LOCAL WEATHER

18, ఏప్రిల్ 2012, బుధవారం

వీధి కుక్కలు


రో
జు........ ఇంగ్లిషు సాయంత్రం...అంటే బాగా చీకటి పడిందన్నమాట. ఒక చిన్న పిల్లవాడి ఆర్తనాదం అదేపనిగా వినిపించింది. గభాలున బయటకు వెళ్ళి చూద్దుము కదా కొన్ని వీధి కుక్కలు సైకిలు మీద వెళుతున్న కుర్రాడి చుట్టూ చేరి పీడిస్తున్నాయి...అనేక మంది బయటకు వచ్చినా వారిలో ఒకరిద్దరు వాటిని చెదరగొట్టి ఎవరిదారిన వారు లోపలకు పోయి "టీవీల ధ్యానంలో" పడిపోయారు.


మళ్లీ రెండవరోజు, మూడవరోజు ఇదేతంతు. చివరికి ఒకాయన తెగించి " కుక్కలతో చచ్చిపోతున్నాము" అన్నాడు. ఇది విన్నంతనే అప్పటిదాకా నోరు మెదపని మరొకాయనకి తనకి తెలియకుండానే తన భావం బయటకి వచ్చి పడింది; "ఊర్కోండి అవ్వి ఉండ బట్టే కదా రాత్రిళ్ళు హయిగా నిద్రపోతున్నాము" అని.


అక్కడితో డిస్కషన్ మొదలైంది. అసలు విషయం పోయి అసెంబ్లీ లాగా తయారైంది. మిగిలినవారు టీవీలలో "
అసెంబ్లీ లైవు" చూసే అలవాటు ఉండటం వలన జరిగేదానిని చక్కగా చూస్తూ, వింటూ ఉండిపోయారు. మాములుగానే అసలు విషయం తేలకుండానే వారి డిస్కషన్ వాయిదా పడింది.

ఇంతకీ, వీధి కుక్కలు; కుక్క నుండి కుక్కలుగా మారి మా వీధిలో వంశపారంపర్యంగా స్తిర నివాసం ఏర్పరుచుకొని మాములుగానే ఉండేవి. మేము పడేసేవి తిని అలా బ్రతికేసేవి. కానీ మధ్య మా ప్రక్కన అపార్టుమెంటు కట్టటం మొదలైయ్యే సరికి అక్కడికి వచ్చిన కూలీలు తదితరులు వాటికి "మాంసాహారం" పడెయ్యటం మొదలు పెట్టారు. దానితో అప్పటిదాకా మా తిండితో బ్రతుకుతున్న వీధి కుక్కలకి మేమంటే లెక్క లేకుండా పోయింది...చులకనై పోయింది. "బయట తిండి ప్రభావం" మరి........





సరే
, యధావిధిగా రోడ్డున పోయేవారిని అవి పీడిస్తూనే ఉన్నాయి. కొందరు బయటకు రావటం మానేసారు, కొందరు మనదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అని ఊరుకుండి పోయారు, మరి కొందరు మనకే పట్టిందా అనీ....... మరి ఇంకొందరు "దారే పొయ్యే వారు జాగ్రత్తగా వెళ్ళద్దూ" అనీ బాధితులనే బాధించారు; ఇలా సహజమైన స్వదేశీ తత్వంతో మిన్నుకుండిపోయారు.


ఇహ లాభంలేదనుకొని, ఒకాయన వీటి గురించి మీటింగు అన్నాడు...... ఆ ఆయనంతే, పనికిమాలిన విషయాలను నెత్తికెత్తుకుంటాడు అని కొందరూ, "ఆ ఆయనతో మనకేమన్న ఇప్పుడు పనులున్నాయా ఏమిటి", ఆని చాలా మంది రాలేదు. ఇక వచ్చింది ఇద్దరు ముగ్గురు; "బాబూ అవి మా అపార్టుమెంట్ మెటిరియల్‌ని కాపలా కాస్తున్నాయి, వాటితో మాకేమి ఇబ్బంది లేదు" అని ఇద్దరు మూగ్గురులో ఒకాయన అన్నాడు. మరొక పిసినారి డబ్బున్న వాడు; "ఇవి కాణీ ఖర్చు లేకుండా రాత్రిళ్ళు కాపలా కాస్తున్నాయిగా ఎవరిగోలో మనకెందుకు?" అని ప్రశ్నించాడు... అవును కదా!! "ఎవరి అవసరాలు వారికున్నాయి" అన్నారు ఇద్దరు ముగ్గురులో.......మరిద్దరు.

ఇంత పేద్ద దేశంలోని ఒకానొక రాష్ట్రం, దానిలో ఒకానొక జిల్లాలోని ఒక నగరం. అందులోని ఒక పేట, అక్కడి ఒక వీధిలోని ప్రజలే ......... వీధి కుక్కలు లాంటి చిన్న విషయానికే ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంటే......ఇంత పేద్ద దేశంలో పేద్ద అవినీతి రాజకీయల గురించి ఎకాభిప్రాయం ఎలా వస్తుంది?



"
ప్రతీ దాంట్లోంచి మనకేమిటి" అంటూ ఆలోచిస్తుంటే......దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి వంటి పెద్ద సమస్య గురించి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందంటారా?? ఏది మంచి ఏది చెడు అన్న విషయం అనేది నిర్ణయించటానికి ప్రతీ మనిషికి తన అవసరం, తనకు మేలు చెయ్యటం వంటివి మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు దేశానికి మేలు జరుగుతుందా...??? అందుకనే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొత్తంగా విఫలం అయి కూచుంది, లేదా "విఫలం అయిపోయింది" అని అందరూ అనుకునేట్టుగా చేసేశారు. "అవునులే ఎవరి అవసరాలు వారికుంటాయి కదా మరి".

*source: http://trak.in/tags/business/2009/06/30/india-corruption-bribery-report/

జై హింద్


పైన బొమ్మలన్నీ గూగుల్ బొమ్మలే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి