LOCAL WEATHER

21, డిసెంబర్ 2012, శుక్రవారం

అందమైన బావా అంటే....కంగారు పడుతున్న ANR"అందమైన బావా"  అంటూ మరదలు వస్తే ఎవరికైనా ఆనందమే మరి...... అలా ఆనందం పొందకుండా తెగ కంగారు పడుతున్న మన ఏఎన్ఆర్ గారిని చూస్తే   జాలి వెయ్యటంలేదూ..........!!! ఇంతకీ ఆయనెందుకు కంగారుపడుతున్నాడూ ఇవ్వాళ  మతిలేని టివీ వాళ్ళు చెప్పిన ప్రళయం రోజు 21-12-12 అని మటుకు కాదు...........ఇంతకీ దేనికో  చూస్తే పోలా........  ఏమున్నది పాపం, మన మ్యూజిక్  డైరెక్టరు పుణ్యాన  ఆయన మరదలు ఎదో తెలియని హంగేరియన్ లేదా సెర్బియన్ భాషలో పాట పాడుతుంటే మన ఏఎన్నార్ గారు ఖంగారు పడక ఏమి చేస్తాడు....!!!  
ఈ పాట రుణానుబంధం తెలుగు చిత్రంలోనిది..... దీనికి  సంగీతం పీ.ఆదినారాయణగారు. పాడినది... పీ.బీ.స్రీనివాస్, ఎస్.జానకి గారు. సెర్బియన్‌లో  పాడినది  "Ljiljana Petrović"  ...హంగేరియన్‌లో పాడినది  "Kovács Erzsi".  ఇదే  ఇంగ్లిషులో..."Louis Nunley"
 "Sail Along Silvery Moon" పాటగా కన్నా ఇనుస్ట్రుమెంట్ ముజిక్కుగా బాగా పాపులర్ అయినది.


 **************

పైన ఉన్న పూర్తీ పాటలు ఈ  క్రింది లింకులు నొక్కితే  వస్తాయి.

తెలుగులో  ---  "అందమైన బావా" [P.B.SRINIVAS, S.JANAKI]
హంగేరియన్ ---Jó az álmodozás [Kovács Erzsi] 

*********************