తల్లిదండ్రుల విషయానికొస్తే, వారికి కావాలిసింది కూడా తమతో కాసేపు గడిపేవారే... అందులోనూ వారి పాత అనుభవాలని చెపుతుంటే మంచి శ్రోతలాగా కనుక నిజాయతీగా వినగలిగితే, వారి ఆయుస్షుని పెంచినవారవుతాము. ఒంటరితనం దరిచేరనంతవరకూ పెద్దలకి అనారోగ్య సమస్యలూ ఏమీ రావు...
ఇక చుట్టరికాలలోనూ, స్నేహితుల మధ్య పట్టుదలలు ఇగోలు అడ్డంపడి ఒకరొ మొఖం ఒకరు చూసుకోవటానికి అనేక ఏళ్ళు పట్టవచ్చునూ... లేక అదీ జరగక ముందే పైకి ఎగిరిపోవచ్చునూ ... కాబట్టి ఏదైనా మనం భూమ్మిద ఉన్నప్పుడే చూడాలి కానీ, తరవాత సాధించేది ఏముంటుంది. అదే కనుక, ప్రక్కవాడికి కూడా కాస్త సమయాన్ని కేటాయించి గౌరవించి, మన అహాన్ని కాసేపు ప్రక్కన పెడితే చాలు. పట్టుదలలు పంతాలూ.. వంతులూ... భాగాలూ... అన్నీ ఇట్టే కరిగిపోతాయి... అలాగే భార్యాభర్తలలో... ఇద్దరూ ఇంటిపనిని ఇష్టంగా పంచుకుంటే చాలు...
ఇదే సమాజం మొత్తం మీద పనిచేస్తుంది... కానీ, సమాజం కోసం మన ఇగోని చంపుకోవద్దు...ఎవడి ఇగో వాడికి అందం... అయితే... తల్లిదండ్రుల దగ్గరా, కన్నపిల్లల దగ్గరా, భార్యాభర్తల మధ్యా, పెద్ద వయసు వారి దగ్గరా ఈ ఇగోలని పట్టుదలలని ప్రక్కన పెడితే, అనేక కుటుంబాలు సంతోషంగా ఉంటాయి... కుటుంబాలు సంతోషంగా ఉంటే సమాజమే సంతోషంగా ఉంటుంది...
శుభం
****
ఇందులోని బొమ్మలన్నీ గూగల్ లోనివే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి