మయాన్ కేలండరు గురించి ఎక్కడలేని అవాకులు చవాకులు పేలిన మన మీడియా వారు నిన్న రాత్రి నుండి అది మూఢ నమ్మకం అనీ , దానిని నమ్మద్దని........తాము చేసిన పాపాన్ని కడుక్కోవటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఒక టీ.విలో అయితే మనిషే శాశ్వతమని..... మరేది శాశ్వతం కాదని, తమ విపరీత ధోరణిని మళ్ళి ప్రదర్శించారు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది ష ........ కానీ అంత ధైర్యం మన మీడియా వారికి లేదు......... ఎవరికీ వారు ముందర నుండి దయ్యం గొంతుకులతో చెప్పింది వారే మర్చిపోయినట్లు నటించి........ఇప్పుడు ఏ పాపం ఎరగనట్లు, అదంతా మూఢనమ్మకమని మేమే ముందర చెప్పాము అని అంటున్నారు. ఎవరూ కాకపొతే ఎక్కడో ఉన్న మాయన్ కేలండరుకి ప్రచారం చేసిందెవరు? ...... మయన్లని తిట్టించింది ఎవరు.....?? మొదలు నుండీ చూస్తున్న ప్రజలు వీరి మోసపూరిత అమాయకత్వ నటనని చూసి ఏమనుకోవాలి......???
నిన్న వేసిన
"మయాన్ కేలండరా.... మతిలేని కేలండరా".......[హైదరాబాదు బీచ్....!!!] లో
శివాగారు తమ అభిప్రాయంలో చెప్పినట్లు ........."నాన్నా తోడేలు" కథలో లాగా చివరకు నిజమైన ఆపద వస్తుంటే, మీడియాలో ఆ విషయాలు చెపితే ఎవ్వరూ పట్టించుకోని స్థితిని, వారి ఓవర్ ఏక్షన్‌తో కలుగుచేస్తున్నారు ప్రస్తుత మీడియా." ........మీడియా అనేది ప్రపంచ ప్రజలకి ఎంత అవసరమో చెప్పనవసరం లేదు......... అలాంటిది మీడియా మీద నమ్మకాన్ని పోగొట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు ప్రవర్తించటం వారికి వారు మెడ కోసుకోవటమే కాదు....... ప్రజలకి చాలా తేలికగా అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థను దుర్వినియోగ పరచిన వారవుతున్నారు.
పై చిత్రాలు చార్లీ చాప్లిన్ గారి "THE GREAT DICTATOR" లోనివి
మీడియా అంటే వ్యక్తులు కాదు ఒక నమ్మకమైన వ్యవస్థ. ఏ ఒక్కరి స్వంతమూ కాదు........దానిని ప్రజలు నమ్ముతారు...... అందువలన, ఏదైనా వేసేప్పుడు........చూపించేటప్పుడు .....వాగేటప్పుడు .......దీని వలన ఏమవుతుంది...? ఇది ప్రజలకి ఏమైనా ఉపయోగ పడుతుందా.......?? లేక ప్రజలని భయ భ్రాంతులని చేస్తుందా......అని చూడటమే కాదు .......అసలు నిజమా అబద్దమా అని చూడకుండా వేస్తే మన మీడియా ఇమేజ్ ఇబ్బందుల్లో పడుతుందా........??? ఇలాంటివి వేస్తే ఫుట్ పాత్ పుస్తకాల స్థాయికి పడిపోతామా.... అని ఆలోచించుకోవాలి..... ముందర చెప్పినట్లు, వ్యవస్థలో వ్యక్తులుంటారు......... వారు ఇవ్వాళ ఉంటారు రేపు ఇంతకన్నా మంచి ఆఫరు వస్తే వెళతారు....... కాని, మీడియా వ్యవస్థ ..... పాలకులకి......ప్రజలకి, ప్రజలకి....ప్రజలకీ మధ్య నమ్మకమైన వారధిగా మిగలాలి.........దాని కోసం అందులో పనిచేసేవారు మెలగాలి...... అప్పుడే వారి మీద ఎటువంటి బయటి వత్తిళ్ళు ఉండవు........ ఇలాగే దుర్వినియోగం చేస్తుపోతే మీడియాకి కూడా పరిధులు.......కళ్ళేలూ, గోళ్ళాలు పెట్టటానికి ప్రభుత్వం ముందు అడుగు వెయ్యక తప్పదు......అప్పుడు ప్రభుత్వానికి ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురవదు........!!!
@@@@
@@@@@
@@@@
మరీ సీరియస్సు ఎందుకు సరదా ఇది చూడండి
**********
chala baga chepparu sir
రిప్లయితొలగించండిTHANK YOU.......
రిప్లయితొలగించండిProblem is with the so called 24 hours News Channels. Although they call themselves as 24 hour news channels, are they telecasting non repetitive news all through this 24 hours? No not at all. They have some 3 to 4 hours of footage or content which they are churning out repeating the same over and over. When they not show non repetitive content 24 hours, why they should be allowed to telecast all through the day. They may say it is to provide ,news, for those who missed it in the last segment of telecast. If it is such a great news, we do come to know by more reliable source than the channels ie. WORD OF MOUTH.
రిప్లయితొలగించండిThis kind of telecast of the same thing over and over should be termed as psychological pollution and should be controlled by POLLUTION CONTROL BOARD, so that at least the resultant corruption (payment of heavy sums regularly) shall act as counter balance. In my view any thing seen over and over or heard on and on shall affect our thinking powers and illogically what we see or hear repeatedly we believe as truth and as such it's psychological pollution. Better Government intervenes and put restrictions on these so called 24 hour news channels and relieve us from this onslaught of pollution.
రిప్లయితొలగించండిFurther the demonic sounding voices, known as voice over should be completely banned as its unnatural and fearsome. More than the content, the way it is narrated affects and freighters people more.
రిప్లయితొలగించండిThank you శివరామప్రసాదు కప్పగంతుగారు. "They may say it is to provide, news,for those who missed it in the last segment of telecast" వాళ్ళు ఇలా సర్ది చెప్పుకోవటానికి కూడా లేదు.. ఎందుకంటే జనానికి పనికొచ్చేది రోజుకి ఒకసారో రెండుసార్లో వెయ్యటమో లేక స్క్రోలింగులో వెయ్యటమో చేస్తున్నారు. మయాన్ కేలండరు లాంటి సెన్సేషనల్ మూఢ నమ్మకాలిని రిపీట్‌గా వేస్తున్నారు.... , రాజకీయ నాయకుల మధ్య గొడవలు గంటలు గంటలు లైవ్ టెలికాస్టు ఇచ్చి మరీ జనాన్ని చావగొడుతున్నారు. దీనిలో అంతరార్ధమేమిటో సీబీఐ విచారణ చెయ్యకుండానే జనానికి తెలుసు.
రిప్లయితొలగించండి