LOCAL WEATHER

30, జూన్ 2014, సోమవారం

ఆంధ్రప్రదేశ్‌నకు ఫుల్ టైం ముఖ్యమంత్రి కావలెను...!!!


ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విభజింపబడిన తరవాత... తెలంగాణాకి జూన్ 2వ తేదీ నుండీ ఒక ముఖ్యమంత్రి ఏర్పడి... ఆ రాష్ట్ర ప్రయోజనాలకి కావలిసినవీ అన్నీ చూసుకుంటూ, "ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు" అనే భావనని అక్కడి ప్రజలకి తెచ్చాడు...

అదే సమయములో కాకుండా...జూన్ 8వ తేదీన మరొకరు ఆంధ్రప్రదేశ్‌నకు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ప్రమాణం చేసి... వారంలో నాలుగు రోజులు ఆంధ్రాలోనే గడిపి...రెండురోజులు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో ఉండి...మరొక రోజున ఢిల్లీ వెళ్ళి...అంధ్రాకి కావాలిసిన అన్ని పనులూ చేసిపెడతానని నొక్కి వక్కాణించాడు. అనంతరం ఇక్కడి నుండీ హైదరాబాదు ప్రయాణం అయిన మరుక్షణం...తెలంగాణాకి కూడా ఒక రోజు కేటాయిస్తానని చెప్పేశాడు...

ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ తెలంగాణాలో ఉంటాను అనే మాట తప్ప మిగిలినవి అన్నీ మరచిపోయారు...ఈయన గారి నొటి నుండీ రోజుకి 100 సార్లు "ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణం" అనే మాట తప్ప... మరొక అడుగు సీమాంధ్ర అభివృద్ధి వైపుకి పడటం లేదు... అయితే, తెలంగాణా విషయంలో మడుకూ అక్కడి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ శ్రద్ధ కనపరస్తూ ఉన్నాడు... 

అక్కడెక్కడో హైదరాబాదు కుర్రాళ్ళకి ప్రమాదం జరిగితే... తెలంగాణా వారికన్నా ఎక్కువ స్పందించి, ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసేశారు...అంధ్రా ఖర్చులతో... ఇలా చెయ్య కూడదని కాదుగానీ...రేపు ఏ తమిళనాడులోనో, కర్నాటకాలో "నివసిస్తున్న" తెలుగు వారికి ప్రమాదం జరిగితే ఇలాగే స్పందిస్తారా బాబుగారు... స్పందించకపోవచ్చును...ఎందుకంటే అక్కడ తన పార్టీ లేదు కదా...ఇదే విధంగా, మొన్న తూగో జిల్లా నగరం దుర్ఘటన జరిగినప్పుడు...మాజీ ఆంద్ర రాష్ట్ర పౌరుడు, ప్రస్తుత ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి ఒక సంతాప సందేశం వచ్చిందేగాని...దీనిపై దూకుడుగా మరే స్పందన లేదు...కారణం...ఆయన పార్టీ ఇక్కడ లేదు...కదా...!!!


ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతుంటే...
దానికి మూలంలోనికి వెళ్ళి 
సరైన శాశ్వత పరిష్కారం చెయ్యవలసిన ముఖ్యమంత్రి...
మరింత పీట ముడిపడేట్లు చేశారు....
ఈయన మాటలతో 
పరోక్షంగా ఆంధ్రాకి జరిగిన అన్యాయాన్ని 
సమర్ధించినట్లు అయింది.  
దీని వలన 4 లక్షల టన్నుల బొగ్గుని రాష్ట్రానికి కేటాయించుకున్నా ...
పరోక్షంగా ఈ బొగ్గులో 52 శాతం తెలంగాణాకి కేటాయించినట్లు అయ్యింది.
ఈ బొగ్గు వలన వచ్చే కరెంటులో షుమారు 52శాతం ఆ రాష్ట్రానికే కదా...


అలాగే పైదీ పరోక్షం అయితే, 
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీ ప్రయాణాన్ని పెట్టుకొని 
అక్కడి వారికందరికీ ఆంధ్ర విషయాలనే కాకుండా...
ప్రత్యేక్షంగా తెలంగాణా అవసరాల గురించి కూడా చర్చించారు... 
ఈయన ఇంకా మొత్తం 
"సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగానే" వ్యవహరిస్తున్నాడో
 లేక 
అక్కడ తెలంగాణాలో 
తన పార్టీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారో" తెలియటం లేదు. 
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పర్యటన చేసినప్పుడు...
తానూ ఏ రాష్ట్ర పనిమీద వచ్చాడో
 అది మాత్రమే మాట్లాడాలి... 
అదే ఆ పార్టీ అధ్యక్ష్యుడుగా వెళితే, 
అప్పుడు తన పార్టీ బాబోగుల గురించి మాట్లాడోచ్చును....

విభజన ద్వారా వీరి పార్టీని దెబ్బ తీద్దామనే ప్రత్యర్దుల కోరికని వీరి నాయకుడే తీరుస్తున్నట్లుగా ఉన్నది....అధికారం ఇచ్చిన రాష్ట్రం గురించి కాకుండా...అధికారం రావాలిసిన మిగిలిన ముక్క కోసం  ప్రయత్నిచటం వలన...రేపు 2019 ఎన్నికలలో... విడిపోయిన ముక్కలో అధికారం వచ్చే మాట అటుంచి, ఇక్కడ అధికారం ఉన్న చోట అధికారం పోయే పరిస్తితిని, వారికి వారే కల్పించుకుని...వీరి సమీప ప్రత్యర్ది మార్గాన్ని సుగమం చేస్తున్నారు.


ఒక వేళ తెలంగాణాలో కనుక 
తమ పార్టీకి అవసరం అనుకున్నట్లైతే 
అక్కడి ముఖ్య మంత్రి అభ్యర్ధి 
కృష్ణయ్యగారు చూసుకోవచ్చును కదా... 
ఆయనకి కేవలం ముఖ్యమంత్రిగానే అనుభవం ఉండి... 
ప్రతిపక్షనేతగా అనుభవం లేకపోతే, 
ఆయనని ఆంధ్ర ప్రదేశ్‌నకు ముఖ్యమంత్రిగా చేసి, 
బాబుగారే స్వయంగా 
తెలంగాణాలో ప్రతిపక్ష పాత్ర పోషించ వచ్చును కదా...
ఎందుకంటే ఈయనకి ముఖ్య మంత్రిగా కంటే 
ప్రతిపక్ష నేతాగానే ఎక్కువ అనుభవం ఉన్నది...
సమైక్యరాష్త్రంలో.... 

బాబుకి ఈ ఆశ 2019లో కూడా తీరే అవకాశం లేదు...
వస్తే కెసిఆర్ లేకపోతె కాంగ్రెస్...అంతే... 

ఏది ఏమైనా 
"ఆంధ్రప్రదేశ్‌నకు ఒక ముఖ్య మంత్రి ఉన్నాడా" అని అనిపిస్తుంటే...
"తెలంగాణా[లో]కి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు" అని అనిపిస్తోంది... 
కాబట్టి... 
కేవలం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మాత్రమే 
చూస్తానని ప్రమాణం చేసే 
ముఖ్యమంత్రి సీమాంధ్రకి కావలెను....


కావలిసిన అర్హతలు:  

1] ఈ అభ్యర్ధి 1956 తరవాత  హైదరాబాదుకి వెళ్లి ఉండరాదు...[ఈ అర్హత తప్పనిసరి]


2] ఈ అభ్యర్ధి యొక్క కొలతలు ముఖ్యంగా "హృదయ వైశాల్యం తెలంగాణా ముఖ్యమంత్రికి ఉన్నంత మాత్రమే             ఉండవలెను"...లేదా అంతకు తక్కువ ఉన్నా మంచిదే కానీ...ఎక్కువ హృదయ వైశాల్యం మడుకూ ఉండరాదు. 

3] ఈ అభ్యర్ధి అంతకు ముందుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా పరవాలేదు కానీ....ఇతర                   రాష్ట్రాలలో పని చేసిన అనుభవం "అసలు ఉండరాదు"

4] అభ్యర్ధి కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లోనే పుట్టి ఉండవలెను... వారి తాత ముత్తాతలు కూడా.

5] అభ్యర్ధి ఓటు హక్కు కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉండవలెను. 

6] వీరికి సంబంధించిన రాజకీయ పార్టీ... కేవలం ప్రాంతీయ పార్టీగానే ఉండవలెను...అనగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే       పోటీ చెయ్యవలెను...ఇతర రాష్ట్రాలలో బ్రాంచీలు ఉండరాదు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోనే                    ఉండవలెను. 

7] ఈ అభ్యర్ధికి ఇతర రాష్ట్రాలలో ఆస్తులు ఏమీ ఉండరాదు.... ముఖ్యంగా స్థిరాస్తులు...అదీ కూడా తెలంగాణాలో             అసలు ఉండరాదు.

8] ఈ అభ్యర్ధి తానూ ముఖ్యమంత్రిగా ఉన్న ఆంద్రప్రదేస్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కోట్లాది తెలుగు వారి గురించి             కాకుండా...ప్రపంచంలో ఉన్న లక్షలాది తెలుగు ప్రజల గురించి "అసలు" ఆలోచించ కూడదు. 

ఈ పై లక్షణాలు ఉండి, భవిష్యత్తులో కనీసం 100 ఏళ్ళ వరకూ తన పార్టిని జాతీయ పార్టీ చెయ్యనని హామీ బాండ్ ఇవ్వగల  అభ్యర్ధుల వల్లనే ఆంధ్రప్రదేశ్ బాగు పడుతుందనే ఆశ ఇక్కడి ప్రజలలో ఉన్నది... కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలని నెరవేర్చే ముఖ్యమంత్రి కావలెను...

ఈ విధమైన భావాన్ని  ప్రజలలో బలంగా ఉండేట్లుగా చేస్తున్న ఇప్పటి ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలతో...

అలాగే, తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోరేవారుగా ఒక విజ్ఞప్తి... తెలంగాణా[కి]లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరో ఒకరు రాజీనామా చేస్తే మంచిది...లేకపోతే రాజ్యాంగ సంక్షొభం ఏర్పడి అక్కడి పాలన స్థభించే అవకాశం ఉన్నది...చివరగా అసలు విషయం......

ఏ పార్టి వారైనా తన పార్టిని
ఇతర రాష్ట్రాలకి వ్యాపింప చెయ్యాలంటే
తాము ఇప్పటికే ఉంటున్న రాష్ట్రం యొక్క
ప్రయోజనాలని ఫణంగా పెట్టరాదు...
ఈ విషయంలో
ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్న
 కాంగ్రెస్సు-బిజెపి-కమ్యునిస్టు వారిని చూసి,
కొత్తగా జాతీయ పార్టీలుగా అయిన
 తెలుగుదేశం మరియు వైఎస్సార్ పార్టీలు
నేర్చుకోవలసినది చాలా ఉన్నది....
ఉదాహరణకి
కర్ణాటకాలో, ఆంధ్రలో, మహారాష్ట్రాలో
కాంగ్రెస్సు లేక బిజెపి ఉన్నప్పటికీ
వారు తమ "లోకల్ ప్రయోజనాలకే" పోరాడేరే తప్ప
దానికి విరుద్ధంగా ప్రవర్తించ లేదు...
కాబట్టి,
ఈ బుద్ధిని కొత్తగా జాతీయ పార్టీలుగా అయిన 
తెలుగు పార్టీలు తెలుసుకుంటే మంచిది...
అలా కాకుండా, 
"తెలంగాణా పార్టీ వారి బ్లాక్ మెయిల్‌కి"
లొంగితే
ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న వీరు...
ఉన్న జాతీయ హోదా పోగొట్టుకోవటమే కాకుండా...
ప్రాంతీయ పార్టీలుగా కూడా పనికి రాకుండా పోతారు...

జై హింద్ బొమ్మలు గూగుల్...మిక్స్తింగ్ కేఆర్కే రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???@@@@@@@@@@@@

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
27, జూన్ 2014, శుక్రవారం

సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం మరో హైదరాబాదు కాబోతున్నదా...???

గూగుల్ బొమ్మ...

ఇప్పటి పరిణామాలు చూస్తుంటే సీమాంధ్రుల నాయకులు మరో హైదరాబాదుని తయారు చేస్తున్నారనే అనిపిస్తోంది. హైదరాబాదులో అన్ని రకాల ఉద్యోగాలు వచ్చే సంస్థలు పెట్టేసినట్లే... ఇక్కడ కూడా అన్ని రకాల ఉద్యోగాలనీ విశాఖకే తరలించుకుని పోతున్నారు... ఇప్పటికే అనేక వేల ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన ఈ నగరానికి మరో వేల కొద్దీ ఉద్యోగాలు వచ్చే రైల్వే జోను కూడా పోబోతున్నది... దీనికి కారణం లోకల్ రాజకీయాలే అని చెప్ప వచ్చును...

ఈ రైల్వే జోనుని మొదలు విజయవాడకి అనుకూలం అనుకున్నారు... 
అయితే 
విశాఖలో బీజేపీ అభ్యర్ధి ఉండటం వల్లన 
దానిని ఒక పట్టుదలకి తీసుకొని, 
విశాఖకి తరలించటానికి నిర్ణయించుకున్నారు... 
"దీనికి తెలుగు దేశం వారు కూడా 
తలూపేంత బలహీనంగా ఉన్నారు"... 
బలహీనత అని ఎందుకనాలిసి వచ్చిందంటే... 
కేంద్రంలో ఉన్న బిజెపి సహకారం  
ఉన్నది...ఉన్నది అనే వీరి నాయకుడు...
కనీసం విద్యుత్ ఒప్పందాల విషయంలో 
దక్షిణ ప్రాంత గ్రిడ్ అధికారులనే 
ఒప్పించలేని బలహినతలో ఉన్నప్పుడు... 
మరియు 
గెలిచిన ఇద్దరు బిజెపి ఎంపి అభ్యర్ధులనే 
ఒప్పించలేని బలహినతలో ఉన్నప్పుడు....
ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం 
ప్రధాన మంత్రి...తదితరులని ఏమి ఒప్పించగలరు....??? 

విషయంలోనికి వస్తే....ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఈ జోనుని విజయవాడలో పెట్ట వచ్చును... ఎందుకంటే ఈ ఊరు అటు సీమకి ఇటు ఉత్తరాంధ్రకి అందుబాటులో ఉన్నది...  అదీకాక, ఈ ఊరు పెద్దది అయినప్పటికీ  ప్రభుత్వానికి చెందిన ఎవో కొద్ది ఉద్యోగాలు తప్ప వేల కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఏ సంస్థలూ లేవు... కనుక ఈ జోనుని విజయవాడలో పెట్టవచ్చును... లేదా ఇక్కడ రాజధాని వస్తోందని పుకారులున్నాయి కాబట్టి కడపలో పెడితే సీమ వారికి న్యాయం చెసినట్లు అవుతుంది...అక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది...దీనిని  ఇప్పటికే అన్ని విధాల అభివృద్ధి చెందిన ప్రాంతంలో పెట్టటం సమజసం కాదు.  

ఇవే కాదు, ఎక్కువ ఉద్యొగాలు వచ్చే ఏ సంస్థలు అయినా జిల్లాకి ఒకటి పెట్టాలేగానీ, ఇప్పటికే వేల కొద్ది ఉద్యోగాలని పొందిన విశాఖకి ఇలాంటి అవకాశం ఇవ్వటం మరో హైదరాబాదుని తయారు చెయ్యటమే...ఇప్పటికే కడుపు నిండిన బేరంగా ఉన్న విశాఖలాంటి నగరంలో ప్రత్యేకించి ఏమి పెట్టకుండా ఉంటే మంచిది... ఎందుకంటే అది భౌగోళికంగా ఉన్న పరిస్థితిబట్టి ఎవరూ రాజకీయంగా కలిగించుకోకపోయినా కూడా... ఎన్నో సంస్థలు వచ్చే అవకాశం ఉన్నది. 
అందుకని
 "రాజకీయ కెలుకుడుతో" పెట్టే సంస్థలని, 
ప్రభుత్వ ఉద్యోగాలు కోసం యువత
ప్రక్క జిల్లాలకి వెళ్ళే దుస్తితి ఉన్న జిల్లాలలో పెడితే మంచిది. 
ఈ రోజున పరిస్థితులు చూస్తుంటే 
యురప్పులో రెండు దేశాల మధ్యన లేనటువంటి కఠిన మనస్తత్వం 
మనకు రెండు జిల్లాల మధ్యన కనబడుతున్నది. 
దీనిని ప్రత్యక్షంగా తెలంగాణా ఉద్యమంలో చూడనే చూసాము.... 
ఎవరైనా ఒక చోట పుట్టితే అక్కడ ఎన్ని నిమిషాలు...ఎన్ని గంటలు...ఎన్ని రోజులు...ఎన్ని సంవత్సరాలు ఉన్నారనే సంబంధం లేకుండా ఆ దేశపు పౌరసత్వమే వస్తున్నా...."తెలంగాణలో మాత్రం తరతరాలుగా ఉండాలి" అన్న కొత్త విధ్వంసకర చట్టాలు రూపుదాలుస్తున్నాయి...ఈ విషయానికి సీమాంధ్ర జిల్లాలు కూడా ఏమాత్రం తీసిపోవు...

ఈ విధంగా విశాఖలో మరిన్ని అవకాశాలు కల్పించ కూడదు...కారణం... హైదరాబాదుకీ విశాఖకీ ఒక పోలిక ఉండటమే... అదే... ఎదో భయంకరంగా అన్యాయం అయిపోతున్నామనీ, దోపిడీకి గురవుతున్నామనీ సపరేటు ఉద్యమము...తూర్పు ఆంధ్రా[ఉత్తరాంధ్ర]ఉద్యమం ఉండటమే... విచిత్రం ఏమంటే ఎక్కడైతే బాగా అబివృద్ధి చెందిన నగరం ఉన్నదో అక్కడే వేర్పాటు వాదం కూడా పొంచి ఉన్నది...ఇక్కడే కనుక వేల కొద్దీ ఉద్యోగాలు వచ్చే సంస్థలని పెట్టినట్లైతే.... రాష్ట్ర వ్యాప్త యువత విశాఖకి మళ్ళే అవకాశం ఉన్నది... అయితే వీరిని భరించే సహనం కానీ, పెద్ద మనసు కానీ తెలంగాణా వారి లాగానే తూర్పు ప్రజలకి కూడా లేదు...

అదేంటీ
 అక్కడ అనేక మంది ఒరియా వారూ, 
బీహారీలు, ఛత్తీస్ ఘడ్ వారూ, బెంగాలీలూ ఉన్నారు కదా 
అని సందేహం రావచ్చును... 
వారెవ్వరూ బయట వారు కాదు...!!! 
అంతే...!!!
కేవలం ప్రక్క జిల్లాల నుండీ వచ్చే 
సాటి తెలుగు వారే తమకు పోటీ అన్న భావన...
హైదరాబాదులో లాగానే విశాఖలో కూడా ఉన్నది... 
ఇది కానీ... కొంత కాలం తరవాత ముదిరి 
మిగిలిన జిల్లాల వారిని సెటిలర్స్ అని అనటం మొదలెడితే... 
ఈ సారి రాజధాని పోదు కానీ... 
ఎక్కువ ఉద్యోగాలని కలిగిన ప్రాంతం పోయి... 
సీమాంధ్ర యువత మరో సారి నిరాశా నిస్పృహలకి... 
అవమానాలకీ గురి అయ్యే అవకాశం ఉన్నది.  

కాబట్టి, నాయకులు బుద్ధి కలిగి 
జరిగిన "కాలవిధ్యంసం" నుండీ జ్ఞానాన్ని పొంది, 
ఎక్కువ ఉద్యోగాలని ఇచ్చే సంస్థలని జిల్లాకి ఒకటి చొప్పున పెట్టాలి...
అలా కాకుండా...
మరల మరల చేసిన తప్పునే చేస్తూ పోతే 
సీమాంధ్రలో... పంజాబు,కాష్మీరు లాంటి పరిస్తితులు 
ఏరపడతాయో లేదో అన్నదానిలో అనుమానం ఉన్నా...
"ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి 
తప్పకుండా ఇదే ముఖ్యకారణం అవుతుంది"
అని అనేదానిలో
 ఏ మాత్రం సందేహం లేదు.


జై హింద్రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@


@@@@@@@@@@@@2, జూన్ 2014, సోమవారం

బాబుగారూ బేల మాటలేల...ఏవరి ప్రాపకం కోసము...???


రాష్ట్రం విడిపోయిన వేళ...అన్నీ ప్రజా నిష్పత్తిన పంచి...కరెంటుని మాత్రం "వినియోగం ప్రాతిపదికన" పంచారు. దీని మీద మాట్లాడుతూ... "ఈ కొరతని కేంద్ర విద్యుత్ నుండీ తీసుకోవలసి ఉన్నది" అని కాబోయే ముఖ్యమంత్రి బాబుగారు బేల వచనాలు పలికారు....పంచినది ఏమి దేవతలు కారు కదా...జీతం డబ్బులు కోసం పనిచేసే ఉద్యోగులే కదా...మార్చటానికి అవకాశం ఉన్నది కదా...మరెందుకు బేల మాటలు బాబుగారు...ఎవరి ప్రాపకం కోసం...???  

ఇప్పటికి పంచినవి సరి చేసుకోవలసినది పోయి, ఎక్కీడి నుండో ఏదో రాబట్టాలని వ్యవహారం చూస్తుంటే...రాబొయ్యే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌నకు రావాలసినవి రాబట్టటంలో "బాబుగారు మొహమాట పడేట్లుగా" ఉన్నది.  ఈ విషయంలో ఓదార్పు నేత కూడా ఓదార్చటం లేదు.

దీని గురించి ఇదే బ్లాగులో 7 మార్చ్‌న వచ్చిన వ్యాసం
"సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం..."లో  
"తెలంగాణలో ఏక పార్టీ లేక ఏక నాయకత్వ పరిపాలన రాబోతోంది...తెలంగాణాని తెప్పించింది మేమంటే మేము అని ఎంతమంది చంకలు గుద్దుకున్నా... "ఆ క్రెడిట్ కేసీఆర్‌కి తప్ప మిగిలిన ఎవ్వరికీ పోదు"... పైగా తన ప్రాంతం కోసం  తన పార్టీని కాలుష్య సముద్రంలొ కలిపేయకుండానే ఉంచారు...ఇది తెలంగాణాకి ఎంతో మంచిది. ఇక కాంగ్రెస్సుకి... కేసీఆర్ అండలేకపోతేగానీ బ్రతకలేని పరిస్థితిని ఆ పార్టీ వారే కొని తెచ్చుకున్నారు.... ఇకపోతే ఇక్కడ బీజేపీది "దారిని పొయ్యే దానయ్య పరిస్థితే"... ఆస్తుల తగాదా పడుతున్నవారికి, ఓ దారిన పొయ్యే దానయ్య ఎంత సహాయం చేసినా కూడా... ఆ అస్తులలో వాడికి భాగం రాదు కదా...!!! ఇదే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి..."
అని వివరించటం జరిగినది... 
అందులో తెలంగాణాలో ఏక పార్టీ రాబోతోందని...
ఇంకా ఎన్నికల ఫలితాలు రాక ముందే చెప్పటం జరిగింది. 
అందులో 
ఆంద్ర ప్రదేశ్‌నకు రాబొయ్యే కష్టం
"పార్టీల హంగ్" 
ఏర్పడుతుందని వ్రాయటం జరిగింది...
అయితే, 
అది తృటిలో తప్పినా  
"మానసిక హంగ్" 
మాత్రం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ...ఈ మానసిక హంగ్ వలన, అక్కడ తెలంగాణాలో రేపు 2019లో గెలవాలన్న అనవసర ఆశ మూలంగా, ప్రస్తుతానికి తాము అధికారం చేజిక్కించుకున్న రాష్ట్రానికి అన్యాయం చేసే స్థితిలో బాబు ఉన్నారు. ఈ అధికార నేతే కాదు...ప్రతిపక్షపు నేతకి కూడా ఒకటో రెండో సీట్లు తెలంగాణాలో రావటంతో, ఆయన కూడా 60 సీట్లు ఇచ్చిన రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై స్పందించకుండా...కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం అయినారు. ఈ విధంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోతే ఆంధ్ర పాలనకి సంబంధించి ఎలా నష్టం వస్తుందో...అదే జరగబోతోంది...దీనికి కారణం తాము లేని రాష్ట్రంలో అధికారాన్ని పోందాలన్న దురాశే...

విషయంలోనికి వస్తే... 
అవసరాన్ని బట్టి వినియోగం మీద విద్యుత్ పంపిణీ చేసేట్లు అయితే, 
ఉమ్మడి రాష్ట్రం లోటుని కూడా అలాగే పంచాలి కదా.... 
దీని ప్రకారం
తెలంగాణా మిగులు బడ్జెట్...షుమారు రూ.8000/-కోట్లు,
ఆంధ్రా లోటు బడ్జెట్టు.....షుమారు రూ.14000/-కోట్లు
 కలిపేస్తే ఉమ్మడి రాష్ట్రం లోటు బడ్జెట్టు.... రూ.6000/- కోట్లు అవుతుంది...
దీనిని జనభా ప్రాతిపాదికన పంచితే 
తెలంగాణాకి 2500/- కోట్లు లోటు బడ్జెట్టు,
ఆంద్ర ప్రదేశ్‌నకు రూ.3500/-కోట్ల లోటు బడ్జెట్టూ ఉండి 
ఎవరికీ భారం కాకుండా ఉంటుంది....కదా!!!

ఈ విధంగా చెయ్యటానికి వారు పెద్ద మనస్సుతో రాక, 
ఇలా ఆంధ్రాకి సంబంధించిన లోటు బడ్జెట్టుకి 
మాకెం సంబంధం అని తెలంగాణా వారు అంటే కనుక... 
తెలంగాణాకి సంబంధించిన కరెంటు లోటు గురించి 
ఆంధ్రాకెందుకు అనే ప్రశ్న వస్తుంది... 

ఏది లాభమో... అది ఒక ప్రతిపాదికనా...
ఏది నష్టమో... అది మరొక ప్రతిపాదికనా 
పంచుకోవటాన్నే సమన్యాయం అంటారా..
ఈ విధంగా పంపకం అనేది సవ్యంగా జరగకపోతే 
అనేక సమస్యలు వస్తాయ్. 
విడిపోయి అన్నదమ్ముల లాగా ఉందాము అనే వారు... 
రాజధానిని ఇవ్వక, ఆదాయాన్ని పంచక, 
ఉన్న కరెంటు మిగులుని లాగేసుకొని, 
పెద్ద ఎత్తున అప్పుల భారాన్ని వేస్తుంటే... 
సమన్యాయం అనేవారి బుద్ధి ఎక్కడ నడుస్తోంది...
2019 ఎన్నికల ఊహలలోనా....

కాబట్టి, 
ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్‌నకు చెందిన ఇద్దరు నాయకులు 
తమ కలహాలని ప్రక్కన పెట్టి, 
కనీసం 
పంపకాలు న్యాయంగా జరిగే వరకైనా ఇద్దరూ కలసి...
తమకి అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రానికి 
మేలు చేసేట్లుగా ప్రవర్తించాలి... 
సమ న్యాయాన్ని 13 జిల్లాలకీ చేస్తూ...
ఓదార్పుని కలిగిస్తూ ...
ఆంధ్ర ప్రదేశ్‌ పరిపాలనని ఆదర్శంగా చూపిస్తూ
అక్కడ 
2019 ఎన్నికలలో సత్తా చూపించవచ్చును.
అలా కాకుండా...
ఓడిన చెప్పుల పార్టీ నాయకుడిలాగా 
శల్యసారధ్యం[నమ్మిన వారిని తప్పు దారి పట్టించటం]చేస్తూ  
జరుగుతున్న నష్టాన్ని ఉపెక్షించి 
ఎవరికి వారు తమ రాజకీయ స్వలాభాన్నే కనుక చూసుకొని...
జగడాలు ఆడుతూ పోతే...
ఇప్పటి ప్రజలు క్షమించినా...
చరిత్ర క్షమించదు...
ఈ చెడ్డ పేరుని 
ఇప్పటికే నీలం సంజీవ రెడ్డి, ప్రకాశం  పంతులు లాంటివారు 
మొస్తూనే ఉన్నారు...
తమ పదవుల కోసం, 
కొన్ని ప్రాంతాలని ప్రక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన వారు ఒకరైతే...
రాజధానిని పోగొట్టిన వారు మరొకరు.
వారు పొయ్యారు.
కానీ,
వారు కలిగించిన నష్టం 
ఇప్పటికీ
వెంటాడుతోనే ఉన్నది.జై హింద్ 
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

@@@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి గూగులమ్మ-మిక్సిగ్ కేఆర్కే 
@@@@@@@@@@@@@@@@