LOCAL WEATHER

12, ఫిబ్రవరి 2015, గురువారం

బిజెపి హిందుత్వం వల్ల ఓడిందా...???

బిజెపి ఓడిపోయింది....రోగం వదిలింది....అంతే కావాలి...లేకపోతే ఏమిటీ ఈ మిడిసిపాటు...ఇలా రకరకాలుగా అందరూ అనుకున్నారు..ఎంతో ఐకమత్యంగా..ధిల్లీ ఎన్నికల ఫలితాల తరవాత. అయితే ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయినట్లు అనే దాని దగ్గరికి వచ్చేసరికి... తిట్టుకోవటంలో కనబరచినంత ఐకమత్యం కనపడలేదు...తలో దారిని తలో కారణం చూపించారు...మీడియా వారు ఇదంతా తమ గొప్పతనమే అని...తాము చేసిన ప్రచారం వల్లనే బిజెపికి తగిన శాస్తి జరిగింది అని... వారి దారిన వారు తమకి ఉన్న మీడియాలో  ఊదర కొట్టేశారు. 

ఇక ఆప్ పార్టీని అందరూ పైకేత్తేసే వారే... కాంగ్రెస్సు, కమ్యునిస్టు ఆ ఇస్టు ఈ ఇస్టు అని తేడా లేకుండా.....అందరి ఉద్దేశ్యంలో ఆ పార్టీని మెచ్చుకునే కన్నా బిజెపికి తగిన శాస్తి జరిగిందనే కసే ధ్వనించింది....పాపం  ఈ ఆనందంలో తమ పార్టీలు కూడా మట్టికోట్టుకుని పొయ్యాయి అన్న సంగతిని మరచిపోయ్యారు...

http://images.financialexpress.com/2015/02/Aam-aadmi-party-graph.jpg

ఇక మూడో తరగతి వాళ్ళు.........ఓ విశ్లేషణని చేసిపారేశారు...అదేమిటంటే...బిజెపి పైకేత్తుకున్న హిందుత్వం వల్లనే  ప్రజాగ్రహానికి గురై దిల్లోలో ఓడిపోయింది అని తేల్చారు...వీరి కోపం బిజెపి మీద కాదు హిందుత్వం మీదే... మరి వీరి మాటే నిజమైతే అక్కడ నిఖార్సు అయిన సేక్క్యులర్ పార్టీలు చాలానే నుంచున్నాయి కదా... అవి ఎందుకు డిపాజిట్లని కూడా కోల్పోయాయి అన్న ప్రశ్నకి వీరి దగ్గర జవాబు లేదు...ఉండదు...సమాధానం కూడా చెప్పారు... ఎందుకటే వీరికి హిందుత్వం అంటే ఎందుకో కోపం...{?}  సరే వీరి మాటలని ఊరికే కొట్టెయ్యకుండా వివరంగా చూద్దాం...

మొదట బిజెపిలోని హిందుత్వ ఎజండా వల్లనే అని  ఈ మూడో తరగతి వారి వివరణ...
ఇందుకోసం దిల్లీలోని ఉన్న అన్ని మతాల శాతం చూద్దాం...


ఇలా 81 శాతం మంది హిందువులు ఉన్న దిల్లీలో 
హిందుత్వ వ్యతిరేకం ఉండే అవకాశం లేదు కదా... 
పోనీ, 
అసలు సెక్యులరిజం పిచ్చి ఎక్కించు కున్నది హిందువులు మాత్రమే కదా...
కాబట్టి, ఇక్కడి సెక్యులర్ హిందువులు బిజెపికి వ్యతిరేకంగా వేశారని అనుకుందాము...
అప్పుడు,  
ఇప్పటికే అయిపోయిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలని చూద్దాం... 
అక్కడ 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 7 స్టానాలలో కూడా బిజేపినే గెలిచింది...  
అప్పుడు ఓడిపోయి రెండో స్థానంలో ఉన్నది 
సెక్యులర్ పార్టీలు అయిన ఏ కాంగ్రేస్షో లేక కమ్యునిస్టు పార్టిలో కాదు. 
సామాన్యుల పార్టీ అయిన "ఆప్" పార్టినే. 
 బిజెపి ఏమన్నా కొద్ది మార్జినుతో గెలిచిందా అంటే... 
లక్ష నుండి రెండున్నర లక్షల ఓట్ల మేజారిటితో గెలిచింది..   
అప్పటికే హిందుత్వ వాది అయిన మోడిని చూసే ధిల్లీ ప్రజలు ఓటు వేశారు...

ఇక ఇప్పుడు 
అసెంబ్లీ విషయానికి వస్తే 
ఆప్ చేతిలో చిత్తుగా ఓడిన గౌరవం పొందినది ఎవరూ....
కాంగ్రెస్ లేక కమ్యునిస్టులా కాదు...  
మళ్ళీ బిజేపినే....
70 నియోజక వర్గాలలో కేవలం "నాలుగింటిలో మాత్రమే" 
రెండవ పొజిషన్ గౌరవాన్ని పొందింది... సెక్యులర్ కాంగ్రెస్.  
కమ్యునిస్టులతో సహా మిగిలిన ఏ పార్టీకి దిక్కు మొక్కు కూడా లేకపోయింది....
అందువలన ఇది బిజెపికి మాత్రమే వ్యతిరేకం కానీ...హిందుత్వానికి కాదు...


అయితే, ఇంతకీ బిజెపి ఇంత చిత్తుగా ఓడిపోవటానికి కారణం....

I] బిజెపి పార్టీ వైపు నుండి..

1] గెలుపులతో పెరిగిన అహంకారం. విరోధి పార్టీని తక్కువగా అంచనా వెయ్యటం....
2] ఆ అహంకారంతో స్వంత వారినే లెక్కచెయ్యని తనం. అప్పటికే సీనియర్లు అయిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవటం. దాంతో వారి సహాయ నిరాకరణ.
3] పార్టిలో అమిత్ షా విపరీత చొరబాటు. లోకల్ గా నుంచోబెట్టే అభ్యర్దుల విషయంలో అనవసర జోక్యం.
4] మొన్నటి దాకా విరోధి పార్టిలో ఉండి...నానా బూతులు తిట్టినా కిరణ్ బేడిని దగ్గరకి రానియ్యటం.
5] ఆవిడ రాకతో అప్పటికే ధిల్లీ పదవులు ఆశిస్తూ ఉన్న వారి సహాయ నిరాకరణ.


II] ఆప్ పార్టీ వైపు నుండి:

1] అంతకు ముందు ఓటమికి సరైన ఆత్మ విమర్శ.
2] తప్పుని మొహమాటం లేకుండా ఒప్పుకుని క్షమాపణలు అడగటం.
3] అభ్యర్ధుల ఎంపికలో తమదైన శైలిలో కొత్తవారికి....
4] తమ పార్టీ వారిని బిజెపి వారు లాక్కొన్న విధానాన్ని ఎండగట్టటం...
5] ప్రాంతీయ సమస్యల పట్ల క్రింది తరగతి వారి వరకూ వెళ్ళటం...

III] కాంగ్రెస్సు పార్టీ వైపు నుండి:

1] వీరు వ్యుహాత్మకముగా ఆప్ పార్టీ వారికి సహకరించటం. వీరు ఇదే పనిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా చేశారు. ఇక్కడ జగన్ పార్టీ రాకుండా తెలుగు దేశానికి బాహాటంగానే సహకరించారు.

IV] ధిల్లీ ప్రజలు:

అన్నీ ఏవేవో విశ్లేషణలే గానీ... ప్రజలని పట్టించు కోలేదు ఎవ్వరు... నిజానికి ఎన్నికలలో హీరోలు ప్రజలే... వీరు పార్లమెంటు ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి మారిపోయిన కారణాలు...

1] ఏ హిందుత్వ పునాదులపై బిజెపి ఉన్నదో దానినే బిజెపి వారు నిర్లక్ష్యం చెయ్యటం... బిజేపి వారు కాశ్మీరులో అధికారం కోసం వెంపర్లాడి,  తమకి అంటరాని పార్టీలతో జత కట్టాలన్న ఆరాటమే ప్రజల మనసుని మార్చేసింది... ఇది కేవలం దిల్లిలోనే కాదు యావత్ భారత దేశంలోనే మారింది...కాకపొతే డిల్లిలో  ఎన్నికలు కాబట్టి వెంటనే తెలిసింది....ఇప్పటికిప్పుడు మళ్ళి పార్లమెంటు ఎన్నికలు వస్తే...ఇప్పుడు వచ్చినన్ని సీట్లు మళ్ళీ రావు...కారణం బిజెపి వారు అధికారం కోసం హిందుత్వాన్ని నిర్లక్ష్యం చెయ్యటమే...

2] బిజెపి వచ్చిన తరవాత వారి ప్రవర్తనలో కొత్తదనం ఏమీ లేదు...కాంగ్రెస్సు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో...అలానే వీరు ఉన్నారు. వారు చేసిన పనులనే వీరు కంటిన్యు చేశారు... కాంగ్రెస్సుకి బిజెపికి తేడా లేదని ప్రజలకి అనిపించింది.

3] దేశీయం అని పేరుకేగాని....నినాదాలు తప్ప ఆ దిశగా చేసిందేమీలేదు...చెప్పిందే చెపుతుంటే ఎన్నాళ్ళు మాటలతో కాలేక్షేపం చేస్తారు ప్రజలు.....

4] ఇంతకు ముందు ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసిన పాపం కాంగ్రెస్సు కన్నా బిజెపి పైనే పడింది... ఎందుకటే ప్రజలు బిజెపి... కాంగ్రెస్సులాగా చెయ్యదని నమ్మారు. ఆ నమ్మకాన్ని బిజెపి వారు తమ కుళ్ళు రాజకీయాలతో వమ్ము చేశారు...ఇలాంటి కుళ్ళు రాజకీయమే బిహార్ రాష్ట్రంలో కూడా నడవటంతో... నమ్మని కాంగ్రెస్ కన్నా నమ్మిన బిజెపి పైనే ఎక్కువ కోపాన్ని ప్రజలు చూపించారు....

5] క్రిందటి సారి ఎదో చేద్దామని వచ్చిన కేజ్రివాలుని ఏమీ చెయ్యకుండానే దింపటంతో ఆయన మీద విపరీత సింపతి...పైగా ఆయన తన తప్పులని ప్రజల వద్ద మొహమాటం లేకుండా ఒప్పుకోవటం.....మరో ప్రక్క అహంకారంతో ఉన్న బిజెపి...రెండిటి భేదం ప్రత్యేక్షంగా కనపడటంతో...ఈ సారి ఆప్ కి  అవకాశం ఇద్దాం అనుకున్న ప్రజలు....

ఇలా వచ్చిన సంవత్సరానికే తమ విపరీత ప్రవర్తనతో ప్రజలకి విరక్తి పుట్టించిన బిజెపివారు ఓడిపోవటం విచిత్రమేమి కాదు.... ఎన్నికల ఫలితాల ముందరే ప్రజలు  "ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోతేగానీ బుద్ధి రాదు" అని అనుకోవటం జరిగింది....ఈ ఫలితాల తరవాత కేవలం బిజెపి శత్రువులే కాకుండా మిత్ర పక్షాలు అయిన తెలుగుదేశం లాంటి పార్టీలలో కూడా ఆనందమే కనబడింది...కొసమెరుపు ఏమంటే...అనేక మంది బిజెపి నాయకుల మొహాల్లో ఇటువంటి ఆనందమే తొంగి చూడటం...

కాబట్టి, బిజెపి వారు తమని ప్రజలు ఎందుకు నమ్మారో... ఆ నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా... కుళ్ళు రాజకీయాలని కట్టి పెట్టి...దేశాభివృద్ధికి ఎవరూ కలిసి వస్తే ...వారిని వారి పార్టీలలోనే ఉండనిచ్చి వారిని కలుపుకుని... విదేశి పిచ్చ మానుకుని దేశీయంగా అభివృద్ధి ఎలా జరగాలో...దానికి దేశ ప్రజలని వాడుకుని...తద్వారా వారికి ఉపాధిని కల్పిస్తే...ఇలాంటి చెడు అనుభవాలు వారికి ఎదురుపడవు...


చివరిగా ఒక మూర్ఖుడి గురించి[లింక్ నొక్కండి]...ఈయన గారు ఎక్కడికి పోయినా ప్రజాసామ్యాన్ని నిలబెడుతున్న భారతీయ ప్రజలని తిట్టటమే పనిగా పెట్టుకున్నాడు.  ఈయనగారి దృష్టిలో భారతీయులు మూర్ఖులు, పశువులు తదితరాలు... 

ఇతను చెప్పినట్లే ప్రజలు ఓట్లు వేసేట్టుంటే... డైరెక్టుగా RSS ఎప్పుడో రాజకీయ పార్టీ అయి, దేశాన్ని ఏలుతుండేది... కనీసం ఇప్పుడు దిల్లీలో ఉన్న 81 శాతం మంది హిందువులలో సగం అంటే 40 శాతం మంది బిజెపిని హిందూ పార్టిగా మాత్రమే చూసుంటే, అది గెలిచి ఉండేది... కానీ, ప్రజలు బిజెపిని హిందూ పార్టిగా మాత్రమే కాకుండా ఇతర విషయాలలో కూడా మంచి చెడులు చూడటం వల్లన ఫలితాలు పార్లమెంటుకి-అసెంబ్లీకి తేడా వచ్చాయి... మరి ఈ సంగతి ఇతనికి ఎవరూ చెపుతారు...కేవలం కులాలే చూసుంటే అత్యధికంగా ఉన్న బిసి లు మాత్రమే రాజకీయాలలో ఉండే వారు... 

ఉద్యోగం చేసినంతకాలం జీతాలు...టియ్యేలు...డియ్యేలు అని ఏడిచిన ఇతనికి సామాన్య ప్రజల కష్టాలు తెలియవా...ఈ పిచ్చి వాగుడు[లింకు నొక్కండి] అప్పుడు వాగితే ఉద్యోగం ఊడుతుందని భయపడ్డాడా....రిటైరు అయిన తరవాతే పతివ్రతా అయినాడా...మీడియాలో సినితారాలకే ప్రాధాన్యం అన్న ఈ పెద్ద మనిషి, జైలు శిక్షపడ్డ సంజయ్ దత్తుని ఎందుకు వెనకేసుకొచ్చాడు[లింక్ నొక్కండి]....

ఇది ఇలా ఉంటే, ప్రజాసామ్యంలో ప్రజలని అవమానిస్తున్న ఇతని మీద ఎందుకు కేసు పెట్టటం లేదు...రాజకీయ నాయకులకేనా ఆత్మాభిమానం వగైరాలు...చివరికి చనిపోయిన నాయకుడి మీద కామెంటు పెట్టిన ఇద్దరు ఆడపిల్లలని అరెస్టు చేసిన చట్టానికి ప్రజల విషయంలో ఏమైయ్యింది...చట్టం తన పని తాను చేసుకోలేకపోతోందా... ఇప్పటి దాకా ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సరిగ్గా ఏర్పడలేదనే కదా ఇతని ఉద్దేశ్యం...మరి ఇతని మీద చర్య ఎందుకు తీసుకోరు...ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే... ముందు ముందు దేశాన్ని...దేశ ప్రజలని తిట్టే ఫేషన్ తగ్గుతుంది...అలా చేసి పేరు తెచ్చుకుందాము అనుకునేవారికి హెచ్చరికగా ఉంటుంది కదా....@@@@@@@@@@@@@@@

బొమ్మల కర్టేసి: ఈనాడు మరియు గూగుల్ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1] పార్టీ సభ్యత్వం అయిదేళ్ళ తరవాతే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో నుంచునే అర్హత....
లాభం: పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు...
గభాలున పార్టీ మారి మరో పార్టీ తరపున నుంచునే గోడ దాటు రాజకీయాలకి బ్రేక్...

2] పార్టీలో టిక్కెట్టు రాలేదని అలిగి ఇండిపెండెంటుగా నుంచునే
 బ్లాక్ మైయిల్ రాజకీయాలకి స్వస్తి.

3] ఇండిపెండెంటుగా నుంచుని ప్రభుత్వాలు ఏర్పరచేప్పుడు జరిగే బేరసారాలకి బ్రేక్....
మరియు ప్రబుత్వాల మీద పార్టీల పెత్తనం లేకుండా చెయ్యటం.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి