LOCAL WEATHER

31, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగు సభలా........? శాలువా సభలా.......??

అసలు విషయం కన్నా కొసరు విషయం ముందర వ్రాస్తున్నాను........ ఇవాళ ఉదయం మన వార్తా చానళ్ళలో "చైనా వారి కళా ఖండాల ప్రదర్శన" గురించి చెపుతు.......... "అద్భుతమైన కల ఖండాలని చైనా వారు ప్రదర్శించారు" అని వార్తలు చదివే వారు ముద్దు ముద్దుగా చెప్పారు........ సరే ఈ వాక్యాన్ని మన గూగుల్ అనువాదంలో పడేస్తే ఎలా వస్తుంది అని వేసాను....... ఇదిగో ఈ క్రింది విధంగా వచ్చింది.

"అద్భుతమైన కల ఖండాలని చైనా వారు ప్రదర్శించారు" = గూగుల్ అనువాదం = "They performed a wonderful dream that had come to China".


సవ్యంగా ఇలా ఉండాలి........
"అద్భుతమైన కళని చైనా వారు ప్రదర్శించారు". =  గూగుల్ అనువాదం = " They performed a wonderful art in China".

ఈ విదంగా గూగుల్ అనువాదం అంటేనే భయంకరంగా  ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది.......అర్ధం ఉన్నా లేకున్నా...........గూగల్కి తెలిసినంత తెలుగు కూడా మన తెలుగు టివిల వారికి తెలియదంటే సిగ్గుతో మన టివి వారు...............


ఇక అసలు విషయంలోనికి 

తెలుగు మహా సభలు బొలెడంత ఖర్చు చేసి వైభవంగా చేసేశారు...... ఆ సభలు దేనికోసం జరిగినాయో దానికోసం మడుకూ జరిగినట్లు అనిపించలేదు..... మళ్ళీ మామూలే... గంగిరెద్దులూ, కుండల తయారీ, నాట్యాలూ, శాలువాలూ........ "ఇంతకీ ఇవి తెలుగు భాషా సభలా...?  లేక తెలుగు సంస్కృతిక సభలా"....?? ఈ సభల్లో గంగిరెద్దులతో పనియేమి...... వస్త్ర  ధారణా విషయం ఎందుకు......... ఎక్కడో పడిపోతున్న తెలుగు భాషని రక్షించుదామని కదా........ మళ్ళీ  పాత ధోరణే.......మూడు శాలువాలు.....ఆరు ఉపన్యాసాలు.... ఈ సభలకు అయిన ఖర్చుని తెలుగు భాషాభివృద్దికి ఇచ్చేనట్లయితే బాగుండేది. 

ప్రజలకి భాష వలన ఉపయోగపడే చర్యలు తీసుకోవాలి.... తెలుగు ఉద్యోగాలని సృష్టించాలి.... అంతే కాని ఇలా పేద్ద సభ చేస్తే,  అది ఒక  పెద్ద బల ప్రదర్శనగా ఉన్నదే కాని తెలుగు భాషా సభలాగా లేదు..... మరి ఈ సభలో  రాష్ట్రంలో ఉన్న మిగిలిన పార్టీలవారు  కనపడలేదు.......వారేమైనారు....వేదికని కూడా తిరుపతిలో కాకుండా ఏ ఓరుగల్లులో పెట్టినట్లైతే కాకతీయ ఉత్సవాలకి మరింత అందాన్నిచ్చే అవకాశం ఉండేది.... పాపం గవర్నర్ గారు కష్టపడి తెలుగుని మాట్లాడటం బాగున్నా...... నాకు తెలిసినంతవరకూ చాలామంది ఆరవ వాళ్ళకు చక్కటి తెలుగే వచ్చు మరి...........   


జరిగిన సభలో తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చినట్లే కనపడలేదు...... వారి గుర్తు.... పైన ఇంగ్లీషూ, హిందీ ఉండీ అడుగున తెలుగులో ఉన్నది... రేపు తెలుగుని ప్రముఖంగా వ్రాయమని వీరు ఏముఖం పెట్టుకొని జనానికి చెపుతారు...... షాపుల పేర్లూ, ఆఫీసుల పేర్లూ తెలుగులోనే పైన వ్రాసి, క్రింద ఏ భాషలోననా వ్రాసుకోమని చెప్పిన వారు...... తామే పైన వేరొక భాష వ్రాసి, తెలుగుని క్రిందకి నొక్కారు.....

ఏదైనా కార్యక్రమం జరిగితే సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం మాములే....  కానీ, సభల్నే సాంస్కృతిక సభలలాగా మార్చటం సబబుగా లేదు.  పైగా అక్కడ జరిగిన సభలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు... సభ  జరగాల్సింది తెలుగు భాష గురించి అయినప్పుడు.... శ్రీకాకుళం భాష, గోదావరి జిల్లా యాసా, నెల్లురి తెలుగు, కర్నూలు భావం, తెలంగాణా గానం ఎక్కడా వినిపించలేదు. తెలంగాణా గానం ఎందుకన్నాను అంటే....... ఇదివరలో శుద్ద గ్రాంధిక తెలుగు భక్తి పాటలు మాత్రమే జనానికి అందుబాటులో ఉండేవి... కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయం దగ్గరా తెలంగాణా యాసలోని భక్తి పాటలకి విపరీత జనాదరణ ఉన్నది....... ఈ విధమైన  తెలుగులో పలు వైవిధ్యంగల అనేక తెలుగు యాసల అందానికి ఎక్కడా ప్రాధాన్యతని ఇవ్వలేదు..... ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగా జరిగిందే కానీ, అందులో ప్రజా చైతన్యం ఎక్కడా కానరాలేదు.

ఇకపోతే, ఇదేమీ కాంగ్రెస్సు మాహా సభ కాదు కదా; మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు పాల్గొనలేదు....? పిలవలేదా....?? లేక పిలిచినా వారు రాలేదా.....?? పిలవకపోతే నిర్వాహకుల తప్పు....పిలిచినా రాకపోతే తెలుగు భాషమీద మిగిలిన వారి గౌరవం ఎంతటిదో తెలుస్తోంది.  ఇకపోతే, పాపం ఒకాయన  తమ స్వామిభక్తిని చాటటానికి నల్ల జెండాలు పట్టుకొని రావటం చాలా అసహ్యకరంగా ఉన్నది.... పైగా ఆయన తెలుగు తల్లి ముఖాన నల్ల జెండా పెట్టి మాట్లాడుతుంటే ఆయన నిరసన తెలుగు తల్లిమీదా.... అని అనుమానం వచ్చింది... ఇలాంటి విషయాలని కూడా రాజకీయం చేయటం తెలుగు రాజకీయ వ్యవస్థ సిగ్గు పడే విధంగా ఉన్నది..... 

ఇక సభలో మాట్లాడేవారు ఏమి మాట్లాడోరో అర్ధం కాలేదు, కానీ ఒకటి మటుకూ అర్ధం అయింది... భాషాభిమానం అంటే ఏమిటో అరవ వాళ్ళ నుండో లేక ఇతర భాషల వాళ్ళ నుండో చూసి నేర్చుకొమ్మని కసిరినట్లుగా చెప్పారనిపించింది... ఇంతకీ తెలుగు భాష గురించి వీరు ఏమి చేస్తారో చెప్పలేదు. భాషని జనానికి ఉపయోగ కరంగా ఉంచితే ఎవరైనా దానిపట్ల ఆశక్తిని చూపుతారు... కనీసం రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఏ విన్నపం చేసుకోవాలన్నా వాటిని ఇంగ్లీషులో వ్రాయలని ఉంటే,  తెలుగు ఎవరు నేర్చుకొంటారు...?? అయ్య సభలో మాట్లాడిన పెద్ద మనుషులలారా...... ఈ రోజు ఏదైనా మనగలగాలంటే అది ప్రజల భ్రతుకు తెరువుతో మిళితం అయి ఉండాలి.... అంతే కానీ తెలుగుని రక్షిద్దాం అని ఊకదంపుడు మాటలు మాట్లాడి మన దారిని మనం పోయి మన వాళ్ళని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చేరిపిస్తే, మన మాటని ఎవరు నమ్ముతారు....?? ఎందుకు నమ్మాలి...??? 


ఊరికే తెలుగు నేర్చుకొని కూర్చోండి అంటే  ప్రజలేమన్న పాతకాలపు రాజ ఆస్థానంలో ఉన్నవారా...... వారినైతే రాజులు పోషించారు కాబట్టి హాయిగా మంచి వాతావరణంలో తెలుగు భాషాభివృద్దిని చెయ్యగలిగారు... అలా చెయ్యటం వల్లనే మనం ఈ రోజున చెన్నయ్ వెళ్ళినా, బెంగుళూరు వెళ్ళినా, భువనేశ్వర్ వెళ్ళినా, తిరువనంతపురం వెళ్ళినా తెలుగు మాట పాట వినపడుతోంది...రాజుల్లాగా కాకపోయినా, కనీసం ..... రాష్ట్ర ఉద్యోగాల్లో  50 శాతం ఉద్యోగాలని తెలుగు మాధ్యమంలో చదివిన వారికి తప్పని సరిగా కేటయిస్తే చాలు, కోట్ల రూపాయల పెట్టి ఏ సభలూ నిర్వహించకుండానే తెలుగు అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని దుకాణాలా, ఆఫీసుల, ఊళ్ళ పేర్లే కాకుండా, మన రాష్ట్రం గుండా వెళ్ళే వందలాది రైళ్ళ మీద తప్పనిసరిగా తెలుగు అక్షరం కనపడి తీరాలి అని చట్టం చేస్తే చాలు, బోలెడు మంది తెలుగు వ్రాతగాళ్ళకి పని దొరుకుతుంది.... ఏ రాష్ట్రం వారు వచ్చినా, ఏ ఉత్తరం వ్రాయాలన్నా తెలుగులోనే ప్రభుత్వ కార్యక్రమాలు జరిపితే అనేక మంది తెలుగుని మాత్రం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి....

ఇంతకు ముందు వ్రాసిన తెలుగు భాషా నీవు మాకేమిస్తావ్!!! లొ ఇదే విషయం వ్రాసాను....."ఎదైనా భాష అబివృద్ధి చెందాలంటే ఆ భాష వలన ప్రజా అవసరాలు తీరాలి.  అలాగే, తెలుగు నేర్చుకోవటం వలన బ్రతుకు తెరువు లభిస్తుంది అన్న నమ్మకాన్ని విద్యార్ధి లోకంలో కలిగించాలి.  ఆ భాష నేర్చుకొన్న వాళ్ళకి గుర్తింపు....... అంటే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. రాష్ట్ర ఉద్యోగాల్లోనైనా 50 శాతానికి తగ్గకుండా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యతని ఇస్తే, తెలుగు మాధ్యమంలో చదవటానికి ప్రోత్సాహం లభిస్తుంది". ఏది ఏమైనా ఈ సభల్లో తెలుగు భాషకి సంభంధించి  ప్రత్యేకించి చేసిందేమీ లేదు........... 

ఈ సందర్భంగా  శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన "చక్కర కలిపిన" అనే పాటని ఇక్కడ ఉంచుతున్నాను.  పాడినది  కైకలూరులో సంగీతం మాస్టారుగా పనిచేస్తున్న చిరంజీవి పోపూరి శ్యాం సుందర్.........







@@@@@@@@@@@@@@@@@@@@



28, డిసెంబర్ 2012, శుక్రవారం

రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...





అనగనగా ఒక రాజ్యం  ఉండేది.....ఉన్నది......ఉంటో ఉన్నది. దానిలో అనేక మంది రాజులు వారికి తోచిన విధంగా బ్రతుకుతున్నారు. వారికి కావాలిసినవి సమకూర్చటానికి కొందరు మంత్రులు/మేనేజర్లు    ఉన్నారు. వారు   ఈ  రాజులకి  కావాలిసిన సౌకర్యాలను కల్పిస్తూ, చుట్టు ప్రక్కన వారితో మంచి సంబంధాలను కలిగి ఉంటున్నారు.  

ఆ మాంచి కాలంలోనే ఆ రాజ్యానికి  కావాలిసిన నీరు అంధించటానికి కొండల మధ్య  ఒక పేద్ద చెరువు తవ్వించారు.....దానిని ప్రారంభించటానికి చక్రవర్తి గార్ని పిలిచారు. ఆయన వచ్చినప్పుడు ఆయనను మంచి చేసుకొని అలాంటిదే మరొక చెరువుకి కావాలిసిన నిధులు కూడా తెచ్చుకొని, దానిని కూడా పూర్తి చేశారు. చుట్టు ప్రక్కల వారితో మంచిగా ఉండటం వలన వారి దగ్గర నుండీ నీరు తెచ్చుకొని చెరువులు నింపుకొనే వారు.  ఆ రాజ్యానికి  కరెంటు కావాలి.....దానితో ఈ మంత్రులు  తమ దగ్గర ఉన్న రాజుల సంపద నుండి కొంత తీసి మాంచి జనరేటర్లు కొనుగోలు చేశారు. వాటిలో కొన్ని కొండల మీద ఉన్న పెద్ద చేరువులకి బిగించి తక్కువ ఖర్చుతో కరెంటు వచ్చేట్లు చేసారు. ఇంకేమున్నది........ఆ రాజ్యంలో  వెలుగులు చాక్కగా విరజిమ్ముతో ఉన్నాయి. ఇలా రాజ్యం మొత్తానికి సమానంగా సౌకర్యాలని కల్ప్లిస్తూ  వస్తున్నారు.  ఇక రాజూలందరూ మహా వైభవంగా కాకపోయినా హాయిగానే బ్రతుకుతున్నారు. 

సరే, ఒక తరం గడిచింది. ఈ మంత్రులు  మారేరు.  కొత్త మంత్రులు వచ్చారు. అక్కడ తమ అవసరం ఎంత ఉన్నదో గమనించినాక, పాత వారిలాగా వినయంతో కాకుండా గర్వం, అహంకారంతో మీసాలు మెలేశారు. ఇంకేమున్నది....ఇంత కష్టపడుతున్న తాము ఎక్కువ సౌకర్యాలను ఎందుకు పొందకూడదు.......?  ఇలా అనుకోగానే రాజుల సంపదను వాడుకొని తమకి చెందినా భవనాలని పెద్దవి చేసుకొని, రంగులు వేయుంచుకొన్నారు....ఏసీలు పెట్టించుకొన్నారు.....ఇక  అక్కడ నుండీ రాజుల సొమ్ముతో మంత్రులు సోకు చేసుకోనారంభించారు.  పైగా ఇలా తాము అనేక సౌకర్యాలని పొందటం రాజుల కోసమేనని నమ్మబలికారు.  వీరు  రాజ్యంలో  ఒకే చోట భవనాలని కట్టుకొని ఆ ప్రాంతానికే ఎక్కువ ఖర్చు చేసి సౌకర్యాలని పెంచారు...   దానితో ఆ ప్రాంతానికి విపరీతంగా ప్రాధాన్యత పెరిగింది. 

ఒకప్పుడు "మంత్రి  పదవి ..... అంటే చాలా కష్టంతో మరియూ బాధ్యతతో  కూడుకొన్న పని అని,  డబ్బులు సంపాయించుకుందాము అని అనుకొన్న వారెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు". కానీ, కొత్త మంత్రుల వైభవం చూసిన తరవాత,  ఆ ఉద్యోగం కోసం పోటీ ప్రారంభమైనది..... దానితో ఎవరికి వారు వచ్చి రాజులకి అది చేస్తాము ఇది చేస్తాము అని ఊదరగొట్టేశారు..... వారి తెడ్డేమి పోయింది, స్వంత సొమ్ము కాదుగా.... సొమ్ము అంతా రాజులదే.....కదా!!!  రాజులకి కొత్త సౌకర్యాల ఎర చూపించారు.  రాజులు కూడా మంత్రుల సౌకర్యాలని చూసి  ఆకర్షితులైనారు. దానితో  ఈ మంత్రులు రాజులకి మరి కొన్ని సౌకర్యాలని కలిపిస్తామని చెప్పటం ద్వారా రాజుల సొమ్ముని కాజెయ్యటం మొదలు పెట్టారు. ఇదే అదనుగా ఎవరికి వారు అందినంత రాజుల సొమ్ముని  ఖర్చు పెడుతో ఉన్న   మంత్రులుఆ రాజ్యంలోనే  బ్రహ్మాణ్ణమైన భవనాలను కట్టుకొని సుఖంగాజీవించ సాగేరు.    

అంతా బాగానే ఉన్నది. ఈ ఖర్చు అంతా రాజులదే కదా.....క్రమంగా సొమ్ములు కరిగిపోసాగినాయి....మంత్రుల సొమ్ము పెరగ సాగింది. మంత్రుల మధ్య పోటి పెరిగింది.   మంత్రుల  పోటీ వలన పెద్ద పెద్ద మంత్రులు వచ్చి....రాజులకి పనిమీద ఆశక్తి తగ్గేంత సౌకర్యాలని కల్పించారు.........కొందరు రాజులు పనీ పాటా మానేసి మంత్రులు ఇచ్చిన మందు కొట్ట సాగారు. దానితో సొమ్ములు ఖర్చే కానీ.....కానీ ఆదాయం లేకుండా పోయింది.  శ్రమపడే రాజులని మరింత సొమ్ములు తెమ్మని మంత్రులు వత్తిడి పెంచారు..... సుఖాలు కావాలంటే కష్టపడి కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదని మంత్రులు చెప్పారు. వారు మడుకూ ఏసీ రూములని వదలకుండా "కష్టపడి" రాజభవనాన్ని చూసుకోసాగారు. 

మంత్రులు  లెక్కలు చెప్పేటప్పుడు,  తమ లెక్కల్ని  దాచిపెట్టి చెప్పేవారు. మిగిలిన లెక్కల్ని పేద్ద  పేద్ద  'ఆర్ధిక లెక్కల వేత్తల"  చేత లెక్కలు వేయించి లాభ నష్టాలని చూపించారు..........

HGJKHJ=KYH54542/5254254+9LI0-9TFFDJKJ=46757689798770909/-
-KJGCN7575HU/YrYU587HG+KJ4G78HK>Y<H=98798798789787878/- 
TOTAL..............................................................---4547958891008983031/-
కాబట్టి రాజులకి పెట్టే ఖర్చు వల్లనే రాజ్యానికి నష్టం వస్తోంది.........అని తేల్చారు.... 
 రాజులందరూ కలిస్తే కదా లెక్కల భాగోతం తెలిసేది అని మంత్రుల ధీమా.........

ఇక రాజ్యంలో  ఉన్న మంత్రులు డబ్బు సంపాదనలో పడి చుట్టు ప్రక్కవారితో మంచి కన్నా..... డబ్బు సంబంధాలనే పెట్టుకొన్నారు.   ఈ మంత్రులు తమ దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారాలని, కాంట్రాక్టులని చేసి డబ్బు విపరీతంగా సంపాయించసాగారు.  తమ వ్యాపారంలో భాగంగా   ప్రక్క వారికి చెరువులు కట్టించి వాటిలో లాభం పొదారు. దానివలన, చుట్టుప్రక్కల వారు నీరు సరిగా ఇవ్వటం మానేశారు.....దానితో రాజ్యంలోని  తోటలన్నీ  ఎండిపోసాగినాయి...కనీసం త్రాగటానికి నీరు వస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.రాజులు ఎంత కష్టపడినా ఆ డబ్బులు మంత్రుల జీతాలకీ, సౌకర్యాలకే సరిపోతున్నాయి. ఎంత తెచ్చినా మంత్రులు సరిపొలేదనే చెపుతూ వచ్చేరు.... క్రమంగా జనరేటర్లకి కావాలిసిన ఆయిల్ బిల్లులు సరిగా చెల్లించక పోవటం వలన అవి పూర్తి స్తాయిలో పని చేసే అవకాశం పోయింది. చెరువులో నీళ్ళు  లేకపోవటం వలన అక్కడి కరెంటు కూడా ఆగిపోయింది. దానితో రాజ్యంలో  చికట్లు ముసురుకోసాగినాయి... మంత్రులకి  మాత్రం కరెంటు సప్లై నిరంతరంగా ఉన్నది మరి..... ఎందుకంటే వీరు పని చెస్తే కదా రాజులు సవ్యంగా బ్రతికేది......!!!!! 

మంత్రుల డబ్బు సంపాదన ముదిరి,  ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకి సిద్ధమైనారు.  దీనితో రాజుల రక్షణ కన్నా మంత్రుల రక్షణకే ఎక్కువ ఖర్చు కాసాగింది.  ఈ గోల రాజులకి తెలియకుండా ఉండటానికి వారిలో వారికి గొడవలు తెప్పించారు... ఇందుకోసం రాజులకి మంత్రులు లేనిపోనివి కల్పించి చెప్పసాగారు.  రాజులకి ఇచ్చే సౌకర్యాలని తగ్గించి, ఇది ప్రక్క రాజుల వల్లనే జరిగిందని  ఒకరిపైకి ఒకరిని ఎగదోశారు.  ఇక రాజుల సంగతికి వస్తే వారికి క్రమంగా సౌకర్యాలు తగ్గటంతో, అప్పటిదాకా ఎవరిదీ,  ఏమిటీ అని పట్టించుకోని వారు, తమలో తాము ఆస్థుల కోసం కొట్టుకోనారంభించారు.  అసలే ఎండిపోతున్న చెరువులోని నీళ్ళని వివాదాలలోనికి లాగారు...... నువ్వు నా రాజ్యంలోకి  ఎందుకొచ్చావు......? అసలు ఇదంతా నాదే.. మీరెవరు....?? నేనే ఇదంతా బాగు చేసింది........ అంటూ తమలో తాము తగాదాలు పడుతుంటే.....  మంత్రులు కూడా కొట్టుకొన్నట్లు నటించి,  ఏ రాజు  దగ్గరికి వెడితే ఆ రాజుకి అనుకూలంగా మాట్లాడుతూ ఈ గోలను మరింత పెంచారు.  వ్యాపారాలు చేసుకొనే మంత్రులు మరింత ఆజ్యం పోశారు. రాజులకి రాజులకి పడకపోతే వారిలో వారు మాట్లాడుకో వలసింది పోయి........  మంత్రుల్ని  పంపించారు...  మంత్రులకి  కావాలిసింది రాజ్యం  మీద ఆధిపత్యమే కానీ, రాజుల మధ్య సామరస్యం కాదుగా...., గొడవలెందుకు తగ్గిస్తారు........???

డబ్బులూ లేవూ, రాజ్యం  అంతా  అశాంతిగా ఉన్నది;  పోనీ బయటవారెవరైనా వద్దామంటే లో[కల్‌గా]పల పాతుకుపోయిన వారు రానీయరు. ఇదీ ప్రస్తుత పరిస్తితి.... దీనికి మంత్రులని  మాత్రమే తప్పు పట్టల్సిన పనిలేదు.....రాజూలైన వారిది కూడా తప్పు ఉన్నది. కానీ  ఏమి లాభం...?  ఈ సంగతి రాజులు గమనించుకోవటం లేదు.....!!!  "రాజులకి తెలిసేటట్లు చేసే మంత్రులు  కూడా లేరు"......!!! ఒక వేళ అటువంటి వారు ఉన్నా, వారు ఆస్తుల గొడవ మానండి; రాజ్యం బాగుపడాలంటే అందరి తెలివితేటలూ, సహకారం కావాలనే నిజం  చెప్పటం వలన,  రాజుల మనస్సుని గెలవలేక పోతున్నారు. ఎవరికీ వారు ప్రక్క రాజు వెళ్ళిపోతే సమస్య తీరుతుందని కొందరు, తాములేందే ప్రక్క రాజులు బ్రతకలేరని ఇంకొందరు, మంత్రులందరు మా వారే వారి వల్లనే మీరు బాగుపడ్డారు అని మరికొందరు  అనుకోసాగారు..... రాజులని విభజిస్తే తమ పని మరింత సానుకూలం అవుతుందని మంత్రులు అనుకోసాగారు. ఈ విధంగా ఆ రాజ్యాన్ని మంత్రులు ఆక్రమిస్తున్నారన్న సంగతి రాజులు తెలుసుకోలేకపోతున్నారు........ఇక ఆ రాజ్యాన్ని దేవుడు కూడా  కాపాడలేడేమో....!!!      
  


...........ఇంకా ఉన్నది. 

 ...............మిగిలినది .......2021లో  
    
@@@@@@@@@@




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???






చిత్రాలు గూగుల్ లోనివి 



27, డిసెంబర్ 2012, గురువారం

తెలుగు టీవీల్లో తెలుగు ఠీవీ ఎంత...??? ...నేతి బీరకాయంత...!!!

తెలుగు ప్రపంచ మహా సభలు జరగబోతున్న సందర్భంగా, మన తెలుగు టివీలు తెలుగు భాష పట్ల ఎనలేని ప్రేమ చూపిస్తున్నాయి. అందరూ తెలుగు వాడాలని అని చెపుతున్నాయి... కానీ వారి టీవీలలో భాషని ఏమాత్రం మార్చకుండా యధావిధిగా అలాగే వాడుతున్నాయి..  వాల్లూ వీల్లూ,  నాన్యత, ప్రమానం[ప్రమాణం], కల్లు, అంటూ చక్కగా భాష తెలిసిన వారిచేత కూడా ఇలా పలికిస్తున్నారు....



సరే, ఇదెలాగూ మారదు... కనీసం పేర్లైనా తెలుగులో ఉన్నాయా అంటే   అదీ లేదు....!!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ తెలుగులోనే ఉండాలనీ లేకపోతే జరిమానాలు వడ్డిస్తామనీ చెపుతున్నది... ఆ జరిమానాలు ముందర మన తెలుగు టీవీలకే పడే అవకాశం కనపడుతోంది...... ఎందుకంటారా... దిక్కుమాలిన తెలుగు వాడినందుకు కాదు.... వారి వారి టీవీల పేర్లన్నీ ఇంగ్లీషులోనే ఉండటం వల్లన.... 

ఒకటి రెండు టీవీలు మినహా మిగిలినవన్నీ తమ పేర్లని ఇంగ్లీషులో వ్రాసుకోవటమే కాదు.... అసలు వాటిని ఇంగ్లీషులోనే పెట్టారు... ఉదాహరణకి టీవీ నైన్, టీవీ ఫైవ్, వీ సిక్స్, ఏ టీవీ, హెచ్‌ఎం  టీవీ, సీవీఆర్ టీవీ, ఏబీఎన్, ఐ టీవీ, స్టుడియో ఎన్  లాంటివి.. .. ఇలా   ఉన్నాది  మన మార్గ దర్శకాలైన తెలుగు టీవీల పేర్ల పరిస్థితి. ఇక ఇవ్వి చెప్పే  "టెల్గు" విషయాలకి ఏమి గౌరవం ఉంటుంది.... 


మరికొన్ని భారతీయ పేర్లు తగిలించుకొన్నప్పటికి వాటి పేర్లు ఇంగ్లిషు అక్షరాలలొనే ఉన్నాయి. ఆ మాత్రం అక్షరాల అందానికి కూడా తెలుగు నోచుకోలేదా...? ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషల్లో రెండవ స్థానాన్ని ఆక్రమించిన మన తెలుగుకి మనవారిచ్చే గౌరవం.........


ఒకదానికి ఒకటి విరుద్దమైనప్పటికీ "సాక్షీ", "ఈటీవీలు" తెలుగును ఉపయోగిస్తున్నాయి. దూరదర్శన్ వారు ఎంత హిందీ సేవ చేసినప్పటికీ పేరులో మాత్రం తెలుగూ..ఇంగ్లీషులని వాడుతున్నారు...ఏబీఎన్ వారు ఇంగ్లీషులో  పేరెట్టుకొన్నప్పటికీ తెలుగులో "ఆంద్రజ్యోతి" అని అప్పుడప్పుడూ వేస్తున్నారు. ఇలా కొద్ది టివీలు తప్ప మిగిలినవన్నీ తెలుగు అక్షరాల అందాన్ని తమ టీవీల పేర్లలో కనపడేట్లు చెయ్యటంలో విఫలం అయినాయి.


తెలుగులో అందమా అని ఆశ్చర్యపోకుండా మన తెలుగు సినిమా వారి సహాయం తీసుకొంటే వారు చక్కగా సహాయం చేస్తారు కదా....పాత సినిమా పేర్లు దొరకలేదు కాని వాటిల్లో ఇంకా అందమున్నది.


తెలుగుకి గౌరవం ఇద్దాం అని మాటలు కాదు......  ముందర టీవీల పేర్లు ఇంగ్లీషులో ఉన్నప్పటికీ, వాటిని తెలుగు అక్షరాలని ఉపయోగించి తెలుగులో వ్రాసినట్లైతే బాగుంటుంది... తెలుగుకి ఏమో కానీ కనీసం "తెలుగు అక్షరానికైనా" గౌరవం ఇస్తే బాగుంటుంది.  మనకి మనం కాకపోయినా, ఇతరులు  ప్రపంచంలో అత్యంత అందమైన భాషగా 2వ స్థానాన్ని గుర్తించినందుకైనా  తెలుగుకి గౌరవాన్ని ఇద్దాం.... 






@@@@@@@@@@@
ఈ సందర్భంగా వ్యాఖ్యల్లో వచ్చే  నా పేరుని "Radhakrishna  kappagantu"  తెలుగులో వచ్చేట్లు మార్చాను.
@@@@@@@@@@


ఇక యదావిధిగా బొమ్మలన్నీ గూగుల్ వే 





25, డిసెంబర్ 2012, మంగళవారం

దైవభక్తులారా దేవుడి కోసం మీ ఒక్క శలవైనా త్యాగం చెయ్యలేరా..????



పండగలు వస్తే చాలు, అవి ఏ శనివారమో, సోమ వారమో వస్తే మరీ వీరాంగం వేస్తున్న భక్త శిఖామణులు...... ఏమున్నదీ ఆ శలవలలో అందరికీ లోకువైన ఏ తిరుమలకో బయలు దేరటం...... అక్కడికి పోయిన తరవాత, తమని వీఐపీల లాగా చూడలేదని ఆక్రోశం వెళ్ళగక్కటం మాములైపోయింది.... వారి కళ్ళముందే ఎవరెవరో వీఐపీ దర్శనంలో వెడుతుంటే, భక్త శిఖామణుల కోపం మరింత ఆక్రోశించి దేవాలయాలనే శపించేస్థాయికి దిగజరిపోతున్నారు..... మొన్న చాలామంది టీటీడీ డౌన్ డౌన్ అని అరిచారు ధర్నాలు చేశారు... గొడవలు పడి దేవాలయ ప్రాంగణాన్ని రణరంగాన్ని చేసిపారేస్తున్నారు..... టీటీడీ అంతే అర్ధం తెలుసా వీరికి......"తిరుమల తిరుపతి దేవస్థానములు" అని అర్ధం....   ఆ........ ఆ సంగతి మాకు తెలుసులేవయ్యా అని అహంకరించే భక్త  శిఖామణులకి చెప్పేది ఏమున్నది.....??

ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడి పరిస్తితులకి అణుగుణంగానే మన మైండు సెట్ మార్చుకోవాలి... అక్కడికి వెళ్ళిన వేలాది, లక్షలాది భక్తులలో మనం కూడా ఒకరిమే...... లేదా దొంగదారిన వెళుతున్న వీఐపీలలో ఒకరు అవ్వాలని ప్రతీ వారు అనుకొంటే అక్కడి పరిస్థితీ అంతే కదా.... మన లాగానే ఇతరులూ వచ్చారు.. వారిలాగానే మనమూ వచ్చాము అని అనుకోకుండా ఉన్న వారికి .... దైవంతో పని ఏమున్నది...? మనకే తొందరగా దైవ దర్శనం కావాలీ అని ప్రతీ వారూ అనుకోబట్టే తిరుమలలో పరిస్థితి అలా దిగజరింది.  సమస్య మూలం లోనికి వెళ్ళకుండా అక్కడ పని చేసే వారిని తిడుతున్నామనుకొని.....దేవస్థానాలనే తిడుతున్నారు.



 
 
సరే, లక్షలు మందీ వచ్చే చోట దేవస్థానం సిబ్బంది ఏదో అవకతవకలు చేస్తున్నారనే అనుకొందామూ..... మరి మనం పని చేసే చోట పరిస్థితి ఏమిటీ;  ఫదులూ వందలూ వచ్చే కౌంటర్లలోనే, ఎవరైనా తెలిసిన వారు వస్తే వెనక నుండీ పని చేసి పంపిస్తునామా లేదా....... ఒకసారి గుండెల మీద చెయ్య వేసుకొని చెప్పాలి మన భక్త శిఖమణులు.... అలాంటి దిక్కుమాలిన ఆబ్లిగేషన్లు ఫదులూ వందలు ఉండే కౌంటర్ల దగ్గరే ఉంటే.... లక్షలు వచ్చే చోట పనిచేసే వారి మీద ఎంత వత్తిడి ఉంటుంది...? అక్కడ పనిచేసే వారు దేవతలేమీ కాదు కదా... కేవలం సగటు సామాన్యులే  కదా....!!!  అది గమనించకుండా దేవస్థానాలని శాపనార్ధాలు పెట్టటం సమంజసమేనా.....   ఎక్కడ ఏది జరిగినా "అధికారులు రాలేదు" అని ఒక మాటని మీడీయా మరియూ సామాన్య జనం వాడేస్తునారు......"అధికారులు అంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం కాగల శక్తులున్నవారా"...??  వారికి ఉండే పరిమితులు వారికీ ఉంటాయి...  అయినా అధికారులూ, పాలక  వర్గాలని ఏకి పారెయ్యటానికి వారి నుండే ప్రత్యేక దర్శన పాసులు తీసుకొనే మీడియా ఉండనే ఉన్నది...... వారికి తోడు ప్రతిపక్ష వీఐపీలూ మరియూ పూర్తి బాధ్యతగల పౌరులూ ఉన్నారు......

కానీ, అసలు మనం సరిగ్గానే వ్యవహరిస్తున్నామా... అని ఎవరికి వారు ఒకసారి ప్రశ్నించుకొంటున్నారా....??? ఇప్పుడు సమస్య మూలంలోనికి వెళ్ళి చూద్దాం.... ఒక్కసారిగా ఒకే దేవాలయం మీద వేలూ లక్షలూ వచ్చి పడుతుంటే అక్కడి సమస్య దేవాలయం కాదు..... అలా ఒక్క సారిగా వచ్చిన వాళ్ళే ఒక పెద్ద సమస్య...  సమస్యని మనలో పెట్టుకొని దేవాలయాలని నిందించటం తగునా...? మరి ఆ సమస్య రాకుండా ఉండాలంటే అధికారుల కన్నా ముందర మన బాధ్యత ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మనం వెళ్ళేది మన భార్యా పిల్లలతో..... వారి బాబోగులు చూసేది మనమే కదా... వారికి ఎలా సౌకర్యవంతంగా ఉంటుందో మనమే చూసుకోకుండా బయలుదేరి, అధికారులని నిందిస్తే ప్రయోజనం ఏమున్నది...? అందుకని వెళ్ళే ముందర కొన్ని ఆలోచనలు ఈ క్రింది విధంగా చేస్తే చెయ్యగలిగితే ఏ సమస్యా ఉండకపోవచ్చును..... దేశమంటే మనమే కదా..... మన లాంటివారే కదా దేశమంటే......!!!


 1] మనం వెళ్ళబోయే దేవస్థానంలో రోజుకి ఎంతమంది దర్శనం చేసుకొనే వీలున్నది.......? శలవ రోజులలో రద్దీగా   ఉంటున్నాయా...?? ఈ ప్రశ్నలకి సమాధానంగా ... ఈ రోజు మనకి అందుబాటులో ఉన్న మీడియా చానళ్ళని ఉపయోగించుకొని తెలుసుకోవచ్చును...
 

2] రెండు రోజులు శలవలు కలిసి వస్తున్నాయి కదా అని మనమే బయలు దేరామా.....? మన లాగానే ఎన్నో లక్షల మంది ఆలోచించ వచ్చును కదా...... వారందరూ వచ్చి పడితే మన గతి ఏమిటీ అని మన సంగతి మనం ఆలోచించుకొన్నామా......?  లేదు. మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కానీ ....... అధికారులు కాదు కదా...!!!
 

3] దేవుడు శలవ రోజులలోనే దేవాలయంలో ఉంటారా...? లేదు కదా..... మరి మనమెందుకు శలవలు కాని రోజులలో శలవు పెట్టి వెళ్ళటం లేదు..? సమాధానంగా ఏమి చెప్పాలి.....? దేవుడి కోసం మనం మనకున్న శలవులలో ఒక్క శలవైనా వాడలేమా....?
 

4] దేవుడిని చూడటానికి కూడా మంచి రోజులు అనేవి కొన్నే ఉంటాయా.....? కేవలం అప్పుడే దేవుడు అక్కడ ఉంటారా?...... ఏదో కేంప్ కార్యాలయంలో  ఉన్నట్లుగా........ ఆ ప్రతేక రోజులలోనే దేవుడు అక్కడ ఉండి మనని కరుణిస్తాడా....??? అలా అనుకునేట్లైతే మనకి  దేవుడి మీద నమ్మకం లేనట్లే అనుకోవాలి.
 

5] మన మీద మనకి గౌరవం ఉన్నట్లే మన తోటివారి మీద కూడా అంతే గౌరవం ఉన్నదా....? దేవాలయాల్లోనే కాదు ఎక్కడ ఏ లైనులో చూసినా ఈ భావం మచ్చుకైనా కనపడదు.... మన తోటి వారిని మన లాగానే చూడగలిగితే ఏ సమస్యా ఉండదు.
 

6] తొక్కిసలాట జరిగే చోటికి మనమే వెళ్ళామా....? అక్కడ  మన లాంటి వారి వల్లనే అలా జరుగుతోందా...??
 

7] అవకాశం వస్తే మనం కూడా బ్రేక్, వీఐపీ దర్శనంలో వెళ్ళి "మాకు గంటలో దర్శనం అయింది" అని చెప్పుకొంటున్నామా...? 

పైన విషయాలని ఒక్కటి కూడా ఖాతరు చెయ్యకుండా, రద్దీ సమయాలలో  దేవాలయానికి వెళ్ళి అక్కడి వారిని తిట్టే హక్కు మనకున్నదా.......అలాగే దేవస్థానంకి సంబంధించిన వారు కూడా పండగలనీ, ముఖ్యమైన రోజులనీ భక్తులని రెచ్చగొట్టినప్ప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ రోజులకి ఎంతమందికి దర్శనం కల్పించగల శక్తి ఉన్నదో అంత మందినే కొండపైకి అనుమతించాలి.......సామాన్యుల కోటా ఎంతా,  ప్రత్యేకించి కొమ్ములు కలవారికి ఎంత కోటా అనేది ముందర రోజులలోనే నిర్ణయించి, క్రింద తిరుపతిలోనే విపరీత భక్త జనాన్ని నిలువరించాలి. తమ ఆబ్లిగేషను పీడలని సాద్యమైనంతవరకూ తగ్గించుకోవాలి........ ఇలా అడ్డ దారిలో వెళితే పుణ్యం రాదనీ, పైగా ఇతరులని ఇబ్బంది పెట్టటం వలన పాపం కూడా వస్తుందని స్వామీజీలూ సన్యాసుల చేతా ప్రచారం చేయించాలి. పెద్ద పెద్ద బోర్డులూ పెట్టాలి.  "ఇలా అడ్డ దారిలో వెళ్ళటం మహా పాపం అని   వీఐపీ పాసుల మీద  ముద్రించాలి".

మనం కూడా, దైవికంగా వచ్చే శలవలనీ, వారంతపు శలవలనీ ఈ గొడవల సంగతి తెలియక, సాధారణ దర్శనంలో 20 గంటలు నుంచొనే చదువు రాని వారికీ, అమాయకులకీ, మూర్ఖులకీ,  విపరీత నమ్మకాలున్న గ్రామీణులకీ వదిలేద్దాం..... హాయిగా మన శలవల్ని మన  కోసం అదే దేవుడికోసం వాడి  కోపతాపాలనీ అందోళనీ లేని వాతావరణంలో చక్కని దైవదర్శనం చేసుకొందాము. తిరుమల చేరుకోవటానికి సోమవారం మధ్యాహ్నం నుండీ శుకృవారం మధ్యాన్నం వరకూ మంచి అనుకూలమైన వాతావరణం. అంటే మధ్యలో ఉన్న మంగ్ళ, బుధ, గురువారాలలో కనుక తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొంటే చాలా చక్కగా అవుతుంది. ఎటువంటి తొక్కిసలాటా ఉండదు... రూములూ దొరుకుతాయి... అంతే కాదు తిరుపతికి వెళ్ళటానికీ, తిరిగి ఇంటికి వెళ్ళటానికీ రైల్ టిక్కెట్లు పెద్దగా కష్ట పడకుండానే దొరుకుతాయి. ఇంకో విషయం, తిరుమలలో ముఖ్యమైన రోజూ అని అందరూ అనుకొనే కాలంలో అక్కడికి వెళ్ళకపోవటమే మేలు. లేదా ఆ కష్టాలు పడటానికే సిద్ధమై వెళ్ళాలే కానీ..... అక్కడ వ్యవస్థనీ, తోటి భక్తులనే కాకుండా ఏకంగా దేవాలయాలనే విమర్శించ కూడదు.... దాని బదులు మనం మనని విమర్శించుకొంటే మనకే కాదు మన తోటివారికి కూడా కష్టం  లేకుండా చేసిన వారు అవుతాము. 
 


@@@@@@@@@@@

     

24, డిసెంబర్ 2012, సోమవారం

బాపట్ల పిల్లి -- విజయవాడ సాలీడు....

  పువ్వు లాగా ఉన్న కాకర కాయ---కాకర పువ్వు 



కాకర పువ్వోత్తులు -- భూ చక్రం 



 కాటన్ దొర -- పాలకొల్లులో కాటన్ విగ్రహం 




పురావస్తు వస్తువులు కాదు -- మొన్నటిదాకా వాడినవే 



హిందువుల విశాల హృదయం -- గన్నవరంలోని  ఒక ఆలయం వద్ద 


చలికి  ఎండ కాచుకుంటున్న బాపట్ల పిల్లి --  విజయవాడ సాలీడు 

పైన పిల్లిని బాపట్లలో ఫోటో తీసాను--క్రింది సాలిడుని  విజయవాడలో తీసాను

చిన్నప్పుడెప్పుడో ఆడుకొన్న చాక్లెట్ ఐదు రూపాయలు



విజయనగరం గంటస్థంభం సెంటరు రాత్రిపూట 



బాటరీ డౌన్ -- అంటే ది  ఎండ్  అన్నమాట 



////////////////////////////////////////////////// //////////////////////////////////////////////////
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\ \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
/////////////////////////////////////////////////// ///////////////////////////////////////////////////
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\ \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\
//////////////////////////////////////////////////// ////////////////////////////////////////////////////

 /////////////////////////////////////////////////////////////////////////////////////// 
 \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\ 
 ////////////////////////////////////////////////////////////////////////////////////// 
 \\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\ 
 ////////////////////////////////////////////////////////////////////////////////////// 



21, డిసెంబర్ 2012, శుక్రవారం

చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది ష ......కానీ అంత ధైర్యం...


మయాన్ కేలండరు గురించి ఎక్కడలేని అవాకులు చవాకులు పేలిన మన మీడియా వారు నిన్న రాత్రి నుండి అది మూఢ నమ్మకం అనీ , దానిని నమ్మద్దని........తాము చేసిన పాపాన్ని కడుక్కోవటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఒక టీ.విలో అయితే మనిషే శాశ్వతమని..... మరేది  శాశ్వతం కాదని,  తమ విపరీత ధోరణిని మళ్ళి  ప్రదర్శించారు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది ష ........ కానీ అంత  ధైర్యం మన మీడియా వారికి లేదు......... ఎవరికీ వారు ముందర నుండి దయ్యం గొంతుకులతో చెప్పింది వారే మర్చిపోయినట్లు నటించి........ఇప్పుడు ఏ  పాపం ఎరగనట్లు, అదంతా మూఢనమ్మకమని మేమే ముందర చెప్పాము అని అంటున్నారు.  ఎవరూ  కాకపొతే ఎక్కడో ఉన్న మాయన్ కేలండరుకి ప్రచారం చేసిందెవరు? ...... మయన్లని తిట్టించింది ఎవరు.....??   మొదలు నుండీ చూస్తున్న ప్రజలు  వీరి  మోసపూరిత అమాయకత్వ నటనని చూసి ఏమనుకోవాలి......???

నిన్న వేసిన 

  "మయాన్ కేలండరా.... మతిలేని కేలండరా".......[హైదరాబాదు బీచ్....!!!] లో 

 శివాగారు  తమ అభిప్రాయంలో చెప్పినట్లు ........."నాన్నా తోడేలు" కథలో లాగా చివరకు నిజమైన ఆపద వస్తుంటే, మీడియాలో  ఆ విషయాలు చెపితే ఎవ్వరూ పట్టించుకోని స్థితిని, వారి ఓవర్ ఏక్షన్‌తో కలుగుచేస్తున్నారు ప్రస్తుత మీడియా." ........మీడియా అనేది ప్రపంచ ప్రజలకి ఎంత అవసరమో చెప్పనవసరం లేదు......... అలాంటిది  మీడియా మీద నమ్మకాన్ని పోగొట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు ప్రవర్తించటం వారికి వారు మెడ కోసుకోవటమే కాదు....... ప్రజలకి చాలా తేలికగా అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థను దుర్వినియోగ పరచిన వారవుతున్నారు.

పై చిత్రాలు చార్లీ చాప్లిన్ గారి  "THE GREAT DICTATOR"   లోనివి 

మీడియా అంటే వ్యక్తులు కాదు ఒక నమ్మకమైన వ్యవస్థ. ఏ ఒక్కరి స్వంతమూ  కాదు........దానిని ప్రజలు నమ్ముతారు...... అందువలన,  ఏదైనా వేసేప్పుడు........చూపించేటప్పుడు .....వాగేటప్పుడు .......దీని వలన ఏమవుతుంది...? ఇది ప్రజలకి ఏమైనా ఉపయోగ పడుతుందా.......??  లేక ప్రజలని భయ భ్రాంతులని చేస్తుందా......అని చూడటమే కాదు .......అసలు నిజమా అబద్దమా అని చూడకుండా వేస్తే  మన మీడియా ఇమేజ్ ఇబ్బందుల్లో పడుతుందా........???  ఇలాంటివి వేస్తే ఫుట్ పాత్ పుస్తకాల స్థాయికి పడిపోతామా.... అని ఆలోచించుకోవాలి.....  ముందర చెప్పినట్లు,  వ్యవస్థలో వ్యక్తులుంటారు......... వారు ఇవ్వాళ  ఉంటారు రేపు ఇంతకన్నా మంచి ఆఫరు వస్తే వెళతారు.......  కాని, మీడియా వ్యవస్థ .....  పాలకులకి......ప్రజలకి,  ప్రజలకి....ప్రజలకీ  మధ్య నమ్మకమైన వారధిగా మిగలాలి.........దాని కోసం  అందులో పనిచేసేవారు మెలగాలి...... అప్పుడే వారి మీద  ఎటువంటి బయటి వత్తిళ్ళు ఉండవు........ ఇలాగే దుర్వినియోగం చేస్తుపోతే మీడియాకి కూడా పరిధులు.......కళ్ళేలూ,  గోళ్ళాలు పెట్టటానికి ప్రభుత్వం ముందు అడుగు వెయ్యక తప్పదు......అప్పుడు  ప్రభుత్వానికి ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురవదు........!!!

@@@@

@@@@@

@@@@ 



మరీ  సీరియస్సు ఎందుకు సరదా ఇది చూడండి 



**********

అందమైన బావా అంటే....కంగారు పడుతున్న ANR



"అందమైన బావా"  అంటూ మరదలు వస్తే ఎవరికైనా ఆనందమే మరి...... అలా ఆనందం పొందకుండా తెగ కంగారు పడుతున్న మన ఏఎన్ఆర్ గారిని చూస్తే   జాలి వెయ్యటంలేదూ..........!!! ఇంతకీ ఆయనెందుకు కంగారుపడుతున్నాడూ ఇవ్వాళ  మతిలేని టివీ వాళ్ళు చెప్పిన ప్రళయం రోజు 21-12-12 అని మటుకు కాదు...........ఇంతకీ దేనికో  చూస్తే పోలా........  ఏమున్నది పాపం, మన మ్యూజిక్  డైరెక్టరు పుణ్యాన  ఆయన మరదలు ఎదో తెలియని హంగేరియన్ లేదా సెర్బియన్ భాషలో పాట పాడుతుంటే మన ఏఎన్నార్ గారు ఖంగారు పడక ఏమి చేస్తాడు....!!!  




ఈ పాట రుణానుబంధం తెలుగు చిత్రంలోనిది..... దీనికి  సంగీతం పీ.ఆదినారాయణగారు. పాడినది... పీ.బీ.స్రీనివాస్, ఎస్.జానకి గారు. సెర్బియన్‌లో  పాడినది  "Ljiljana Petrović"  ...హంగేరియన్‌లో పాడినది  "Kovács Erzsi".  ఇదే  ఇంగ్లిషులో..."Louis Nunley"
 "Sail Along Silvery Moon" పాటగా కన్నా ఇనుస్ట్రుమెంట్ ముజిక్కుగా బాగా పాపులర్ అయినది.


 **************

పైన ఉన్న పూర్తీ పాటలు ఈ  క్రింది లింకులు నొక్కితే  వస్తాయి.

తెలుగులో  ---  "అందమైన బావా" [P.B.SRINIVAS, S.JANAKI]
హంగేరియన్ ---Jó az álmodozás [Kovács Erzsi] 

*********************