LOCAL WEATHER

24, ఫిబ్రవరి 2014, సోమవారం

సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టకూడదు...?!?!?

ఇదేమిటీ, రాజధాని ఎక్కడ పెట్టాలీ అని అందరు తలలు బాదుకునే పరిస్థితులు వస్తుంటే "ఎక్కడ పెట్టకూడదు" అని వ్రాయటమేమిటా అనా సందేహం...

రాజధాని ఎక్కడ పెట్టాలి...ఎలా పెట్టాలి...దానికి కావాలిసినవి ఏమిటీ...అని ఇంతకు ముందే ఈ బ్లాగులో  9 ఆగస్టు 2013 న వ్రాయటం జరిగింది....[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] అలా  దీని ప్రకారం పెట్టాలంటే మనవారికి చాలా విశాల హృదయంకావాలి...కానీ, ఇప్పుడు జరుగుతున్నా పరిస్తితులు చూస్తుంటే "సమైక్య ఉద్యమ్మాన్ని నడిపిన రాజకీయ వేత్తలకి" ఇంత కాకపోయినా...కొద్దిగా అయినా విశాలమైన ఆలోచన ఉందా అని అనిపిస్తోంది...

ఆగస్టు 2013 మొదటి వారం తరవాత, ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగినాయి... మద్రాసు విభజన జరిగిన సమయంలో లేని వాళ్లకి..అది ఎలా జరిగింది...అప్పుడు మనవాళ్ళు ఎలా ప్రవర్తించారు...అనే విశేషాలని మనవాళ్ళు ప్రత్యేక్ష ప్రసారం చేసి మరీ చూపించారు...అప్పట్లో టీవీలు..విపరీత మీడియాలు లేకపోవటంతో... జనంలో జరిగిన పోరాటాలే తెలిసినాయి కానీ, తెర వెనుక జరిగిన కుళ్ళు రాజకీయ కంపు తెలియలేదు... కానీ, ఇప్పుడు ఆ కొరత లేదు కదా...అన్నం తిన్న తరవాత మధ్యలో ఎన్ని తిరుగుళ్ళు తిరిగి అది క్రిందకి ఎలా వస్తుందో ప్రత్యేక్షంగా చూపించే [ఇది చూపించ వచ్చు...చూపించకూడదు అనే విచక్షణ లేని] మీడియాలు...  రాజకీయ కుళ్ళు మొత్తం చూపించేసినాయి. అప్పట్లోలాగానే యధావిధిగా సీమాంధ్ర రాజకీయ వేత్తలు మరో మాయ... సమైక్యాంధ్ర పేరుతొ హైదరాబాదు గొడవలో పడి తమకు కొత్తగా రావాలిసిన వాటి మాట అటుంచి...1956కు ముందున్నవి కూడా పోగొట్టుకొని వీరవిజయులై కొత్త హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటులో తమ వంతు కృషి తాము చేశారు....

ఈ కృషిలో ఎక్కువ భాగం పాలు పంచుకున్నది...అంతిమ ముఖ్య మంత్రి గారే..."హైదరాబాదులో తాను తిన్న ఉప్పుకి గౌరవం ఇచ్చారు". అలాగే మరొకరు... మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లుగా....తన ప్రాణాలని హైదరాబాదులో పెట్టి... మా విజయవాడకి ఎందుకు పనికి రాకపోయినా, ఏదో స్వాతంత్ర యోధుడిగా తనకు తానే ముద్ర వేసుకొని...తన నాటకాన్ని తానే పండించి, చివరకు సన్నాసి అయినట్లుగా... మొఖం చాటేశాడు. ఇక ముఖ్యంగా మూడో వారిగా ఉన్న సీమాంధ్ర పంచ కట్టిన పెద్ద మనుషులు... "విభజన పాపం జరిగినప్పుడు అక్కడకి మమ్మల్ని రానియ్యలేదు" అని జనాలకి చెప్పుకోవటానికి, తమ కాపి స్లిప్పుని తామే అందించి... తమకితామే పరిక్ష నుండి డిబారు అయిపోయినట్లుగా నటించారు...ఇలా ఎవరి నాటకం వారు ఆడి జనాలతో ఆడుకున్నారు...


ఇదంతా ఎందుకు అంటే...ఇప్పుడు ఇలా అనవసర గొడవలు జరిగి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిన తరవాత విభజన జరిగేకంటే...మొదటి ప్రకటన జూలై 31 వచ్చినప్పుడే...సరైన పద్ధతిలో చేసినట్లయితే బాగుండేది కదా...ఇలా పనికి మాలిన నాటకాలు ఎవరి కోసం... పోనీ, ఇన్ని నాటకాల తరవాత అయినా సీమాంధ్రకి, న్యాయం మాట అటుంచి, కనీసం 1956కి ముందు రూపం వచ్చిందా అంటే అదీ రాలేదు. ఈ సారి విభజనలో భద్రాచలంతో పాటు కొన్ని ఊళ్ళని ఊడగోట్టించుకొన్నారు...ఈ విషయాన్ని ఇదే బ్లాగులో ఇంతకు ముందే 9 ఆగస్టు 2013 న హెచ్చరించటం జరిగింది...[లింకు నొక్కండి:ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???] ఇందులోని విషయం:                                      

"ఇది ఆంధ్రా వారికి అడిగే సమయం. కావాలిసింది కఠినంగా అడిగి, వత్తిడి చేసి తీసుకోవలిసిన టైమిదే...ఒకప్పుడు ఆంద్రా ఏర్పడేప్పుడు... మదరాసు మాయలో పడి, ఆంధ్రాలో కలవవలసిన చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుండీ జిల్లాల వరకు, ప్రక్క రాష్ట్రాల వారికి  నీళ్ళొదులుకున్నారు.... ఇప్పుడు కూడా హైదరాబాదు మాయలో పడి... రాష్ట్రానికి చెందిన అనేక ఊళ్ళ దగ్గర నుండీ, నీరు, వనరుల పంపిణీ ...ముఖ్యమైన ఆదాయ-వ్యయ లెక్కల్ని విస్మరిస్తున్నారు.  ఏది జరిగినా విభజన సమయలోనే జరగాలి... ఆతరవాత ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే...ఈ సంగతి గుర్తెరిగి బుద్ధి కలిగి ఉంటే మంచిది. ."

మామూలుగా ఉన్న మనలాంటి వారికే తెలుస్తుంటే....రాజకీయాల్లో పండిపోయి ఉన్న ఈ పనికి మాలినవారికి తెలియదా...??? నిన్నో మొన్నో కొందరు సీమాంధ్ర రాజకీయ  పెద్దలు "సమైక్య ఆంద్ర మాయలో పడి, రావాలిసినవి సరిగా అడగలేకపోయ్యామని" వాపోయ్యారు ట...ఇప్పుడు ఏమి ఏడిస్తే ఏం లాభం...!

ఈ ఏడుపుల వెనుక రకరకాలైన బెయిళ్ళూ...విడుదల బేరసారాలు కూడా బాగానే జరిగినాయి...ఒకరు ఆంధ్రాలో విడుదల అయితే, మరొకరు చిన్నమ్మగారి శిష్యుడు కన్నడంలో విడుదల అయినారు... అయితే, ఇప్పటి రాజకీయ నాయకులు కూడా 1953/56లలో రాజకీయనాయకుల కన్నా కొత్తగా ద్రోహం చేసిందేమీలేదనుకోండి...అప్పుడు ముఖ్యమంత్రి పదవికోసం ఒక పేద్ద నాయకుడు...బళ్ళారి, రాయచూరు జిల్లాలని వదిలివేస్తే, ఇప్పుడు తాము చేసిన తప్పిదనాలనుండీ బయటపడటానికి రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టారు.                                 
సరే, అసలు విషయానికి వస్తే...ఇంత జరిగినా ఇప్పటికైనా వీరికి బుద్ధి వచ్చిందా అంటే... రాలేదనే అనిపిస్తోంది... ఇది "రాజధాని మా ప్రాంతంలోనే పెట్టాలి అని మన లోకల్ సమైక్య రాజకీయ నాయకులు డిమాండులు చూస్తే తెలుస్తుంది... ఎక్కడ పెట్ట కూడదు అని అనుకుంటామో, అక్కడే పెట్టాలని వీరు... "ఊరు భక్తిని" చూపిస్తున్నారు... ఇన్నాళ్ళు సమైక్యాధ్రకి ఉద్యమం చేసిన వీరి విశాల హృదయం విశాల రాష్ట్రం నుండి...తమ ప్రాంతం...అక్కడి నుండి తమ జిల్లా...అక్కడి నుండి తమ ఊరు దాకా ఎందుకనో కుంచించుకొని పోయింది... కాబట్టి, ఇప్పటికైనా  సమైక్యాంద్ర స్పూర్తిని కలిగి...ఎక్కడ పెడితే రాష్ట్రం మొత్తానికి, మరియూ పెట్టిన చోట లాభం ఉంటుందో అక్కడ పెడితే బాగుంటుంది. ఇక వీరు సూచిస్తున్న ప్రాంతాలలో ఎందుకు పెట్టకూడదో చూద్దాం...

1] విశాఖపట్టణం...ఇక్కడ పెట్టాలని ఆటే గొడవల్లో పాల్గొనని అక్కడి ఓ పెద్ద మనిషి రాజకీయ వేత్త అంటాడు...అక్కడ పెట్టటానికి అన్ని వసతులు ఉన్నాయట....  "మీ ప్రాంతాన్ని రాజధాని పేరుతొ అభివృద్ధి పరచుకొండిరా" అని వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం అంటుంటే... అంత డబ్బు మాకు అవసరం లేదు అని...ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని కట్టమని అడగటంలో ఆయనగారి రాజకీయ అనుభవేమిటో మనకి అర్ధంకాదు...ఒక ప్రాంతీయ దురభిమానం తప్ప. మరొక విషయం ఏమిటంటే...ఈ విశాఖ పట్టణం మిగిలిన తెలుగు వారికి దూరం, ఒరియా వారికి దగ్గర. ఇక్కడగాని రాజధాని పేరుతొ వందల కిలోమీటర్లు అభివృద్ధి చెందితే...అందులో తెలుగువారికన్నా ఒరియా/హిందీ వారికే లాభం ఎక్కువగా ఉంటుంది....మూడవది ముఖ్యమైనది ఏమంటే..."ఇక్కడి ప్రజలకి కూడా హైదరాబాదు జనం లాగే బయట ప్రజలని భరించే శక్తి తక్కువ...కొన్నాళ్ళకి పొమ్మన్నా పొమ్మంటారు"....

2] కర్నూలు...ఇక్కడ అంతకు ముందే వుండేది అనీ, అందుకని అక్కడే పెట్టాలి అనీ... కొందరు సీమా రాజకీయాలలో పండిపోయ్యామని అనుకున్నవారు అంటున్నారు... అసలు ముందర అక్కడ పెట్టటమే తప్పు...మరల ఆ తప్పుని చెయ్యాలా...??? అక్కడ పెట్టటం వల్లనే హైదరాబాదు కలసిన తరవాత, రాజధాని అక్కడికి తరలిపోయింది. అదీకాక, నది దాటితే వేరొక రాష్ట్రం...అక్కడ పరిస్తితులు కూడా బాగున్నవి కావు...దాంతో అక్కడి ప్రజలు వెల్లువలా ఈ రాజధాని మీదకి దండెత్తే అవకాశం ఉన్నది. ఊరు పెరిగితే...పెరగటానికి వీలు లేకుండా నది ప్రక్కనే వేరొక రాష్ట్రం... దీనివల్లన నదికి అవతల ప్రక్కన పెరిగినా...ఆ ప్రాంతంల్లో సీమాంధ్రుల ప్రయోజనాలు ఏమీ ఉండవు...ఇలా మరొకసారి సీమాంధ్రుల కష్టం నదిలో కలిసిపోతుంది...       

3] విజయవాడ...[ఏలూరు నుండి గుంటూరు దాకా]"ఈ ఊరు అన్నిటికి చాలా బాగుంటుంది కదా" అని అనుకుంటున్నారా....ఇక్కడ ఉన్నంత కుళ్ళు కుల రాజకీయాలు మరెక్కడా ఉండవు... చివరికి విజయవాడకి లాభం చేకూర్చే విషయాలలో కూడా వీరు కొట్టుకుని, అది వేరొకరికి పోయ్యేట్లుగా చేస్తారుగానీ, ఆ పనిని మడుకు సక్రమంగా జరగనియ్యారు... ఇక్కడి రాజకీయ నాయకులే సరైన వారైనట్లయితే...మద్రాసు నుండి విడిపోయినప్పుడే ఇక్కడ రాజధాని ఏర్పాటులో కృషి చేసి ఉండాలిసింది... కానీ, అలా జరగలేదు. వీరికి పదవులిచ్చి, వాటితో పాటు ఇక్కడకి వచ్చే ప్రాజెక్టుల కాంట్రాక్టులు వీరికే కనుక ఇస్తే... తమ లాభం కోసం ఆ ప్రాజెక్ట్లులని మరో రాష్ట్రంలో కట్టటానికైనా వెనుదియ్యారు...ఇది ఇక్కడి రాజకీయ నాయకుల "విశాల హృదయం".    రేపు ఇక్కడ రాజధాని పెడితే, ఇక్కడికి వచ్చే ప్రాజెక్టులని పరాయి రాష్ట్రాలకి తాకేట్టేసెంత గొప్ప రాజకీయ వేత్తలున్నారు... మరొకటి, సీమాంధ్ర రాజధానిని ఇక్కడ పెట్టకుండా ఎక్కడ పెట్టినా కూడా తనంత తాను బాగుపడటానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఉన్నది... కాబట్టి, ఇక్కడ రాజధాని పెట్టి మరీ తొయ్యవలసిన పనిలేదు...రాజధానిగా లేకపోతేనే రాజకీయాలకి దూరంగా ఉండటం వలన తొందరగా మరింత అభివృద్ధి చెందుతుంది....                               

ఇప్పుడు చర్చలో ఉన్న ఈ మూడు నగరాల పరిస్థితి ఇలా ఉన్నది... కాబట్టి, నిజాయతీగా, కేంద్రం కనుక వేలకోట్లు మన కొత్త రాజధాని  కోసం ఇస్తే...వాటిని పూర్తిగా ఖర్చుపెట్టటానికి వీలున్న ప్రదేశంలోనే రాజధానిని పెట్టాలే కానీ, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలలో పెట్టి...ఆ ఊళ్ళని డిస్ట్రబ్  చెయ్యటం మంచిది కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో మన రాజధానిని ప్రక్క రాష్ట్రం వారికి ఉపయోగ పడేంత దగ్గర ఉంచటం కూడా సరైన పద్దతి కాదు...                     

అందువల్ల...సీమాంధ్రలోని ఆంధ్రలో  రాజధాని పెట్టాలంటే ప్రకాశం జిల్లాలోనూ, సీమలో పెట్టాలంటే కడప జిల్లాలో పెట్టినట్లయితే, కేంద్ర నిధులు అన్నీ ఉపయోగించే వీలు ఉన్నది... ఇతర రాష్ట్రాల దాడి ఉండదు...ఇక్కడ కొద్దిగా లోకల్ రాజకీయాలు ఉన్నప్పటికీ...బయట నుండి వచ్చి పడే వారిని నిర్దేశించే శక్తి లేనివే కాబట్టి ప్రమాదం లేదు...


సీమాంధ్ర దేశం  ....కర్టేసి ఫేస్ బుక్  

రాజకీయ పెద్దలారా ప్రజలు 
మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇప్పటికే నాశనం చేసేశారు...
ఇల్లు తగలడుతుంటే...
మీరు అంటించారు అంటే... మీరు అంటించారు అని గొడవలు పడి...
ఇల్లు తగలడే వరకు కొట్టుకున్నారు...
మీ పరస్పర ఆరోపణలని చూస్తుంటే 
జనాలకి అసహ్యం పుడుతోంది...

సీమాంద్ర జెండా ట... కర్టేసి ఫేస్ బుక్ 

ఇప్పుడున్న వాతావరణంలో... మరోసారి రాయల సీమ, ఆంధ్రలోని ఏ ప్రాంతం వారికైనా  పెట్టె బేడా సర్దుకోనే పరిస్థితి వస్తే 
అది ఉగ్రవాదానికి తెరతియ్యవచ్చును...
ఇప్పటికే పార్లమెంటులో వివక్షతకి గురైయ్యాము అన్న బాధతో 
 ఫేస్ బుక్ లో  
సీమాంధ్ర దేశం, దానికి జెండాని కూడా తయారు చేసేశారు 
మన యువత...
"ఇది ఇప్పటికి జోక్ గా తేలిగ్గా తీసిపారేసినా, 
తరవాత కాలంలో పశ్చాత్తాప పడవలసి ఉంటుంది"... 
రాజకీయ నాయకులారా కనీసం....ఇప్పటికైనా మీ రాజకీయాల గురించి కాకుండా, 
మిగిలిన రాష్ట్రం మరియు ప్రజల యొక్క అబివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, కలిసికట్టుగా పనిచేసి... 
తిరిగి ప్రజలలో నమ్మకాన్ని పెంచుకుంటే మంచిది..., 
లేకపోతే "మీ వంశపారంపర ఉద్యోగాలు అంతరించి పోతాయి"....!!! జైహింద్

రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???

17, ఫిబ్రవరి 2014, సోమవారం

ఉత్తరాది వాళ్ళా మనకు బుద్దులు చెప్పేది.?? చివరికి బిహారీ వాళ్ళు కూడానా ...

పై వార్త కర్టేసి ఈనాడు...


మొన్న జరిగిన పార్లమెంటు గొడవలో మన దేశ పార్లమెంటు పరువు పోయిందని... పాపం ఒక బిహారీ గారు, బిహారులోనే కోర్టుకెళ్ళాడుట... ఆయనేదో ఒక సోషల్ వర్కరో లేక ఒక చిరుద్యోగో అయ్యుంటే, పాపం ఏదో లోక జ్ఞానం లేక కేసు పెట్టాడని అనుకోవచ్చును. కానీ, ఆయన సాక్షాత్తూ ఒక న్యాయవాది[లాయరు]. బీహారు గొడవలు గురించి బాగా తెలియటానికి వీలున్న వృత్తి.... అయినా ఆయన గారికి, బిహారీల కన్నా కూడా మన తెలుగు వారి గొడవే ఎక్కువగా కనపడిందిట....కనీసం పేసెంజరు రైల్లొ  కూడా రెండు రూపాయల టిక్కెట్లు కొనని వాళ్ళకి, ఆంధ్రా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైనట్లు కనపడింది... అసలు బిహారులో ప్రభుత్వము, చట్టము లాంటివి ఉంటాయా... అని దేశ వాసులే ఆశ్చర్యపొయ్యెట్లుగా ఉండే బీహారులోని ఒక బిహారీ గారికి... మన పార్లమెంటు ఎంపీల భాగోతం దౌర్జన్యంగా కనపడింది...!!! బహుశా వాళ్ళలాగా గొడ్డళ్ళు, కత్తులూ, తుపాకులూ వాడలేదని, అందుకనే "దౌర్జన్యం యొక్క పరువు పోయిందని" ఆయనగారి ఉద్దేశ్యం అయ్యుంటుంది...!!! 

చట్టాలని చేసేదే మేము, మాకు ఏ చట్టం వర్తించదు... అన్నట్లు ప్రవర్తిస్తారు ఉత్తరదేశీయులు. వీరు వచ్చి మనవారికి నీతులు చెప్పే అర్హత ఉన్నదా...? అందులోనూ బీహారీలు అంటేనే చట్టాన్ని ఎంత బాగా గౌరవిస్తారో భారతీయులందరికీ తెలిసిందే... ఒకప్పుడు, బీహారులో ఒక ప్రకృతి విలయం సంభవిస్తే, మన కేంద్రం స్పందించే లోపలే, అక్కడి కాంగ్రెస్సు ముఖ్యమంత్రి చైనా వారి సహాయం కోరాడు... ఇదీ బీహారీయుల దేశ భక్తి...చివరికి వీళ్ళా మన దక్షిణ దేశం వారికి నీతులు చెప్పేది...!!!

అందుకనే అనిపిస్తుంది, ఇదంతా హిందీ మరియూ ఉత్తర దేశం వారి కుట్ర అని. ఎందుకంటే; జగన్, గాలి జనార్ధన్ రెడ్డీ, రాజా, కనిమోళీ లాంటి వారి ఆర్ధిక నేరాలని... ఉత్తర దేశ నాయకులు/ప్రజల అవినీతితో పోలిస్తే...వారి ముందు మన వారు చిన్న పిల్లలు లాంటి వారుగా కనపడతారు. శాంతి భద్రతల విషయంలోనూ మనకంటే వెయ్యాకులు ఎక్కువ చదివిన వారే... ఉత్తర దేశంతో పోలిస్తే, దక్షిణ దేశం దేవలోకం లాంటిదే... అయినప్పటికీ, దక్షిణ దేశం వారిని వేలెత్తి చూపించి....తామెంతో మహా పతివ్రతలైనట్లు మహ ఫోజు కొడతారు ఈ హిందీ బానిసలు. ఎన్నో వేల కోట్లు అడ్డగోలుగా సంపాయించుకుంటున్న ఉత్తరాదివారు...తమలాంటి పనే దక్షిణాది నుండి ఎవరైనా చేస్తే మాత్రం వారికి చట్టం, రాజ్యాంగం రుచి చూపిస్తారు. తమదాకా వస్తే...సాధ్యమైనంతవరకు చట్టాన్ని పట్టించుకోరు... కుదరకపోతే, చట్టాన్నే మార్చివేస్తారు... ఇక దక్షిణ దేశం నుండీ ఎవరైనా ఎదిగితే వీరికి పడదు. వారిని ఎదో విధంగా పడదొయ్యాలనే చూస్తారు.  

దక్షిణాది వారిని పడదోసి వారు పైకి రావాలనే ఉద్దేశ్యం, ఉత్తరాది వారి ప్రతీ కదలికలోను కనపడుతుంది. ముఖ్యమైన పరిశ్రమలన్నీ వారివైపే పెట్టుకున్నారు. అలాంటి పరిశ్రమలు మనకి రాకుండా మన వారి చేతే నాటకాలు ఆడిస్తారు. అలా వారికి మడుగులు ఒత్తుతూ ఉన్న దక్షినాదివారినే వారు రాజకీయాలలో పైకి రానిస్తారు. ఈ విషయంలో... దక్షిణాదిలో మిగిలిన వారి కన్నా తమిళులు తెలివైన వారు. వీరు కూడా హిందీ వారి ఆధిపత్యాన్ని ముందరగా ఎదిరించినా, అది కుదరదని గ్రహించి... లౌక్యంగా లొంగి నట్లుగా కనపడి...వారి పనులు వారు చేసుకుని, మిగిలిన వారికన్నా పైకి వచ్చారు... అలా దేశానికి పనికొచ్చే వస్తువుల పరిశ్రమలని సాధించుకున్నారు. అయితే, వీరికి కూడా హిందీవారి  ఆధిపత్య  జాడ్యం లాంటిది ఉండటం వల్లనే వీరు హిందీ వారితో స్నేహం చెయ్యగలిగారు.

అలా  చెన్నయి, బెంగళూరు, కొచ్చిన్ అభివృద్ధి పధంలోనికి నడుస్తుంటే...అవి ఎలాగు బాగుపడుతున్నాయి... కానీ, దానిలో భాగాసామ్యం అక్కడి వారి కన్నా బయట నుండి వచ్చిన రాజస్తాన్, బిహార్, యు.పీ., గుజరాత్ వారికి పనికొచ్చేట్లుగా తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు మన ఉత్తరాది వారు. దీనికి చిన్న ఉదాహరణ....మనం ఎన్ని నాళ్ళుగా మొత్తుకున్నా మనకు వెయ్యని రైళ్ళను.... వారి ప్రాంతం యువతకి పనికొచ్చేట్లుగా రైళ్ళని వేసి, ఆక్కడి వారు తేలిగ్గా దక్షిణాదిన అభివృద్ధి చెందిన ప్రాంతానికి చేరుకునేట్లుగా తెలివిగా రైళ్ళని వేస్తారు....వేస్తున్నారు... ఎక్కువ భాగం రైళ్ళు, ఉత్తరాది వెనుకబడిన ప్రాంతాల నుండి చెన్నయికి, బెంగళూరుకి, ఎర్నాకుళానికి[కొచ్చిన్] మరియు యశ్వంత్‌పూర్ [బెంగళూరు]కి ఉంటాయి. అదే, మన వెనుకబడిన ప్రాంతాల నుండి ముంబాయి నుండి కాన్పూర్ వరకు ఉన్న అభివృద్ధి చెందిన కారిడార్లకి రైళ్ళు వేస్తారా...?? వెయ్యమని అడిగినా కూడా వెయ్యరు. ఎందుకంటే, వారి యువతకి దక్షిణాది యువత కాంపిటిషన్ వస్తుంది కదా.... ఇలా ఉంటాయి ఉత్తరాది కుళ్ళు రాజకీయాలు.

ఈ విషయంలో రాజకీయ పార్టీలలో అది కాంగ్రేసు అయినా మరే ఉత్తరాది పార్టీలు అయినా ఒకటే... చివరికి బిజెపి అయినా... వీరందరికీ కావాలిసింది హిందీ'స్తానే కానీ, హిందూస్తాన్ కాదు..... అందుకని, మన ప్రాంతపు రాజకీయ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన ప్రాంతాలకి జరుగుతున్నా అన్యాయాన్ని, వివక్షతని గమనించి మెలగాలి. మనమంటే లెక్కలేని ఆ ఉత్తరాది వారిని న్యాయం అడిగితే... వారేమి చెపుతారు... వారికేది లాభమో అదే చెపుతారు. ఇక దక్షిణాన్నే ఉన్న ఆషాడ భూతులైన కొందరు ఇతర భాషల వారికి కావాలిసింది కూడా మనం నాశనం అవటమే...కారణం...హైదరాబాదు నగరం కూడా మిగిలిన నగరాలలాగానే అబివృద్ధి వెలుగులనివ్వటమే... అందుకనే, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని వ్యంగంగానే అందరు చూస్తున్నారే కానీ, అందులో నిజాయతీ లేదు. మన దిక్కుమాలిన నాయకులకేమో కాళ్ళు పట్టుకుని పదవి సంపాయించటం...కాంట్రాక్టులు సంపాయించటం తప్ప, ఉత్తరాది వారి వెకిలి నవ్వుల, దక్షిణాది ఆషాడభూతుల  కుళ్ళు రాజకీయం తెలియని మూర్ఖులు.  వీరికల్లా ఉన్నది విపరీత స్వార్ధం అంతే....దీనికి వీరు... రాష్ట్ర ప్రజలనే తాకట్టు పెట్టేస్తారు....

ఇక్కడ మన నాయకులనో లేక అవినీతి పరులనో సపోర్టు చేస్తున్నామని కాదు. ఒకే నేరానికి ఉత్తరాది వారికో న్యాయం, దక్షినాది వారికో న్యాయం కనపడుతుంది. దీనికి ఉదాహరణగా రాజానో, లేక గాలినో ఉదాహరణ తీసుకోవలసిన పనిలేదు.... చిన్న రైలు సంఘటనని తీసుకుంటే చాలు... టిక్కెట్టు లేకుండా వందల కొద్ది బీహారీలు రిజర్వేషన్ బోగిలలోనికి ఎక్కితే... గోడవై తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో  వారిని అదుపులోనికి తీసుకున్నారు... వారిలో కొందరు ఫోన్ ద్వారా "పై వారిని" సంప్రదించారు... అంతే...వారిని తక్షణం విడిచి పెట్టమని సాక్షాత్తు రైల్వే మంత్రి ఫోన్ చేసి మరి విడిపించే ఏర్పాటు చేసేశాడు. ఇలా మన వారికి ఉత్తరాదిన న్యాయం  జరిగే అవకాశం ఉన్నదా....???

"లేదు" అని దేశం అంతా వినిపించెట్లుగా అరచి చెప్పే సంఘటన మొన్నీ మధ్యన జరిగింది..... అదే ఉత్తరాఖండ్ వరదలు.... వాటిలో చిక్కుకుని మనవారు ఎన్నో వేలమంది ఉంటే...  మన వారిని పట్టుకుని బాధలో ఉన్నారని కూడా చూడకుండా, బూతులు తిడుతూ... "మీరు మా ప్రాంతానికి ఎందుకొచ్చారు...?? మీ ఖర్మ, మీ చావులు మీరు చావండి" అని ఎన్నో వేలమంది సాక్ష్యంగా నిర్భయంగా నిర్లక్ష్యంగా వారు  అనటం చూస్తే.... మనం అంటే ఉత్తరాది వారికి ఎంత గౌరవమో తెలుస్తుంది....ఇక అక్కడి ప్రజలు ఎన్నివిధాల మన వారిని దోచారో ఆ దేవుడికే తెలియాలి....అక్కడివారే కాకుండా సైన్యానికి చెందిన కొందరు వారు కూడా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మన వారు చెపుతుంటే...."అసలు మనని ఈ దేశం వారిగా చూస్తున్నారా ఈ ఉత్తరాది మూఢులు...?" అని అనుమానం రాక తప్పదు...

ఉత్తరాది వారు రాజకీయంగా అలా ఉంటే ...ఇక అక్కడి పారిశ్రామిక వేత్తలకి కూడా మనమంటే లోకువే... వారికి కావాలిసింది దక్షిణాది నుండి వినియోగదారులే కానీ, ఉద్యోగులు కాదు. ఒక వేళ ఉద్యోగాలు ఇచ్చినా... అవి షాప్ కీపింగ్ పనులే... రిలయన్సు అంబానిలకి కావాలిసింది మన గేస్ మాత్రమే, వారు స్థాపించే పరిశ్రమ ఎదో... ఇక్కడే గేస్ దొరికే చోటే పెట్టచ్చు కదా... పెట్టారు... ఎందుకంటే, అందులో ఉత్తరాది వారికి ఎక్కువ ఉద్యోగాలు రావు కదా... ఈ విషయంలో టాటా వారి మనస్సు కూడా కఠినమే...టాటా నానోని బెంగాలు వారు పొమ్మన్నా కూడా వారి మీద కొద్దిగా కూడా కోపం రాలేదు...ఆ ప్రాజెక్టు మా రాష్ట్రంలో పెట్టండి మహాప్రభో అని మన రాష్ట్రం ముఖ్యమంత్రి ఎంత మొత్తుకున్నా వినకుండా తీసుకెళ్ళి గుజరాత్ లో పెట్టారు... ఎంతైనా వారు వారు భాయి భాయి కదా... వీరే కాదు బజాజ్, జిందాల్ లాంటి మొదలైన వారికి... మన వనరులు మాత్రమే కావాలి కానీ, మన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మాత్రం మనసొప్పదు.. వీరు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించబడే పెద్ద  పరిశ్రమలని మన ప్రాంతంలో నెలకొల్పరు...ఒక వేళా ఏదైనా చిన్నా చితకా పరిశ్రమలు వారు స్థాపిస్తే, వారి రాష్ట్రం వారిని తెప్పించుకుని మరీ పెడతారు. ఇంతెందుకు, మన రాష్ట్రంలో తిండి తప్పితే, మిగిలిన వస్తువులు 90 శాతం దాకా బయటి రాష్ట్రాల నుండి వస్తున్నాయి అంటే... ఇంకా చెప్పేదేమున్నది. చివరికి హోళీకి వాడే రంగులు, రాకిలు, దీపావళి టపాసులు, చిన్న పిల్లలు ఆడుకునే రంగు కాయితాలు కూడా బయట రాష్ట్రం నుండి వస్తుంటే...మనం దేనిలో అభివృద్ధి చెందినట్లు...?? 

ఇకపోతే, ఉత్తరాది ప్రజల గురించి చెప్పాలిసిన పనిలేదు... వారిలో వారు ఎంత స్నేహంగా ఉంటారు. అయితే దక్షినాది వారంటే మాత్రం చులకనే.... వీరికి మనవారంటే ఎంత చులకనంటే... ఒకసారి విజయనగరం బస్‌స్టేండులో ఒక హిందీ వాడు గొణుక్కుంటున్నాదు... "క్యా లోగ్ హై, ఇస్ లోగ్ కో హిందీ భి నహి జాంతా హై"....కేసే దేశ్ వాసీ హై.... అని. ఇంతకీ వాడి గోలేమిటంటే... మన బస్సుల మీద అంతా తెలుగులోనే ఉన్నది. వాడు అడగబోతే... సామాన్యులకి హిందీ రాదు. వాడి అవసరం కోసం మన వూరు వచ్చి... మన వాళ్ళు వాడి భాషలో మాట్లాడటం లేదు అనే అహంకారాన్ని చూపించాడు. అంటే, దిక్కుమాలిన హిందీ రాకపోతే భారతీయులు కానట్లనా...??? ఆ హిందీ అహంకారికి సమాధానంగా ఒక ప్రయాణీకుడు అన్నాడు..."టెర్రరిస్టులు అందరు హిందీలోనే మాట్లాడతారు కానీ, తెలుగులోనూ, కన్నడంలోనూ మాట్లాడరుగా"  అని.

ఇక పార్లమెంటు గోడవ దగ్గరికొస్తే...నిజంగా చిత్త శుద్ధి వుంటే తెలంగాణా పార్టీల వారు, సీమాంధ్ర పార్టీల వారు, కొందరు ప్రాంతీయంగా అనుభవం ఉన్నవారు[మేథావులు కాదు] ఒక చోట కూర్చుని, ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలో చక్కటి నిర్ణయం చేసుకొంటే బాగుంటుంది కానీ....ఎవరు కొట్టుకొని క్రిదపడితే మింగుదామా అనే అడవి నక్కలులాగా ఉన్న వారి దగ్గరికా... మనలో మనం కొట్టుకొని న్యాయానికి వెళ్ళేది...???

కాబట్టి, అలాంటి చోట మన తెలుగు నాయకులు వీధిన  పడి గొడవ చెయ్యకుండా,  మన సమస్యని పద్దతిగా పరిష్కరించుకున్నట్లయితే, పాకిస్తాన్ వారి నుండి యుద్ద  నీతులు, చైనా వారి నుండి ప్రజాసామ్యం, అమెరికా వారి నుండి స్వేచ్చ, యురప్పు వారి నుండి చట్టాల గురించి, చివరికి... దేశానికే అపకీర్తి కిరీట ధారులైన బిహారీల నుండి కీర్తి, పరువు మర్యాదల గురించి చెప్పించుకోవలసిన ఖర్మ పట్టదు కదా...!!!  
జై హింద్ రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???

5, ఫిబ్రవరి 2014, బుధవారం

చమ్మకాయ కూర

ఇవే "చమ్మకాయలు"... మా చిన్నప్పుడు మాయింట్లోనే వీటి పాదు ఉండేది...
వీటికి మరో ప్రాంతంలో ఏమైనా పేరుందేమో తెలియదు...

ఇవి మామూలు చిక్కుడుకాయలకన్నా చాలా పెద్దవిగా ఉంటాయి

చమ్మకాయలు అని ఇదివరలో బాగా వచ్చేవి... 
మాయింట్లో కూడా దీని తాలూకు పాదు ఉన్నట్లు జ్ఞాపకం. 
ఇవి చూడటానికి గోరు చిక్కుడులాగా ఉంటాయి. 
అయితే ఇవి గోరు చిక్కుడు...మామూలు చిక్కుడు కాయలకన్నా చాలా పెద్దవి... 
ఈ మ్మకాయలు దరిదాపుల కనుమరుగు అయిపోయినట్లే కనపడినా.... 
అప్పుడప్పుడు రైతు బజారులో దర్శనం ఇస్తున్నాయి. 
అయితే, 
చాలా మందికి వీటి పేరు కూడా తెలియకపోవటం వలన విచిత్రంగా చూస్తున్నారే కానీ..
కొనే ధైర్యం చెయ్యటంలేదు. 
అమ్మే వాళ్ళు కూడా ఇదోరకం పేద్ద చిక్కుళ్ళని చెపుతున్నారు.  
ఇలా ఎన్ని రకాలైన కూరగాయలు కాలగర్భంలో కలిసిపోతున్నాయో కదా...!!!

ఈ మధ్యన కూరగాయలు కొనటానికి వెళితే, మ్మకాయలు కనపడినాయి....
ఇవి కనపడటమే అరుదు...
కనపడిన తరవాత కూడా కొనకపోతే ఇంకా ఏమున్నది....
కొన్నాం సరే....
కూర వండుకొనే తినాలి కదా....


"చమ్మకాయ కూర" చేసే విధానం...

కావలిసినవి:

1] పావు కేజీ మ్మకాయలు[లకి]
2] పెసరపప్పు లేక కందిపప్పు చారెడు... 2 లేక 3 చెంచాలు
3] ఎండుమెరపకాయలు 4 
4] ఉప్పు తగినంత[చేత్తో వేస్తె మంచిది]
5]తిరగమోతకి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, నూనె.... 
6] కర్వేపాకు  

ముందరగా... తెచ్చుకొన్న మ్మకాయాలని బాగా కడిగిన తరవాత... చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి... ముక్కలుగా చేసే ముందర, కాయలకి ప్రక్కన ఉన్న భాగాన్ని...చిక్కుడుకాయలకి తీసినట్లే తియ్యాలి...ఎందుకంటే అక్కడ గట్టిపడ్డ పీచు ఉండి ఉండకదు. అందుకని దానిని తొలగించాలి. అయితే, చిక్కుడుకాయ చిన్నది కాబట్టి చేత్తోనే తీసేస్తాం... కానీ, మ్మకాయ పెద్దగా ఉండటం వలన కత్తిని వాడి తీస్తే గట్టి భాగం వస్తుంది. ఆలా తీసేసిన తరవాత, చిన్న చిన్న ముక్కల క్రింద తరగాలి... అప్పుడు బాగా ఉడుకుతుంది...

ఇదిగో ఇలాగ....ముక్కలు చెయ్యాలి

ఇప్పుడు ఇలా తరిగిన చమ్మకాయ ముక్కలని బూర్లెమూకుడులో వేసి దాని మీద పెసరపప్పు రెండు మూడు చెంచాలు వెయ్యాలి...అప్పుడు తగినంత ఉప్పు వేసి...అవి కొద్దిగా మునిగే వరకు నీళ్ళు పొయ్యాలి...

చమ్మకాయలు..పెసర పప్పు,ఉప్పు...క్రింద నీళ్ళతో...

అప్పుడు వాటీని ఉడికించాలి...బాగా ఉడికిన తరవాత, ఆ ముక్కలని ఒక చిల్లులు పళ్ళెంలో వెయ్యాలి... దీని వలన అందులో ఉన్న నీరు ఏమైనా ఉంటే పోతుంది.

పప్పు ఉప్పుతో కలిపి ఉడికిన చమ్మకాయ ముక్కలు

ఇప్పుడు బూర్లెమూకుడులో కొద్దిగా నునె వేసి, వేడెక్కిన తరవాత, అందులో ముందరగా ఎండుమెరపకాయల ముక్కలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయ్యాలి...ఇవి వేగిన తరవాత, స్టవ్వు మంటని బాగా తగ్గించి[సింలో]పెట్టి... కర్వేపాకును వెయ్యాలి...అప్పుడు ఇందులో ఉడకపెట్టిన మ్మకాయ ముక్కలని వేసి గరిటతో కలిపిదాని మీద మూతని మూడు నాలుగు నిమిషాలు పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టటం వల్ల పోపుకు సంబంధించిన సువాసన కూరకి పడుతుంది. ఆ తరవాత, మూతని తీసేసి గరిటతో అటు ఇటు వేయించాలి. అలా ముక్కలలోని నీరు కొంత తగ్గే వరకు వేయించాలి. అంతే మ్మకాయకూర అయిపోయినట్లే...ఇక తినటమే తరువాయి... దీని రుచి మిగిలిన ఏ కూరలకీ తీసిపోదు...!!!

చమ్మకాయ కూర
ఇందులో ఇంతకు ముందు వచ్చినవి 
క్రింది లింకులు నొక్కండి:


కూరలు: 
పచ్చళ్ళు:

ఊరగాయలు:@@@@@@@@@@@@@@@


నా పుట్టిన రోజున FEBRUARY 3 న గూగుల్ లో వచ్చినది 2, ఫిబ్రవరి 2014, ఆదివారం

రాజకీయ నాయకులు, గూండాలు, స్వామీజీలు దేశాన్ని కొల్లగొట్టేస్తున్నారు ష....!!!

కర్టేసి:ఆంద్ర జ్యోతి 

రాజకీయ నాయకులు, గూండాలు, స్వామీజీలు దేశాన్ని కొల్లగొట్టేస్తున్నారు షా.... మన మహాన్ కళాకారుడు గారు మోహన్‌బాబుగారి ఉవాచ...

నిజమే, ఈయనగారు చెప్పేస్తున్న నిజాలు నిఝంగా నిజమే... కానీ, ముక్కు సూటిగా మరియూ మొహమాటం లేకుండా మాట్లాడేస్తారని పేద్ద పేరున్న ఈ ఖళాకారుడు తమ రంగం గురించి ఎందుకు చెప్పలేదో...??? అదీ కూడా చెప్పేస్తే బాగుండేదేమో...

ఎందుకంటే ఈయనగారు చెప్పిన పెద్దమనుషులైన రాజకీయ, గూండా...స్వామీజీలలో కొందరు కేవలం వారియొక్క నిజస్వరూపాలైన ఒక్క రూపంతోనే ప్రజలని మోసం చేస్తున్నారు... కానీ, "ఈ మూడు రూపాలనీ తామే పోషిస్తున్న సినిమాలలోని కళాకారులుగా పేరెట్టుసుకొన్నా కళాకళలున్న ఖళాకారుల" సంగతేమిటీ...?? "ఖళాకారులు" ఎందుకంటే... నిజమైన కళాకారులులాగా ఏ సీన్‌నీ కంటిన్యూస్‌గా చెయ్యలేక  కట్‌చేసి ఖండ ఖండాలుగానే నటించగల వీరు కళాకారులు ఎలా అవుతారు...ఖళాకారులవుతారుగానీ.... 

రాజకీయ నాయకులని తిట్టిన ఈ ఖళాకారుడికి తమ పరిశ్రమ రాజకీయాలు తెలియవా....పైకి మాత్రం కళాకారులు లాగున్నా...ప్రజలకి సేవ మాట అటుంచి కనీసం తమ రంగానికి చెందిన వారికైనా సహాయసహకారాలు అందించారా...??? లేదు. బ్యాక్ గ్రౌండు లేని కళాకారులు నటించిన సినిమాల వలన లక్షలు కోట్లు గడించుకున్నా...ఆ తరవాత ఆ కళాకారులు రోడ్డున పడితే పట్టించుకునే దిక్కు లేదు... ఐరన్ లెగ్ శాస్త్రి గారు  సినిమాలలో ఎంతో మందిని నవ్వించినా...సినిమావారిలో మడుకు ఆయనని ఏడిపించిన వారే ఎక్కువ...కనీసం ఆయనకి ఇవ్వాలిసిన కొద్ది మొత్తం కూడా ఇవ్వకుండా..చివరికి ఆయన సినిమా జాడ్జ్యం వల్లనే చనిపొతే, సినిమాలలోని ఏ ప్రవక్తగారూ ఆయన కుటుంబాన్ని ఆదరించలేదు. ఇలాగే బోలెడు మంది కళాకారులు, వారి కుటుంబాలు అనాధలవుతున్నారు.  ఈ సినిమా రాజకీయాల గురించి చెప్పాలంటే పాతకాలంలో హరనాధ్ దగ్గర నుండీ ఇప్పటికాలం ఉదయ్ కిరణ్ వరకూ ఒకే రకమైన కుళ్ళు వంశపారంపర్య మరియూ కుల రాజకీయలే నడుస్తున్నాయి... పాపం మన కమేడీయన్ బాబూమోహన్ గారు కళ్ళనీళ్ళెట్టేసుకొని...తమ సినిమా విడుదలకి అడ్డుపడుతున్నారని ఏడ్చేశారు... అలాగే దాసరి గారు... మొన్నీమధ్యన స్టార్ డైరెక్టరుగా పేరొందిన రాజమౌళీ గారు కూడా కుళ్ళు సినిమా రాజకీయాల వలన బలైపొయ్యే వారే... "కొందరు" టీవీ వారికి డబ్బులిచ్చి మరీ దుష్ ప్రచారం చేయించినప్పటికి, ఆయన సక్సెస్సే ఆయనను కాపాడింది... ఈ సినీ రాజకీయాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి.... తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాగారు బలైపొయింది సినీ పరిశ్రమలో కుళ్ళిపోయిన రాజకీయాల వల్లనే...ఇక హిందీలో కూడా గానకోకిలగా  ఉన్న ఒక మహా గాయని, కొత్తగా వచ్చిన గాయనీ మణులను  బెదిరిస్తున్నారని... గాయని కవితా కృష్ణ మూర్తి ఒక ఇంటర్వ్యులో చెప్పారు...ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు...ఈ సినీ రాజకీయాలకి ఏ సపోర్టూ లేని ఎంతమంది కళాకారులు బలైపొయ్యారో... మనకన్నా బాబుగారికే ఎక్కువ తెలుసు...ఎందుకంటే, ఒక సినిమా ఫంక్షన్లో గొంతెత్తి తమకి అన్యాయం జరుగుతోందని చిరంజీవి గారితో వాదనకి దిగింది ఈయనగారే....


ఇక సినిమా వాళ్ళ గూండాయిజం గురించి చెప్పాలంటే వేరెవరినో చెప్పాలిసినపనిలేదు... ఈ ఖళాకారుడిగారికే పేద్దపేరుంది... ఈ బాబుగారు ముక్కుసూటిగా, మొహమాటం లేకుండా ఉంటారుష...దానికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే... వారిని బూతులతో కడిగిపారెయ్యటమే కాకుండా, చెయ్య చేసుకుంటారని కూడా సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిందే... ఒక సీనియర్ నటి జయంతిగారిని... సాటి కళాకారిణి అని కూడా చూడకుండా కళ్ళనీళ్ళెట్టించిన ఘనత మోహన్బాబుగారిదే...తాను మొహమాటం లేకుండా ఉన్నప్పుడు... ఇతరులు కూడా అలాగే ఉంటే సహించే బుద్ధి జ్ఞానం ఉండాలి... కానీ ఈయనగారిలో అది కనపడదు. కాబట్టి... ఈయనది ముక్కుసూటీ తత్త్వం కాదు... అహంకారం, దౌర్జన్యం చేసే బుద్ధి మాత్రమే... ఇక వీరి వారసులు గురించి చెప్పనే అఖర్లేదు.. రోడ్డునపడి ఎంత యాగీ చేసి కేసులని నెత్తికి ఎత్తుకున్నారో అందరికీ తెలుసు...

ఇది చిన్ని ఉదాహరణ మాత్రమే...కర్టేసి"యు ట్యూబ్"

ఇకపోతే, సినిమా వాళ్ళు స్వామీజీల పాత్రని ఎంతగా పొషిస్తూ ఉన్నారంటే... వ్యక్తిగత పూజలూ... పాలాభిషేకాలు... గుడులెక్కి... వీరే దేవుడైనట్లు పాటలూ...అవి కూడా... ఇప్పటికే ఉన్న భక్తి పాటల ట్యూన్లో ఉండటంలాంటి విపరీత ధొరణులతో, యువతని తప్పుదోవ పట్టించే విధానం చూస్తే తెలుస్తుంది... ఇలా స్వామిజిలు చేస్తే... మోసం... వీరు చేస్తే అభిమానం'ట....కాకపోతే, అలా మూఢులైన ప్రజలకి పేరెట్టేశారు మన సినీ పెద్దలు... దాని పేరే "అభిమానులు...అదేనండీ ఫేన్సు ట".  ఈ ఫ్యాన్సు పేరు అడ్డెట్టుకొని సినీమా పెద్దలు చెయ్యని దురాగతం లేదు... వీరివల్లన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడినాయి...పడుతున్నాయి...అభిమానం పేరుతో అభిమానులని సమాజంలోని యువతని రెచ్చగొట్టి....ఎంత నాశనం చేశారో తెలిసిందే..."తప్పనిసరైతే" దొంగతం చెయ్యటం  ప్రేమ పేరుతో పెద్దలని ఎదిరించి పారెయ్యటం...ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం...లాంటివి  మన సినిమా ప్రవక్తలు చెప్పిన వేదాంతమే...

ఈ విషయానికొస్తే ఓ మాట చెప్పుకోవాలి...సినిమాల్లోని లవ్వు వ్యవహారాల్లో హీరోగారు ఎన్ని వెకిలి చేష్టలు చేసినా పరవాలేదు...హీరోయిన్ ఏమీ అనుకో కూడదు... హీరోయిన్‌కే తెలియదు పాపం తానూ హీరోని ప్రేమిస్తున్నానని... హీరోయిన్ తండ్రి అడ్డుపడితే, ఆయనకి ఫ్లాష్ బ్యాక్‌లో ఒక కధ కలిపి, ఆయనను విలన్ చేసిపారేస్తారు మన సినిమా పెద్దలు.... ఇదే కనుక  హీరోగారి చెల్లెళ్ళ విషయానికొస్తే మాత్రం, ఎవడు ఏమీ కామెంటు చెయ్యకపోయినా సరే...కనీసం ఒక చూపు వారి వంక చూస్తే చాలు...మన హీరోగారు... వారి డొక్క చింపి డోలు కట్టేస్తారు... పెళ్ళిళ్ళ విషయానికొస్తే  హీరోగారు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చును... వాటికి తగ్గ పరిస్థితులు కూడా అలాగే వచ్చేస్తాయి మరి...!!!  కానీ, హీరోగారి బావగారు తప్పనిసరిగా ఏకపత్నీవ్రతుడైయుండాలి...లేదా వాడికి కూడా ఏ విలనిజమో కట్టబెట్టేస్తారు...మన "సినిమా ప్రవక్తలు".  ఇక హీరోగారు దొంగతం చేస్తే అది కూడా హీరోయిజమే... అని మన సినిమా స్వామీజీలు తమ ప్రవచనంలో చెప్పియున్నారు...ఈ విధంగా  మన సినిమా స్వామీజీలు/ప్రవక్తలు సృష్టించిన మహాకావ్యాల వల్లనే ఈ రోజున సమాజంలోని యువత తల్లిదండ్రులని ఎదిరించటం, ఆడపిల్లలని ఏడిపించటం...దొంగతనం చెయ్యటం కూడా ఒక హిరోయిజం క్రిందగా అనుకోవటం లాంటి దుష్‌ప్రభావాలు ఏర్పడినాయని, సందేహం లేకుండా చెప్పవచ్చును. తీరా అందరికీ ఇలా ప్రవచనాలు చెప్పిన స్వామీజీలకే ఈ పరిస్థితి వస్తే, తుపాకులతో బెదిరించెయ్యటం, కురదకపోతే గడ్దాలు పెంచేసుకుని టీవీలలో పడి ఒకటే ఏడుపు... సినీ ఫీళ్డు మన చేతిలో ఉన్నది కదా అని పరుగో పరుగు అని సినిమాలు తీసెయ్యటం....  మరి, వీరు తీసిన సినిమాల వలన బాధలు ఏర్పడ్డ ఆడపిల్లల తల్లిదండ్రులు వీరిలాంటివారు కాదా...?  కేవలం సినిమా వారికే ఇలా ఏడిచే సర్వ హక్కులనీ.... సర్కారు, సీడెడ్డు, నైజాం జిల్లాలు మరియూ శాటిలైట్‌లకి కలిపి  ... ఎవరైనా వ్రాసిచ్చారా...???  

సరే, ఇక దోచుకోవటం గురించి అయితే సినిమా కళాకారులు[కొందరు]తాము చేసే పావలా నటనకి కోట్ల రూపాయలని పుచ్చేసుకోవటం కళాపోషణ అవుతుందని వీరికి వీరే అనేసుకుంటున్నారా...?? ఎందుకంటే, రెండున్నర గంటల నిడివిగల ఒక సినిమాలో హీరో, హీరోయిన్లు కనపడేది...కేవలం అరగంటే...దానికే వీరు లక్షలు, కోట్లు డిమాండు చేస్తున్నారు...మరి మిగిలిన రెండుగంటల సినిమాని పొషించిన కళాకారుల మాటేమిటీ, వారికి  కూడా డబ్బులు ఇస్తున్నరని అనేకన్నా విదిలిస్తున్నారు అని అనటమే సమంజసం. ఒకవేళ రెండున్నర గంటలు పాటు వీరు కనపడినా దానికి లక్షలు...కోట్లు పుచ్చేసుకోవాలా....? ఇలా హీరోలు కోట్లు కొట్టేయ్యటంతో... సినిమాలని కళా దృష్టి ఉన్న ఏ మాములు కళాపోషకుడు తియ్యలేని పరిస్థితి వచ్చింది. దీంతో సమాజాన్ని చెడగొట్టే వ్యాపార దృష్టిగల "దిష్టి" సినిమాలే వస్తున్నాయి...దీనికి గల కారణం మన మహా సినిమా ప్రవక్తల దోపిడినే కదా... 

సామాన్యుడికి సామాన్య వినోదంగా ఉండే సినిమాలు.... సినిమా హాళ్ళని కూడా ఈ సినిమా ప్రవక్తలే చేతిలో ఉంచుకోవటంతో  వాటి ధరలు కొండెక్కి కూచున్నాయి. ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే పర్సు ఖాళీ అవ్వవలసిందే...  కాబట్టీ, ఇలా ఏ విధంగా చూసినా సమాజానికి ఇసుమంతైనా ఉపయోగపడని వీరు, కళాకారులని పేరెట్టేసుకుని... వీరే ఏదో సమాజాన్ని ఉద్దరించేట్లుగా మాట్లాడటం.... వారి నటనకి బాగుంటుందేమో కానీ, నిజ జీవితానికైతే ఏ మాత్రం నప్పదు!!! 
@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@
@@@@@@@@@@ఇందులోనివి గూగుల్ బొమ్మలే