LOCAL WEATHER

27, జూన్ 2014, శుక్రవారం

సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం మరో హైదరాబాదు కాబోతున్నదా...???

గూగుల్ బొమ్మ...

ఇప్పటి పరిణామాలు చూస్తుంటే సీమాంధ్రుల నాయకులు మరో హైదరాబాదుని తయారు చేస్తున్నారనే అనిపిస్తోంది. హైదరాబాదులో అన్ని రకాల ఉద్యోగాలు వచ్చే సంస్థలు పెట్టేసినట్లే... ఇక్కడ కూడా అన్ని రకాల ఉద్యోగాలనీ విశాఖకే తరలించుకుని పోతున్నారు... ఇప్పటికే అనేక వేల ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన ఈ నగరానికి మరో వేల కొద్దీ ఉద్యోగాలు వచ్చే రైల్వే జోను కూడా పోబోతున్నది... దీనికి కారణం లోకల్ రాజకీయాలే అని చెప్ప వచ్చును...

ఈ రైల్వే జోనుని మొదలు విజయవాడకి అనుకూలం అనుకున్నారు... 
అయితే 
విశాఖలో బీజేపీ అభ్యర్ధి ఉండటం వల్లన 
దానిని ఒక పట్టుదలకి తీసుకొని, 
విశాఖకి తరలించటానికి నిర్ణయించుకున్నారు... 
"దీనికి తెలుగు దేశం వారు కూడా 
తలూపేంత బలహీనంగా ఉన్నారు"... 
బలహీనత అని ఎందుకనాలిసి వచ్చిందంటే... 
కేంద్రంలో ఉన్న బిజెపి సహకారం  
ఉన్నది...ఉన్నది అనే వీరి నాయకుడు...
కనీసం విద్యుత్ ఒప్పందాల విషయంలో 
దక్షిణ ప్రాంత గ్రిడ్ అధికారులనే 
ఒప్పించలేని బలహినతలో ఉన్నప్పుడు... 
మరియు 
గెలిచిన ఇద్దరు బిజెపి ఎంపి అభ్యర్ధులనే 
ఒప్పించలేని బలహినతలో ఉన్నప్పుడు....
ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం 
ప్రధాన మంత్రి...తదితరులని ఏమి ఒప్పించగలరు....??? 

విషయంలోనికి వస్తే....ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఈ జోనుని విజయవాడలో పెట్ట వచ్చును... ఎందుకంటే ఈ ఊరు అటు సీమకి ఇటు ఉత్తరాంధ్రకి అందుబాటులో ఉన్నది...  అదీకాక, ఈ ఊరు పెద్దది అయినప్పటికీ  ప్రభుత్వానికి చెందిన ఎవో కొద్ది ఉద్యోగాలు తప్ప వేల కొద్ది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే ఏ సంస్థలూ లేవు... కనుక ఈ జోనుని విజయవాడలో పెట్టవచ్చును... లేదా ఇక్కడ రాజధాని వస్తోందని పుకారులున్నాయి కాబట్టి కడపలో పెడితే సీమ వారికి న్యాయం చెసినట్లు అవుతుంది...అక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది...దీనిని  ఇప్పటికే అన్ని విధాల అభివృద్ధి చెందిన ప్రాంతంలో పెట్టటం సమజసం కాదు.  

ఇవే కాదు, ఎక్కువ ఉద్యొగాలు వచ్చే ఏ సంస్థలు అయినా జిల్లాకి ఒకటి పెట్టాలేగానీ, ఇప్పటికే వేల కొద్ది ఉద్యోగాలని పొందిన విశాఖకి ఇలాంటి అవకాశం ఇవ్వటం మరో హైదరాబాదుని తయారు చెయ్యటమే...ఇప్పటికే కడుపు నిండిన బేరంగా ఉన్న విశాఖలాంటి నగరంలో ప్రత్యేకించి ఏమి పెట్టకుండా ఉంటే మంచిది... ఎందుకంటే అది భౌగోళికంగా ఉన్న పరిస్థితిబట్టి ఎవరూ రాజకీయంగా కలిగించుకోకపోయినా కూడా... ఎన్నో సంస్థలు వచ్చే అవకాశం ఉన్నది. 
అందుకని
 "రాజకీయ కెలుకుడుతో" పెట్టే సంస్థలని, 
ప్రభుత్వ ఉద్యోగాలు కోసం యువత
ప్రక్క జిల్లాలకి వెళ్ళే దుస్తితి ఉన్న జిల్లాలలో పెడితే మంచిది. 
ఈ రోజున పరిస్థితులు చూస్తుంటే 
యురప్పులో రెండు దేశాల మధ్యన లేనటువంటి కఠిన మనస్తత్వం 
మనకు రెండు జిల్లాల మధ్యన కనబడుతున్నది. 
దీనిని ప్రత్యక్షంగా తెలంగాణా ఉద్యమంలో చూడనే చూసాము.... 
ఎవరైనా ఒక చోట పుట్టితే అక్కడ ఎన్ని నిమిషాలు...ఎన్ని గంటలు...ఎన్ని రోజులు...ఎన్ని సంవత్సరాలు ఉన్నారనే సంబంధం లేకుండా ఆ దేశపు పౌరసత్వమే వస్తున్నా...."తెలంగాణలో మాత్రం తరతరాలుగా ఉండాలి" అన్న కొత్త విధ్వంసకర చట్టాలు రూపుదాలుస్తున్నాయి...ఈ విషయానికి సీమాంధ్ర జిల్లాలు కూడా ఏమాత్రం తీసిపోవు...

ఈ విధంగా విశాఖలో మరిన్ని అవకాశాలు కల్పించ కూడదు...కారణం... హైదరాబాదుకీ విశాఖకీ ఒక పోలిక ఉండటమే... అదే... ఎదో భయంకరంగా అన్యాయం అయిపోతున్నామనీ, దోపిడీకి గురవుతున్నామనీ సపరేటు ఉద్యమము...తూర్పు ఆంధ్రా[ఉత్తరాంధ్ర]ఉద్యమం ఉండటమే... విచిత్రం ఏమంటే ఎక్కడైతే బాగా అబివృద్ధి చెందిన నగరం ఉన్నదో అక్కడే వేర్పాటు వాదం కూడా పొంచి ఉన్నది...ఇక్కడే కనుక వేల కొద్దీ ఉద్యోగాలు వచ్చే సంస్థలని పెట్టినట్లైతే.... రాష్ట్ర వ్యాప్త యువత విశాఖకి మళ్ళే అవకాశం ఉన్నది... అయితే వీరిని భరించే సహనం కానీ, పెద్ద మనసు కానీ తెలంగాణా వారి లాగానే తూర్పు ప్రజలకి కూడా లేదు...

అదేంటీ
 అక్కడ అనేక మంది ఒరియా వారూ, 
బీహారీలు, ఛత్తీస్ ఘడ్ వారూ, బెంగాలీలూ ఉన్నారు కదా 
అని సందేహం రావచ్చును... 
వారెవ్వరూ బయట వారు కాదు...!!! 
అంతే...!!!
కేవలం ప్రక్క జిల్లాల నుండీ వచ్చే 
సాటి తెలుగు వారే తమకు పోటీ అన్న భావన...
హైదరాబాదులో లాగానే విశాఖలో కూడా ఉన్నది... 
ఇది కానీ... కొంత కాలం తరవాత ముదిరి 
మిగిలిన జిల్లాల వారిని సెటిలర్స్ అని అనటం మొదలెడితే... 
ఈ సారి రాజధాని పోదు కానీ... 
ఎక్కువ ఉద్యోగాలని కలిగిన ప్రాంతం పోయి... 
సీమాంధ్ర యువత మరో సారి నిరాశా నిస్పృహలకి... 
అవమానాలకీ గురి అయ్యే అవకాశం ఉన్నది.  

కాబట్టి, నాయకులు బుద్ధి కలిగి 
జరిగిన "కాలవిధ్యంసం" నుండీ జ్ఞానాన్ని పొంది, 
ఎక్కువ ఉద్యోగాలని ఇచ్చే సంస్థలని జిల్లాకి ఒకటి చొప్పున పెట్టాలి...
అలా కాకుండా...
మరల మరల చేసిన తప్పునే చేస్తూ పోతే 
సీమాంధ్రలో... పంజాబు,కాష్మీరు లాంటి పరిస్తితులు 
ఏరపడతాయో లేదో అన్నదానిలో అనుమానం ఉన్నా...
"ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి 
తప్పకుండా ఇదే ముఖ్యకారణం అవుతుంది"
అని అనేదానిలో
 ఏ మాత్రం సందేహం లేదు.






జై హింద్



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@


@@@@@@@@@@@@



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి