LOCAL WEATHER

28, ఫిబ్రవరి 2015, శనివారం

మోడీ గారి బడ్జెట్టుతో జీవితాలే మారిపోతాయా...???

హమ్మయ్య రైల్వే బడ్జెట్టు తతంగం పూర్తి అయ్యింది...
సంచీలకి సంచీల బడ్జెట్ కాపిలని  పార్లమెంటు లోనికి తరలించటం....
ఆ తరవాత చెసిందేమిటిరా అంటే...
రోజువారి ఆఫీసు కార్యక్రమాల పట్టికని పార్లమెంటులో చదవటం...
ఆ చదవటాన్ని బడ్జెట్టు అంటారేమో...
ఆ సంగతి మోడీ గారికి, రైల్వే మంత్రి గారికే తెలియాలి... 
చదివిన దానిలో ఆదాయ-వ్యయ వివరాలూ
సంవత్సర కాలంలో ఏమీ చేయ్యబోతున్నారో ఒక్క వివరం లేదు... 
మరి ఇంకెందుకు ఆ సంచీలకి సంచీల ప్రతులను పార్లమెంటులోనికి చేరేయ్యటం...???
ఈ మాత్రానికి బడ్జెట్ ప్రకటన ఎందుకు...
"పాత ప్రాజెక్టులే పూర్తి చేస్తాం" 
అనే సింగల్ లైను ఉన్న కాగితం ఒక్కటి చదివితే సరిపొయ్యేది కదా...!!!
ఇంతకన్నా ఎక్కువ వ్రాస్తే...
ఇది రైల్వే బడ్జెట్ ఏమో అని అనుమానం వెయ్యచ్చు...!!!
ఇంతకన్నా ఎక్కువ వ్రాయాలిసిన గౌరవమూ ఈ బడ్జెట్టు అనబడే దానికి లేదు...

టివి దుకాణాలలో ప్రొద్దున్నే కూర్చొనే పెద్ద మనుషుల రైల్వే బడ్జెట్టు పై వాదనలు వింటుంటే 
ఈ పాత పాట గుర్తొచ్చింది....

ఈ పాట పూర్తిగా మన రాజకీయ నాయకుల వారి చెంచాల మనస్థత్వం పై 
వ్రాసినదే...పూర్తి పాట కోసం పై లింకు నొక్కండి...
బొమ్మలు సహజంగా గూగుల్ లోనివే
మిక్సింగ్ కే ఆర్ కే 

----


అదలా ఉంటే....ఈసారి జనరల్ బడ్జెట్ మీద ప్రతివారూ పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే, మోదిగారు వచ్చిన తరవాత మొట్ట మొదటి పూర్తి బడ్జెట్ ఇది... నిజమే వారు చేసిన ప్రచారానికి ప్రజలు ఇన్ని ఆశలు పెట్టుకోవటంలో వింతేమీ లేదు. అయితే, ప్రజల ఆశలకి అనుగుణంగా, సామాజికవేత్తల ఆశయాలకి తగ్గట్టుగా రాబోయే బడ్జెట్టు ఉంటుందా...???

"ఉండదు" అని ఖచ్చితంగా బడ్జెట్టు రాకముందే చెప్పెయ్యచ్చు..ఇదేమిటి మీరు వేరే పార్టీవారా...? లేక మోడీ అంటే గిట్టదా.. లాంటి అనేక సందేహాలుండచ్చు... కానీ, చెప్పొచ్చేదేమిటంటే, ఇక్కడ మోదిగారో-జట్లిగారో, లేక ఏ సామాన్యుల పార్టీ ఆప్ వారో అయినా బడ్జెట్టు అనేది ఒకలాగానే ఉంటుంది... ఇది రాజకీయ నాయకుల బట్టో, పార్టీల బట్టో లేక విప్లవ నాయకుల బట్టో మారదు...కారణం అక్కడ దీనికి సంభందించిన ఒక వ్యవస్థ ఉన్నది, కట్టుబాట్లు ఉన్నవి...పరిమితులు ఉన్నాయి...వాటికి లోబడి మాత్రమే బడ్జెట్టు రూపకల్పన చెయ్యబడుతుంది .... అంతేగానీ, ఏ వ్యక్తిని బట్టో ఇట్టే మారిపోదు.

అక్కడ ఒక తెడ్డేసే పడవ ఉంటే...దానిని ఏ విమానం పైలెట్టో పోనిస్తే పైకెగరదు కదా...కనీసం వేగంగా కూడా పోదు...దాని తెడ్లు వేసే విధానం బట్టి అది ముణగకుండా ఎంత వేగంగా వెళ్ళగలదో అంతే వేగంగా వెళుతుంది...మన ఆర్ధిక వ్యవస్థ కూడా పూర్తిగా లాంటిదే.. పైగా ఈ తెడ్డేసే వాళ్ళు అవసరానికి మించి ఉన్నారు... వాళ్ళ బరువు వల్లనే పడవ మునిగేట్టుంది... పడవలో ఎక్కే వాళ్ళ కన్నా...తెడ్డేసే వాళ్ళ సంక్షేమమే ఎక్కువగా చూడాలిసిన పరిస్థితి దాపురించింది... 

కాబట్టి, ముందర మార్చవలసినది తెడ్డేసే పడవని అదే...ఆర్ధిక వ్యవస్థ-విధానాన్ని...ఆ తర్వాతే దానిని పోనిచ్చే వ్యక్తి గురించి ఆలోచించాలి...అంటే ఈ రోజున ఓ గొప్ప వ్యక్తీ వచ్చి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నా పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు... ఆ వ్యక్తీ ముందరగా మార్చవలసింది అక్కడ పరిపాలిస్తున్న వ్యవస్థని...ఆ తరవాతే ఎవరైనా ఏమైనా చెయ్యగలిగేది...అలా మార్చాలంటే, అది ఒక్కరోజులో కాదు కదా కొన్ని సంత్సరాలకి కూడా కుదిరేది కాదు... అయితే, ముందర ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అని అనిపిస్తుంది.... కానీ, అలా మొదలు పెట్టటానికి కూడా ఇవాళ ఉన్న వ్యవస్థలో ఊరుకునే పరిస్థితులు లేవు...

ఉదాహరణకి, పడవని తీసేసి అక్కడ స్టీమరు పెడదాము అని అనగానే..."మరి తెడ్డేసే వాళ్ళ సంగతి ఏమిటి" అని ఆ సంఘం వారు నిలదీస్తారు...ఆ బ్యురోక్రసి సంఘానికి రాజకీయ నాయకులు కూడా బానిసలే...ఆ బానిసత్వం నుండి బయటపడి, ఆ దిశగా మోదిగారు ఆలోచించి, "ప్రభుత్వ వ్యవస్థ అంటే ప్రజల నుండి పన్నులు వసులు చేసేదే మాత్రమే" అన్న అపోహ పోగొట్టే విధంగా మార్చిన తరవాత...అప్పుడు వచ్చే బడ్జెట్టులో ప్రజలకి పనికొచ్చే మంచి ప్రయోజనకరమైన విషయాలని మనం ఆశించ వచ్చును...

డ్జెట్టు ఆదర్శవంతంగా ఉండాలంటే...

1] ముందర బడ్జెట్టు తయారు చెయ్యటానికి అయ్యే ఖర్చుని తగ్గించాలి...అంటే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి... వచ్చే దానిలో అరవై శాతం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు "తయారు చెయ్యటానికే" ఖర్చు చేస్తే...ఇక ఆ కార్యక్రమాలని అమలు చెయ్యటానికి డబ్బేది....ఉదాహరణకి రైల్వేలో వచ్చిన ఆదాయంలో అరవై శాతం ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకే సరిపోతోంది...అలాగే మునిసిపాలిటీలలో అయితే వచ్చిన ఆదాయం కనీసం వారి ఉద్యోగుల జీతాలకి కూడా సరిపోవటం లేదు... ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థలో అయినా ఇదే తంతు...అందుకనే పాతకాలపు ఆర్ధిక వేత్త ఒకరు...ప్రభుత్వ ఆదాయంలో దాని వ్యయానికి 25 శాతం మించకుండా ఉంటేనే ఆ ప్రభుత్వం ప్రజలకేమైనా చెయ్యగలుగుతుంది అని అన్నాడు... అలా కాకుండా 100 కోట్ల ప్రజల దగ్గర పన్నులు వసులు చేసి కేవలం ఒక కోటి మంది సంక్షేమం కోసం ఖర్చు చేస్తే అది ఆదర్శ బడ్జెట్టు ఎప్పటికి కాదు... 

2] తరవాత, ప్రభుత్వం అంటే ప్రజలు బ్రతికే దారి చూపాలే కానీ, బ్రతికించే పని చెయ్యకూడదు...అంటే, ప్రజలు తమ పనులు తాము చేసుకుని బ్రతికేట్టు చెయ్యాలి... కానీ తమ రాజకీయ స్వార్ధం కోసం అనేక పధకాలంటూ ప్రవేశ పెట్టి వాటి ద్వారా పనులు చేసుకుందాం అనుకునే ప్రజలని కూడా చెడగొడుతున్నారు....అయితే, ఈ పధకాల ఖర్చుతో ఏ కొద్ది మందిని తప్ప సమాజాన్ని మొత్తాన్ని మార్చటం కుదరదు...ఇలా డైరెక్టుగా సమాజంలోని ప్రజలకి ఉపాధి పేరుతొ నిధులని దుర్వినియోగం చేసే కన్నా...ఆ ఉపాధి కల్పించే వారికి ప్రోత్సాహం ఇస్తే...అది ఏ కొందరికో కాక సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది...అంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకి పన్ను రాయతీలు ఇస్తే, వారి వలన ఉద్యోగ కల్పన జరుగుతుంది... అలాకాకుండా, ఉద్యోగాల ఇచ్చే పేరుతో ప్రభుత్వం తామే "కల్పిత ఉద్యోగాలని" సృష్టించ కూడదు...దీని వల్ల అనవసర ఖర్చు తప్ప ఉపయోగం ఉండదు...ఆ ఖర్చు కోసం తిరిగి సామన్య ప్రజల మీదే భారం వెయ్యాలిసి వస్తుంది. ఈ సంగతి ప్రభుత్వాలని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలకన్నా...ఏనాడు పరిపాలన చెయ్యకుండా, కేవలం సిద్దాంతాలు అంటూ రాధాంతం చేసే వారే ముందర తెలుసుకోవలసి ఉన్నది.

3] అలాగే, ప్రభుత్వ జోక్యం సామాన్యుల జీవితాల్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది...ఎవడైనా గాలికి తిరుగుతుంటే వాడి గురించి ప్రభుత్వానికి పట్టదు...కానీ, వాడేదో స్వంతంగా బ్రతకాలని చూడగానే... లైసెన్సులు, ఫీజులు, పర్మిషన్లు, పన్నులు అంటూ వాడిని బాధించి... స్వంతంగా బ్రతికేకన్నా, హాయిగా ఏ ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవటమే మేలు అని అనిపించేట్లు చెయ్యకూడదు...ఎవరో విదేశీయులకి ఫ్రీ జోన్లు అంటూ కల్పిచటం కాదు అదేదో దేశీయ ప్రజలకి అవకాశం ఇస్తే, ఆ విదేశీయుల కన్నా 100 శాతం అభివృద్ధిని చూపిస్తారు.... 

4] చేతిలో అధికారం ఉన్నది కదా అని ఉద్యోగులు కూడా... ఆయా బడ్జెట్టు రూపకల్పనలో తమ స్వార్ధం తాము చూసుకుంటున్నారు... ఉదాహరణకి పెన్షన్ మీద ఇంకం టాక్సు లేకుండా ఉండాలని వీరి వాదన... అవతల, సామాన్యులకి...నెలకి 15000/- వస్తే పన్నులు...దానిలో ఎంత రాయతి...ఆదిస్తే ప్రభుత్వానికి నష్టం అంటూ విపరీత వాదనలు ఈ ఉద్యోగులే చేస్తున్నారు... ఇక రాజకీయ నాయకుల సంగతి సరే సరి... తమ ఖర్చులు పెంచుకునే బిల్లుని తమ పార్టీల సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలసి, ఏకగ్రీవ నిర్ణయంతో పెంచేసుకుంటారు....అదే ప్రజలకి సంబంధించిన వ్యవహారంలో అయితే ...అది ఇంత-అంత నష్టం అంటూ లెక్కలు చెపుతారు...పైగా ప్రజలని త్యాగాలని చెయ్యమని... తమ ఏసీ రుముల్లోంచే సందేశాలని ప్రజలకి ఇస్తుంటారు...మరోప్రక్క తమ మూఢ నమ్మకాల కోసం అనవసర ఖర్చులు చేస్తూ. ఇంతకీ ఆ డబ్బు వసులు చేసేది రాజకీయ నాయకుల నుండి కాదు, ఉద్యోగుల నుండి కాదు... ప్రజల నుండే. ప్రజల నుండి వసులు చేసిన డబ్బుని ప్రజల కోసం ఖర్చు చెయ్యటం నష్టమని[లింకు నొక్కండి] మన దిక్కుమాలిన రాజకీయ ఆర్ధిక వేత్తలు అనుకున్నంత కాలం ప్రజలకి మేలు చేసే బడ్జెట్టు రాదు....

అప్పటిదాకా ప్రభుత్వం అంటే అది మన పనులకి అడ్డం రాకపోవటమే అది చేసే పెద్ద మేలు అని అనుకోండి......అందు వలన ఓ ప్రజలారా మీరు మీమీ పనుల మీదే దృష్టి పెట్టండి...రైల్వే బడ్జెట్టులాగానే ఇది కూడా దేవతా వస్త్రం లాగానే ఉండచ్చు... కాబట్టి, ఇలాంటి బడ్జెట్టుల మీద అనవసర ఆశలు పెంచుకోకండి..అవి అడియాశలై ఇప్పటిదాకా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీద కోపం పెరిగే అవకాశం కూడా ఉన్నది...


రాజకీయ మీడియా పులుల భాగోతం..
=========================================================

ఇది ఇలా ఉంటే, ఈ రైల్వే బడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ వస్తుందని అందరూ ఆశించారు...అయితే, అది రాకుండా ఉండటానికి ఎవరో కాకుండా,  మనవారే అడ్డు పడటం అసలు విశేషం. ఎలా అంటే, రైల్వే వారు దక్షిణ మధ్య జోన్ నుండి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను వేరుచేసి  జోన్ చేద్దామని, దానిని గుంటూరు లేక విజయవాడలో పెడదామని అనుకున్నారట...దానికి పేరుతొ సహా కావాలిసిన అనేకం జరిగిన తరవాత...దానిలో రాజకీయ జోక్యం ఎక్కువై..దీనిని విశాఖలో పెట్టాలని మొదలైయ్యింది...అలా పెట్టాలంటే ఒరిస్సా వారిని ఒప్పించాలిసిన పని పడింది... ఎక్కువ ఆదాయం వచ్చే విశాఖ డివిజన్‌ను వదులుకోవటానికి వారు ససేమిరా అంటున్నారు... ఈ గోలలోపడి, పెడితే అక్కడే పెట్టాలనీ, లేకపోతే అసలు పెట్టకూడదు అనేదాకా వెళ్ళింది...

వీళ్ళు మూర్ఖ్లులు కాకపొతే...ముందర జోన్ అంటూ చేసిన తరవాత, మిగిలినవి ఆలోచించ వచ్చును కదా... అభ్యంతరం లేని...విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ముందర జోన్ ఏర్పాటు చేస్తే, తరవాతి రోజుల్లో విశాఖ డివిజన్‌ను కూడా దానిలో కలపవచ్చునుకదా...అన్నీ ఇప్పుడే కావాలంటే అసలుకే మోసం వస్తోంది....ఇప్పుడు తెలుగుదేశం మరియూ బిజేపి వారితో కలసి కేంద్రంలో బలం ఉండి కూడా... ఒక లోకల్ పార్టీ నాయకుడు ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని ఎదిరించలేకపోతే...రేపు వచ్చే రోజులలో అక్కడ ఉన్న బలం కూడా పోయిన తరవాత ఇంకేమి చెయ్యగలరు....??? దీనిబట్టి అర్ధం అయిందేమిటంటే...తెలుగుదేశం బాబుగారి కన్నా, బిజేపి నాయుడు గారికన్నా...కేంద్ర ప్రభుత్వంతో సత్ సంబంధాలు లేని పట్నాయక్ గారి పార్టీనే బలంగా ఉన్నదనుకోవాలి...వారు వారి రాష్టంలోనే కాకుండా ఆంధ్రాలో కూడా చక్రం తిప్పగలుతున్నారు...మనవారు మీడియా పులుల గానే మిగిలి పనులు చేయించుకోవటంలో పిల్లులకన్నా హీనంగా ఉన్నారు... డివిజన్‌కు...జోన్‌కు తేడా తెలియని మన మీడియావారి గోల సరేసరి....  మన అనైక్యతే వారి బలంగా ఉన్నది....కాబట్టి, మన తెలుగు నాయకులు అనవసర వాచాలతని కట్టి పెట్టి, మీడియాలో పవర్ కాకుండా రియల్ పవర్ చూపించి మన రాష్ట్రానికి రావాలిసినవి సాధిస్తే వారికే మంచిది...@@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి గూగుల్...మిక్సింగ్ కేఆర్క్ 
@@@@@@@@@@@@@@

ఇంతకు ముందు వ్రాసిన కొన్ని వ్యాసాలు...
[క్రింది లింకులు నొక్కండి]జారిపడ్డ రూపాయి ......."ఇసయం" తెలియని భీమన్న.......!!!!

14, ఫిబ్రవరి 2015, శనివారం

రెండు నాలికల రాజకీయ-మీడియాలు...!!!!

ఒకటే న్యూస్ రెండు నాలికలు...
నల్గొండ సాక్షి ఎడిషన్ లో నీటి కోసం ఆంధ్రా జులుం అని వ్రాశారు...
గుంటూరు సాక్షి ఎడిషన్ లో తెలంగాణా హై డ్రామా అని ఉన్నది...
ప్రజలని ఇలా ప్రాంతాలకో విధంగా రెచ్చగొట్టే వీరు
 ప్రజా పక్షమైన మీడియానా...?

 గుంటూరు ఎడిషన్ 

నల్గొండ ఎడిషన్

ఆంధ్రజ్యోతి లోనూ ఇదే తంతు 

ప్రింట్ మీడియాల పరిస్థితి ఇలా ఉంటే... 
దరిదాపుల 20 న్యూస్ చానళ్ళ దుకాణాల పరిస్థితి 
మరోలా ఉన్నది...
 ఏది పూర్తిగా చెప్పలేరు.
"తెలుగు రాష్ట్రాలు" అని నెట్టుకోస్తున్నారు.
ప్రొద్దున్నే ఈ దుకాణాల్లో కూర్చుని 
న్యాయాన్ని చిన్నాభిన్నం చేసి చెప్పెయ్యగల 
సమర్ధులు అయిన పెద్ద మనుషులు కూడా 
పాపం ఏమీ చెయ్యలేక పోతున్నారు...
ఏమంటే ఎవడొచ్చి కొడతాడో 
ఎందుకొచ్చిన గొడవ అనుకొంటూ 
తమలో తామే కొట్టుకుంటునట్లుగా కనపడుతున్నారు.
ఇదీ వీళ్ళ సామాజిక బాధ్యత. 

ఇక 
రాజకీయ నాయకుల సంగతి సరే సరి 
"మాకు అన్ని ప్రాంతాలు ఒకటే"
"శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే"
"తెలుగు వారంతా ఒక్కటే"
ఇలాంటి డైలాగులతో
ప్రజలని మభ్య పెడుతున్నారు.
ఈ కొటేషన్ గాళ్ళు ఎన్ని చెప్పుకున్నా 
చట్టాన్ని అనుసరించి న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా...
దాన్ని...మీడియా వారు కానీ, 
రాజకీయ నాయకులు గాని 
ఎందుకు చెప్పలేకపోతున్నారు...

ఓకే, ఎవడి వ్యాపారం వాడిది.. 
అయితే, 
వీళ్ళ వ్యాపారానికి బలి అయ్యేది
సామాన్య ప్రజలా...
ఇలా కొట్టుకు చచ్చేట్లు చెయ్యకపోతే...
అప్పుడు శాసన సభకి బిల్లు వచ్చినప్పుడు 
చక్కగా చర్చించినట్లయితే ఈ గతి పట్టేది కాదు కదా....
ఏమన్నా ఇలాంటి గొడవ మొదలవగానే 
"నేను ముందరే చెప్పాను" అంటూ
ఒకడు అభినవ భ్రహ్మంలాగా బయలు దేరుతాడు...
ఇంత తెలిసిన వాడు, అప్పుడు ముఖ్య మంత్రే కదా...
అప్పుడే సభని సవ్యంగా నిర్వహించి 
ఇలాంటి అన్ని సమస్యలని చర్చించినట్లయితే 
ఏ గోలా ఉండేది కాదు కదా...
ఈ ముఖ్యమంత్రి చేసిన ద్రోహం చేసేసి
ఇప్పుడు 
అమాయక ప్రజల దగ్గర 
భ్రహ్మం బిరుదుని కొట్టేశాడు
ఈ తెలుగు రాష్ట్రాల కామన్ ద్రోహి.

ఇలా ఎవడి స్వార్ధం వాడు చూసుకొని
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, 
ఆత్మలు, శరీరాలు అంటూ ప్రజలని మభ్యపెడుతున్నారు...
అసలు ఎవడు కాదన్నాడని...?
రాష్ట్రాలు విడిపోయినా 
అటు ప్రజలు ఇటు, ఇటు ప్రజలు అటు 
తిరుగుతోనే ఉన్నారు...
ఒక్క రాష్ట్ర ఉద్యోగులు తప్ప...
అసలు వీళ్ళ వల్ల వచ్చిందే కదా ఈ రాద్ధాంతం.

ప్రజలని రెచ్చగొట్టి 
తమ మీడియా వ్యారాన్ని పెంచుకునేది కొందరైతే
మరికొందరు, 
అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లుగానో,
లేక, 
మేము కాదు ప్రక్కవాళ్ళు అన్యాయం చేస్తున్నారనో 
సమస్యలని ప్రక్కదారి పట్టించి
తమ తమ పార్టీలని అభివృద్ధి చేసుకుంటున్నారు...
ఇక ఉద్యోగుల సంగతి చెప్పనే అఖర్లేదు...
తమ 30 ఏళ్ల నెలవారీ జీతాల కోసం 
రాష్ట్రాన్నే ముక్కలు చేశారు...
వీరి నుండి ఆశించటం దురాశే...

వీళ్ళు 
నిజంగా తెలుగు ప్రజల మంచిని కోరేట్టుంటే
 ఇప్పటికైనా ఈ వీధి నాటకాలని కట్టి పెట్టి 
ప్రజలకి ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ
కనీసం కొట్టుకోకుండా చేస్తే 
అదే నాలుగో స్థంభం చేసే మంచి
అదే రాజకీయ నాయకులు చేసే ప్రజాసేవ...

@@@@@@@@@@@@

బొమ్మల కర్టేసి:సాక్షి


12, ఫిబ్రవరి 2015, గురువారం

బిజెపి హిందుత్వం వల్ల ఓడిందా...???

బిజెపి ఓడిపోయింది....రోగం వదిలింది....అంతే కావాలి...లేకపోతే ఏమిటీ ఈ మిడిసిపాటు...ఇలా రకరకాలుగా అందరూ అనుకున్నారు..ఎంతో ఐకమత్యంగా..ధిల్లీ ఎన్నికల ఫలితాల తరవాత. అయితే ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయినట్లు అనే దాని దగ్గరికి వచ్చేసరికి... తిట్టుకోవటంలో కనబరచినంత ఐకమత్యం కనపడలేదు...తలో దారిని తలో కారణం చూపించారు...మీడియా వారు ఇదంతా తమ గొప్పతనమే అని...తాము చేసిన ప్రచారం వల్లనే బిజెపికి తగిన శాస్తి జరిగింది అని... వారి దారిన వారు తమకి ఉన్న మీడియాలో  ఊదర కొట్టేశారు. 

ఇక ఆప్ పార్టీని అందరూ పైకేత్తేసే వారే... కాంగ్రెస్సు, కమ్యునిస్టు ఆ ఇస్టు ఈ ఇస్టు అని తేడా లేకుండా.....అందరి ఉద్దేశ్యంలో ఆ పార్టీని మెచ్చుకునే కన్నా బిజెపికి తగిన శాస్తి జరిగిందనే కసే ధ్వనించింది....పాపం  ఈ ఆనందంలో తమ పార్టీలు కూడా మట్టికోట్టుకుని పొయ్యాయి అన్న సంగతిని మరచిపోయ్యారు...

http://images.financialexpress.com/2015/02/Aam-aadmi-party-graph.jpg

ఇక మూడో తరగతి వాళ్ళు.........ఓ విశ్లేషణని చేసిపారేశారు...అదేమిటంటే...బిజెపి పైకేత్తుకున్న హిందుత్వం వల్లనే  ప్రజాగ్రహానికి గురై దిల్లోలో ఓడిపోయింది అని తేల్చారు...వీరి కోపం బిజెపి మీద కాదు హిందుత్వం మీదే... మరి వీరి మాటే నిజమైతే అక్కడ నిఖార్సు అయిన సేక్క్యులర్ పార్టీలు చాలానే నుంచున్నాయి కదా... అవి ఎందుకు డిపాజిట్లని కూడా కోల్పోయాయి అన్న ప్రశ్నకి వీరి దగ్గర జవాబు లేదు...ఉండదు...సమాధానం కూడా చెప్పారు... ఎందుకటే వీరికి హిందుత్వం అంటే ఎందుకో కోపం...{?}  సరే వీరి మాటలని ఊరికే కొట్టెయ్యకుండా వివరంగా చూద్దాం...

మొదట బిజెపిలోని హిందుత్వ ఎజండా వల్లనే అని  ఈ మూడో తరగతి వారి వివరణ...
ఇందుకోసం దిల్లీలోని ఉన్న అన్ని మతాల శాతం చూద్దాం...


ఇలా 81 శాతం మంది హిందువులు ఉన్న దిల్లీలో 
హిందుత్వ వ్యతిరేకం ఉండే అవకాశం లేదు కదా... 
పోనీ, 
అసలు సెక్యులరిజం పిచ్చి ఎక్కించు కున్నది హిందువులు మాత్రమే కదా...
కాబట్టి, ఇక్కడి సెక్యులర్ హిందువులు బిజెపికి వ్యతిరేకంగా వేశారని అనుకుందాము...
అప్పుడు,  
ఇప్పటికే అయిపోయిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలని చూద్దాం... 
అక్కడ 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 7 స్టానాలలో కూడా బిజేపినే గెలిచింది...  
అప్పుడు ఓడిపోయి రెండో స్థానంలో ఉన్నది 
సెక్యులర్ పార్టీలు అయిన ఏ కాంగ్రేస్షో లేక కమ్యునిస్టు పార్టిలో కాదు. 
సామాన్యుల పార్టీ అయిన "ఆప్" పార్టినే. 
 బిజెపి ఏమన్నా కొద్ది మార్జినుతో గెలిచిందా అంటే... 
లక్ష నుండి రెండున్నర లక్షల ఓట్ల మేజారిటితో గెలిచింది..   
అప్పటికే హిందుత్వ వాది అయిన మోడిని చూసే ధిల్లీ ప్రజలు ఓటు వేశారు...

ఇక ఇప్పుడు 
అసెంబ్లీ విషయానికి వస్తే 
ఆప్ చేతిలో చిత్తుగా ఓడిన గౌరవం పొందినది ఎవరూ....
కాంగ్రెస్ లేక కమ్యునిస్టులా కాదు...  
మళ్ళీ బిజేపినే....
70 నియోజక వర్గాలలో కేవలం "నాలుగింటిలో మాత్రమే" 
రెండవ పొజిషన్ గౌరవాన్ని పొందింది... సెక్యులర్ కాంగ్రెస్.  
కమ్యునిస్టులతో సహా మిగిలిన ఏ పార్టీకి దిక్కు మొక్కు కూడా లేకపోయింది....
అందువలన ఇది బిజెపికి మాత్రమే వ్యతిరేకం కానీ...హిందుత్వానికి కాదు...


అయితే, ఇంతకీ బిజెపి ఇంత చిత్తుగా ఓడిపోవటానికి కారణం....

I] బిజెపి పార్టీ వైపు నుండి..

1] గెలుపులతో పెరిగిన అహంకారం. విరోధి పార్టీని తక్కువగా అంచనా వెయ్యటం....
2] ఆ అహంకారంతో స్వంత వారినే లెక్కచెయ్యని తనం. అప్పటికే సీనియర్లు అయిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవటం. దాంతో వారి సహాయ నిరాకరణ.
3] పార్టిలో అమిత్ షా విపరీత చొరబాటు. లోకల్ గా నుంచోబెట్టే అభ్యర్దుల విషయంలో అనవసర జోక్యం.
4] మొన్నటి దాకా విరోధి పార్టిలో ఉండి...నానా బూతులు తిట్టినా కిరణ్ బేడిని దగ్గరకి రానియ్యటం.
5] ఆవిడ రాకతో అప్పటికే ధిల్లీ పదవులు ఆశిస్తూ ఉన్న వారి సహాయ నిరాకరణ.


II] ఆప్ పార్టీ వైపు నుండి:

1] అంతకు ముందు ఓటమికి సరైన ఆత్మ విమర్శ.
2] తప్పుని మొహమాటం లేకుండా ఒప్పుకుని క్షమాపణలు అడగటం.
3] అభ్యర్ధుల ఎంపికలో తమదైన శైలిలో కొత్తవారికి....
4] తమ పార్టీ వారిని బిజెపి వారు లాక్కొన్న విధానాన్ని ఎండగట్టటం...
5] ప్రాంతీయ సమస్యల పట్ల క్రింది తరగతి వారి వరకూ వెళ్ళటం...

III] కాంగ్రెస్సు పార్టీ వైపు నుండి:

1] వీరు వ్యుహాత్మకముగా ఆప్ పార్టీ వారికి సహకరించటం. వీరు ఇదే పనిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా చేశారు. ఇక్కడ జగన్ పార్టీ రాకుండా తెలుగు దేశానికి బాహాటంగానే సహకరించారు.

IV] ధిల్లీ ప్రజలు:

అన్నీ ఏవేవో విశ్లేషణలే గానీ... ప్రజలని పట్టించు కోలేదు ఎవ్వరు... నిజానికి ఎన్నికలలో హీరోలు ప్రజలే... వీరు పార్లమెంటు ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి మారిపోయిన కారణాలు...

1] ఏ హిందుత్వ పునాదులపై బిజెపి ఉన్నదో దానినే బిజెపి వారు నిర్లక్ష్యం చెయ్యటం... బిజేపి వారు కాశ్మీరులో అధికారం కోసం వెంపర్లాడి,  తమకి అంటరాని పార్టీలతో జత కట్టాలన్న ఆరాటమే ప్రజల మనసుని మార్చేసింది... ఇది కేవలం దిల్లిలోనే కాదు యావత్ భారత దేశంలోనే మారింది...కాకపొతే డిల్లిలో  ఎన్నికలు కాబట్టి వెంటనే తెలిసింది....ఇప్పటికిప్పుడు మళ్ళి పార్లమెంటు ఎన్నికలు వస్తే...ఇప్పుడు వచ్చినన్ని సీట్లు మళ్ళీ రావు...కారణం బిజెపి వారు అధికారం కోసం హిందుత్వాన్ని నిర్లక్ష్యం చెయ్యటమే...

2] బిజెపి వచ్చిన తరవాత వారి ప్రవర్తనలో కొత్తదనం ఏమీ లేదు...కాంగ్రెస్సు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో...అలానే వీరు ఉన్నారు. వారు చేసిన పనులనే వీరు కంటిన్యు చేశారు... కాంగ్రెస్సుకి బిజెపికి తేడా లేదని ప్రజలకి అనిపించింది.

3] దేశీయం అని పేరుకేగాని....నినాదాలు తప్ప ఆ దిశగా చేసిందేమీలేదు...చెప్పిందే చెపుతుంటే ఎన్నాళ్ళు మాటలతో కాలేక్షేపం చేస్తారు ప్రజలు.....

4] ఇంతకు ముందు ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసిన పాపం కాంగ్రెస్సు కన్నా బిజెపి పైనే పడింది... ఎందుకటే ప్రజలు బిజెపి... కాంగ్రెస్సులాగా చెయ్యదని నమ్మారు. ఆ నమ్మకాన్ని బిజెపి వారు తమ కుళ్ళు రాజకీయాలతో వమ్ము చేశారు...ఇలాంటి కుళ్ళు రాజకీయమే బిహార్ రాష్ట్రంలో కూడా నడవటంతో... నమ్మని కాంగ్రెస్ కన్నా నమ్మిన బిజెపి పైనే ఎక్కువ కోపాన్ని ప్రజలు చూపించారు....

5] క్రిందటి సారి ఎదో చేద్దామని వచ్చిన కేజ్రివాలుని ఏమీ చెయ్యకుండానే దింపటంతో ఆయన మీద విపరీత సింపతి...పైగా ఆయన తన తప్పులని ప్రజల వద్ద మొహమాటం లేకుండా ఒప్పుకోవటం.....మరో ప్రక్క అహంకారంతో ఉన్న బిజెపి...రెండిటి భేదం ప్రత్యేక్షంగా కనపడటంతో...ఈ సారి ఆప్ కి  అవకాశం ఇద్దాం అనుకున్న ప్రజలు....

ఇలా వచ్చిన సంవత్సరానికే తమ విపరీత ప్రవర్తనతో ప్రజలకి విరక్తి పుట్టించిన బిజెపివారు ఓడిపోవటం విచిత్రమేమి కాదు.... ఎన్నికల ఫలితాల ముందరే ప్రజలు  "ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోతేగానీ బుద్ధి రాదు" అని అనుకోవటం జరిగింది....ఈ ఫలితాల తరవాత కేవలం బిజెపి శత్రువులే కాకుండా మిత్ర పక్షాలు అయిన తెలుగుదేశం లాంటి పార్టీలలో కూడా ఆనందమే కనబడింది...కొసమెరుపు ఏమంటే...అనేక మంది బిజెపి నాయకుల మొహాల్లో ఇటువంటి ఆనందమే తొంగి చూడటం...

కాబట్టి, బిజెపి వారు తమని ప్రజలు ఎందుకు నమ్మారో... ఆ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా... కుళ్ళు రాజకీయాలని కట్టి పెట్టి...దేశాభివృద్ధికి ఎవరూ కలిసి వస్తే ...వారిని వారి పార్టీలలోనే ఉండనిచ్చి వారిని కలుపుకుని... విదేశి పిచ్చ మానుకుని దేశీయంగా అభివృద్ధి ఎలా జరగాలో...దానికి దేశ ప్రజలని వాడుకుని...తద్వారా వారికి ఉపాధిని కల్పిస్తే...ఇలాంటి చెడు అనుభవాలు వారికి ఎదురుపడవు...


చివరిగా ఒక మూర్ఖుడి గురించి[లింక్ నొక్కండి]...ఈయన గారు ఎక్కడికి పోయినా ప్రజాసామ్యాన్ని నిలబెడుతున్న భారతీయ ప్రజలని తిట్టటమే పనిగా పెట్టుకున్నాడు.  ఈయనగారి దృష్టిలో భారతీయులు మూర్ఖులు, పశువులు తదితరాలు... 

ఇతను చెప్పినట్లే ప్రజలు ఓట్లు వేసేట్టుంటే... డైరెక్టుగా RSS ఎప్పుడో రాజకీయ పార్టీ అయి, దేశాన్ని ఏలుతుండేది... కనీసం ఇప్పుడు దిల్లీలో ఉన్న 81 శాతం మంది హిందువులలో సగం అంటే 40 శాతం మంది బిజెపిని హిందూ పార్టిగా మాత్రమే చూసుంటే, అది గెలిచి ఉండేది... కానీ, ప్రజలు బిజెపిని హిందూ పార్టిగా మాత్రమే కాకుండా ఇతర విషయాలలో కూడా మంచి చెడులు చూడటం వల్లన ఫలితాలు పార్లమెంటుకి-అసెంబ్లీకి తేడా వచ్చాయి... మరి ఈ సంగతి ఇతనికి ఎవరూ చెపుతారు...కేవలం కులాలే చూసుంటే అత్యధికంగా ఉన్న బిసి లు మాత్రమే రాజకీయాలలో ఉండే వారు... 

ఉద్యోగం చేసినంతకాలం జీతాలు...టియ్యేలు...డియ్యేలు అని ఏడిచిన ఇతనికి సామాన్య ప్రజల కష్టాలు తెలియవా...ఈ పిచ్చి వాగుడు[లింకు నొక్కండి] అప్పుడు వాగితే ఉద్యోగం ఊడుతుందని భయపడ్డాడా....రిటైరు అయిన తరవాతే పతివ్రతా అయినాడా...మీడియాలో సినితారాలకే ప్రాధాన్యం అన్న ఈ పెద్ద మనిషి, జైలు శిక్షపడ్డ సంజయ్ దత్తుని ఎందుకు వెనకేసుకొచ్చాడు[లింక్ నొక్కండి]....

ఇది ఇలా ఉంటే, ప్రజాసామ్యంలో ప్రజలని అవమానిస్తున్న ఇతని మీద ఎందుకు కేసు పెట్టటం లేదు...రాజకీయ నాయకులకేనా ఆత్మాభిమానం వగైరాలు...చివరికి చనిపోయిన నాయకుడి మీద కామెంటు పెట్టిన ఇద్దరు ఆడపిల్లలని అరెస్టు చేసిన చట్టానికి ప్రజల విషయంలో ఏమైయ్యింది...చట్టం తన పని తాను చేసుకోలేకపోతోందా... ఇప్పటి దాకా ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సరిగ్గా ఏర్పడలేదనే కదా ఇతని ఉద్దేశ్యం...మరి ఇతని మీద చర్య ఎందుకు తీసుకోరు...ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే... ముందు ముందు దేశాన్ని...దేశ ప్రజలని తిట్టే ఫేషన్ తగ్గుతుంది...అలా చేసి పేరు తెచ్చుకుందాము అనుకునేవారికి హెచ్చరికగా ఉంటుంది కదా....@@@@@@@@@@@@@@@

బొమ్మల కర్టేసి: ఈనాడు మరియు గూగుల్ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఒబామా గారు ముందర మీ దేశం సామరస్యం గురించి చూసుకోండి...!!!

ఫోటో కర్టేసి:ఈనాడు 

ఇప్పుడేదో భారతదేశంలో సరిగా లేదంట...
భారత్ లో  ఉన్న  పరిస్తితికి గాంధీగారు బాధపదతారట...
ఇన్ని మతాలవారు సమాన హక్కులతో బ్రతుకుతున్న 
భారతదేశంలో మతసహనం లేదు అనే జోకు పేల్చారు... 
చివరిగా రెండు ముక్కలు వారి గురించి చెప్పుకుని 
అదంత ముఖ్యమైనది కానట్లు 
 గాంధీగారి పేరు సాకుతో భారత్ గురించి అవాకులు చెవాకులు పేలిన ఒబామా.
 ఇక్కడే సహనం లేకపోతే భారత్ ఎప్పుడో అమెరికా అయ్యేది కదా...!!!

120 కోట్ల ప్రజల సహనం గురించి ఆయనగారు ఏదో ఆయనకీ తోచింది చెప్పేస్తున్నారు....
నిజానికి 120 కోట్ల ప్రజలు అసహనానికి గురి అవుతే ఏమవుతుంతో ఆయనకీ తెలియంది కాదు...
బహుశా మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా 
యురప్పు మొత్తం  జనాభా 120 కోట్లు ఉండి ఉండదు...
ఉన్న ఆ కాస్త జనమే కొట్టుకుని 
ప్రపంచం మొత్తాన్ని బాధపెట్టి కోట్ల మందిని చంపింది కాక...
అదేదో గొప్ప కార్యం అయి 
లోక కళ్యాణానికే తాము చేసినట్లుగా 
కేవలం జర్మని, ఇటలి, జపాను దేశాలే ప్రపంచ శత్రువులు అయినట్లు..
వారు మాత్రమే ప్రపంచం పై దురాక్రమణ చేసినట్లు
మిగిలిన యురప్పు దేశాలు పతివ్రతలు అయినట్లు చూపించారు.
అసలి లోపలి విషయం అయితే, 
తాము ఆసియా/ఆఫ్రికా/అమెరికా దేశాల మీదపడుతుంటే
ఈ మూడు దేశాలు మనమీద పడుతున్నాయి అన్న అక్కసుతో
ఆ మూడు దేశాలని దోషులుగా నిలబెట్టి 
వాటిని నాశనం చేసిందే కాక 
ఆ తప్పుని కప్పిపెట్టటానికి 
వాటికి "ప్రపంచ యుద్ధం" అని పెరేట్టేసుకున్నారు..
ఇప్పుడు వారేదో ప్రపంచ శాంతికి ప్రతినిధులుగా వారికి వారే అనుకుంటున్నారు....
ఓ ప్రక్కన ఆయుధాల వ్యాపారాలు చేసుకుంటూనే....
వీళ్లా భారత్ గురించి వాగేది
 అసలు అర్హత అనేది ఉన్నదా...


బాబూ ఒబామా గారు,  ముందర  మీ  దేశం  సంగతి చూసుకోండి...
మీ యురప్పు మిత్ర దేశాల గురించి ఆలోచించండి. 
అక్కడి మీ సహచర నీగ్రోల దుస్తితి మరియూ ఇతర మతస్తుల గురించి ఆలోచించండి... 
మీ దేశంలో పేరుకి ప్రజా సామ్యమే కానీ 
సరిగ్గా ప్రజలందరూ సమాన హక్కులు పొందుతునారా అనే సంగతి చూడండి...
అక్కడి అసియన్స్ ప్రజలు మాత్రమే బయటి నుండి వచ్చిన వారుగా చూస్తూ, 
యురోపియన్లు అక్కడి వారే అన్నట్లుగా ఉండే మీ వివక్ష చట్టాల గురించి ఆలోచించండి... 
వేడుకకు అతిథిగా వచ్చి ఆ యింటినే విమర్శించే మీ సుగుణం గురించి ఆలోచించండి... 

ఇక్కడ మాకు మత సహనం ఉండబట్టే అన్ని మతాల వాదనలు వినపడుతున్నాయి... 
మీ దేశంలో రెండు భవనాలని కూల్చినంతమాత్రానే
మీ దేశం మరియు మీ మిత్ర దేశాలలో ఎంతమంది ముస్లిం ప్రజలని హత్యలు చేశారో...
ఎన్ని మసీదులు కూల్చారో మాకు చెప్పకపోయినా మీకు తెలుసు...
ఇప్పటికీ ముస్లిమ్స్ లాగా ఉండే అక్కడి శిక్కులు 
పడే బాధలు చూస్తే...ఇక ముస్లిమ్స్ గతి ఏమిటో అందరికి తెలుస్తోనే ఉన్నది...
 ఆ రెండు భవనాలని కూల్చినందుకు 
రెండు దేశాలని నాశనం చేసేంత సహనం మాకు లేదు... 
అందుకనే 
మీ లాంటి వారు వచ్చి తిని పోయిన తరవాత
 పిచ్చి వాగుడులు వాగగలుగుతున్నారు... మా గాంధిజీ బాధ గురించి  కన్నా 
నీగ్రోలు మరియూ బడుగు జీవుల గురించి ఆలోచించి 
హత్యలకి గురైన 
మీ మార్టిన్ లూధర్ కింగ్ మరియూ అభ్రహాం లింకన్ లాంటి 
నాయకుల బాధని గురించి ఆలోచించి వారి బాధని ఇప్పటికైనా తీర్చండి...
సరిగ్గా చూస్తే మా దేశానికి సముద్ర మార్గానికి కనిపేట్టటానికి బయలుదేరినప్పుడే 
"మీ దేశం అనేది ఉన్నదని తెలిసింది" అన్న సంగతి తెలుసుకోండి.
అప్పటికే మా దేశంలో వ్యాపారం, మతసామరస్యం తదితారాలు ఉండబట్టే 
మీ యురోపియన్లు-అరబ్బులు మా దేశం మీదకు ఎగబడ్డారు... 
కాబట్టి మా సహనం గురించి మీరు కొత్తగా మాకు చెప్పవలసిన పనిలేదు....
జై హింద్ 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

5, ఫిబ్రవరి 2015, గురువారం

కాంగ్రెస్సు గతే మీకు పట్టాలా....

ఆత్మగౌరవ యాత్ర ఇదివరకు ఎవరో చేశారు గానీ... ఇప్పుడు ఆంద్రరాష్ట్ర ప్రజల కోసం మళ్ళి  ఆ దారి పట్టలిసిన అవసరం కనపడుతోంది... మొన్నటి దాకా ఎవరి  చేత నానా బూతులు తిన్నారో వారి ప్రాపకం కోసం ఆంధ్రా నాయకుల తాపత్రయం చూస్తుంటే "వీరు ఎక్కడి నాయకులు" అని అనిపించక మానదు...పైగా వారి స్వప్రయోజనాల కోసం ఆంధ్రా ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు... అధికార పార్టీ వారు హైదరాబాదు నుండీ వస్తామంటునే అక్కడి నుండి రావటానికి ఎందుకనో నానా బాధలు పడుతున్నారు...ఆంద్ర రాష్ట్రానికి సంబంధించిన డబ్బు...చదవు విషయంలో వాళ్ళు నిర్మొహమాటంగా ఉంటే... విద్యుత్ మరియూ నీళ్ళ విషయంలో వీళ్ళు ఎంతో ఉదాసీనంగా ఉంటూ ఏ మాటంటే తెలంగాణలో మళ్ళీ గెలవలేకపోతామో అన్న భయంతో వణికి పోతున్నారు... అధికారం ఇచ్చిన ప్రజల ప్రయోజనాలని ఫణంగా పెట్టి...తెలంగాణలో గెలవాలనే దిక్కుమాలిన ఆలోచనలో వారున్నారు..."బాబూ అధికార పార్టీ వారూ మీకు ప్రక్క రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మీ స్వంత డబ్బులు, స్వంత శ్రమతో చూపించండి"....అంతేకానీ అధికారమిచ్చిన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టకండి....ఉన్నది కూడా పోతుంది... దీని గురించి ఇదివరకే  ఇదే బ్లాగులో "బాబుగారూ బేల మాటలేల...ఏవరి ప్రాపకం కోసము...???" మరియు "ఆంధ్రప్రదేశ్‌నకు ఫుల్ టైం ముఖ్యమంత్రి కావలెను...!!!" అని వ్రాయటం జరగింది...[లింకులు నొక్కండి] వీరితో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన ఉద్యోగులు  కూడా స్వంత రాష్ట్రానికి రావటానికి ఎందుకనో మొహమాటం పడుతున్నారు... 

ఒకే వార్తని ప్రాంతానికో రకంగా...

ఇక ప్రతిపక్ష నాయకుల సంగతి చెప్పనే అక్కర్లేదు... ఇదివరలో  తెలంగాణా ఉద్యమం పేరుతొ అక్కడి పార్టీల వాళ్ళు ఆంధ్రావారిని తిట్టినట్లుగా...ఇప్పుడు, వీరు అధికార పార్టిని తిడుతున్నామనుకుని ఆంధ్రా ప్రజలని అవమానిస్తున్నారు...అదికాక...రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రత్యేక హోదా కోసం కొందరు పోరాడుతుంటే...వీరు ఎక్కడెక్కడి లెక్కలో వేసి ఆంధ్రాలో ఆదాయం బాగానే ఉన్నదనీ, కాబట్టి దీనికి ప్రత్యేక హోదా అవసరం లేదని లెక్కలతో సహా వ్రాసేస్తున్నారు..."వీరు ప్రతిపక్షంగా ఉన్నది తెలుగుదేశం పార్టీకా లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకా" అనేది అర్ధం కావటం లేదు. ప్రతిపక్షం పార్టీ వారూ...మీరు ఉన్నది అధికార పార్టీని కట్టడి చెయ్యటానికి, ఆంధ్రులని అవమానించిన కాంగ్రెస్సు పార్టీని ప్రక్కనపెట్టి  మీకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చినది అందుకే... ఉద్యమం సమయంలో దిక్కుమాలిన పార్టీలా ఆంధ్రులని అవమానించటానికి కాదు...రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్సుకి ప్రత్యామ్నామంగా అధికారం ఇవ్వటానికి కూడా... అయితే, ఇప్పుడు ఇలాగే ఎవరినో తిడుతున్నామని అనుకునే రాష్ట్ర ప్రజలని అవమానించి వారికి రావాలిసిన ప్రయోజనాలని దెబ్బతీస్తే...కాంగ్రేస్సుకి పెట్టిన గతే మీకు పడుతుంది...


ఈ ముందరి మాటలు ఏమయ్యాయి... ఏరు దాటాక...

దిల్లి అధికార పార్టీ బిజేపి విషయానికోచ్చినా ఆంధ్రులకి వాళ్ళు పికేందేమి కనపడటం లేదు...ఇప్పుడు జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ఇలాగే జరగనిస్తే  ఆ మంచి పేరు తెలుగుదేశం పార్టీకి ఎక్కదోస్తుందో అనే దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలిసిన ప్రయోజనాలని త్రొక్కి పెడుతున్నారు... ఉన్న ఒకరిద్దరు పార్టీ సభ్యులతోనే ఎదో సాధించాలని చూస్తున్నారు...ప్రేత్యేక హోదా ఇవ్వాలిసి ఉండగా...పేకేజీలతో కప్పిపెడుతున్నారు... "అయ్యా వెంకయ్యనాయుడుగారు ఆ రోజున కాంగ్రెస్సు అన్యాయం చేస్తోందని సభా సాక్షిగా ఏవేవో కోరికలు అప్పటి ప్రధాన మంత్రిగారి చేత ప్రమాణం చేయించుకుని... తీరా మీరే కోర్కెలు తీర్చే వారుగా మారినా కూడా... ఎందుకు మాటల గారడితో ప్రక్కదారి పట్టిస్తున్నారు...??? పాపం మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్సుకి పట్టిన గతి పూర్తిగా తెలియకపోవచ్చును..మీకు తెలుసును కదా కాంగ్రెస్సు ఎంత పవర్ ఫుల్ పార్టీ అయినా... ఎందుకని ఇక్కడ మట్టికోట్టుకుని పోయిందో...అదే గతి మీ పార్టికి పట్టాలన్నా ముందర కాంగ్రెస్ అంత పెరగాలికదా... ఇప్పుడే మీ పార్టీని ఆంద్ర ప్రజలు మూల కూర్చోపెడతారు అని కూడా చెప్పలేము కదా...ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో పెరిగితే కదా పొయ్యారు అనే గౌరవం అయినా దక్కేది...దిల్లి ఎన్నికల సందర్భంగా... "దేశం ఏ తప్పునైనా సహిస్తుంది కానీ, మోసాన్ని సహించదు" అని మోడీ గారు అన్నారు.... కాబట్టి మార్వారీ తెలివితేటలు ప్రక్కన పెట్టి, రాష్ట్రానికి రావాలిసిన ప్రయోజనాలు అన్నీ ఇప్పించి, ఆదిలోనే పార్టీ కధ ముగిసిపోకుండా చూసుకోండి...అలా కాకుండా మీకిచ్చిన ఈ అవకాశాన్నిదుర్వినియోగం చేసుకుంటే, తిరిగి కాంగ్రెస్సుకి మీ తప్పులని సద్వినియోగం చేసుకునే అవకాశం మీరే ఇచ్చినట్లు అవుతుంది...!!!


ప్రక్క రాష్ట్రం టివీలలో ఇలాగే వస్తుంది మరి
ఒకాయన ఏ పికి మాత్రమే సిఎం.....మరొకాయన మొత్తానికి  సి ఎం 

చివరిగా మీడియా దగ్గరకి వస్తే... వీరు హైదరాబాదు వదలకుండానే ఓ కొత్త మాట...."తెలుగు రాష్ట్రాలు"...అనేది కనిపెట్టి...దానితోనే నెట్టుకుని రావాలని చూస్తున్నారు... అయితే, వారి భాషలోనే తాము ప్రక్క రాష్ట్రం టివీ వాళ్ళమని చెప్పకనే చెపుతున్నారు... తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన ఏ మంత్రి మాట్లాడినా... "ముఖ్యమంత్రి ఇలా అన్నారు, హోం మంత్రి అలా అన్నారు" అని తమ వార్తలలో చెపుతున్నారు... అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారి గురించి..."ఏపి సిఎం ఇలా అన్నారు...ఏపి అధికారులు అలా అన్నారు" అంటూ తమ పరాయి తత్వాన్ని వారే చాటుకుంటున్నారు ...  "అక్కడ ఆంధ్రప్రదేశ్" అని అనే బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చానళ్ళని మొదలు పెట్టవచ్చును కదా...ఇక్కడి ప్రకటనలతో డబ్బు కావాలి కాని... ఇక్కడికి రావాలంటే డబ్బు ఖర్చు పెట్టటం ఈ విశాల హృదయ్యంగల మీడియా వారికి ఇష్టం లేదు....కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ప్రేక్షకుల మన్ననల్ని పొందాలంటే ఇక్కడికొచ్చి "ఇక్కడి విషయాలతోనే వార్తలని చూపించి....ఆంధ్రా ప్రాంతపు ప్రజల అభిమానాన్ని చూరగొనటమే కాకుండా...హైదరాబాదులో కూర్చుని చేసే నారద కార్యక్రమాల వలన... చెడే ఆంధ్రా-తెలంగాణా సంబంధాలని కూడా మేరుగుపడేట్లు చెయ్యచ్చు"....అయితే వీరివల్ల పెద్ద ఉపయోగం లేదనుకోండి...వీరి ధైర్యం అంతా రాజకీయ నాయకుల వెంటపడి సొల్లు కార్చే వార్తల పట్లే కానీ...మొన్నటికి మొన్న ఇక్కడ విశాఖలో తుఫాను వస్తే, ఆ తుఫాను దృశ్యాలని చిత్రీకరించటానికి సరిపోలేదు...తుఫానుకి ఉన్న రెండు మూడు విడియోలు ఎవరో ఎమెట్యూర్స్ తీసినవే...ఉండటానికి ఓ 20 తెలుగు న్యూస్ చానళ్ళు ఉన్నాయి ఏం ఉపయోగం...

ఇవ్వన్నీ చూస్తుంటే...

"నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 

అన్నీ నవ్యంగానే ఉండాలిసిన అవసరం కనపడుతోంది...

కొత్త రాజధాని, 

కొత్త రాజకియపార్టీ[కేవలం ఈ ప్రాంతానికే సంబంధించినది], 

కొత్త మీడియా... 

అప్పుడుగాని 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న వనరులకి తగ్గట్టుగా అభివృద్ధి చెందదు"...

అని అనిపిస్తోంది...


@@@@@@@@

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@