బీరకాయలాగా ఉంటుందనే కానీ... దీనికి బీరకాయకి అసలు సబంధమే లేదు.
అలాగే, పేరులో నెయ్యి ఉన్నప్పటికీ, నేతితో సంబంధం లేకపోయినప్పటికీ...
ఈ కాయలతో పచ్చడి చేసుకుని తింటే, నెయ్యంత రుచిగా ఉంటుంది.
బహుశా అందుకే నేతిబీరకాయ అని పేరు పెట్టారేమో.....
ఇది పాదు. అంటే తీగాలాగా పాకేది.
సామాన్యంగా కార్తీకమాసంలోనే నేతిబీరకాయలు వస్తాయి.
ఈ కాయలు కార్తీకమాసంలో తింటే చాలా పుణ్యం అని చెపుతారు....
ఈ కాలంలో మాత్రమే దొరికే నేతిబీరకాయలు తింటే
ఈ కాయలలోని పీచు గుణాలు ఆరోగ్యానికి మంచిది
ఈ కాయలలోని పీచు గుణాలు ఆరోగ్యానికి మంచిది
అని ఉద్దేశ్యం అయి ఉంటుంది.
మాములుగా తినమంటే మనవారికి సరిపడదు కదా...
పుణ్యమో పురుషార్ధమో అంటే తప్ప....!!!
పైగా ఈ పాదులనే పెంచకపోవచ్చును...
ఈ నేతిబీరకాయాలలో పీచు ఎక్కువ ఉండటం వలన పచ్చడికే ఉపయోగిస్తారు...
ఈ పచ్చడిని రెండు రకాలుగా చెయ్యవచ్చును.
ఒకటి...కాయని ముక్కలుగా కోసి, వాటిని వేయించి పచ్చడి చెయ్యటం.
రెండవది... మరియూ పాతకాలం పద్దతి ప్రకారం
కాయని పొయ్యి మీద కాల్చి పచ్చడి చెయ్యటం.
1. నేతిబీరకాయ ముక్కలు పచ్చడి.
కావాలిసినవి
1.నేతిబీరకాయ ఒకటి
2.చింతపండు కొద్దిగా
3.నూనె కొద్దిగా
4.పచ్చిమెరపకాయలు 6 లేక 8 [నేతి బీరకాయ సైజుకి తగినన్ని]
5.కొత్తిమీర ఒక కట్టలో సగం
6.తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]
ముందుగా కొద్ది నూనెను మూకుడులో వేసి వేడి చేసి... దానిలో తరిగిన నేతిబీరకాయ ముక్కలని వెయ్యాలి. అయితే, ముక్కలు వేగకూడదు...ఉడకాలి. కాబట్టి, అవి వేగకుండా ఉండటానికి, మూకుడు పైన మూత పెట్టాలి. అవి కొద్దిగా ఉడకగానే, దానిలో కొంచం చింతపండుని వేసి కలిపి, తిరిగి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడకబెట్టాలి.
ఇప్పుడు, పచ్చిమెరపకాయాలని మిక్సీలో వేసి...అవి నలిగినా తరవాత,
దానిలోనే ఉడికిన నేతిబీరకాయ ముక్కలని వేసి మిక్సీని కొద్ది కొద్దిగా తిప్పాలి.
మిక్సీని పూర్తిగా తిప్పితే
మొత్తం ముక్కలు కనపడకుండా రసంలాగా చూర్ణం అయ్యే ప్రమాదం ఉన్నది.
ఈ పచ్చడిలో సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకోవాలి.
అంతే నేతిబీరకాయ ముక్కల పచ్చడి తయారైనట్లే.....
ఇక అన్నంలో కలుపుకొని తినటమే తరువాయి......
2. నేతిబీరకాయ కాల్చిన పచ్చడి.
4.మినపప్పు ఒక చెంచా
5.ఆవాలు, జీలకర్ర కొంచం
6.ఇంగువ కొద్దిగా, తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]
ముందుగా నేతిబీరకాయ పైన నూనెను రాసి దానిని స్టవ్వు మీద కాల్చాలి.
తిప్పుతూ అది అన్ని వైపులా తగిన విధంగా కాలేట్టుగా చూసుకోవాలి.
అది బాగా కాలినా తరవాత, చల్లారే వరకు ఆగి, దానిమీద ఉన్న చెక్కును తీసివెయ్యాలి.
ఈ కాయలో పీచు ఎక్కువ కాబట్టి, క్రింద ఒక గిన్నె పెట్టుకొని,
కాలిన నేతిబీరకాయ తలకాయ భాగాన్ని పట్టుకొని క్రింద వరకు నొక్కుతూపోవాలి.
అప్పుడు ఆ కాయలోని గుజ్జు మరియు గింజలు ఆన్ని క్రింద పెట్టిన గిన్నేలోనికి వస్తాయి.
చేతిలో మిగిలిన పీచులో మెత్తటి భాగాన్ని కూడా గిన్నేలోనికి వేసుకోవాలి.
ఇప్పుడు, ఆవాలు, జీలకర్రా ఎండు మెరపకాయాలలో కొద్దిగా ఇంగువ వేసి వేయించాలి.
ఈ వేయించిన వాటిని మిక్సీలో వేసి తిప్పిన అనంతరం,
దానిలో నేతిబీరకాయ గుజ్జుని కూడా కలిపి మరొకసారి కొద్దిగా మిక్సీని తిప్పాలి.
అంతే... కాల్చిన నేతిబీరకాయ పచ్చడి తయ్యారైనట్లే......
ఈ నేతిబీరకాయ చట్నిలని అన్నంలో కలుపుకుని తినటమే కాదు,
దోశలలో నలుచుకుని తిన్నా బాగుంటాయి.
@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి