LOCAL WEATHER

3, ఆగస్టు 2013, శనివారం

తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!





ఎప్పుడో జరిగే ఎలక్షన్ల్ గురించి సంవత్సరాల ముందరే వ్యూహాలు పన్ని,
తమ రాజకుమారుడిని ప్రధానిని చెయ్యాటం పట్ల కాంగ్రెస్సుకి ఉన్న శ్రద్ధ  ...... 
ఓ కొత్తరాష్ట్రాన్ని,  ఇప్పటికే ఉన్న రాజధానితో సహా ఇచ్చేస్తే,
మరి మిగిలిన రాష్ట్రాం పరిస్థితి ఏమిటీ...??? అనే దానిమీద ఏ మాత్రం శ్రద్ధ లేదు... 
అవునులే "ఎవరెటుపోతే మాకేమిటి, మేమూ మా పార్టీ ఉంటే చాలునని" 
అన్న సిద్ధాంతంతోనే బ్రతికే కాంగ్రెస్సుకి,
ప్రజలు ఎలా కొట్టుకు చస్తే ఏమిటట..!!!
మొదటి మేప్ కర్టేసి లింకు నొక్కండి..
రెండవ మేప్ కర్టేసి లింకు నొక్కండి

29వ రాష్ట్రం ఇచ్చేశాము అని చంకలు గుద్దుకొనే ఈ కాంగ్రెస్సు వారు, ఇదివరలో ఆయా రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలియదా...??? ఏ రాష్ట్రమైనా దానికి తగ్గ రాజధాని లేకుండా అయ్యిందా..? లేక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పటికే ఉన్న రాజధానిని కబళించి వేసిందా...? అంటే.... 

ఉద్యమం చేసిన ఆంద్రా...  మదరాసు రాజధానిగా రాష్ట్రం ఏర్పడిందా....? 

మరాఠా నుండి వీడిపోయిన గుజరాతు...  ముంబాయి రాజధానిగా ఏర్పడిందా....?

హైదరాబాదు నుండీ విడిపోయిన ఉత్తర కర్నాటకా... హైదరాబాదు రాజధానిగా రాష్ట్రంగా ఏర్పడీందా...?

బెంగాలు నుండీ విడిపోయిన బీహారు, ఒరిస్సా, ఆస్సాములకి... రాజధానిగా కలకత్తా నగరం అయ్యిందా...?  



అంతెందుకు...మొన్నటికి మొన్న, గొడ్డలి గుర్తుగల విచ్చిన్నకర బీజేపీ వారిచ్చిన 3 రాష్ట్రాలు...లక్నొ రాజధానిగా ఉత్తరాఖండ్, పాట్నా రాజధానిగా ఝార్ఖండ్, భోపాల్ రాజధానిగా చత్తీశ్‌ఘర్ రాష్ట్రాలు ఏర్పడలేదు.  కొత్త రాష్ట్రాలు కొత్త రాజదానితోనే ఏర్పడినాయి. మన భారత దేశం ముక్కలైనప్పుడు కూడా  ఢిల్లీ రాజధానిగా బర్మా ఏర్పడలేదు, ఢిల్లీ రాజధానిగా పాకిస్తాను ఏర్పడలేదు. [కాబట్టి ఒక్కమాటతో చెయ్యాలిసినపని కాదు; ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలిసిన విభజన ఇది.]


కానీ, ఎప్పుడూ జరగని విధంగా దేశంలోనే[బహుశా ప్రపంచంలోనే] మొట్టమొదటిసారిగా,
 ఉద్యమం చేసిన ప్రాంతానికే... 
50 ఏళ్ళూగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కట్టుకున్న రాజధానిని, 
ఒక్క మాటతో ఒక్క నిమిషంలో ఆ ఒక్కరికే మూటకట్టి ఇవ్వటం 
ఎంతవరకూ సమంజసం...? 
సరే, భౌగోళికంగా దగ్గర లేదు....అలాంటప్పుడు 
మరో 10 సంవత్సరాలు సీమాంధ్రకి రాజధానిగా ఎలా పనికి వస్తుందనుకున్నారు....
మొత్తం కొత్త రాష్ట్రం వారికి ఇచ్చేసి...
మీరు కూడా ఓ ప్రక్కన ఉండండీ అని అనటం 
బుద్ధి ఉన్నవాడు చేసే పనేనా...??
ఈ మాత్రం ప్రకటించటానికి ఇన్ని ఏళ్ళు ఎందుకు పట్టింది...???  

ఇంతకు ముందు అన్నదమ్ములుగా కలిసినవారు, 
కొన్నాళ్ళు అన్నదమ్ములుగా ఉన్నా, 
తరవాత అన్నదమ్ముల్లాగా విడిపోదామని ప్రయత్నించారు. 
కానీ, అప్పుడు కూడా
 ఈ దిక్కుమాలిన కాంగ్రెస్సే 1969 ఒకసారీ, 1973లో మరోసారీ మోకాలొడ్డింది... 
పైగా, "మా రాష్ట్రం మాకు కావాలి" అని అడిగిన ఆంధ్రా వారికి 
అప్పుడు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్సు...
ఈ 40 ఏళ్లలో నమ్మకంగా "ఇది అందరిది" అని నమ్మి
 రాజధాని అయిన హైదరాబాదుకి రాష్ట్ర ప్రజలందరూ అంకితం అయిన తరవాత...
ఇప్పుడు, 40 ఏళ్ల తరవాత మళ్ళీ అదే కాంగ్రెస్సు "విడదీస్తున్నాం" అంటున్నారు. 
అంతా వీరిష్టమేనా...???
ఇది అన్నదమ్ములు విడిపోయినట్లుగా లేదు; 
అవమానకరంగా తరిమేసినట్లుగా ఉన్నది...
 సరే జరిగిందేదో జరిగింది... 
ఆంధ్రాకి తలకాయని తెగ్గొట్టి మరో ఫదేళ్ళు ప్రక్కవాడి తలకాయని ఉపయోగించు 
అనీ...అదీ కూడా ఇష్టం లేకుండా...మొఖానే తలుపువేసిన వారితో పంచుకోమనటం
 వీరిని అగౌరపరచినట్లు కాదా....
అంటే, అక్కడ మరిన్ని అబివృద్ధి కార్యక్రమాలకి వీరిని వాడుకునీ,  
వీరికి ఉన్న గోచి కూడా లాగేద్దామనా...
అందుకే ఈ విభజన, ఆంద్రా వారి ఆగ్రహానికి కారణం అయ్యింది.  

"కొత్త రాష్ట్రం ఏర్పడకుండా ఉండటానికి ఏవో వేలకోట్ల పేకేజీలు..." అని ఆశలు చూపిన వారు...  మరి కొత్త రాజధాని కోసం ఆంధ్రా వారికేమీ పేకేజీలు...కోట్లరూపాయలూ ఇవ్వరా.....? ముందరే ప్రకటన చెయ్యరా...?? ఇది ఎలా ఉన్నదంటే, "మరో పదేళ్ళూ మళ్ళీ క్రిందా మీదా పడీ కొత్త రాజధానిని మీరే ఏర్పాటు చేసుకొండి" అని తప్పించుకొనే ధోరణిగా ఉన్నది... అవును మరి, పుట్టలు పెట్టటం ఒకరి ఒంతు, పెట్టిన వారిని తరిమేసి ఆ పుట్టలోనికి వేరొకరు జొరబడటం తెలుగు వారికి అనేక దశాబ్దాలుగా జరుగుతున్నదే కదా...!!! అందుకే కాబోలు మన అతి తెలివి కాంగ్రెస్సు వారు ఆంధ్రాకి కేపిటలు లేకుండా...ప్రత్యేక పేకేజీలు లేకుండా చేశారు...వీరికి వీరే మరోచోట పుట్టని....అదే, మరో రాజధానిని ఏర్పాటు చేసుకుంటారని నమ్మకం....!!! 


అయితే, పేకేజిలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం
 50 ఏళ్లుగా ఎప్పుడు మాట మీద నిలబడలేదు అనుకోండి. 
మదరాసు నుండి విడిపోయిన ఆంధ్రాకి ఇస్తామన్న పేకేజీ అమౌంట్ 
ఇప్పటిదాకా ఇవ్వలేదు...!!!


ఇదంతా చూస్తుంటే
 దేశంలోనే రెండవ అతిపెద్ద భాషగా ఉన్న తెలుగు వారికీ
 మనశ్శాంతి లేకుండా చేసి,
తద్వారా హిందీ మరియూ ఉత్తరాది భాషల వారికి పొటీ లేకుండా 
చెయ్యాలన్న కుంట్రే కనపడుతోంది.
ఇందులో భాగంగానే రాష్ట్ర విచ్చిన్నమే చెయ్యటమే కాకుండా,
రెండు ప్రాంతాల వారిని 10 ఏళ్ళు ఒకే రాజధానిలో ఉంచి,
మరో 10 ఏళ్ళు, వీరు తమలో తాము తన్నుకుంటూ ఉండేట్లు చేసి, 
వాళ్ళ దృష్టి డిల్లి రాజకీయాల మీద పడకుండా జాగ్రత్త పడినట్లుగా ఉన్నది. 
ఎందుకంటే,
తెలుగువారి సమర్ధత ఏమిటో కొద్ది దశతాబ్దాలుగా 
ఢిల్లీలోవారు చూస్తూనే ఉన్నారు కదా....!!! 
దేశ రాజకీయాలనే మార్చివెయ్యగల సత్తా తెలుగువారికి ఉన్నది.
ఈ రోజు కాంగ్రెస్సేతర ప్రతిపక్షాల ఐక్యతకి కారణం తెలుగువారే.... 
కాబట్టి, తెలుగువారికి మనశ్శాంతి లేకుండా చేసి,
వారికి ఎప్పటికప్పుడు తమ అభివృద్ధి మొదటి నుండీ చూసుకోవలసిన పని పెట్టి,
తెలుగువారు దేశ రాజకీయాలలో  తలదూర్చకుండా చెయ్యటమే
 ఉత్తరాదివారి కుట్రగా కనపడుతోంది....

దీని మాయలో పడి ఉన్న ఊళ్ళని వీడద్దు  

సరే, ఒకరిని అనేమి లాభం...!!! 
ఇప్పటికైనా ఆంద్రా తెలుగువారు ఒక స్థిరమైన రాజధానిని ఏర్పాటు చేసుకొనీ,
అది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పడినప్పటికీ,
దాని  మీద రాష్ట్ర  ప్రజలందరికీ హక్కు ఏర్పడే విధంగా ఓ చట్టం చేసి,
 దానిని అబివృద్ధి పరుచుకోవలసి ఉన్నది. 
ఇదే కాకుండా మొదలుగా "ఇంట గెలిచి రచ్చ గెలవమని" మన తెలుగు సామెత.... 
దాని ప్రకారం 
ఎవరి ఊళ్ళని వారు, ఎవరి జిల్లాలని వారు అభివృద్ధి చేసుకుంటే 
ఒకరు పొమ్మనేది ఏమిటీ...ఒకరిని ఇమ్మని దేబిరించేదేమిటీ....
ఇలాంటి ఖర్మలు పట్టవు కదా...!!! 
అందుకే, ఇకనైనా రాజధాని అనగానే దాని మీద పడిపోకుండా 
ఎక్కడి ఊళ్ళ వాళ్ళు అక్కడ తమ శ్రమని{డబ్బుని}ఖర్చుపెడితే....
కనీసం ఇప్పటివారి కోసం కాకపోయినా 
వీరి తరవాతి తరం వారికి అయినా, 
వేరొకరితో మొఖాన తలుపులు వేయించుకొనే 
ఖర్మ నుండీ తప్పించిన వారు  అవుతారు.

దీనికి కావాలిసిన ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి 
ఆంధ్రా వారు చెయ్యవలసిన మొట్టమొదటి పని 
"హైదరాబాదు నుండి వచ్చే మొత్తం మీడియాని 
ఆంధ్రాలో కనపడనియ్యకుండా చెయ్యటం, ముఖ్యంగా వార్తా ఛానళ్ళని." 

ఈ సందర్భంగా ఇంకో మాట...
రాష్ట్ర విభజన చేస్తూ రాజధానిగా హైదరాబాదుని 10 ఏళ్ళు వాడుకోవటం 
కేవలం అక్కడ డబ్బులు ఇరకబెట్టుకున్న రాజకీయ బ్రోకర్ల కుట్ర మాత్రమే ....
వారి డబ్బుల కోసం, మొత్తం సిమాంద్ర వారి సోమ్ములకే ఎసరు పెడుతున్నారు.
కాబట్టి విభజన తప్పనిసరి అయితే,
 ఆంధ్రాకి వేరొక రాజధాని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
 అప్పుడు మాత్రమే  రాష్ట్రం విభజన జరిగిన మొదటి రోజు నుండే 
ఆంధ్రావారి సొమ్ములు ఆంధ్రా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడతాయి.
అంతే కాదు, ఆంధ్రాకి సంబధించిన ఎటువంటి హెడ్ ఆఫీసు అయినా...
రైల్వే దగ్గర నుండి అన్నీ హెడ్ ఆఫీసులు ఆంధ్రాలోనే ఉండేట్లు చూసుకోవాలి.
లేకపోతే, మరల ఆ ఉద్యోగాలకోసం గొడవలు అయ్యే అవకాశం ఉన్నది.
అసలు గొడవంతా అదే కదా...!!! 

ఇవే ఎప్పటికైనా ముద్దు 

హైదరాబాదు విషయంలో తెలంగాణా వారికి కూడా ఇదే విధమైన సమస్య ఉంటుంది.
కాబట్టి వారు కూడా తెల్ల ఏనుగు అయిన హైదరాబాదుని 
బడుగు తెలంగాణా జిల్లాల నెత్తిన పెట్టకుండా, 
వారు కూడా వేరొక రాజధానిని ఏర్పాటు చేసుకొంటే  మంచిది. 
లేకపోతే,  రేపు 
మిగిలిన  తెలంగాణా జిల్లావారికి కూడా ఆంధ్రావారికి పట్టిన గతే పడుతుంది. 
ఈ  విధంగా ఎవరి రాజధానిని వారు చేసుకొని, 
రెండు రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రా, హైదరాబాదు రాష్ట్రాలు కలిసినప్పుడు... కర్నూలు నుండీ రాజధానిని కలిసిన హైదరాబాదులొ ఏర్పాటు చేసి....
అక్కడి వారితో కలిసి అభివృద్ధి చేసినందుకు గానూ...... 
హైదరాబాదుని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లోని  అన్ని ప్రాంతాల 
వారికీ ఫ్రీ జోనుగా చేస్తే, 
రెండు ప్రాంతాలవారికీ న్యాయం చేసినట్లు అవుతుంది. 
కొత్త రాష్ట్ర ఏర్పాటుకి ఎటువంటీ ఆటంకాలూ ఉండకపోవచ్చును. 
హైదరాబాదు భారాన్ని, లాభాన్ని ఇద్దరు పంచుకోవచ్చును. 
ఏది ఎలా జరిగినా, హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగానో, 
లేక భారత రెండవ రాజధానిగానో చేసి........ 
హిందీ తదితర ఉత్తరాదివాళ్ళ పాలబడెయ్యకుండా చూసుకోవాలిసిన బాధ్యత తెలుగువారికందరికీ ఉన్నది. 

ఒకవేళ హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా చెయ్యవలసి వస్తే, 
దేశంలోని ఓ ౩౦ లక్షల జనాభా దాటిన అన్ని నగరాలనీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి. ఎందుకంటే, ఏ నగరం విపరీతంగా అభివృద్ధి చెందినా.. 
ఆ అభివృద్దిలో కేవలం ఆ ప్రాంత ప్రజలదే కాక, 
దేశంలోని అన్నిప్రాంతాల ప్రజల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. 

కొసమెరుపు లాగా కొస చీకటి ఏమిటంటే, 
ఉద్యమం ఎవరు చేశారు.....? 
ఎవరికి రాష్ట్రం ఇచ్చారు....?? 
10 జిల్ల్లాల వారు ఉద్యమం చేస్తే,
 13 జిల్లాలవారికి ప్రత్యేకరాష్ట్రం ఇచ్చినట్లుగా ఉన్నది.
ఏమి దేశ ఐక్యత...సమైక్యత...
రెండు జిల్లాల అవతల నుండి వచ్చిన వారిని తరిమేసే 
ఈ మాత్రం ఐకమత్యం
 మొదటి నుండి ఈ దేశంలో ఉండి ఉంటే, 
విదేశీయులు మన దేశం మీదకు వచ్చే వారా.... 
వచ్చినా  వందల సంవత్సరాలు పరిపాలించగలిగేవారా... 
స్వాతంత్రం తేవటానికి పాపం అంతమంది నాయకులు/
ప్రజలు త్యాగాలు చెయ్యవలసి వచ్చేదా...
స్వాతంత్రపోరాటానికి 100 ఏళ్ల సమయం పట్టేదా...
కానీ, మనలో మనం తన్నుకోవటానికి చూపించే నిజాయతీ 
ఇతరుల మీద ఉంటుందా...!?!?
మేరే భారత్ మహాన్


జైహింద్





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???







  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి