LOCAL WEATHER

21, డిసెంబర్ 2013, శనివారం

దేవయానిని అవమానించేది ఎవరు...???

అమెరికాలోని భారత్ కార్యాలయంలో డిప్యూటి కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడు...ఒక పనిమనిషి విషయంలో తేడాగా ఉన్నందుకు దేవయానిగారిని అమెరికా వాళ్ళు అక్కడి చట్టాల ప్రకారం అరెస్టుచేశారు. ఆ సమయంలో వారు తప్పుగా ప్రవర్తించారు అని, గొడవ జరిగిన కొన్నాళ్ళకు భారత్‌లో ఆందోళనలు  చెలరేగినాయి. 



కర్టేసి:  సాక్షి... కధనం.

ఈ విషయంలో కేవలం అమెరికావాళ్ళనే తప్పుపట్టవలసిన పని లేదు..అన్ని యురోపియన్ దేశాల వైఖరి ఇలాగే ఉంటుంది. వారి అహంకారం అలాంటిది. ఆ అహంకారాన్ని మన దేశాల్లాంటివారు, ఇప్పటిదాకా ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఆమోదిస్తూనే ఉన్నారు...అదే అసలైన తప్పు. యురోపియన్ దొంగలు భారతదేశంలో పట్టుబడితే...వారికి భారత చట్టాలు వర్తించవు....కానీ, సామాన్య తల్లిదండ్రులు తెలియక చేసిన చిన్న తప్పుకి, వారిని  యురోపియన్లు జైల్లో పడేస్తారు. పైగా వారి దేశాల చట్టాలని గౌరవించి తీరాలని అంటారు. 

అలా అన్న ఈ దొంగల దేశాలు, ఇతర దేశాల చట్టాలని... ముఖ్యంగా ఆసియన్,ఆఫ్రికన్ దేశాల చట్టాలని అసలు గౌరవిచటం మాట అటుంచి, కనీసం పరిగణలోనికి కూడా తీసుకోవు. మన వారి ఆవకాయాలని కూడా అక్కడికి రానియ్యరు కానీ, వారి బాంబులని మన దేశాలకి అమ్ముకుంటారు...ప్రమాదకర మందులని అమ్మేస్తారు... వారి దేశాలకి రావాలంటే మన వారికి అన్ని చెకప్పులూ చేస్తారు...అక్కడి ఎయిడ్స్ ఉన్న వారి ప్రజలు ఇక్కడికి వచ్చి మనదేశంలో విచ్చలవిడిగా తిరిగేస్తారు.... మన వారు పరిధి దాటి ఒక్క గంట ఉన్నా వారిని నేరస్తులని తరిమినట్లుగా తరిమి పట్టుకుంటారు... కాని, ఆ దేశస్తులు "మతం ముసుగులో" వేలు లక్షల మంది ఏ పర్మిషన్ లేకుండా మన దేశంలో గ్రామ గ్రామాన తిరిగేస్తారు....

కర్టేసి: ఈనాడు... కధనం 

ఈ విషయంలో కూడా ఈ దొంగల దేశాలని తప్పుపట్టవలసిన పనిలేదు. ఎందుకంటే వారి అహంకారాన్ని మిగిలిన దేశాలవారు ఆమోదించటమే కారణం.... ఇవే కాదు, ఆసియాలోనే ఉన్న అరబిక్ చట్టాలూ కూడా ఇలానే ఉంటాయి. వారు మన దేశానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చును; చిన్న పిల్లలను పెళ్ళిళ్ళు చేసుకోవచ్చును... కాని మన వాళ్ళు అక్కడికి పొతే, అక్కడి చట్టాలకి లోబడి ఉండవలసిందే...చివరికి మన మాజీ రాష్ట్రపతి శంకరదయాల్ గారి భార్య కూడా బురఖా ధరించవలసి వచ్చింది. మరి అలాంటప్పుడు షేకులు మన దేశానికి వచ్చినప్పుడు "వారి భార్యలు పట్టుచీర కట్టుకొని బొట్టు పెట్టుకుని ఉండాలి" అని మనవాళ్ళు అడగకపోవటమే మనవారి తప్పు....

ఇలా ఒక దేశం మరొక దేశాన్ని అవమానిస్తున్నప్పుడు, ఒకరి దౌత్యవేత్తలని మరొకరు అరెష్టు చెయ్యటమో లేక దేశం నుండి తరిమేయ్యటమో ఇదివరలో జరిగేది. ఇతర దేశాల్లో జరుగుతోంది కూడా... కానీ, మన దేశంలో ఉన్న దిక్కుమాలిన నీతి జాతి లేని రాజకీయ వ్యవస్థ వలన మన దేశం పౌరులు... బయట దేశాల్లోనే కాదు, మనదేశంలో కూడా ఏ నేరం చెయ్యకుండానే అవమానాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి ... మన దేశ రాజకీయ నాయకులకి దేశమంటే గౌరవం లేకపోవటమే ముఖ్య కారణం . ప్రతివారికి వారి వారి వ్యాపారాలే ముఖ్యం కాని...ప్రజల మానాలు ప్రాణాలు కాదు.  వారి వ్యాపారాలకోసం కోసం ఏ దేశానికైనా దాసోహం అనేస్తున్నారు....మన ఆర్ధిక దుస్తితికన్నా యూరప్పుల ఆర్ధిక ఆరోగ్యమే మన దేశనాయకులకి  ముఖ్యం...

వీరికి తోడూ... మన మీడియా వారు...ముఖ్యంగా టీవీల వారు...ప్రింటు మీడియాలో జరిగినది జాగ్రత్తగా మర్యాదగా వ్రాస్తుంటే...టీవీ 9 లాంటి మూర్ఖ ఛానళ్ళు ఇష్టారాజ్య భావజాలం వాడుతో.... అమెరికాలో దేవయానిగారికి ఒకసారి అవమానం జరిగితే, దానిని తిప్పి తిప్పి ఇష్టానుసారం మార్చివేసి అసభ్యంగా చిత్రీకరించి, తెలియని అందరికి తెలిసేట్లుగా చేస్తున్నారు...అదేదో సినిమాలో బ్రహ్మానందం మరియు ఎవిఎస్స్ గార్ల మధ్య జరిగిన విపరీత హాస్యం లాగా మన టివి వారు ప్రవర్తిస్తున్నారు...

కర్టేసి: యుట్యుబ్... ప్రియరాగాలు సినిమా నుండి 

ఇందులో బ్రహ్మానందం గారు ఎవిఎస్స్ గారిని శిక్షించినట్లుగా  
టీవీవారిని కూడా  శిక్షించినా ...ఎవిఎస్స్ గారి రియాక్షనే రావచ్చును...

కాబట్టి, మన భారతదేశ వనితకి గౌరవం కలగాలంటే ముందరగా టీవీవారు సంయమనం పాటించి, సరైన భావజాలాన్ని వాడుతో విషయాన్ని ప్రజలకి తెలియజెయ్యాలి.  అమెరికా మీద కోపంతో, అవతల ఉన్నది భారతీయ వనిత అన్న సంగతి మరచి... అందరు విపరీత ప్రవర్తన చేస్తున్నారు; అది ముందర మానుకుంటే మంచిది. అమెరికా వాళ్ళ అవమానం కంటే మనవాళ్ళ  విపరీత ప్రవర్తన.... ముఖ్యంగా దిక్కుమాలిన టివీల "నోటివాపిరి జాలం" మారితే... దేవయాని గారికి మరింత అవమానం జరగకుండా ఉంటుంది.

చివరిగా, ఎదో జరిగినప్పుడు అల్లరి చేసి, తరవాత మిన్నుకుండిపోవటం మానుకొని... ఒక నిర్దుష్టమైన విధానంతో భారత రాజకీయ వ్యవస్థ ఉండాలి. మొన్న  భోపాల్ గేస్ నిందితుడిని దగ్గరుండి మరీ విమానం ఎక్కించారు.... నిన్న ఆయుధాల జారివేత కేసులోని రష్యాన్ని ఒదిలేసారు....ఈ మధ్య ఇటలివారి పట్ల ఉదాశీనంగా ఉన్నారు... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో...మరెన్నో  మన వారి తప్పిదనాలు... మన చట్టాన్ని మనమే గౌరవించకపోతే దొంగ యురోపియన్ దేశాలు ఎలా గౌరవిస్తాయి...ఇప్పటికైనా  ఈ విషయాన్ని కఠినంగా తీసుకోని అమెరికాకి తగిన గుణపాఠం నేర్పి...దీనితోపాటు  ఇతర దేశాల పౌరులు ఎదో దేవతలైనట్లు వారి నేరాల పట్ల ఉదాసినంగా ఉండకుండా తగిన విధంగా మన చట్టాన్ని అనుసరిస్తే... అది మిగిలిన అన్ని దేశాలకి... ముఖ్యంగా యూరప్పు దేశాలకి హెచ్చరికగా ఉంటుంది....



జై హింద్ 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి