LOCAL WEATHER

12, మే 2014, సోమవారం

విభజనకి తొందరేమొచ్చింది..???


ఆంధ్రప్రదేశ్ నుండి 
తెలంగాణా పేరుతో కొత్త రాష్ట్రం విడిపోవటాన్ని
 పార్లమెంటులోనూ-రాష్ట్రపతి దగ్గరా ఖచ్చితం చేసినప్పుడు...
దీనిని క్రమ పద్ధతిలోనే చెయ్యవచ్చును కదా... 
అనవసర హడావిడిని... అలవిగాని వాళ్ళు చేత చేయించి, 
తరవాతి రోజుల్లో 
ప్రజల మధ్య దశాబ్దాలబాటూ చిచ్చుపెట్టటం దేనికి...??? 
మాములుగా ఏ కొద్దిపాటి ఆస్తి ఉన్న అన్నదమ్ములు కూడా, 
దగ్గర ఉండి తమ ఆస్తులని పంపకం చేసుకుంటారు. 
అన్నదమ్ములలో ఏ ఒక్కరు అక్కడ లేకపోయినా 
ఆస్తుల పంపిణీని చెయ్యరు. 
దీని వల్లన ఏదైనా అభిప్రాయ భేదం వచ్చిందంటే 
అప్పటికప్పుడే సర్దుబాటు చేసుకోటానికి వీలుంటుంది. 
తరవాత రోజుల్లో "నేను లేనప్పుడు జరిగిపోయింది... 
నాకు అన్యాయం జరిగింది" 
అని రాద్ధాంతం చేసే అవకాశం ఏ ఒక్కరికీ ఉండదు...

అలాగే ఇంత పేద్ద రాష్ట్రాన్ని విభజించటం జరుగుతున్నప్పుడు; సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు లాంటి వారు లేకుండా... అంటే పరోక్షంగా ప్రజల భాగసామ్యం లేకుండా.... కేవలం జీతాల కోసం పనిచేసే ఉద్యోగులు  మన ప్రాంతం గురించి తెలియని అధికారి పర్యవేక్షణలో ఆస్తుల పంపిణీని చేస్తే అది న్యాయంగా జరుగుతుందా...?? తరవాతి రోజుల్లో అనేక వివాదాలని రేపి ప్రజల మధ్యలో చిచ్చు రేపకుండా ఉంటుందా...??? ఎందుకంటే ఈ ఉద్యమమే సెంటిమెంటు మీద ఆధారపడినది...మరి దానికి సంబంధించినవారు ఒక్కరు కూడా అక్కడ లేకుండా విభజన చెయ్యటం సమంజసమా...??? ఎంతో ఆస్తిగల అన్నదమ్ములు...విడిపోయి అన్నదమ్ములలాగా కలిసి ఉందామన్న వారు, ఆస్తుల పంపకం జరిగేటప్పుడు బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉన్నది కదా.... కానీ, ఆ బాధ్యత కనపడటం లేదు.

విభజనలొ రాజకీయ నాయకుల ప్రమేయం ఏ మాత్రం లేనట్లు ఎవరిదారిన వారుంటే... ఇదేదో బ్యూరోక్రాటిక్ దేశంలాగా ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా  ఇరు రాష్ట్రాల ఆస్తులనీ పంచుతున్నారు. నాయకులు ఎన్నికలు వస్తున్నాయి అని అనగానే ఎంతో ఉత్తేజంగా, నడవలేని ముసలి నాయకులు కూడా పరిగెడుతూ పాల్గొన్నవారు, విభజన కర్యక్రమంలో మడుకూ పాల్గొనటం లేదు. అదేదో ఉద్యోగుల విషయం అన్నట్లుగా మిన్నుకుండిపొయ్యారు.    

ఎన్నికలు ఇప్పుడోచ్చేవే కాకుండా... రాబోయ్యే 2019 న్నికల ప్రణాలికలని కూడా తయారు చేసుకునేంత దూర దృష్టికల మన రాజకీయ నాయకులు... రాష్ట్ర విభజన సందర్భంగా ఆస్తుల పంపకం జరుగుతున్నప్పుడు...రాజధానిలో కూర్చుని పరిశీలించాలి.  కాని, వీరికి ఆ భాధ్యత ఉన్నట్లు కనపడటం లేదు. "ఆ... ఎన్నికల తరవాత ఎవడు వస్తోడో మనకెందుకొచ్చిన గొడవ" అన్నట్లుగానే ఉన్నారు కాని... ప్రజల ఆస్తుల పంపిణీ జరుగుతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఈ విషయంలో తెలంగాణా నాయకులే కొద్దిగా నయమనిపిస్తున్నారు. అయితే వారు కూడా ఫాం హౌసులకి పరిమితం కావటమో లేక వారికి తాట తీస్తాం వీరికి నాలిక కోస్తాం అనే మాటలతోనే కాలం వెళ్ళదీస్తున్నారు. కేవలం ఉద్యోగుల విషయం తప్ప మరే దాని మీద ప్రకటనలు చెయ్యటం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ నాయకులకైతే ప్రజలంటే ఎన్నికలుగానే కనిపిస్తోంది కానీ బాధ్య్తగా అని అనిపించటం లేదు...ఎన్నికల రణరంగలో పాల్గొన్న వీరు... ఎన్నికలు అయిపోగానే రాజధానిలో ఒక కమిటీ క్రింద ఏర్పడి రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో భాగం పంచుకోవలసిందిపోయి... ఎవరిదారిన వారు హాలిడే రిసార్టులకీ...ఫాం హౌసులకీ వెళ్ళిపోయ్యారు. రేపు ఈ నాయకులే వచ్చి ఉద్యోగులు చేసిన విభజన పాపాన్ని రెచ్చగొట్టి ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సయోధ్యలేకుండా చేస్తారు...అదేదో ఇప్పుడే అన్ని పక్షాలు కలిసి కూర్చుంటే తరవాతి కాలంలో అనవసర వివాదాలుండవు కదా...!!!


ప్రజాసామ్యం...???

ప్రజాసామ్యంలో, ప్రజల ఆస్తులని పంచటానికి ఉద్యోగులు ఎవరు...? పరాయి రాష్ట్రం నుండి వచ్చిన అధికారులు ఎవరు...??? "దీని వలన కాగితాల మీద లెక్కలు బాగానే కుదరొచ్చునేమో కానీ, నేల మీద లెక్కలు గొడవలకి దారి తీస్తాయి"...ఉదాహరణకి అనేక విషయాలని జనాభ ప్రతిపాదికగా తీసుకుంటూ... కరెంటు పంపిణీని వాడకం[వినియోగం]ప్రతిపాదికని తీసుకోవటం చూస్తే ఉద్యోగుల అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. అంటే, ఎవరి దగ్గరైనా... వాడని డబ్బుని ఇతరులకి పంచి వెయ్యచ్చునా... మరి అసలు వ్యక్తికి అవసరం పడితే... సీమాధ్రలో వినియోగం లేదని కరెంటుని తగ్గిస్తే... అసలే పరిశ్రమలు తక్కువ. మరి కొత్తగా పరిశ్రమలు వస్తే ఏమి చెయ్యాలి...???

అలాగే, కేవలం 10 యేళ్ళ రాజధాని అంటున్నారు.  మరి హైదరాబాదులోని అనేక భవనాలని పంచటం దేనికి... కొన్నిటిని విరగ్గోసి కట్టిస్తో అనవసర ఖర్చు దేనికి... అదేదో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రాబొయ్యే రాజధానిలోనే ఖర్చు పెట్టవచ్చును కదా.... ఈ లోగా కలిసి కాపురం చేస్తే, ఇంతలో కొంపలేమి ముణిగిపోవు కదా...ఇది విడిపోవటం రాష్ట్రంగానే కాని... దేశంగా కాదు కదా... ఇందులో కూడా ఉద్యోగుల-అధికారుల కాగితం తెలివితేటలు కనపడుతున్నాయి.

అసలే ఈ ఉద్యోగులు వాళ్ళలో వాళ్ళకి సయోధ్య లేక, 
ఎవరు ఎక్కడికి పోవాలో తెలియక ఆందోళనలు చేస్తూ...
ఆందోళనగా ఉన్నప్పుడు, 
వారు ఇంత పెద్ద రాష్ట్రం ఆస్తులని 
ఎలా ప్రశాంతంగా చక్కగా లెక్కించి విభజింపగలరు..? 
ఆ విభజనలో 
వారి వారి లాభ నష్టాలని కూడా పరిగణలోనికి తీసుకుంటే... 
అప్పుడు ఆయా పరిధిలో ఉన్న ప్రజలకి 
తీరని నష్టం కలిగించినట్లే కదా... 
అంటే ఆస్తుల పంపిణీ చేస్తున్నప్పుడు 
ఆయా ఉద్యోగులకి ఏది లాభసాటిగా ఉంటుందో
[తమ 5 లేక 10 సంవత్సరాల సర్వీసు కోసం]
అలా పంపిణీ చేసే ప్రలోభం వారిలో ఉన్నప్పుడు... 
వారి చేతే లెక్కలు తీయించటం ప్రమాదకరం కాదా...??? 
తొందరపాటు విభజన విభేధాలకి మూలం అవుతుంది.

దీనంతటికీ మూలం, 
రాజధానిని చూపించకుండా విభజించటమే... 
ఇది బాధ్యతా రహితంగా జరిగింది... 
దీని గురించి ఇది వరలో ఇదే బ్లాగులో సూచించటం జరిగింది.
సామాన్య ప్రజలకే తెలుస్తున్నాప్పుడు... 
వేలు లక్షలు జీతాలు తీసుకొనే ఉద్యోగులకీ తెలియదా...??? 
వంశపారంపర్యంగా ప్ప్రజాసేవ చేస్తున్నామని 
చెప్పుకునే రాజకీయ ప్రముఖలకి తెలియదా
 అని అనటం కూడా జరిగింది... 
అయితే,  
ప్రజల గోడు అరణ్యరోదనే అయ్యిందే కానీ... 
 అటు రాజకీయనాయకులకి గానీ
ఇటు ఉద్యోగులకి కానీ...
బుద్ధి వికశించినట్లు కనపడలేదు....

 వేలల్లో నాయకులకి 
ఫ్రెష్‌గా వచ్చిన ఎన్నికలు ముఖ్యంకాగా...
లక్షలలో ఉన్న ఉద్యోగులకి 
తమ సర్వీసు...
పెన్షనే పరమావధి అయ్యిందే కానీ, 
కోట్లలో ఉన్న ప్రజల గోడు 
ఎవరికీ పట్టటంలేదు. కాబట్టి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని...
ముందరగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్ణయించి 
సాధ్యమైనంత తొందరగా 
అంటే 10 సంవత్సరాలకంటే ముందరే 
దానిలోనికి మారేట్లుగా 
ప్రణాలికని తయారు చెయ్యాలి.
అటు తమ రాజకీయ భవిష్యత్తు అని 
రాజకీయ నాయకులు స్వార్ధంగా ఆలోచించ కుండా...
ఇటు ఉద్యోగులు తమ 5, 10 సంవత్సరాల సర్వీసులు గురించి కాకుండా... 
ప్రజలకి శాశ్వతంగా మిగిలిపోయ్యే విషయాలపట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. 
లేకపోతే విడిపోయి అన్నదమ్ములుగా ఉందాము అన్నమాట అటుంచి...
కనీసం ఇరుగు పొరుగు వారిలా కూడా ప్రజలు ఉండక, 
రెండు శత్రు దేశాల్లా నిత్యం కొట్టుకునే పరిస్తితి వస్తుంది.... 
నాయకులారా...సామాజిక సేవకులారా
 ఇకనైనా కళ్ళు తెరిచి విభజన ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గోనండి... 

ఇది అయిదేళ్ళకొకసారి వచ్చే 

ఎన్నికలకన్నా ముఖ్యమైనది... 
ఎన్నికలలో తప్పు నిర్ణయం తీసుకుంటే 
మరో అయిదేళ్ళలో మార్చుకోవచ్చును... 
కానీ,
ఇప్పుడు జరిగే
విభజన ప్రక్రియ ఫలితం 
శాశ్వతం.


ప్రజాసామ్యం పై అత్యంత గౌరవంతో[?]
ఓటు వెయ్యకపోతే వుతారు ఇదవుతారు అనే మీడియా కూడా 
విభజన అంటే అదేదో ఉద్యోగులకి సంబంధించినదిగా చూస్తున్నదే కానీ,
ఈ విషయం మీద సరైన అవగాహనతో మెలగటం లేదు...
విభజన విషయాలపై సరిగా చర్చించటం లేదు...  
ఇది రాజకీయ నాయకుల-పార్టీల భవిష్యత్తు కాదు కదా...
ప్రజలది కదా... ఎవడికి పట్టింది....!!!


జై హింద్


బొమ్మలు గూగుల్-మిక్సింగ్ కేఆర్కే @@@@@<><><><><><><>@@@@@


రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@