ఎవరైతే మోస్తారో వారినే తన్నే నహుషుడి జాతికి చెందిన చాలా మంది మన దేశంలో తయారైనారు........ అలాంటి వారిలో....... చదివేసుకొన్నాము అనుకొన్న వారు........లేక........ మేధావి వర్గం వారు.... లేక పెద్ద బాధ్యాతాయుత పదవిగల వారూ ఉన్నారు. వీరికి "స్వదేశం అనగానే స్వద్వేషం" పుట్టుకొస్తుంది. ఎక్కడ లేనీ విషయాలూ గుర్తుకొచ్చేస్తాయి....వాళ్ళకి తోచిన డైరెక్షనులో చరిత్ర చెప్పేస్తారు........ ఇంతకీ వీళ్ళ ఇంటెన్‌క్షన్ ఒక్కటే... "అది భారత దేశాన్ని తిట్టటం...భారతీయుల్ని అవమానించటం". దాని ద్వారా పేరు తెచ్చుకోవాలని అనుకోవటం..... ఇదేదో విదేశీయులు చేసే పని కాదు..... వారికి బారత దేశ సంస్కృతి అన్నా, భారతీయూ వ్యవస్థ అన్నా చాలా గౌరవం. ఈ పని చేసేది పైన చెప్పిన దేశీయ వర్గాలే..... వీరికి కావాలిసినది పేరు రావటమో లేక ఎదైనా మనసిక బలహీనతో అర్ధం కాదు....
మరి ఏమి అయ్యిందో కానీ ఈ నెల ఆరంభంలో [ఆ రోజు అమావస్య ముందు అనుకొంటా.....] "భారతీయులలో 90 శాతం ............."అని అనేశాడు". ఒక పెద్ద పదవిలో ఉన్న పెద్ద మనిషి.... ఇందులో 30-40 శాతం మంది ఉన్న...... పిల్లల్ని కూడా వదల లేదు ....... ఇంట్లోంచి కదల కుండా, పనికిమాలిన మీడియాని ఫాల్లోవ్ అవుతూ నోరు స్లిప్ అయినట్లున్నాడు....... అయితే, ఈయన గారు చెప్పిన ఒక విషయం మటుకూ కొంతవరకూ నిజమే. అది....... మనని మనం తిట్టుకొనే మానసిన బలహీనతని అంటించినది.... "లండన్ పీపులే". అదోక్కటే నిజం...ఈ లండన్ జబ్బు పుట్టే ఈ పెద్ద మనిషి భారతీయుల గురించి వదిరాడు.......... బాధాకరమైన విషయం ఏమంటే దేశ ప్రజలని "ఇడియట్స్" అన్న మనిషిని తిరిగి "ఇడియట్" అని అనలేక.......దాని బదులు ......... ఈయన..........ఆయన........ వారు..... వీరు..... అని" ..... సంబోధించవలసి రావటం............ తప్పదు మరి. ...........
1] ఇప్పడు ఈయన చెప్పిన విషయాల జోలికి వెళదాము... "communal riot could be incited in Delhi for as meagre an amount as Rs. 2000" భారతీయ జీవనం గురించి తెలిసి ఇలా ఎలా మాట్లాడగలిగాడు............? నిజంగా హిందువులూ ముస్లింస్ కొట్టుకుంటూ ఉంటే, రోజూ కొట్టుకుంటూనే ఉండాలి కదా...!!! దాని కోసం కేవలం 2000/- ఖర్చుపెట్టగలవారు ఎవ్వరూ లేరా .....?? కాని, అ విధంగా కొట్టుకొనే మనస్తత్వం మన భారతీయులకి లేదు. ఎందుకంటే, కేవలం 2000/- రూపాయలే కాదు,బయట నుండీ అనేక ఉగ్రవాద సంస్థలు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టినా భారతీయుల మధ్య విభేదాలని సృషించ లేకపోయారు కదా...!!! ఇంత ముఖమైన విషయం అంత పేద్ద పదవిలో ఉన్న పెద్ద మని....షికి తెలియదా....??? పెద్ద పదవిలో ఉండి ఏది అన్నా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడా....??? ప్రజా ప్రాతినిధ్యం మీద ఒక చిన్న కార్టూన్ వేసినందుకు సామాన్యుడిని అరెస్టు చేసిన మన వారు, ఫేసు బుక్ లో ఒక్క వ్యక్తీ గురించి రెండు ముక్కలు వ్రాసినందుకు ఆడ పిల్లలని కూడా చూడకుండా అరెస్టు చేసిన మన వారు........... ఏకంగా ఇంత పెద్ద ప్రజాసామ్య దేశాన్ని నిర్వహిస్తున్న ప్రజలని తులనాడినందుకు ఈ పెద్ద మనిషి మీద ఏ కేసు ఎందుకు పెట్టలేదు...??????? పెద్ద పదవిలొ ఉన్నాడనా........??? సామాన్యుడికో న్యాయం...........వేరోకరికో న్యాయమా.... మన ప్రజాసామ్య వ్యవస్థలో.............!!!!!! ఈ విషయంలో ఏ కాస్త తేడా వచ్చినా, పనికి మాలిన అల్లరి చేసే ఏ రాజకీయ పార్టీ కూడా ఈయన గారికి సరైన సమాధానం చెప్ప లేదు. పైగా పొద్దున్నే టీవీలలో కూర్చున్న "పెద్ద మనుషులైన[?]వారు కొందరు ఈయనను వెనుక వేసుకొచ్చారు కూడా....!!!
2] ఇక రెండవ విషయం..."before 1857 there was no communalism in the country but the situation is different now".. ఆయన చదివిన చరిత్ర పుస్తకాల సిలబస్సులో అంతవరకే ఉన్నట్లున్నది....పరిక్షలు పేసవటానికి అది చాలుగా...... "బుర్ర పెంచుకోవటానికి అయితే మన సిలబస్సులో లేని పుస్తకాలని చదవాలిగానీ"..... శతాబ్దాల పూర్వమే బుద్దిజం పుట్టిన తరవాత, వారి మత వ్యాప్తి సందర్భంగా అనేక గొడవలైనట్లు చరిత్ర చెపుతోంది...పగిలిన బుద్ద విగ్రహాలు చెపుతున్నాయి..... ఇక్కడ మనం తెలుసుకోవాలిసినది......"ఒకరి విషయంలో మరొకరు అనవసరంగా కలిగించుకొని.......అదీ సంస్కృతిక పరంగా....ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలో అయినా గొడవలు తప్పవు.... ఆ తరవాత 9 వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల నుండీ కూడా మత వైషమ్యాలు పెరిగినాయి......."నచ్చిన వాళ్ళని కలుపుకుంటాము....నచ్చని వాళ్ళని నరుకుతామూ" అనే దాడులు జరిగినాయని చరిత్ర చెపుతోంది......పగిలి ముక్కలైన దేవాలయాలు చెపుతున్నాయి............ఇంతెందుకు....మన దేశాన్నేదో "వాస్కోడీగామానే" కనిపెట్టిసినట్లూ...అంతకు ముం
3] ఈయన మూడో విషయం....."Today 80 percent Hindus are communal and 80 percent Muslims are communal"......ఈయన లాంటి వారు ఉద్యోగం.... జీతాలూ....టీయేలూ....డియేల్లూ లెక్కలలో పడి దేశంలోని ప్రజల జీవన విధానాన్ని సరిగా అర్ధం చేసుకొన్నట్లు లేదు ...!!!! "దేశంలోని ప్రజలలో ఎక్కువగా వేరే మతం వారితో స్నేహం కానీ, ఆర్ధిక లావా దేవీలు ఉన్నాయంటే అది హిందూ...ముస్లీంస్ మధ్యేనన్న సంగతి నాలుగ్గోడల మధ్య మాత్రమే కూర్చొన్న వారికి ఎలా తెలుస్తుంది....? ఇంట్లోని నలుగురు అన్నదమ్ములు కొట్టుకొన్నట్లుగా
4] ఇకపోతే, వీరు చెప్పిన నాలుగో విషయం...... "The policy that emanated from London after the mutiny in 1857 that there is only one way to control this country" .......... ఇదొక్కటే కొంత వరకూ నిజం....... అయితే, బ్రిటిష్ వారి హయాంలో మతాల మధ్య గొడవలు జరగలేదు.....అదొక పెద్ద విషయం కూడా కాదు.....అలాంటివి ఏమైనా ఉంటే వాటి పట్ల కఠినంగా ఉన్నారు.... అలాంటి గొడవలని సృష్టించే ఫ్రెంచ్...
స్వాతంత్రం వచ్చిన తరవాత అనేక గొడవలు దేశాన్ని వదిలిపోయినా....బ్రిటీషు వారు అంటించిన ఈ జబ్బు మటుకూ పోలేదు..... అదే "మనని మనం తిట్టుకొనే జబ్బు". ఈ విధమైన జబ్బు ప్రభావం వల్లనే మన పేద్ద మనిషి గారు భారతీయులని తిట్టేరు....పాపం ఆయన మడుకూ ఏమి చేస్తారు.....ఇది మందు లేని జబ్బు కదా......!!!! పిచ్చి పట్టిన వాడికి లోకమంతా పిచ్చిగా ఉండి సాటి పిచ్చి వాళ్ళు మాత్రం మంచిగా కనపడతారుట...... అందుకనే వీరు 90 శాతం గురించే మాట్లాడి తమలాంటి 10 శాతం మూర్ఖులనీ వెనుకేసుకొచ్చారు.... "మేధావులనబడే వారిలో 90 శాతం మంది మూర్ఖులే"
అసలు చెప్పాలంటే, శతాబ్దాల భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాకే దేశంలో మతసామరస్యం ఉన్నట్లుగా అనుకోవాలి............అందులో ఏదన్నా తేడా వచ్చిందంటే అది మేదావులనబడే వారి అతి తెలివి మాటల వలన..... లేదా, అందరినీ సమంగా చూడకుండా, కొందరిని మాత్రమే ఏదో లాభం కోసం వెనుకేసుకు రావటం వల్లన మాత్రమే మతసామరస్యానికి ఇబ్బంది వచ్చింది..... ఈ విధంగా ఏ విషయంలో కూడా ఎవరినీ వెనుకేసుకు రాకుండా, "అందరి మనోభావాలకీ ఒకే రకమైన సమాన హోదానీ, గౌరవాన్నీ కలిగించినట్లైతే..... మన భారత దేశం ఇంకా శాంతియుతంగా ఉంటుంది.....ఎదైనా సమస్య ఉంటే దానికి చక్కటి పరిష్కారం చూపించాలిసినది పోయి....తాము చేస్తున్న "పదవిని అడ్డం పెట్టుకొని జాతిని అవమానించే వారిని క్షమించకూడదు"..........
ఇకపోతే మీడియా వారి సంగతి, ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు.......ఒక వర్గం, మరొక వర్గం అని మాట్లాడే వీరు.....ఎవడైనా సరే దేశాన్ని తిట్టగానే......ఆ మొత్తం న్యూస్‌ని, గంటల తరబడీ వేసి.....వాడొకసారి తిడితే, మన మీడియా వారు వెయ్యసార్లు తిట్టి, తిట్టించి సరదా తీర్చుకొంటారు...... సరే.....వీరికి కొత్తగా చెప్పేదేమున్నది....... ఎలాగూ వీరు కూ డా "ఆ మేధావి వర్గం" వారే కదా.... అయినా కొంచం ఆశ ఉన్నది వింటారేమోనని...... అయ్యా మీడియా వారూ... ఎవరైనా దేశం గురించి పనికి మాలిన కూతలు కూస్తే, ఆ వార్తను అనేక సార్లు వేసి, పెద్దమనుషులు కూర్చొని పెదరాయుడి తీర్పులు ఇవ్వ వలసిన పనిలేదు...... మీకు డబ్బు వొచ్చే అనేక విషయాలు దేశంలో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. అప్పటికైనా దేశం, దేశ ప్రజల గురించి కారుకూతలు కూసేవారికి ప్రొత్సాహం తగ్గే అవకాశం ఉన్నది.
కొసమెరుపు.........కాశ్మీర్ సమస్యకు భారత్ పాకిస్తాన్ల విలినమే ఓ గొప్ప పరిష్కార మార్గమనీ .....చాలా విశాల హృదయంతో ఈయన గారు చెప్పేశారు............ఈ మాత్రం తెలియక రెండు దేశాలూ తమ సైన్యానికి వేల కోట్లు తగలేస్తున్నాయి.........
@@@@@@@@@@@@@@@@
1)ఎవరైతే మోస్తారో వారినే తన్నే నహుషుడి జాతికి చెందిన చాలా మంది మన దేశంలో తయారైనారు..."
రిప్లయితొలగించండి2)"..ప్రజా ప్రాతినిధ్యం మిద ఒక చిన్న కార్టూన్ వేసినందుకు సామాన్యుడిని అరెస్టు చేసిన మన వారు, ఫేసు బుక్ లో ఒక్క వ్యక్తీ గురించి రెండు ముక్కలు వ్రాసినందుకు ఆడ పిల్లలని కూడా చూడకుండా అరెస్టు చేసిన మన వారు........... ఏకంగా ఇంత పెద్ద ప్రజాసామ్య దేశాన్ని నిర్వహిస్తున్న ప్రజలని తులనాడినందుకు ఈ పెద్ద మనిషి మీద ఏ కేసు ఎందుకు పెట్టలేదు...???????"
3)"శతాబ్దాల భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినాకే దేశంలో మతసామరస్యం ఉన్నట్లుగా అనుకోవాలి............అందులో ఏదన్నా తేడా వచ్చిందంటే అది మేదావులనబడే వారి అతి తెలివి మాటల వలన..... లేదా, అందరినీ సమంగా చూడకుండా, కొందరిని మాత్రమే ఏదో లాభం కోసం వెనుకేసుకు రావటం వల్లన మాత్రమే మతసామరస్యానికి ఇబ్బంది వచ్చింది....."
Excellent points. Well Written.
thank you sir
రిప్లయితొలగించండి