LOCAL WEATHER

2, జూన్ 2014, సోమవారం

బాబుగారూ బేల మాటలేల...ఏవరి ప్రాపకం కోసము...???


రాష్ట్రం విడిపోయిన వేళ...అన్నీ ప్రజా నిష్పత్తిన పంచి...కరెంటుని మాత్రం "వినియోగం ప్రాతిపదికన" పంచారు. దీని మీద మాట్లాడుతూ... "ఈ కొరతని కేంద్ర విద్యుత్ నుండీ తీసుకోవలసి ఉన్నది" అని కాబోయే ముఖ్యమంత్రి బాబుగారు బేల వచనాలు పలికారు....పంచినది ఏమి దేవతలు కారు కదా...జీతం డబ్బులు కోసం పనిచేసే ఉద్యోగులే కదా...మార్చటానికి అవకాశం ఉన్నది కదా...మరెందుకు బేల మాటలు బాబుగారు...ఎవరి ప్రాపకం కోసం...???  

ఇప్పటికి పంచినవి సరి చేసుకోవలసినది పోయి, ఎక్కీడి నుండో ఏదో రాబట్టాలని వ్యవహారం చూస్తుంటే...రాబొయ్యే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌నకు రావాలసినవి రాబట్టటంలో "బాబుగారు మొహమాట పడేట్లుగా" ఉన్నది.  ఈ విషయంలో ఓదార్పు నేత కూడా ఓదార్చటం లేదు.

దీని గురించి ఇదే బ్లాగులో 7 మార్చ్‌న వచ్చిన వ్యాసం
"సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం..."లో  
"తెలంగాణలో ఏక పార్టీ లేక ఏక నాయకత్వ పరిపాలన రాబోతోంది...తెలంగాణాని తెప్పించింది మేమంటే మేము అని ఎంతమంది చంకలు గుద్దుకున్నా... "ఆ క్రెడిట్ కేసీఆర్‌కి తప్ప మిగిలిన ఎవ్వరికీ పోదు"... పైగా తన ప్రాంతం కోసం  తన పార్టీని కాలుష్య సముద్రంలొ కలిపేయకుండానే ఉంచారు...ఇది తెలంగాణాకి ఎంతో మంచిది. ఇక కాంగ్రెస్సుకి... కేసీఆర్ అండలేకపోతేగానీ బ్రతకలేని పరిస్థితిని ఆ పార్టీ వారే కొని తెచ్చుకున్నారు.... ఇకపోతే ఇక్కడ బీజేపీది "దారిని పొయ్యే దానయ్య పరిస్థితే"... ఆస్తుల తగాదా పడుతున్నవారికి, ఓ దారిన పొయ్యే దానయ్య ఎంత సహాయం చేసినా కూడా... ఆ అస్తులలో వాడికి భాగం రాదు కదా...!!! ఇదే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి..."
అని వివరించటం జరిగినది... 
అందులో తెలంగాణాలో ఏక పార్టీ రాబోతోందని...
ఇంకా ఎన్నికల ఫలితాలు రాక ముందే చెప్పటం జరిగింది. 
అందులో 
ఆంద్ర ప్రదేశ్‌నకు రాబొయ్యే కష్టం
"పార్టీల హంగ్" 
ఏర్పడుతుందని వ్రాయటం జరిగింది...
అయితే, 
అది తృటిలో తప్పినా  
"మానసిక హంగ్" 
మాత్రం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ...ఈ మానసిక హంగ్ వలన, అక్కడ తెలంగాణాలో రేపు 2019లో గెలవాలన్న అనవసర ఆశ మూలంగా, ప్రస్తుతానికి తాము అధికారం చేజిక్కించుకున్న రాష్ట్రానికి అన్యాయం చేసే స్థితిలో బాబు ఉన్నారు. ఈ అధికార నేతే కాదు...ప్రతిపక్షపు నేతకి కూడా ఒకటో రెండో సీట్లు తెలంగాణాలో రావటంతో, ఆయన కూడా 60 సీట్లు ఇచ్చిన రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై స్పందించకుండా...కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం అయినారు. ఈ విధంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోతే ఆంధ్ర పాలనకి సంబంధించి ఎలా నష్టం వస్తుందో...అదే జరగబోతోంది...దీనికి కారణం తాము లేని రాష్ట్రంలో అధికారాన్ని పోందాలన్న దురాశే...

విషయంలోనికి వస్తే... 
అవసరాన్ని బట్టి వినియోగం మీద విద్యుత్ పంపిణీ చేసేట్లు అయితే, 
ఉమ్మడి రాష్ట్రం లోటుని కూడా అలాగే పంచాలి కదా.... 
దీని ప్రకారం
తెలంగాణా మిగులు బడ్జెట్...షుమారు రూ.8000/-కోట్లు,
ఆంధ్రా లోటు బడ్జెట్టు.....షుమారు రూ.14000/-కోట్లు
 కలిపేస్తే ఉమ్మడి రాష్ట్రం లోటు బడ్జెట్టు.... రూ.6000/- కోట్లు అవుతుంది...
దీనిని జనభా ప్రాతిపాదికన పంచితే 
తెలంగాణాకి 2500/- కోట్లు లోటు బడ్జెట్టు,
ఆంద్ర ప్రదేశ్‌నకు రూ.3500/-కోట్ల లోటు బడ్జెట్టూ ఉండి 
ఎవరికీ భారం కాకుండా ఉంటుంది....కదా!!!

ఈ విధంగా చెయ్యటానికి వారు పెద్ద మనస్సుతో రాక, 
ఇలా ఆంధ్రాకి సంబంధించిన లోటు బడ్జెట్టుకి 
మాకెం సంబంధం అని తెలంగాణా వారు అంటే కనుక... 
తెలంగాణాకి సంబంధించిన కరెంటు లోటు గురించి 
ఆంధ్రాకెందుకు అనే ప్రశ్న వస్తుంది... 

ఏది లాభమో... అది ఒక ప్రతిపాదికనా...
ఏది నష్టమో... అది మరొక ప్రతిపాదికనా 
పంచుకోవటాన్నే సమన్యాయం అంటారా..
ఈ విధంగా పంపకం అనేది సవ్యంగా జరగకపోతే 
అనేక సమస్యలు వస్తాయ్. 
విడిపోయి అన్నదమ్ముల లాగా ఉందాము అనే వారు... 
రాజధానిని ఇవ్వక, ఆదాయాన్ని పంచక, 
ఉన్న కరెంటు మిగులుని లాగేసుకొని, 
పెద్ద ఎత్తున అప్పుల భారాన్ని వేస్తుంటే... 
సమన్యాయం అనేవారి బుద్ధి ఎక్కడ నడుస్తోంది...
2019 ఎన్నికల ఊహలలోనా....

కాబట్టి, 
ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్‌నకు చెందిన ఇద్దరు నాయకులు 
తమ కలహాలని ప్రక్కన పెట్టి, 
కనీసం 
పంపకాలు న్యాయంగా జరిగే వరకైనా ఇద్దరూ కలసి...
తమకి అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రానికి 
మేలు చేసేట్లుగా ప్రవర్తించాలి... 
సమ న్యాయాన్ని 13 జిల్లాలకీ చేస్తూ...
ఓదార్పుని కలిగిస్తూ ...
ఆంధ్ర ప్రదేశ్‌ పరిపాలనని ఆదర్శంగా చూపిస్తూ
అక్కడ 
2019 ఎన్నికలలో సత్తా చూపించవచ్చును.
అలా కాకుండా...
ఓడిన చెప్పుల పార్టీ నాయకుడిలాగా 
శల్యసారధ్యం[నమ్మిన వారిని తప్పు దారి పట్టించటం]చేస్తూ  
జరుగుతున్న నష్టాన్ని ఉపెక్షించి 
ఎవరికి వారు తమ రాజకీయ స్వలాభాన్నే కనుక చూసుకొని...
జగడాలు ఆడుతూ పోతే...
ఇప్పటి ప్రజలు క్షమించినా...
చరిత్ర క్షమించదు...
ఈ చెడ్డ పేరుని 
ఇప్పటికే నీలం సంజీవ రెడ్డి, ప్రకాశం  పంతులు లాంటివారు 
మొస్తూనే ఉన్నారు...
తమ పదవుల కోసం, 
కొన్ని ప్రాంతాలని ప్రక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిన వారు ఒకరైతే...
రాజధానిని పోగొట్టిన వారు మరొకరు.
వారు పొయ్యారు.
కానీ,
వారు కలిగించిన నష్టం 
ఇప్పటికీ
వెంటాడుతోనే ఉన్నది.



జై హింద్ 




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@





@@@@@@@@@@@@@@@
బొమ్మ కర్టేసి గూగులమ్మ-మిక్సిగ్ కేఆర్కే 
@@@@@@@@@@@@@@@@



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి