ఎలా అయితేనే అనుకున్నదే జరిగింది.... ఏమున్నదీ గుజరాత్‌లో మోడీ గెలిచాడు. ముందర నుండీ అనుకున్నదే కదా...!!! అయితే అనుకున్నన్ని సీట్లు రాలేదు... మోడీ పని అయిపొతున్నది అన్నమాట..... ఇదీ ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజాభిప్రాయం.... మూడోసారి గెలిచినా ఇంత నీరస అభిప్రాయమేనా....???
అవును మరి, మన కాంగ్రెస్సు వారికి ఎలాగూ తాము ఓడిపోతామన్న విషయం తెలిసిపోయింది... అదెలాగూ ఆపలేరు... కనీసం "మోడీ గెలిచాడు" అనే గొప్పతనాన్నైనా తగ్గిద్దామని ప్రయత్నం చేసేశారు....తిమ్మరుసు తెలివితేటలని చూపించారు.... ముందరే మొడీ గెలిపుకి పేద్ద గీతను గీసేశారు...... కానీ అంత పేద్ద గెలుపు ఎవరికీ రాదన్న సంగతి కాంగ్రెస్సుకి తెలుసు..... దానికి మన మీడియా వారు కూడా చాలా చక్కగా సహకరించారు... ఇద్దరి ఉమ్మడి శత్రువు{?} మోడీనే కదా...!!!
కాంగ్రెస్సు వారు తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి "గుజరాత్ చిరంజీవిని" తయారు చేశారు.....అది మోడికి ఇబ్బందిని కలిగించింది........అయితే దిని వలన పూర్తి ఫలితం ఉండదని ముందరే తెలిసిపోయింది. ఎందుకంటే "ఆంద్రా చిరంజీవి" వలన కాంగ్రెస్సుకి 158 సీట్ల కన్నా రాలేదు. అసలే గుజరాత్ పరిస్థితే వేరుగా ఉన్నది.........ఇక ఎలాగూ ఓడిపోతామని నిర్ణయానికి వచ్చి, తమ శత్రువును అవసరం కన్నా పైకి ఎత్తే పనిలో పడ్డారు... జనం కూడా చూడలేనంత పైకెత్తితే.... ఎలాగూ అన్ని సీట్లు మోడీకి రావు కనుక, వారిలో గెలిచామన్న ఆనందాన్ని తగ్గించ వచ్చు, ఊహించినన్ని సీట్లు రాలేదని నిరుత్సాహపరచ వచ్చును. ఈ విధంగా కాంగ్రెస్సు వారు తమ వ్యూహాన్ని సక్సెస్సుఫుల్ల్‌గా గుజరాత్‌లో చెయ్యగలిగారు. విచిత్రమేమంటే ఢిల్లీ బీజేపీ శిబిరంలో కూడా కాంగ్రెస్సు ఆనందం లాంటిదే కనపడటం....!!! మన దేశ రాజకీయాలలో శత్రువు బయట నుండి రావాలిసిన పనిలేదు....!!!.
"మయాన్ కేలండరా.... మతిలేని కేలండరా".......[హైదరాబాదు బీచ్....!!!]
21-12-12
@@@@@@@@@@@@@@@@@@@
కాంగ్రెస్ కుయుక్తులకు కాలం చెల్లే రోజు వస్తుంది... రావాలి
రిప్లయితొలగించండిబాగున్నది బాబయి .... గుజరాత్ చిరంజీవి(GPP), ఆంధ్ర చిరంజీవి(PRP) పోలిక బాగున్నది.
రిప్లయితొలగించండినరేంద్ర మొడి ని గెలిపించు కోవడం, గుజరాత్ రాష్ట్రం అద్రుష్టం...
దిల్లి భా.జ.ప లొ ముఖ్యమైన లోటు అనవసరమైన చోట అతి మంచి తనం నటించడం.
అతి తెలివితేటలు ప్రదర్సించె దిల్లి కాంగ్రెస్స్ పార్టి కి బుధి చెప్పాలంటె, AGGRESSIVE POLITICAL STRATEGISTS చాలా అవసరం. దీన్ని అర్ధం చెసుకొగలిగేంత వరకు దిల్లి భా.జ.ప దేశ రాజకీయలల్లొ ఓటమి తప్పదు...
సాయి కుమార్ గారికి, భారతీయకి ధన్యవాదాలు..... ఈమధ్యన కాంగ్రెస్సు కొత్తరకం జిమ్మిక్కులు చేస్తోంది. దెబ్బ తగిలినా తగలనట్లుగా నటిస్తోంది... అవతలి వైపు వారు పైకి వచ్చినా దానిని గుర్తించనట్లుగా నటించి ప్రజలని మభ్యపెట్టాలని చూస్తోంది.... కానీ వాళ్ళ లోపల ఉన్న రోగం బయట వాళ్ళకి తెలియకపోయినా, కనీసం వారైనా తెలుసుకుంటే దానికి మందు వేసే అవకాశం ఉన్నది. రోగం లేనట్లు నటిస్తే ఉన్న రోగం పోదుగా....!!! ఇక బీజేపీలో ఉన్న జిన్నా తరాన్ని బయటకి పంపితే కానీ అది బాగుపడదు.
రిప్లయితొలగించండి