ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజింపబడిన తరవాత... తెలంగాణాకి జూన్ 2వ తేదీ నుండీ ఒక ముఖ్యమంత్రి ఏర్పడి... ఆ రాష్ట్ర ప్రయోజనాలకి కావలిసినవీ అన్నీ చూసుకుంటూ, "ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు" అనే భావనని అక్కడి ప్రజలకి తెచ్చాడు...
అదే సమయములో కాకుండా...జూన్ 8వ తేదీన మరొకరు ఆంధ్రప్రదేశ్‌నకు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ప్రమాణం చేసి... వారంలో నాలుగు రోజులు ఆంధ్రాలోనే గడిపి...రెండురోజులు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదులో ఉండి...మరొక రోజున ఢిల్లీ వెళ్ళి...అంధ్రాకి కావాలిసిన అన్ని పనులూ చేసిపెడతానని నొక్కి వక్కాణించాడు. అనంతరం ఇక్కడి నుండీ హైదరాబాదు ప్రయాణం అయిన మరుక్షణం...తెలంగాణాకి కూడా ఒక రోజు కేటాయిస్తానని చెప్పేశాడు...
ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ తెలంగాణాలో ఉంటాను అనే మాట తప్ప మిగిలినవి అన్నీ మరచిపోయారు...ఈయన గారి నొటి నుండీ రోజుకి 100 సార్లు "ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణం" అనే మాట తప్ప... మరొక అడుగు సీమాంధ్ర అభివృద్ధి వైపుకి పడటం లేదు... అయితే, తెలంగాణా విషయంలో మడుకూ అక్కడి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ శ్రద్ధ కనపరస్తూ ఉన్నాడు...
అక్కడెక్కడో హైదరాబాదు కుర్రాళ్ళకి ప్రమాదం జరిగితే... తెలంగాణా వారికన్నా ఎక్కువ స్పందించి, ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేసేశారు...అంధ్రా ఖర్చులతో... ఇలా చెయ్య కూడదని కాదుగానీ...రేపు ఏ తమిళనాడులోనో, కర్నాటకాలో "నివసిస్తున్న" తెలుగు వారికి ప్రమాదం జరిగితే ఇలాగే స్పందిస్తారా బాబుగారు... స్పందించకపోవచ్చును...ఎందుకంటే అక్కడ తన పార్టీ లేదు కదా...ఇదే విధంగా, మొన్న తూగో జిల్లా నగరం దుర్ఘటన జరిగినప్పుడు...మాజీ ఆంద్ర రాష్ట్ర పౌరుడు, ప్రస్తుత ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి ఒక సంతాప సందేశం వచ్చిందేగాని...దీనిపై దూకుడుగా మరే స్పందన లేదు...కారణం...ఆయన పార్టీ ఇక్కడ లేదు...కదా...!!!
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతుంటే...
దానికి మూలంలోనికి వెళ్ళి
సరైన శాశ్వత పరిష్కారం చెయ్యవలసిన ముఖ్యమంత్రి...
సరైన శాశ్వత పరిష్కారం చెయ్యవలసిన ముఖ్యమంత్రి...
మరింత పీట ముడిపడేట్లు చేశారు....
ఈయన మాటలతో
పరోక్షంగా ఆంధ్రాకి జరిగిన అన్యాయాన్ని
సమర్ధించినట్లు అయింది.
దీని వలన 4 లక్షల టన్నుల బొగ్గుని రాష్ట్రానికి కేటాయించుకున్నా ...
పరోక్షంగా ఈ బొగ్గులో 52 శాతం తెలంగాణాకి కేటాయించినట్లు అయ్యింది.
ఈ బొగ్గు వలన వచ్చే కరెంటులో షుమారు 52శాతం ఆ రాష్ట్రానికే కదా...
అలాగే పైదీ పరోక్షం అయితే,
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీ ప్రయాణాన్ని పెట్టుకొని
అక్కడి వారికందరికీ ఆంధ్ర విషయాలనే కాకుండా...
ప్రత్యేక్షంగా తెలంగాణా అవసరాల గురించి కూడా చర్చించారు...
ఈయన ఇంకా మొత్తం
"సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగానే" వ్యవహరిస్తున్నాడో
లేక
అక్కడ తెలంగాణాలో
తన పార్టీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారో" తెలియటం లేదు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పర్యటన చేసినప్పుడు...
తానూ ఏ రాష్ట్ర పనిమీద వచ్చాడో
అది మాత్రమే మాట్లాడాలి...
అదే ఆ పార్టీ అధ్యక్ష్యుడుగా వెళితే,
అప్పుడు తన పార్టీ బాబోగుల గురించి మాట్లాడోచ్చును....
విభజన ద్వారా వీరి పార్టీని దెబ్బ తీద్దామనే ప్రత్యర్దుల కోరికని వీరి నాయకుడే తీరుస్తున్నట్లుగా ఉన్నది....అధికారం ఇచ్చిన రాష్ట్రం గురించి కాకుండా...అధికారం రావాలిసిన మిగిలిన ముక్క కోసం ప్రయత్నిచటం వలన...రేపు 2019 ఎన్నికలలో... విడిపోయిన ముక్కలో అధికారం వచ్చే మాట అటుంచి, ఇక్కడ అధికారం ఉన్న చోట అధికారం పోయే పరిస్తితిని, వారికి వారే కల్పించుకుని...వీరి సమీప ప్రత్యర్ది మార్గాన్ని సుగమం చేస్తున్నారు.
ఒక వేళ తెలంగాణాలో కనుక
తమ పార్టీకి అవసరం అనుకున్నట్లైతే
అక్కడి ముఖ్య మంత్రి అభ్యర్ధి
కృష్ణయ్యగారు చూసుకోవచ్చును కదా...
ఆయనకి కేవలం ముఖ్యమంత్రిగానే అనుభవం ఉండి...
ప్రతిపక్షనేతగా అనుభవం లేకపోతే,
ఆయనని ఆంధ్ర ప్రదేశ్‌నకు ముఖ్యమంత్రిగా చేసి,
బాబుగారే స్వయంగా
తెలంగాణాలో ప్రతిపక్ష పాత్ర పోషించ వచ్చును కదా...
ఎందుకంటే ఈయనకి ముఖ్య మంత్రిగా కంటే
ప్రతిపక్ష నేతాగానే ఎక్కువ అనుభవం ఉన్నది...
సమైక్యరాష్త్రంలో....
బాబుకి ఈ ఆశ 2019లో కూడా తీరే అవకాశం లేదు...
వస్తే కెసిఆర్ లేకపోతె కాంగ్రెస్...అంతే...
ఏది ఏమైనా
"ఆంధ్రప్రదేశ్‌నకు ఒక ముఖ్య మంత్రి ఉన్నాడా" అని అనిపిస్తుంటే...
"తెలంగాణా[లో]కి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు" అని అనిపిస్తోంది...
కాబట్టి...
కేవలం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మాత్రమే
చూస్తానని ప్రమాణం చేసే
ముఖ్యమంత్రి సీమాంధ్రకి కావలెను....
కావలిసిన అర్హతలు:
1] ఈ అభ్యర్ధి 1956 తరవాత హైదరాబాదుకి వెళ్లి ఉండరాదు...[ఈ అర్హత తప్పనిసరి]
2] ఈ అభ్యర్ధి యొక్క కొలతలు ముఖ్యంగా "హృదయ వైశాల్యం తెలంగాణా ముఖ్యమంత్రికి ఉన్నంత మాత్రమే ఉండవలెను"...లేదా అంతకు తక్కువ ఉన్నా మంచిదే కానీ...ఎక్కువ హృదయ వైశాల్యం మడుకూ ఉండరాదు.
3] ఈ అభ్యర్ధి అంతకు ముందుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా పరవాలేదు కానీ....ఇతర రాష్ట్రాలలో పని చేసిన అనుభవం "అసలు ఉండరాదు"
4] అభ్యర్ధి కేవలం ఆంధ్ర ప్రదేశ్‌లోనే పుట్టి ఉండవలెను... వారి తాత ముత్తాతలు కూడా.
5] అభ్యర్ధి ఓటు హక్కు కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉండవలెను.
6] వీరికి సంబంధించిన రాజకీయ పార్టీ... కేవలం ప్రాంతీయ పార్టీగానే ఉండవలెను...అనగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పోటీ చెయ్యవలెను...ఇతర రాష్ట్రాలలో బ్రాంచీలు ఉండరాదు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండవలెను.
7] ఈ అభ్యర్ధికి ఇతర రాష్ట్రాలలో ఆస్తులు ఏమీ ఉండరాదు.... ముఖ్యంగా స్థిరాస్తులు...అదీ కూడా తెలంగాణాలో అసలు ఉండరాదు.
8] ఈ అభ్యర్ధి తానూ ముఖ్యమంత్రిగా ఉన్న ఆంద్రప్రదేస్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల కోట్లాది తెలుగు వారి గురించి కాకుండా...ప్రపంచంలో ఉన్న లక్షలాది తెలుగు ప్రజల గురించి "అసలు" ఆలోచించ కూడదు.
ఈ పై లక్షణాలు ఉండి, భవిష్యత్తులో కనీసం 100 ఏళ్ళ వరకూ తన పార్టిని జాతీయ పార్టీ చెయ్యనని హామీ బాండ్ ఇవ్వగల అభ్యర్ధుల వల్లనే ఆంధ్రప్రదేశ్ బాగు పడుతుందనే ఆశ ఇక్కడి ప్రజలలో ఉన్నది... కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలని నెరవేర్చే ముఖ్యమంత్రి కావలెను...
ఈ విధమైన భావాన్ని ప్రజలలో బలంగా ఉండేట్లుగా చేస్తున్న ఇప్పటి ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలతో...
ఈ పై లక్షణాలు ఉండి, భవిష్యత్తులో కనీసం 100 ఏళ్ళ వరకూ తన పార్టిని జాతీయ పార్టీ చెయ్యనని హామీ బాండ్ ఇవ్వగల అభ్యర్ధుల వల్లనే ఆంధ్రప్రదేశ్ బాగు పడుతుందనే ఆశ ఇక్కడి ప్రజలలో ఉన్నది... కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలని నెరవేర్చే ముఖ్యమంత్రి కావలెను...
ఈ విధమైన భావాన్ని ప్రజలలో బలంగా ఉండేట్లుగా చేస్తున్న ఇప్పటి ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలతో...
అలాగే, తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమం కోరేవారుగా ఒక విజ్ఞప్తి... తెలంగాణా[కి]లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరో ఒకరు రాజీనామా చేస్తే మంచిది...లేకపోతే రాజ్యాంగ సంక్షొభం ఏర్పడి అక్కడి పాలన స్థభించే అవకాశం ఉన్నది...
ఏ పార్టి వారైనా తన పార్టిని
ఇతర రాష్ట్రాలకి వ్యాపింప చెయ్యాలంటే
జై హింద్
బొమ్మలు గూగుల్...మిక్స్తింగ్ కేఆర్కే
చివరగా అసలు విషయం......
ఏ పార్టి వారైనా తన పార్టిని
ఇతర రాష్ట్రాలకి వ్యాపింప చెయ్యాలంటే
తాము ఇప్పటికే ఉంటున్న రాష్ట్రం యొక్క
ప్రయోజనాలని ఫణంగా పెట్టరాదు...
ప్రయోజనాలని ఫణంగా పెట్టరాదు...
ఈ విషయంలో
ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్న
కాంగ్రెస్సు-బిజెపి-కమ్యునిస్టు వారిని చూసి,
కొత్తగా జాతీయ పార్టీలుగా అయిన
తెలుగుదేశం మరియు వైఎస్సార్ పార్టీలు
నేర్చుకోవలసినది చాలా ఉన్నది....
ఉదాహరణకి
కర్ణాటకాలో, ఆంధ్రలో, మహారాష్ట్రాలో
కర్ణాటకాలో, ఆంధ్రలో, మహారాష్ట్రాలో
కాంగ్రెస్సు లేక బిజెపి ఉన్నప్పటికీ
వారు తమ "లోకల్ ప్రయోజనాలకే" పోరాడేరే తప్ప
దానికి విరుద్ధంగా ప్రవర్తించ లేదు...
కాబట్టి,
ఈ బుద్ధిని కొత్తగా జాతీయ పార్టీలుగా అయిన
తెలుగు పార్టీలు తెలుసుకుంటే మంచిది...
అలా కాకుండా,
"తెలంగాణా పార్టీ వారి బ్లాక్ మెయిల్‌కి"
లొంగితే
"తెలంగాణా పార్టీ వారి బ్లాక్ మెయిల్‌కి"
లొంగితే
ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న వీరు...
ఉన్న జాతీయ హోదా పోగొట్టుకోవటమే కాకుండా...
ప్రాంతీయ పార్టీలుగా కూడా పనికి రాకుండా పోతారు...
జై హింద్
బొమ్మలు గూగుల్...మిక్స్తింగ్ కేఆర్కే
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...
3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!
4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????
5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!
6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం
మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@
@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి