LOCAL WEATHER

15, ఏప్రిల్ 2013, సోమవారం

ఆవకాయ చెయ్యటం ఎలాగు...???


ఆవకాయ 


ఆవకాయ అనగానే నోరూరే చక్కటి వాసనతో, కమ్మగా ఉండే ఊరగాయ 
అని మన తెలుగు వారెవ్వరికైనా ప్రత్యేకించి చెప్పాలిసిన పనిలేదు....
 అయితే దీనిని తయారు చెయ్యటం అనగానే, 
అదేదో బ్రహ్మ పదార్ధం అయినట్లుగా చాలా మంది భయపడిపోతారు.... 
 ఆ...  ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అని అనుకుంటారు... 
అయినా ఇది మనకు చాతయ్యేది కాదులే అని మరికొందరు అనేసుకొని, 
బయట కొనేసుకుని తింటానికి ప్రయత్నిస్తారు. 
కానీ, ఇంట్లో పెట్టిన ఆవకాయ లాగా బయట కొన్నది ఉంటుందా...??? 
అలాగని, మన మామ్మగార్లని రమ్మంటే వారెక్కడ నుండీ వస్తారు...??? 

నిజమే ఆవకాయ పెట్టటం ఒకప్పుడు సులభమైన పనికాదు...
ఎండు మెరపకాయలు దంపి, 
మెత్తటి కారం జల్లించి తియ్యాలి, 
తరవాత ఆవాలని దంపి, 
పొడిగా చేసి ఆరబెట్టి,  ఇందులోనే,  
ఉప్పుని దంచి, 
పొడి చేసి కలిపి; 
అది కండ్ర ఎక్కేలోగా....అనగా చేదు అయ్యేలోగా ఆవకాయలో కలిపెయ్యాలి. 
ఇవన్నీ పాతకాలం. 
ఇప్పుడు కారం, ఉప్పు, ఆవాలు పొడి రూపంలోనే మార్కెట్టులో లభ్యం అవుతున్నాయి. 
ఇక కావాలిసినదల్లా మంచి మామిడికాయలు అంతె. 
ఈ మామిడికాయలని ఇంట్లో కత్తిపీటతో తరిగే వాళ్ళు. 
కానీ ఇప్పుడు వీటిని ముక్కలు క్రింద కొట్టే వారు కూడా ఉన్నారు. 

అయితే ఈ ఊరగాయ తగిన శ్రద్ధగా పెట్టకపోతే,  
ఆవకాయ ఏడాదిపాటు ఉండక, 
పాడయ్యే ప్రమాదమున్నది. 
అలా పాడవకుండా ఉండాలంటే దానికి కావాలిసినది శుచి
[శుచి అంటే దేమి వస్తువు కాదు :) ]
 కొద్దిగా శ్రద్ధ.

కాబట్టి, ఇప్పుడు ఆవకాయ ఊరగాయ పెట్టాలంటే భయపడాలిసింది ఏమీ లేదు... కావాలిసినదల్లా ఆసక్తి, శ్రద్ద మరియూ కొద్దిగా శ్రమపడే తత్వం[మరీ ఎక్కువ అఖర్లేదు] అంతే. ఇవి ఉంటే చాలా తెలికగా ఒక ఆవగాయ ఏమిటి, అన్ని ఊరగాయలూ పెట్ట వచ్చును. ఉరగాయల విషయంలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అందుకని కొంచం ఎక్కువ వివరంగా వ్రాయటం జరిగింది.  

సరే, ఇక ఆవగాయ పెట్టే విధానం ఏమిటో తెలుసుకుందాము....


కావాలిసిన పదార్ధాలు 

షుమారు కొలతలు: 10 కాయలకి... కిలోన్నర ఉప్పు, కిలోన్నర ఆవపిండి, ఒక కేజీ కారం.[బళ్ళారి కారం టైపు అయితే కేజీన్నర కావాలి] నూనె మొత్తం రెండు కేజీలు. మెంతులు 50గ్రాములు. శనగలు 100 గ్రాములు

కావాలిసిన పదార్ధాలను  ఎంచుకొనే విధానం.... 

మంచి సైజులో ఉన్న పులుపు మామిడి కాయలు: ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం మామిడికాయలు వాడతారు. అవి ఏ రకమైనా పరవాలేదు... అయితే అవి సీజనల్‌గా... అంటే మార్చ్ నుండీ మే వరకూ వచ్చినవయితేనే బాగుంటాయి. అప్పుడు వచ్చిన మామిడికాయలకే పులుపూ మరియూ సంవత్సరం అంతా ఉండే అన్ని లక్షణాలూ ఉండే అవకాశం ఎక్కువ. ఇవి ముఖ్యంగా 3 రకాలు. 


మార్చ్ నుండి మే వరకు దొరికే మామిడి కాయాలని వాడితే మంచిది 

1] చిన్న రసాలు, 2 ] పెద్ద రసాలు, 3] జలాలు,  4] నాటుకాయలు.... ఏ రకమైనా కొద్దిగా పీచు,  గట్టి టెంక ఉండి, రుచికరమైన పులుపు ఉంటే చాలు.


ఆవాలని మిక్సిలో వేసుకొని పిండి చేసి, జల్లించి....  ఉప్పు  కలుపుకోవాలి 

ఆవపిండి: ఆవపిండి కోసం సన్న ఆవాలు అయితే బాగుంటాయి. ఈ ఆవాలని ఇంటి దగ్గరే పొడి చేసినట్లైతే దానిలో చారెడు[కొద్దిగా] ఉప్పును కలిపితే ... చేదు రాకుండా ఉంటుంది. 


  కారం: ఇక కారం విషయానికి వస్తే ఆంధ్రా ప్రాంతంలో అయితే, 
ప్రాంతాన్నిబట్టీ కారం రుచి మారే కారం దొరుకుతుంది.


కారం 

1. బాగా కారం కావాలని అనుకుంటే గుంటూరు కారం వాడాలి.
2. కొద్దిగా తక్కువ కారం కావాలని అనుంకుటే భద్రాచలం కారం వాడాలి.
3. కారం బాగా వద్దు, కానీ ఎర్రగా కనపడాలి అంటే బళ్ళారి కారం అయితే బాగుంటుంది.



 మామిడికాయ ముక్కలు మరియు నూనె[ప్యాకెట్టు కట్ చేసి నునే పోసేయ్యటమే....]

నూనె: నూనెని కూడా ప్రాంతాలబట్టీ వాడతారు.... అయితే, నువ్వు పప్పు నూనె వాడితే ఊరగాయలకి మంచిది. రుచీ ఉంటుందీ, నిలవా ఉంటుంది. నువ్వుల నూనె వాడకూడదు. నువ్వుల పైన పొట్టు తీసేసిన తరవాత వచ్చిన నూనెని... నువ్వుపప్పు నూనె అంటారు. డైరెక్టు నువ్వుల నూనె అయితే చేదు వచ్చే అవకాశం ఉన్నది.  

పొడి ఉప్పు [అయోడైస్డ్ ఉప్పుని వాడకపోవటం మంచిది] 

ఉప్పు: ఇది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కాలంలో వస్తున్న అయోడైస్డ్ ఉప్పుని వాడరాదు. రాళ్ళ వుప్పుని దంచిన తరవాత వచ్చిన పొడి ఉప్పునే వాడాలి. ఎట్టి పరిస్తితులలో అయోడైస్డ్ ఉప్పుని వాడ కూడదు.


శనగలు మరియు మెంతులు ఇవి డైరెక్టుగా ఆవకాయలో వేసేయ్యటమే... 

మెంతులూ, మరియూ శనగలు....మాములు శనగలనే వాడాలి. బొంబాయి శనగలు పనికిరావు. అవి నిలవ ఉండవు. 

తయారుచేసే  విధానము   

మామిడి కాయలు:   10 ముదిరిన పుల్లని కాయల మామిడి ముక్కలు
ఉప్పు......       ఒకటిన్నర కిలో 
ఆవపిండి....   ఒకటిన్నర కిలో 
కారం....ఒకటింపావు కిలో [బళ్ళారి కారం{తక్కువ కారం ఉన్నది} అయితే ఒకటిన్నర కిలో]   

ముందరగా క్రింద ఫొటో[GIF]లో చూపించిన విధంగా మామిడి కాయని సగానికి టెంకతో సహా తరిగి...మధ్యలో ఉన్నా జీడి, మరియూ పేపరు లాంటి పదార్ధాన్నీ తీసివెయ్యాలి. తరవాత, ఆ రెండు ముక్కలనీ  మరల సగానికి తరిగితే ఒక మామిడికాయ నాలుగు పొడవు ముక్కలుగా అవుతుంది. ఒక్కో పొడవు ముక్కనీ సమానంగా మూడు లేక నాలుగు ముక్కలుగా చేసుకోవాలి. 


మామిడి కాయని ఎలా ముక్కలు చెయ్యాలీ ..... 

ప్రతీ ముక్కకీ ఓ ప్రక్కన చెక్కు, మరో ప్రక్కన టెంక ఉండేట్లు జ్యాగ్రత్త పడాలి. లేకపోతే ముక్కలు మెత్తబడి, ఆవకాయ పాడయ్యే ప్రమాదమున్నది. ఈ ముక్కలు నలిగిపోకుండా గట్టిగా ఉండేట్లుగా కూడా చూసుకోవాలి. ఈ ముక్కలని కనీసం అరగంట ఆరనియ్యాలి. ముక్కలు తరిగిన తరవాత, మిగిలిన పనులు చేసుకుంటే, టైం సరిపోతుంది. 


ప్రతీ ముక్కకీ ఓ ప్రక్కన చెక్కు, మరో ప్రక్కన టెంక ఉండేట్లు జాగ్రత్త పడాలి
  
కలిపే  ద్దతి 

ఇప్పుడు పైన చెప్పిన కొలతలలో ఉన్న ఆవపిండీ, ఉప్పులని ముందరగానే కలిపి ఉంచుకోవటం మంచిది. తరవాత ఈ మిశ్రమాన్ని సరిపొయ్యే పళ్ళెం తీసుకొని అందులో కారం పోసి బాగా కలిపివెయ్యాలి. కారం, ఉప్పు మరియు ఆవపిండి మిశ్రమం బాగా కలిసిన తరవాత దానిలో శనగలు, మెంతులు కలిపెయ్యాలి. 

ఇప్పుడు, ఈ మిశ్రమంలో ముందుగా ముక్కలు క్రింద చేసిన మామిడికాయ ముక్కలని కలపాలి. అయితే ఒకేసారి కలిపెయ్యకుండా.... కొన్ని కొన్ని  ముక్కలని తీసుకొని, మిశ్రమం మీద వేసి, ఆ ముక్కలకి మిశ్రమం అంటుకునేట్లుగా కలిపి, ఆ ముక్కలని ఒక జాడీలో కానీ, గాజు సీసాలో కానీ వేసుకోవాలి. అలాగ, కొద్ది కొద్దిగా ముక్కలని మిశ్రమంలో వేసి కలిపి ఆ ముక్కలని జాడీలో వెయ్యాలి. ఇలా చెయ్యటం వలన ప్రతీ ముక్కకీ మిశ్రమం అంటుకొని ఆ ముక్కలలో ఉన్న రసం చేత పీల్చుకోబడుతుంది. దీని వలన ప్రతీ ముక్క మిశ్రమంలో చక్కగా నానుతుంది. 


జాడీలో ఆవకాయ మిశ్రమాన్ని గరిటతో జాగ్రత్తగా ముక్కలు నలిగిపోకుండా కలపాలి 

ఇలా మిశ్రమంతో కలిపిన ముక్కలని జాడీలోనికి వేసిన తరవాత, మిగిలిన కొద్ది మిశ్రమాన్ని కూడా జాడీలో పైభాగాన పొసెయ్యాలి. దీనిలో ఒక కేజీ నువ్వుపప్పు నూనెని పోసి ఒక గంటసేపు ఉంచిన తరవాత నూనె కలిసేట్లుగా గరిటతో కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని 3 రోజులపాటు కదిలించకుండా ఉంచిన తరవాత....దానిలో మరల ఒక కేజీ నువ్వుపప్పు నూనెని పోసి గరిటతో కలిపెయ్యాలి. 

మొత్తం కలిసిన మిశ్రమం... ఇలా చక్కగా నునె  కలిసేట్లుగా కలపాలి

కలిపిన తరవాత.... 

మరల 3 రోజుల తరవాత జాడీలోని మొత్తం మిశ్రమాన్ని ఒక పెద్ద పళ్ళెంలోనికి తీసుకొని బాగా కలపాలి. ఇలా కలిపేటప్పుడు కారం మరియూ నూనెలు మొత్తం బాగా కలిసేట్లుగా చూసుకోవాలి. అందులో ఉండలు ఉండలుగా ఉండే దానిని కూడా చితిపి చక్కగా కలపాలి......... అంతే ఆవకాయ తయారైనట్లే.... ఇలా తయారైన ఆవకాయని తిరిగి జాడీలలో కానీ గాజూ సీసాలలో మాత్రమే భద్రపరచాలి. ప్లాస్టిక్ సీసాలు కానీ, స్టీలు టిఫెన్లని కానీ వాడకూడదు.     

  ఈ కొత్త ఆవకాయని వారం రోజులు నానిన తరవాత తింటే బాగుంటుంది. దినిని జాడీలో కాని సీసాలో కాని మాత్రమే భద్రపరచాలి. 

వేడి వేడి అన్నంలో కలుపుకుని,  చక్కటి నెయ్య  వేసుకొని  తింటే , ఆవకాయ రుచి మరింత పెరుగుతుంది . 


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@
మా అమ్మ గారు 
@@@@@@@@@@@@@@
1924 - 2004
@@@@@@@@@@@@@@




11, ఏప్రిల్ 2013, గురువారం

ఉగాది శుభాకాంక్షలు



అంరికి   శ్రీ వినా కొత్త సంత్స  గాది శుభాకాంక్షలు 
******************************************************************


*************************************************
**************************************************
******************************************************
***********************************************************