LOCAL WEATHER

27, ఫిబ్రవరి 2021, శనివారం

TV 9 రజని గారు అడగని ప్రశ్నలు...

టీవీలలో ఇంటర్‌వ్యులు చూస్తుంటే..."ఇక్కడ ఇలా అడిగి ఉంటే బాగుండేది" అని సామాన్యుడికి అనిపిస్తుంది....అలాంటిదే ఈ క్రింద ఇంటర్‌వ్యు... 

క్రింది లింకులో జరిగిన సంభాషణ విషయం మొత్తం [10 నిమిషాల తరవాత నుండి....] 
ఈ క్రింద ఓపిగ్గ వ్రాశాను...మధ్యలో "సామాన్యుడు" అడుగుదాం అనుకున్న ప్రశ్నలు...

[10 నిమిషాల తరవాత నుండి....]

ఇది టీవీ 9 లో రజనీగారిచే నిర్వహించపడింది... 

పాల్గొన్నది...జయప్రకాష్ నారాయణగారు...మాజీ ప్రభుత్వ ఉద్యోగి... 

విషయం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ. 

రజని : "ప్రభుత్వమే నడపలేని సంస్థను ప్రైవేటు వాళ్ళు లాభాలకి ఎలా నడుపుతారు? లాభాల కోసం ఉద్యోగులని తీసేసి~భూములని అమ్మి ~ జీతాలు తగ్గించి సంస్థని నడిపితే అది ఆ ప్రాంత ప్రజలకి లాభమా"... ? 

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): ఓ రైతు, ఓ ఆసామి(ప్రైవేటు) తేడా వస్తే మునిగిపోతామన్నట్లు పనిచేస్తారు...జీతాల కోసం పనిచేసే వాడు(ప్రభుత్వ ఉద్యోగి) నాదేం పోయింది(?) అన్నట్లుంటాడు. 

సామాన్యుడు: ప్రభుత్వ ఉద్యోగులందరూ అలా ఉంటారా ?...ప్రైవేట్లో అయితే ఉద్యోగం పోతుందన్న భయం కూడా లేదు కదా...ఆ మాత్రం ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది కదా వాళ్ళెలా బాధ్యతగా ఉంటారు ?

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగంలా పనిచెయ్యలేదని(?) ప్రపంచం అంతటా ఋజువయ్యింది. రెండవది ఆరోగ్య రంగం...దీనిని ప్రభుత్వమే చెయ్యాలి, కానీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రైవేటు రంగం దూసుకొచ్చింది...దీని వలన పేదలు నాశనం (?)అవుతున్నారు. 

సామాన్యుడు: ఆరోగ్య రంగం మడుకూ నష్టాలొస్తే ఎలా చేస్తారు ?...ఓ ప్రక్కన ప్రైవేటుని సమర్ధిస్తో...మరో ప్రక్కన పేద ప్రజలు నాశనం అవుతున్నారనటం...??

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): సేవారంగం అశ్రద్ధ~ఇతరులు చెయ్యగలిగిన ఫేక్టరీలని రాజకీయనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం(?)పట్టుకుని కూర్చుంటున్నారు. నేనైతే ఉద్యోగంలో ఉండగా 3 ప్రభుత్వ రంగ సంస్థలని లాభాలతో నడిపాను...కానీ...అది పధ్ధతి(?) కాదు...

సామాన్యుడు: సేవా రంగం ఎక్కడ అశ్రద్ధ చేస్తున్నారు...అన్నీ ఉచితాలూ ఉన్నాయి కదా...పని చెయ్య కుండా డబ్బులిచ్చే దాకా....ఇతరులు అంటే ప్రైవేటు చెయ్యగలిగేవి ప్రభుత్వం చెయ్య కూడదా...మీరు ఎలా చేశారు... మీలాంటి IAS లు ఇక లేరా...? మీరు ఉద్యోగిగా సక్సెస్ చేసింది "ఏ పద్దతిలో అది పద్ధతి కాదు" అని చెబుతున్నారు...1-2-3 కారణాలేవీ చెప్పకుండా...!!! 

రజని: అదే నండి మీలాంటి అధికారులతో ఈ ప్లాంటుని లాభాలొచ్చేట్లు చెయ్యచ్చు కదా ? కొత్తగా పెట్టాలంటే అప్పుడు ప్రైవేటు వాటిని ప్రోత్సాహించండి...అంతేకానీ ఉన్న వాటిని.......

(రజనిగారి మాటలకి అడ్డం వస్తూ) 

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): "IASలు, MPలు, MLAలు అందరూ అద్భుతంగా ఉంటే"....అని అనుకోవటం...ఇవన్నీకలలు....అలా జరగదెప్పుడూ ...మనుషులుమనుషులే...సమర్దులు~అసమర్ధులుంటారు (?) ప్రభుత్వంలోమహాత్ములుంటారని(?) అనుకోకండి...మాములు మనుషులే ఉంటారు... 

సామాన్యుడు: సేవ చెయ్యాలిసిన ప్రభుత్వం మీద...ప్రభుత్వంలో పని చేసిన మీకే నమ్మకం లేకపోతే....కేవలం వ్యాపార దృష్టితో ఉండే ప్రైవేటు రంగాన్ని ఎలా నమ్మాలి... మహాత్ములుంటారని మీ నమ్మకమా...? అక్కడ కూడా మనుషులే కదా...పైగా ఉద్యోగాలు తరచూ మారే వారు పని మీద శ్రద్ధ ఎలా పెట్టగలరు...? 

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): ఫేక్టరీ మొత్తం భూమితో సహా అమ్మకండి అన్ని వేల ఎకరాల్లో ఎక్కడా స్టీల్ ప్లాంట్ లేదు...మిగిలిన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి...

సామాన్యుడు: నిజమైన ఉద్యమకారులు భయపడేది కూడా ఇందుకే... మీరు చెప్పినట్లు సమర్ధత లేని అధికారులు... నిజాయితీ లేని రాజకీయనాయకులున్నప్పుడు...ఈ ప్రైవేటీకరణ సజావుగా ప్రజలకీ... సంబంధిత ఉద్యోగులకీ ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు..?

రజని: మరి విశాఖలో ప్రైవేటీ కరణకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారు మీలాగా విశాలంగా(?) ఆలోచించలేకపోతున్నారు.... 

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): దీనికి రెండు ఉదాహరణలు...ఒకటి ప్రాంతీయ భక్తి(?)ఓ ఉదాహరణ... రెండవది 25 ఏళ్ళ క్రితం బ్యాంకు వాళ్ళు కంప్యూటర్లు రాకూడదని ఉద్యమించారు...దానికీ రాజకీయ ~ మీడియా వాళ్ళు సపోర్టు చేశారు... కానీ ఇప్పుడు చూడండి " మెడ మీద తలకాయ ఉన్న వాడిని ఒక్కడిని చెప్పమనండి, కంప్యూటర్లు రాకుండా ఉండటం(?) మంచిదని" ... 

సామాన్యుడు: తమ ప్రాంత అవసరలకోసం అక్కడి ప్రజలు అడగటంలో తప్పేమున్నది... అడిగితే కదా వచ్చేది...ప్రతీ సారీ ఎక్కడో ఉన్న ఆఫీసుకి పోవాలంటే ఆ ప్రాంత ప్రజలకి ఎంత ఇబ్బంది...మీ లాగానే ఓ ఉదాహరణ...పేరుకి ONGC ఆఫీసు రాజమండ్రిలో ఉన్నది... దాని హెడ్ ఆఫీసు మద్రాసులో ఉన్నది... నిజానికి రాజమండ్రి ప్రాంతంలోనే వారి పనులన్నీ జరిగేది...మద్రాసు ప్రాంతంలో ONGC వారికి పెద్ద పనులేవీ లేవు. ఇక రెండవది... బ్యాంకుల్లో కంప్యూటర్ల సంగతి....బాగుంది...తలకాయ లేనివాడు కూడా ఈ రోజున కంప్యుటర్లని వాడుతున్నది నిజం... అయితే కాస్త తలయాతో ఆలోచిస్తే.... అప్పట్లో ఓ బ్యాంకు బ్రాంచి నిర్వాహణా ఖర్చు ఎంత...? ఇప్పుడు ఎంత...? మాకన్నా మీకే తెలుసు.... ఖర్చు పెరిగింది ఉద్యోగాలు తగ్గాయి...ఇది బాగుపడకుండా దేవతా వస్తువులు పెట్టినా దేశ ఎకానమీకి ప్రయోజనంలేదని తలకాయలో మెదడున్న వాడెవడైనా చెపుతాడు

