LOCAL WEATHER

1, జూన్ 2014, ఆదివారం

పెళ్ళి జరిగితే... పుట్టిన రోజు మారిపోతుందా....???

భద్రాచలంతో కలిపి 1953 అక్టోబర్ 1 న ఏర్పడిన రాష్ట్రం 

ఆంద్ర ప్రదేశ్ అవతరణ ఎప్పుడూ...
అని ఇప్పుడు చాలా మందికి సందేహంగా ఉన్నది... 
అయితే... 
ఇందులో సందేహం ఏమి అఖర్లేకుండానే 
అక్టోబర్ 1 అనే నిర్ణయించ వచ్చును... 
ఎందుకంటే... తెలుగు వారికి 
మొట్టమొదటిగా రాష్ట్రం ఏర్పడిన రోజది...

నిజానికి...నిజాం ప్రాంతం కలిసిన నవంబరు 1న  
ఆంధ్ర ప్రదేశ్ అవతరణను  చేస్తున్నదే తప్పు. 
ఎందుకంటే, 
రాష్ట్రం ఏర్పడిన తరవాత
మరొక ప్రాంతం కలిసినంత మాత్రాన అవతరణ తేదీ మారదు...
ఉదాహరణకి, 
భారత దేశానికి 1947 అగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ...
దరిదాపుల 1975 వరకూ 
విదేశీ పాలనలో ఉన్న ఏదోక ప్రాంతం కలుస్తూ వచ్చింది...
19 డిసెంబరు 1961లో గోవా భారత్‌లో కలిసింది...
మనం స్వాతంత్ర దినాన్ని డిసెంబరు 19న చేసుకోవటం లేదు కదా... 
 1975లో ఒకానొక ఫ్రెంచ్ కాలనీ భారత్ లో కలిసింది...
అయినా 
భారత్ స్వాతంత్ర దినం మారలేదు కదా...
అలాగే రేపు..
కాకినాడ ప్రక్కన ఉన్న యానం[పాండిచెర్రి]ఆంద్రాలో కలిస్తే 
మరల ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం మారదు కదా.....
పెళ్లి రోజులు ఎన్నైనా రావచ్చును...!!!
కానీ,
పుట్టిన రోజు మాత్రం మారదు కదా....!!!


కాబట్టి, 
ఇప్పటికే చేస్తున్న తప్పుకి మరో తప్పుని చేర్చకుండా...
చేసిన తప్పుని సరిదిద్దుకుని...
ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినాన్ని 
అక్టోబర్ 1న  చేసుకోవటమే సమంజసం.
అదే  
మనకు తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకి పెద్ద నివాళి. 

చివరగా మీడియా వారి పిచ్చి తెలుగుకి 
ఒక సవరణ...
రాష్ట్రం నుండి ఒక ముక్క విడిపోయినంత మాత్రాన  
అవశేష ఆంధ్రా అని అంటున్నారు...
నోటికేది వస్తే అది అనకుంటే 
వాల్ల[ళ్ళ] "దినం"....
అదేనండీ... రోజు గడవదేమో....జై హింద్ రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి గూగులమ్మ-మిక్సిగ్ కేఆర్కే 
@@@@@@@@@@@@@@@@