LOCAL WEATHER

26, ఏప్రిల్ 2012, గురువారం

ఆకాశంలో అలలు


నిన్న సాయంత్రం విజయవాడలో ఆకాశంలోని మబ్బులు అలలు అలలుగా కనపడి అహ్లాదపరిచినాయి.
తరవాత రకరకాలైన అందాలు కనపరిచినాయి. వాటిని నా " పొడ్తో" బంధించాను. మీరు కూడా చూసి ఆనందించండి.











24, ఏప్రిల్ 2012, మంగళవారం

ధర్నాల పేరంటాలు




ధర్నాల పేరంటాలు

ధర్నాలు ఎవరి కోసం...? ప్రజల కోసమా...?? లేక వారిలో వారికి భాగాలు సవ్యంగా కుదరకా...??? రాజకీయ నాయకులు చేసే ఎటువంటి ధర్నాలు అయినా ప్రజలకి ఎందుకూ పనికిరాక పోవటమే కాకుండా జన జీవనానికి అడ్డంకిగా తయారైనాయి.

రాజకీయ నాయకులు ఉద్దేశంతో చేస్తున్నారొ వారి ఉద్దేశం నెరవేరేదాకా ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసి; వారు, వారికి కావలిసిన సాధించుకొంటున్నారు. ప్రజలకి కావాలిసిన, అవసరమైన వాటికి మటుకూ ఏదో కంటితుడుపు చర్య అన్నట్లుగా చేసి ముగిస్తున్నారు.

ఎందుకంటే, ఎప్పుడైనా పెట్త్రొలు ధరలు పెరిగినాయని, నిత్యావసర ధరలు పెరిగాయని ధర్నాలు చేసి అవి తగ్గేదాకా ఏనాడైనా నిలబడి ఉన్నారా..??? వాటికేదో ముహుర్తం పెట్టి, ధర్నా ముహూర్తానికి టీవీల వారిని పేరంటానికి పిలిచి, అందరూ కలసి ముందుగానే టిఫిన్లు అవీ కానిచ్చుకొని, తరవాత టివీ వాళ్ళ ముందు కాసేపు నటించేసి ఎవరిదారిన వారు పోతున్నారు. వారు దేనికైతే ధర్నాలు చేస్తున్నారో ఫలితం వచ్చిందా.....లేదా అని కూడా వెనుతిరిగి చూసుకొవటం లేదు. కాకపోతే, అవి టివీలలో వస్తునాయా, మనకు లోకల్ ఫాలోయింగు పెరిగిందా అన్నవి చూసుకొని జాగ్రత్త పడుతున్నారు.

టీవీల వారు కూడా "హమ్మయ్య ఇవాళకి ఎదో ఒకటి చూపించటానికి ఉన్నది........ వాటి మధ్యలో ప్రకటనలు వేసేసుకొని బ్రతికేద్దాం" అనేగానీ...నాయకులు ధర్నాలు చెయ్యటానికి కారణమైన సమస్యల పరిస్థితి ధర్నాల తరవాత ఏమైంది అన్న ఫాలోయింగే లేదు. పైగా, ఒక ఊరిలోని చిన్న ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతని రాష్ట్ర వ్యాప్తంగా అంటించాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు.

రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్తితులలో సామాన్యుడైనా హాయిగా బ్రతికే పరిస్థితి ఉన్నదా...? అన్ని ధరలూ రోజు రోజుకీ మారుతూ ఉంటే అటు అమ్ముకొనే వారూ, ఇటు కొనుగోలుదారులు ఇబ్బందుల పాలవుతుంటే ఏమీ పట్టని "పాలక-ప్రతిపక్షాలు" వారి వారి "ఇగోలనూ, ప్రాంతీయ పట్టును" కాపాడుకోవటం కోసం ప్రజలని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. దిక్కుమాలిన ధర్నాలు చేయ్యటం వలన ప్రత్యక్షంగా ప్రజలకి ఇంతవరకూ ఒరిగిందేమీ కనపడలేదు. ఆయా రోజులలో ప్రజల పనులకి విఘాతం కలగటం తప్ప.

అయ్యా రాజకీయ నాయకుల లారా, మీ మీ ధర్నాల కోసం ప్రజలకి ఇబ్బంది కలిగించటమే కాకుండా.... గోలలు అదుపు చెయ్యటానికి ప్రభుత్వం చేత అనవసర అదనపు ఖర్చు చేయించి ప్రజా ధనంతో ఆటలాడుకొంటున్నారు. మరొక వైపు ప్రజలను విడదీసి వారి మధ్య వైషమ్యాల పెంచుతున్నారు.

కాబట్టి, ధర్నాలు అంటు ప్రజలని ఇబ్బండి పెట్టకుండా, మీ చుట్టాలైన టీవీ వారిని పిలిపించుకొని వెనుకాల మీ యొక్క ప్రచార జెండాలను పెట్టుకొని కావలిసినంత గొడవ చెయ్యండి. దాని వలన ప్రజలకి మీ వలన వచ్చే ఇబ్బందులు తొలగటమే కాకుండా.....పాపం మీ మిత్రులైన టీవీ వారికి కూడా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుంది!!!




ఇందులోని చిత్రాలన్నీ గూగుల్ లోనివే