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి):పీవీ-మన్మొహన్ సింగ్ సంస్కరణలు(?)చెయ్యకపోతే ఇన్ని అందేవా.....మార్కెట్టులో ఏ వస్తువైనా హయిగా(?) దొరికేవా.....కాబట్టి, సెంటిమెంటు ఆవేశాన్నిబట్టి(?) నిర్ణయించకూడదు... 

సామాన్యుడు: ఏ వస్తువులు "హాయిగా" దొరుకుతున్నాయి ?...ఆ సంస్కరణలు తరవాతే నిత్యావసరాలు సామాన్యులకి అందుబాటులో లేకుండా పొయ్యాయి... చౌకబారు చైనా వస్తువుల దాడితో ప్రాంతీయ పరిశ్రమలు కొన్ని మూత పడ్డాయి..చాలా వాటిల్లో పని తగ్గి ఉద్యోగుల్ని తగ్గించారు. దేశ ఎకానమీ విదేశీ ఎకానమీ మీద అధారపడాలిసి వస్తోంది.

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): ప్రజాసామ్యం అంటే మొత్తం ప్రజలు చెప్పింది జరగాలి...అంతేగానీ ప్రజలు చెప్పింది వాస్తవమని అనుకునేది(?) ప్రజాసామ్యం కాదు...ఎన్నో సందర్భాలలో ఆవేశంతో ప్రజలు చెప్పేది కరెక్టు కాదు..ఆలోచనలో పరిపక్వత(?)లేదు.... 

సామాన్యుడు: ప్రజాసామ్యం కంటే కార్పొరేట్ నమ్మకం ఎక్కువా...?.. ప్రజల మాటే లెక్కలేకపోతే మీరు వాడే ఫ్యుడల్ భావాలనవచ్చునా...?

రజని: నాదొక డౌట్...ఇలా ప్రభుత్వం తన ఆస్తులన్నీ అమ్మేస్తే...రేపు ఆర్దికమాంద్యం వస్తే ప్రభుత్వాలు ఎలా ప్రజలని ఆడుకుమ్తాయి...ఈ దేశాన్ని ఎలా నిలబెడతారు...ఉన్నవాటిని కాపాడుతూ, కొత్తగా ప్రైవేటేజేషన్ ని ప్రోత్సాహించే దిశగా ఎందుకు ఆలోచించ కూడదు...? 

 
జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): దీని గురించి మూడు విషయాలు... 
1) ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆస్థులమీద పడి బ్రతకదు...పన్నుల మీద(?) ఆధారపడి బ్రతుకుతుంది...పెరిగే ఆర్ధిక వ్యవస్థ ఆధారంకానీ... పాతకాలం జమీందారుల్లాగా (?)
ఆస్తుల మీద ఆధారపడదు... 

సామాన్యుడు: అంటే పన్నుల బాదుడుతోనే ప్రభుత్వాలు బ్రతకాలనే పాత భావాలేనా...కొత్తగా వచ్చే మార్పుల ద్వారా సాధ్యమైనంత తక్కువ ప్రజల మీద ఆధారపడి వారి దారిన వారిని బ్రతకనివ్వచ్చును కదా...పాతకాలపు రాజుల్లాగా మీ ప్రభుత్వ ఆర్భాటపు అసమర్ధ ఖర్చుల(మీరన్నదే)కోసం ప్రజలని బాధపెడుతూనే ఉండాలా?..."1930s అమెరికా ఆర్ధికమాంద్యాన్ని పోగొట్టింది కీన్స్ ఎంప్లాయ్ మెంటు థీరీ...ఇది సక్సెస్ అవటానికి కారణం అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆస్తులే"...అవి లేకపోతే ఆర్ధికమాంద్యం పరిస్థితులలో ప్రజల దగ్గర నుండి పన్నులు ఎలా వసూలు చేసే వారు...? పాతకాలపు రాజుల్లాగా కొరడాలతో కొడుతూనా?

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): 2) పోటీని పెంచితే ఆస్తుల విలువ ఎరుగుతుంది...రెట్టింపు (?)పన్నులు వస్తాయి....హిందుస్థన్ జింక్ అలానే పెరిగింది... 

సామాన్యుడు: అమ్మిన తరవాత ఆస్థుల విలువ పెరిగితే ప్రభుత్వానికేం లాభం... పెరిగిన దానిలో 18% పన్నులు ప్రభుత్వానికి... మిగిలిన 82% కొన్న ప్రైవేటు వాళ్ళకా...?

జప్రనా(మాజీ ప్రభుత్వ ఉద్యోగి): 3) ప్రభుత్వం చెయ్యాలిసిన పనులు చెయ్యకుండా... డబ్బూ దానికి(?) పెట్టేస్తున్నారు....అప్పుల పాలవుతున్నారు... ఉదాహరణకి ఈ సంవత్సరం ద్రవ్య లోటు 9 శాతాం... అప్పులు అయ్యాయి...ఆస్థులు లక్షల కోట్లు ఉంచుకొని(?) అప్పుల పాలవటం....ఉదాహరణకి బ్యాంకులున్నాయి... గత నాలుగేళ్ళల్లో 
3 లక్షల కోట్ల రూపాయలని నష్టాన్ని(?) మన పన్నుల డబ్బుల నుండి కైంకర్యం చేసి పెట్టారు...ప్రభుత్వ రంగ బ్యాంకులకి నష్టాలు వచ్చినాయి కాబట్టి....అదే సమయంలో ప్రైవేటు రంగ బ్యాంకులు అద్భుతంగా పని చేస్తున్నాయి.... 

(జప్రనా మాటలకి అడ్డొస్తో రజని...)

రజని: ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి సో కాల్డ్ కార్పొరేట్ వ్యక్తులకే డబ్బులెళ్ళినాయి... వారు పన్నులు కట్టక...ఇవన్నీ అవుతూ ఉన్నాయి...ఓకే.. 

సామాన్యుడు: అప్పులు తీర్చటానికి ఆస్థులు అమ్మటం ఒకటే మార్గమా...??? ప్రభుత్వ రంగ బ్యాంకులకి కట్టిన 3 లక్షల కోట్ల రూపాయలలో ఒక లక్ష కోట్లు....కాదు కాదు ఒక లక్ష రూపాయలు అయినా "ప్రభుత్వ రంగ సంస్థలు" ప్రభుత్వ బ్యాంకులకి బాకీ పడ్డాయా ?... మరొకటి... ప్రైవేటు రంగ బ్యాంకుల ఓనర్లు ఎవరు...????


కొసమెరుపు ఏమంటే... 
విశాఖ స్టీల్ ప్లాంట్ వివరాలు-లెక్కలు... 
ఎందుకు నష్టం వచ్చిందో ఇందులొ చర్చించబడలేదు....
సంబంధం లేని ఉదాహరణలు తప్ప...

ఉదాహరణకి ఉదాహరణ:
జయప్రకాష్ నారాయణగారు మొదట్లో 
"టీవీ 9 దూరదర్శన్‌ని చంపేసి వచ్చింది" అని అన్నట్లుగా
ఉదాహరించబొయ్యారు... 
అలా జరగలేదు కదా దేనికదే ఉన్నాయి కదా...


@@@@@@@@@@@@@@@

కర్టెసి టీవీ 9 మరియూ యూ ట్యూబ్

@@@@@@@@@@@@@@@