మునిగిపోయిన లెహర్ తుఫాను
తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.
మచిలీపట్టణం వద్దకు వచ్చేప్పటికే సముద్రంలోనే బలహిన-పడిపోయింది.
దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ
భారి వర్షాలు పడతాయని అంటున్నారు.
అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.
అయితే, తుఫాను తీవ్రత తగ్గినప్పటికి
నర్సాపురం/మచిలీపట్టణం తీరప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఈ విధంగా
నూటొక్క గంటల
లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా
కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.
నిన్న రాత్రి 9.25 ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం
లెహర్ తుఫాను మొదలు నుండి చివరిదాకా నడిచిన దారి
23-11-2013 సాయంత్రం 4.25 నుండి 28-11-2013 ఉదయం 7.25 వరకు
ఊహా చిత్రం కాదు. సేటిలైట్ గంట గంటకి తీసిన ఫోటోల GIF .
లేహర్ తుఫాను ప్రయాణంలో రెండు టర్నింగు పాయింట్లు...
ఒకటి అండమాన్ దగ్గర దాటుతున్నప్పుడు
NORTH-WEST నుండి WESTకు దిశ మారటం,
రెండవది చెన్నయి వైపుకి వస్తు NORTH-WESTకు దారి మళ్ళటం.
బహుశా తీరం దగ్గర నీళ్ళు-గాలి NORTH దిశగా కదులుతూ ఉండి ఉండవచ్చును.
రెండవ టర్నింగు పాయింటు దగ్గరే తుఫాను బలహినపడింది.
*******************
కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు
రకరకాలైన భయంకరమైన మ్యూజిక్కులు పెట్టి... భయపెట్టిన మన మీడియావారు,
ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి,
యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే
ప్రజల నెత్తిన రుద్దారు.
మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,
తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న
కనీస సామాజిక బాధ్యతని మరచారు.
@@@@@@@@@@@@
తుఫాను గురించి నిన్న వేసినది
లింకు నొక్కండి
@@@@@@@@@@@@
కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com
@@@@@@@@@@@@
భయంకరమైన తుఫాను తప్పిపోయింది
హాయిగా చల్లగా ఉన్నది...కొద్దిగా వర్షం పడుతోంది.
ఇప్పుడు ప్రశాంతమైన కిషోర్ కుమార్ పాట వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి