రాష్ట్రాన్ని గభాలున సొరకాయా తెగ్గొట్టినట్లుగా తెగ్గోసిన నాయకులకి,
ఉద్యోగుల విషయాలలో ఎందుకు ఇంత కష్టమైపోయింది...
విభజన సందర్భంగా ఉద్యోగుల విభజనే వివాదస్పదం అవుతోంది. కేవలం 30 ఏళ్ళ సర్వీసు ఉన్న ఉద్యోగాల కోసం ఇంత తర్జన భర్జన పడుతున్న వీరు... అనేకమైన శాశ్వత విషయాలపట్ల శ్రద్ధ వహించటంలేదు. సరే, ఎంత చెప్పినా వీరికి ఇదే ప్రాణప్రదమైనది...అవును మరీ, ఈ ఉద్యోగాలు-ఉద్యోగుల కోసమే కదా విభజన తంటా...మిగిలిన కోట్లాది ప్రజలు ఏమైతే ఎవడికంటా...
ఎందుకంటే... మొదలులో ఈ ఉద్యోగాలని ప్రజల సేవకోసం సృష్టించినా తరవాతి కాలంలో అవి కేవలం ఉద్యోగుల సంక్షేమ నిధులుగానూ...పధకాలుగానూ తయారైనాయి... ఏ ఉద్యోగి సంఘానికి వారే... దేశాధినేతకన్నా ఎక్కువైనట్లుగా భావించుకుని...మిగిలిన ప్రజల కన్నా ఎక్కువ హక్కులని పొంది...వాటిని సంరక్షించుకునే క్రమంలో...తమకి ఉద్యోగాలిచ్చిన రాష్ట్రాన్ని తెగ్గొట్టైనా తమ ఉద్యోగ సౌకర్యాల హక్కులని కాపాడుకుంటున్నారు. ఆ క్రమంలో వీరికి దేశమూ...ప్రజలూ లాంటి చిన్న చిన్న విషయాలు కనపడటం లేదు.
ఉద్యోగుల ప్రపంచంలో ఉద్యోగాలు,ఉద్యోగులు,ప్రమోషన్లూ,ట్రాన్సఫర్లు,టీయ్యేలూ... డీయ్యేలూ లాంటి పదాలకి తప్ప మిగిలిన వాటికి స్థానం లేదు. ఈ ఉద్యోగుల్లో ఏ శాఖకి చెందిన వారు అయినా పెళ్ళిళ్ళలో కానీ మరెక్కడైనా కలిసినా సరే...పై పదాలని ఉపయోగించకుండా వారి మాటలు రావు... ఇక ఒకే శాఖ వారు అయితే "మీ మేనేజరు వాడా...వీడా" అని తప్ప మరో ప్రపంచం ఉండదు... వీరి ఉద్యోగాలు ప్రజల కోసమే పుట్టినప్పటికీ...వీరికి మాత్రం ప్రజల సేవ అంటే అదేదో ఘోరమైన వెట్టి చాకిరీ క్రిందే లెఖ. ఎవరైనా కొద్దిగా ప్రజల కోసం పనిచేసే ఆఫీసరు కనుక వస్తే ఇక అతని పని అయినట్లే... క్రింది స్తాయి ఉద్యోగుల చేత తనకి కావాలిసిన పనిని రాబట్టుకోలేక...ఆ ప్రయత్నంలో విరోధాలకి కూడా గురై...చివరకి ట్రాన్సఫర్లు అవుతాడు...!!! ఇదీ ఉద్యోగుల సామ్యం...
మరి ఇటువంటి ఉద్యోగుల మూలంగా జరిగిన రాష్ట్ర విభజన జరిగినప్పుడు...వారి విభజన ఎంతైనా కష్టంగానే ఉంటుంది కదా మన నాయకులకి... ఎవరికి చెందాలో తెలియని ఏ హక్కులు లేని మట్టి, నీళ్ళు, కరెంటు లాంటి చిన్న విషయాలని విభజించి పారేసినట్లుగా ఉద్యోగులని విభజించ లేరు కదా...వీరికున్న హక్కులు మన రాష్ట్రపతి గారికి కూడా లేవు కదా...!!!
విషయంలోనికి వస్తే...ఈ ఉద్యోగులని విభజన చెయ్యటానికి స్థానికతని ప్రాతిపదికగా చేసుకోవాలని నిర్ణయించారుష... ఇంతకీ స్థానికత అంటే ఏమిటో సరైన నిర్వచనాన్ని ఏమిటీ...??? ప్రపంచలో మరెక్కడైనా లోకల్ అంటే అక్కడే పుట్టటం, ఎక్కువ కాలం ఒకే చోట నివశించటం లాటి విషయాలని ప్రతిపదికని చేసుకుని ఉంటున్నారు...కానీ, ఈ విషయంలో ప్రపంచానికున్నంత క్లారిటీ మన రాష్ట్రంలో[23జిల్లాలలో]మటుకూ లేదు...
1] ఎక్కడ పుట్టారో అక్కడేనా...?
2] ఎక్కడ చదివారో అక్కడేనా...?
3] ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడేనా...?
4] ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైరు అయ్యారో అక్కడేనా...?
5] ఎక్కడ వారి స్వంత ఇల్లు ఉన్నదో అక్కడేనా...?
6] ఎక్కడ వారు నివశిస్తున్నారో అక్కడేనా...?
7] ఎక్కడ వారి పిల్లలు ఉద్యోగం చేస్తున్నారో అక్కడేనా...?
8] ఎక్కడ వారి పిల్లలకి నివాసం ఉన్నదో అక్కడేనా...?
9] ఎక్కడ ఎక్కువ కాలం ఉద్యోగం ఉద్యోగం లేక నివాసం ఉన్నదో
అక్కడేనా...?
ఇలా అనేకమైనటువంటి విషయాలున్నాయి...ఈ స్థానికతతో ఉద్యోగం లేదా పెన్షనూ పొందటం లేదా నిలుపుకోవటానికి స్థానిక ప్రాతిపదిక ఏది... స్థానికతని నిర్దేశించేది ఏది...ఈ విషయంలో అందరూ సమానులే... ఎందుకంటే వీరెవ్వరూ రకరకాలైన దేశాల నుండి వచ్చిన వారు కాదు... అయితే, దేశాలు విడిపోతున్నప్పుడే ఎక్కడి వారికి అక్కడ జాతీయత వస్తుంటే, అంతకన్నా ఎక్కువా... ఒక దేశంలో ఉన్న రాష్ట్రానికి...???
మరి స్థానికతని కాదనే విషయాలు ఇవ్వేనా...
1] స్తానిక జిల్లాలో పుట్టక పోవటం.
2] స్తానిక భాష రాకపోవటం.
3] స్థానిక భాష వారైనప్పటికీ...యాస తేడా రావటం
4] తండ్రి-తల్లి వేరే ప్రదేశం నుండి రావటం.
5] రాష్ట్రాలు విభజించక ముందో లేక తరవాతో పుట్టటం.
5] రాష్ట్రాలు విభజించక ముందో లేక తరవాతో పుట్టటం.
ఇలాంటి విషయాలేనా స్థానికతకి అడ్డం...ఇవ్వే కనుక అడ్డం అయినట్లైతే, ఈ రోజున ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలు వారి తల్లిదండ్రుల ట్రాన్సఫర్ల వలన రక రకాలైన చోట్ల పుట్టటం, చదవటం జరుగుతుంది... మరి వారి స్థానికతని ఎలా నిర్వచించటం...
కనుక
రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఉద్యోగుల హక్కులని ప్రక్కనపెట్టి
ఈ విధంగా చేస్తే బాగుండచ్చు...
బాగుండచ్చు అని ఎందుకంటే...
ఈ ఉద్యోగులు తమకి ఏ పాయింటు నచ్చితే దానిని ఆమోదిస్తారు...
అది రాజ్యంగ వ్యతిరేకమైనప్పటికీ...
అదే కనుక నచ్చలేదో...
రాజ్యంగంలో ఎన్ని ఆర్టికల్స్‌లో పొందుపరచినా
వాటిని లెక్కచెయ్యరు...
వీరిని అనేకన్నా...
తమ అవసరాల కోసం
ఇలా ఉద్యోగులను అచ్చేసి ఒదిలేసిన
రాజకీయ వ్యవస్థనీ, నాయకులనీ తప్పుబట్టాలి...
వీరి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యోగులకి,
సామాన్య ప్రజలకి లేనటువంటి నిరంకుశ హక్కులని ఇచ్చారు.
స్థానికతని నిర్ణయించటానికి...
అనేకమైనటువంటి స్వంత లాభం కలిగించేవీ
మరియూ
రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండి మిగిలిన ప్రజలకి వర్తించనటువంటివి
తాత్కాలిక లాభం కోసం శాస్వతంగా దేశ ప్రజలని విభజించేవీ,
స్వార్ధ పరమైనవి కాకుండా...
సమంజసంగా ఉండే విధంగా
"ఉద్యోగి ఎక్కువ కాలం తన సర్వీసుని ఇచ్చిన ప్రాంతాన్ని
స్థానికతగా తీసుకోవచ్చును:
ఎందుకంటే
తాను ఈ ప్రదేశంలో తన సర్వీసుని
అక్కడ ఉన్న ప్రజలకి అందజేశారు కాబట్టి...
అయితే జీతం తీసుకోలేదా
అని సందేహం వస్తుంది సహజంగా...
ఆ తీసుకున్న జీతం కూడా ఆ ప్రాంతంలోనే ఖర్చుపెట్టి...
లోకల్‌గా ఉన్న ప్రజలకి ఆదాయాన్ని ఇచ్చారు కదా...
అంటే జీతం తీసుకున్న ప్రాంతంలోనే ఖర్చుపెట్టటం అన్నమాట.
పెన్షన్లు కూడా ఇదే విధంగా ఇవ్వచ్చును...
అయినా...
అయినా...
స్థానికతా... కధా అంటూ
ఉద్యోగులని రెండు రాష్ట్రాలకీ పంచేప్పుడు,
వాటి అవసరాలబట్టీ పంచుతారా లేక...
ఒక రాష్ట్రానికి అవసరమైనదానికన్నా ఎక్కువగానూ...
మరొక రాష్ట్రానికి అవసరమైనదానికన్నా తక్కువగానూ పంచుతారా...???
మిగిలిన ఆస్తులని పంచినట్లే పంచాలి.
మిగిలిన ఆస్తులని పంచినట్లే పంచాలి.
ఈ సందర్భంగా ఒక నాయకుడు అంటాడు
"ఇక రాష్ట్రాన్ని విడగొట్టి ప్రయోజనమేమున్నది"
"వేరే వాళ్ళు మన దానిలో ఉంటే, మన రహస్యాలు వారికి తెలిస్తాయి కదా" అని...
ఇదేమన్నా విదేశీయులని నియమించటమా...
వీదేశీయులే మన దేశీయులుగా చలమణి అవుతున్న ఈ కాలంలో
ఒకే ప్రాంతపు ప్రజలని రహస్యాల పేరుతో అవమానించటం సరైన పద్ధతా...??
అలా అయితే, రాష్ట్రాన్ని విడగొట్టటం దగ్గర నుండీ
ముఖ్యమైన సెక్రటరీల దగ్గర దాకా
కనీసం మన భాషే రాని ఇతర రాష్ట్రాల వారు పని చేస్తున్నప్పుడు
వీరికి ఇటువంటి "దివ్య జ్ఞానం" కలగలేదా...???
వీరికి హక్కులు కావాలిసినప్పుడు/అవసరం పడినప్పుడు
సమైక్య రాష్ట్ర చట్టాలు కావాలి...
ముఖ్యంగా కరెంటు విషయంలో
విభజనకి ముందున్న ఒప్పందాలని గౌరవించి తీరాలని
వీరి వాదన...
మరి అదే సమయంలో
పౌరులకి సంబందించిన అనేక ఒప్పందాలు
రాష్ట్రం విడిపోయ్యాక పోతాయా...???
ఈ ప్రశ్నకి సమాధానం లేదు...
దానికి కేవలం 1956 మాత్రమే డేడ్ ఎండ్...
"మరి మిగిలిన అన్ని విషయాలకి ఆ సంవత్సరమే సరిపడుతుందా"
అని
ఆ ఉద్యమ పార్టీ/వారి అనుకూలురులను
ఎవరు అడగగలరు...???
వీరికి హక్కులు కావాలిసినప్పుడు/అవసరం పడినప్పుడు
సమైక్య రాష్ట్ర చట్టాలు కావాలి...
ముఖ్యంగా కరెంటు విషయంలో
విభజనకి ముందున్న ఒప్పందాలని గౌరవించి తీరాలని
వీరి వాదన...
మరి అదే సమయంలో
పౌరులకి సంబందించిన అనేక ఒప్పందాలు
రాష్ట్రం విడిపోయ్యాక పోతాయా...???
ఈ ప్రశ్నకి సమాధానం లేదు...
దానికి కేవలం 1956 మాత్రమే డేడ్ ఎండ్...
"మరి మిగిలిన అన్ని విషయాలకి ఆ సంవత్సరమే సరిపడుతుందా"
అని
ఆ ఉద్యమ పార్టీ/వారి అనుకూలురులను
ఎవరు అడగగలరు...???
రేపు ఇదే విషయంపై వారికే వ్యతిరేకత వస్తే ఏమంటారు...???
ఆ... ఇదంతా మా[మీ]కెందుకూ...
మేం ఉద్యోగులం; అంటే భారత రాజ్యాంగానికి అతీతులం.
కాబట్టి,
మా విషయాన్ని మేమే నిర్ణయించుకుంటాము కానీ...
ఇందులో వేరోకరికి సలహా కూడా ఇచ్చే హక్కు లేదు
అని అంటే సరే...ఏ బాధా లేదు.
కానీ,
మీరు మీరు కొట్టుకొని
అనవసరంగా ప్రాంతీయతని రెచ్చగొట్టి
ప్రజల మీద పడి
ఇబ్బందులపాలు చెయ్యకుండా ఉంటే చాలు...
"ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటే మడుకూ
సామాన్య ప్రజలకి
ఒరిగేదేమున్నది కనుక"...!!!
@@@@@@@
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...
3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!
4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????
5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!
6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం
మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి