రాజధానిని ఒకే చోట పెట్టకుండా వికేంద్రికరణ చెయ్యాలని...
రాజధానిని నిర్ణయించే "శివరామకృష్ణ కమిటి" తమ రిపోర్టులో పేర్కొన్నారు....
దీని గురించి ఇదే బ్లాగులో
గత సంవత్సరం ఆగస్టు 9నేసూచించటం జరిగింది...
***************************************************************
దానిలోని ముఖ్యమైన అంశాలు:
దానిలోని ముఖ్యమైన అంశాలు:
***************************************************************
9 ఆగస్టు 2013 శుక్రవారం
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంద్ర రాష్ట్రం. కర్టేసి లింకు:[భద్రాచలంతో కలిపి]
రాజధాని గురించి మాట్లాడుతూ... మీడియా మేధావులు ... రాజధాని పెట్టాలంటే ... ఆంధ్రాలో ఎక్కడ పెట్టాలి...? దానికి చాలా విశాలమైన ప్రాంతం కావాలనీ... పరిశ్రమలు అవీ పెట్టటానికి అనువైన ప్రదేశం ఉండాలనీ... దానికి ఎన్నో వేల/లక్షల ఎకరాల భూమి కావాలనీ... నీళ్ళు కూడా సమృద్ధిగా దొరకాలనీ... ఇలా ఒకటేమిటి... ఎవరికీ తోచినది వారు చెప్పేస్తున్నారు.... పరిశ్రమలకి...రాష్ట్ర పరిపాలనకి సంబంధం ఏమిటో ఈ తెలివిగల జ్ఞానులకే తెలియాలి....రాజధానిలో కావాలిసింది కేవలం పరిపాలనా భవనాలు మాత్రమే... దానికి సంబంధించిన ఉద్యోగులకి ఉండటానికి కాలనీలు ... ఇవి మాత్రం ఉంటే చాలు...
"రాజదాని అంటే అభివృద్దికి కేంద్రం... అనే మూఢనమ్మకం" నుండి బయటపడాలి. అభివృద్ధి వికేంద్రికరణ చెయ్యాలి. దీనివలన, ఎక్కువ ప్రాంతాలు బాగుపడతాయి. రాజధానికి వలసలు తగ్గుతాయి. అప్పుడు అనవసరమైన వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒకే చూట కుమ్మరించే దిక్కుమాలిన పరిస్థితి ఉండదు. ఆ డబ్బును రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగటంలేదో అక్కడ ఉపయోగించే అవకాశం ఉన్నది. సోషలిజం, కమ్యూనిజం అని మాట్లాడే మన నేతలు, ఆ భావాలు కేవలం మనుషుల కోసమే కాదు, ప్రాంతాలకి కూడా అన్వయించాలి....ఆ భావాలు మనుషుల మీద ఉపయోగిస్తే కోట్ల ఖర్చుకి వందలమందే బాగుపడతారు...కానీ, ఇదే భావం వెనుకబడిన ప్రాంతాల మీద ఉపయోగిస్తే, కోట్లు ఖర్చు పెడితే లక్షల మంది బాగుపడే అవకాశం ఉన్నది.
రాజధాని అనగానే ఒకే చోట పెట్టకుండా... ప్రాంతీయ అవసరాలుగా రాజధానిని విభజించి, అనేక ప్రాంతాలలో పెట్టినట్లయితే... అన్ని ప్రాంతాలు ఒకే సారి అభివృద్ధి అయ్యేందుకు చాలా చక్కటి అవకాశం ఉన్నది. ఇలా ఒకే చోట రాజధాని లేకపోవటం వలన అన్ని రంగాలవారు దీనినే ఆదర్శంగా తీసుకొని, అన్ని ప్రాంతాలలో తమ అబివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. "ఎక్కడైనా ఒకే రకమైన సౌకర్యాలు ఉంటే అందరు ఒకే చోటుకి ఎందుకు పరిగెడతారు"...!!!
దీని వలన రాజధాని మా ప్రాంతంలో పెట్టండి, మా ప్రాంతంలో పెట్టండి అని వివాదాస్పదంగా కొట్టుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఇంకో ముక్క విడిపోవాలన్నా కేవలం ఒక్క రోజులోనే విడిపోయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే అన్నిప్రాంతాలు సమంగానే ఉంటాయి కాబట్టి ఎదో పోతోందన్న బాధ ఎవరిలో ఉండదు. అయితే అసలు విడిపోయ్యే భావన కూడా పుట్టదనుకోండి...!!! ఈ ప్రయోగం ....రాష్ట్రం అంటే కేవలం రాజధాని మాత్రమే అనే మూర్ఖత్వం నుండి బయటపడేసి, దేశంలోని అన్ని రాష్ట్రాలకి మార్గ దర్శకంగా ఉండి, కనువిప్పు కలిగించేట్లు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పూర్తిగా అవగాహన ఉన్న నిపుణుల కమిటి కనుక సరైన ప్రాంతాలని నిర్ణయించి పెట్టినట్లయితే బాగుంటుంది. అనువుగాని చోట వ్యవసాయం, అడవులలో//వ్యవసాయభూములలో పరిశ్రమలు పెట్టాలనే....రాజకీయ నాయకుల కెలుకుడు లేకుండా, పూర్తిగా నిపుణుల కమిటికే సంపూర్ణ అధికారాలిస్తే మంచిది.
ఇవన్ని చెయ్యాలంటే,
దమ్మున్న రాజకీయ నాయకులు కావాలి...
జావకారిన.. పదవులని నమ్ముకున్న నాయకులు కాదు....
అలాంటి కాపినం ఉన్న నాయకులు తక్షణమే రాజకీయాల నుండి తొలగి...
తమ అసలు ప్రవ్రుత్తి అయిన కాంట్రాక్టు పనులు చెసుకుని బ్రతికితే,
అదే రాయల్ ఆంధ్రా ప్రజలకి... వారు చేసే గొప్ప మేలు...
***************************************************************
ఈ పైన విషయాలతోబాటు... ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో వివరించటం జరిగింది.... అలాగే రాజధాని ఎక్కడ పెట్ట కూడదో కూడా
ఈ పైన విషయాలతోబాటు... ఏది ఎక్కడ పెడితే బాగుంటుందో వివరించటం జరిగింది.... అలాగే రాజధాని ఎక్కడ పెట్ట కూడదో కూడా
24 ఫిబ్రవరి 2014 న వివరించటం జరిగింది.
ఈ రోజున దరిదాపుల ఇదే రకమైన అభిప్రాయాన్ని
రాష్ట్రమంతా పర్యటించిన శివరామకృష్ణన్ కమిటి వెలిబుచ్చింది....
కర్టేసి:ఈనాడు
కర్టేసి:సాక్షి
***************************************************************
సరే బాగానే ఉన్నది....
మరి ఈ కమిటీ... శ్రీకృష్ణ కమిటిలాగా మారి-పోతుందా
లేక
కమిటి మాట ప్రకారమే చేస్తారా అనేది
ఇప్పటి ప్రభుత్వం చేతుల్లో ఉన్నది...
అయితే,
దీనికి ప్రజలందరి సహకారం అవసరముంటుంది.
ఎందుకంటే రాజధాని అనగానే దాని మీద పడిపోయి
అక్కడ లభించే సౌకర్యాలని అనుభవించాలని అనుకునే వారే ఎక్కువ...
దీని ఫలితంగానే హైదరాబాదుకి వలసలు వరసబెట్టి
ఆంధ్రప్రదేశ్‌లోని 22 జిల్లాలని పాడుబెట్టారు.
విపరీత ఉద్యమాలకి మూలం అయ్యారు...
కాబట్టి, ప్రజలు కూడా
జరిగిన అభివృద్ధిని అనుభవించాలానే కాకుండా
జరగాలిసిన అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలని అనుకుంటే బాగుంటుంది.
దీనికోసం రాజధాని వికేంద్రికరణతోబాటు
అభివృద్ధి వికేంద్రికరణ కూడా చాలా అవసరం.
అయితే,
విచారకరమైన విషయం ఏమంటే...
కొందరు రాజకీయనాయకులతోబాటు ప్రజలు కూడా
రాజధాని అంటే ఎదో రియలెస్టేట్ వ్యాపారంగా చూస్తున్నారేగానే
రాష్ట్ర ప్రజలందరి అవసరాలు తీర్చేదిగా చూడటం లేదు.
ఈ వ్యాపార దృష్టి మారినప్పుడే
ఆంధ్రప్రదేశ్‌నకు
ఆరోగ్యకరమైన రాజధాని వస్తుంది.
@@@@@@@@@@@@
అందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు
@@@@@@@@@@@@
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...
3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!
4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????
5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!
6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???
సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం
మరో హైదరాబాదు కాబోతున్నదా...???
@@@@@@@@@@@@
@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి