LOCAL WEATHER

14, ఫిబ్రవరి 2015, శనివారం

రెండు నాలికల రాజకీయ-మీడియాలు...!!!!

ఒకటే న్యూస్ రెండు నాలికలు...
నల్గొండ సాక్షి ఎడిషన్ లో నీటి కోసం ఆంధ్రా జులుం అని వ్రాశారు...
గుంటూరు సాక్షి ఎడిషన్ లో తెలంగాణా హై డ్రామా అని ఉన్నది...
ప్రజలని ఇలా ప్రాంతాలకో విధంగా రెచ్చగొట్టే వీరు
 ప్రజా పక్షమైన మీడియానా...?

 గుంటూరు ఎడిషన్ 

నల్గొండ ఎడిషన్

ఆంధ్రజ్యోతి లోనూ ఇదే తంతు 

ప్రింట్ మీడియాల పరిస్థితి ఇలా ఉంటే... 
దరిదాపుల 20 న్యూస్ చానళ్ళ దుకాణాల పరిస్థితి 
మరోలా ఉన్నది...
 ఏది పూర్తిగా చెప్పలేరు.
"తెలుగు రాష్ట్రాలు" అని నెట్టుకోస్తున్నారు.
ప్రొద్దున్నే ఈ దుకాణాల్లో కూర్చుని 
న్యాయాన్ని చిన్నాభిన్నం చేసి చెప్పెయ్యగల 
సమర్ధులు అయిన పెద్ద మనుషులు కూడా 
పాపం ఏమీ చెయ్యలేక పోతున్నారు...
ఏమంటే ఎవడొచ్చి కొడతాడో 
ఎందుకొచ్చిన గొడవ అనుకొంటూ 
తమలో తామే కొట్టుకుంటునట్లుగా కనపడుతున్నారు.
ఇదీ వీళ్ళ సామాజిక బాధ్యత. 

ఇక 
రాజకీయ నాయకుల సంగతి సరే సరి 
"మాకు అన్ని ప్రాంతాలు ఒకటే"
"శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే"
"తెలుగు వారంతా ఒక్కటే"
ఇలాంటి డైలాగులతో
ప్రజలని మభ్య పెడుతున్నారు.
ఈ కొటేషన్ గాళ్ళు ఎన్ని చెప్పుకున్నా 
చట్టాన్ని అనుసరించి న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా...
దాన్ని...మీడియా వారు కానీ, 
రాజకీయ నాయకులు గాని 
ఎందుకు చెప్పలేకపోతున్నారు...

ఓకే, ఎవడి వ్యాపారం వాడిది.. 
అయితే, 
వీళ్ళ వ్యాపారానికి బలి అయ్యేది
సామాన్య ప్రజలా...
ఇలా కొట్టుకు చచ్చేట్లు చెయ్యకపోతే...
అప్పుడు శాసన సభకి బిల్లు వచ్చినప్పుడు 
చక్కగా చర్చించినట్లయితే ఈ గతి పట్టేది కాదు కదా....
ఏమన్నా ఇలాంటి గొడవ మొదలవగానే 
"నేను ముందరే చెప్పాను" అంటూ
ఒకడు అభినవ భ్రహ్మంలాగా బయలు దేరుతాడు...
ఇంత తెలిసిన వాడు, అప్పుడు ముఖ్య మంత్రే కదా...
అప్పుడే సభని సవ్యంగా నిర్వహించి 
ఇలాంటి అన్ని సమస్యలని చర్చించినట్లయితే 
ఏ గోలా ఉండేది కాదు కదా...
ఈ ముఖ్యమంత్రి చేసిన ద్రోహం చేసేసి
ఇప్పుడు 
అమాయక ప్రజల దగ్గర 
భ్రహ్మం బిరుదుని కొట్టేశాడు
ఈ తెలుగు రాష్ట్రాల కామన్ ద్రోహి.

ఇలా ఎవడి స్వార్ధం వాడు చూసుకొని
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, 
ఆత్మలు, శరీరాలు అంటూ ప్రజలని మభ్యపెడుతున్నారు...
అసలు ఎవడు కాదన్నాడని...?
రాష్ట్రాలు విడిపోయినా 
అటు ప్రజలు ఇటు, ఇటు ప్రజలు అటు 
తిరుగుతోనే ఉన్నారు...
ఒక్క రాష్ట్ర ఉద్యోగులు తప్ప...
అసలు వీళ్ళ వల్ల వచ్చిందే కదా ఈ రాద్ధాంతం.

ప్రజలని రెచ్చగొట్టి 
తమ మీడియా వ్యారాన్ని పెంచుకునేది కొందరైతే
మరికొందరు, 
అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లుగానో,
లేక, 
మేము కాదు ప్రక్కవాళ్ళు అన్యాయం చేస్తున్నారనో 
సమస్యలని ప్రక్కదారి పట్టించి
తమ తమ పార్టీలని అభివృద్ధి చేసుకుంటున్నారు...
ఇక ఉద్యోగుల సంగతి చెప్పనే అఖర్లేదు...
తమ 30 ఏళ్ల నెలవారీ జీతాల కోసం 
రాష్ట్రాన్నే ముక్కలు చేశారు...
వీరి నుండి ఆశించటం దురాశే...

వీళ్ళు 
నిజంగా తెలుగు ప్రజల మంచిని కోరేట్టుంటే
 ఇప్పటికైనా ఈ వీధి నాటకాలని కట్టి పెట్టి 
ప్రజలకి ఏమీ చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ
కనీసం కొట్టుకోకుండా చేస్తే 
అదే నాలుగో స్థంభం చేసే మంచి
అదే రాజకీయ నాయకులు చేసే ప్రజాసేవ...

@@@@@@@@@@@@

బొమ్మల కర్టేసి:సాక్షి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి