అంతా బాగానే ఉన్నది...
ఇదంతా చూస్తుంటే "ప్రజలలో భక్తీ భావం పెరిగిపోయింది" అని అనిపిస్తుంది....
అయితే ఇదంతా భక్తేనా అని అనిపిస్తుంది...
ఇది భక్తీ అవునో కాదో అనుకోవటానికి,
అసలు భక్తీ అంటే ఏమిటో తెలియాలి కదా...
భక్తి అంటే పూజలు చెయ్యటం, అభిషేకాలు చెయ్యటం,
మడికట్టుకోవటాలు, అష్టోత్రాలూ...సహస్రాలు చెయ్యటమేనా ...?
భక్తి అనేది దేనికి సంబంధించినది...??
దేవునికా లేక మనకా...???
అసలు ఈ భక్తిగా ఉండటం అనేది దైవికమా లేక మానవ-తత్వమా..
ఇలా అనేక సందేహాలు భక్తి మీద కలుగుతాయి....
చిన్నప్పటి నుండీ తల్లిదండ్రుల వలన ఏర్పడిన అలవాటుతో...
ఆలయాలకి వెళ్ళటం,
దేవుడికి దణ్ణం పెట్టుకోవటంతో మొదలై, కొంచం పెద్దయిన తరవాత...
అవసరార్ధం మొక్కులు మొక్కటం వరకూ జరుగుతూ ఉన్నది...
అంటే...
ఈ పని అయితే కొబ్బరికాయ కొడతా, గుండు చేయించుకుంటా,
మోకాళ్ళ మీద నడుస్తూ దేవాలయానికి వస్తా,
వంటి మీద ఉన్న నగలన్నీ నిలువు దోపిడీ ఇస్తాలాంటి
ఆధునిక మొక్కులే కాకుండా...
ఆధునిక మొక్కులే కాకుండా...
మనుష్యులని, జంతువులని లేక తమ అవయవాలని బలివ్వటంలాంటి
పురాతన మొక్కులూ ఉన్నాయి...
పురాతన మొక్కులూ ఉన్నాయి...
వీటన్నిటి ఉద్దేశ్యం వారి వారి కోర్కెలు తీర్చుకోవటానికి
దేవునికి"నువ్వు నా పని చేస్తే ఈ లంచం ఇస్తాను,
దేవునికి"నువ్వు నా పని చేస్తే ఈ లంచం ఇస్తాను,
లేక
నా పని కానట్లైతే నిన్ను నేను నమ్మను అనే బెదిరింపు"...
ఇలా నయానో భయానో దేవుణ్ణి లొంగదీసుకొని
తమ తమ పనులని చేసుకోవటాన్ని భక్తి అంటారా....?
దేవుణ్ణి కోరికలు కోరటం కోసం హుండీలో కానుకలు వెయ్యటం,
శరీరాన్ని రకరకాలుగా కష్టపెట్టుకోవటం ఇవన్నీ భక్తి క్రిందకి వస్తాయా...??
మరి ఇవన్నీ భక్తి క్రిందకి రాకపోతే
అసలు భక్తి అనేది ఎందుకుండాలీ...
అనే విపరీత ప్రశ్నకొందరు నాస్తికులనబడేవారివలన ఉద్భవిస్తోంది...
అనే విపరీత ప్రశ్నకొందరు నాస్తికులనబడేవారివలన ఉద్భవిస్తోంది...
"భక్తీ అనేది దారి తప్పటం వలననే
నాస్తికులనబడే వారికి అవకాశం వచ్చింది"అని అనిపించి,
భక్తీ కోసం భక్తిగా గూగుల్ దేవత సహాయం తీసుకోని
నాస్తికులనబడే వారికి అవకాశం వచ్చింది"అని అనిపించి,
భక్తీ కోసం భక్తిగా గూగుల్ దేవత సహాయం తీసుకోని
మన పాత గ్రంధాలని తిరగేస్తే...
భక్తీ అంటే దరిదాపుల అన్నింటిలోనూ ఒకే రకమైన అర్ధం కనపడింది..
భక్తీ అంటే దరిదాపుల అన్నింటిలోనూ ఒకే రకమైన అర్ధం కనపడింది..
వాటిలో ఒక దాని నుండి దొరికింది...
అది:[లింకు నొక్కండి] "Bhakti", says Nârada in his explanation of the Bhakti-aphorisms, "is intense love to God"; "When a man gets it, he loves all, hates none; he becomes satisfied for ever"; "This love cannot be reduced to any earthly benefit", because so long as worldly desires last, that kind of love does not come; "Bhakti is greater than karma, greater than Yoga, because these are intended for an object in view, while Bhakti is its own fruition, its own means and its own end."
"భక్తీ గురించి నారదులవారు వివరిస్తు...
భక్తీ అంటే దేవుని ప్రేమించటం...
ఒక సారి అది కుదిరిన తరవాత...
అతను అందరినీ, అన్నిటినీ ప్రేమిస్తాడు...దేనిని ద్వేషించడు..
పూర్తిగా సంతృప్తి చెందిన భక్తీ అనేది భౌతిక సుఖాలని కోరుకోదు......
అలా కోరుకొనేది భక్తీ క్రిందకి రాదు...
భక్తీ అంటే.....
దేవుణ్ణి...తద్వారా లోకాన్ని...సమాజాన్నీ ప్రేమించటం.
ఇది యోగ మరియు కర్మల కన్నా గొప్పది....
ఈ భక్తికి సాటి అయినది మరేది లేదు..."
కాబట్టి, దేవాలయాలకి వెళ్ళటం...దేవుణ్ణి కొలవటం లాంటివి తమ స్వార్ధ ప్రయోజనాల గురించి కాకుండా....సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించటం...తద్వారా ప్రక్క వారికి కనీస సహాయం చేయకున్నా కనీసం వారి గురించి మన[సు]లో ఒక ఆలోచనని రానియ్యటం లాంటవి భక్తిని సాధించే క్రమంలో మొదట ఉండవలసిన లక్షణాలు.....
ఇందులో మరొక విషయం కూడా ఉన్నది.
దేవుని ప్రేమించటం అంటే ఆయనకీ దగ్గరగా వెళ్ళటం...
దీని ద్వారా ఆయన అంటే మనకి భక్తీ అనగా ప్రేమే కలగాలే కానీ...
భయం కాదు. భయం అనేది దేవునికి వ్యతిరేక పదం....
దీంతో దేవుడికి సంబంధం కలిగించటం ద్వారా...
మనం దేవుని అవమానించిన వారము అవుతాము...
అంటే కొంత వివరణగా...
దేవుని పేరు లక్ష సార్లు వ్రాయి లేకపోతె ఏదో అయిపోతావు...
ఇలాంటివి ఇదివరకు పోస్టు కార్డులు వచ్చేవి....
ఇప్పుడు కంప్యుటర్ యుగం కదా...
మెయిల్స్ లోను, ఫేస్ బుక్ లోను వస్తున్నాయి...
ఈ రకమైనవే కాకుండా,
"తమ" దేవుని నమ్మకపోతే ప్రపంచం మునిగిపోతుందని భయపెట్టి,
దేవునికి దగ్గర చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు చాలా మంది....
అయితే
భయం ద్వారా భక్తులని దేవునికి దగ్గర చెయ్యటం అంటే..
దేవుణ్ణి వ్యతిరేకించటమే....
మరొక ప్రచారంలో,
దేవుని పూజలు విధి విధానంగా సక్రమంగా చేయి, లేకపోతే ఎదో కోల్పోతావు...
ఇవి కొన్ని పూజా మరియు వ్రత కదల పుస్తకాలలో కనపడతాయి...
దేవుడు... తనకి పూజ సరిగా చెయ్యకపోతే
కోపం తెచ్చుకొని భక్తుని శపించేట్లుగా ఉంటాడా....???
ఇవేమీ క్షుద్ర పూజలు కాదు కదా...
అవి సరిగా చెయ్యకపోతే క్షుద్ర శక్తి
పూజ చేసేవారినే కబళించటానికి[సినిమా కధల ప్రకారం]....
దేవుడికి పూజలు చేసే క్రమంలో భయపడితే అది భక్తీ ఎలా అవుతుంది...?
"దేవుడు ప్రేమిస్తాడే కానీ ద్వేషించడు...
అందుకనే ఆయన దేవుడు అయినాడు"
అని
మనం నమ్మకపోవటం ద్వారా...
దేవుణ్ణి అవమానించిన వారం అవుతాము...
దేవుణ్ణి అవమానించిన వారం అవుతాము...
దేవునికి భయపడేది పూజలు చేసేప్పుడు కాదు...
చెడ్డపనులు చేసేప్పుడు మాత్రమే...
చెడ్డ పనులు అంటే.... మన చర్యల ద్వారా...
మనకి మనం,
మన కుటుంబానికి, సమాజానికి కీడు తలపెట్టటం...
మరొక భయానుమానం...
దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళే ప్రతీ సారి అతి శుభ్రంగా ఉండాలి....
లేకపోతే ఆలయం అపవిత్రం అయిపోతుంది....
ఇది కొందరి భావం....
అయితే,
శుభ్రం అనేదానికి ఎక్కడ అంతున్నది...?
మన చర్మం క్రింద ఉన్నదంతా చీము, నెత్తురు మంసమే కదా...
శుభ్రం అనేదానికి రోజుకి ఒకటో రెండుసార్లు స్నానం చేస్తాము...
అయితే అంతటితో శుభ్రం అయిపోతుందా...??
అవదు.
దేవుడు భావం అనేది మానసికమైనది కాబట్టి
శరీర శుబ్రంతోబాటు ముఖ్యంగా ఉండాలిసింది మానశిక శుభ్రత...
అది లేకుండా ఎన్ని సార్లు స్నానం చేసినా
దేవుడి మీద గురి కుదరదు.
ఇక అతి ఆచారాల వ్యవహారాలలో
చొక్కాలు తీసి... లుంగీలు
అందులో
తెల్ల లుంగిలే కట్టుకొని ఆలయాలకి రావాలి...
ఇది కేరళా లోని ప్రతీ ఆలయంలోను కనపడుతుంది....
ఈ ఆచారాల్ని పాటించని వారిని
గుడి బయటి నుండే ఒక కన్నం లాంటి దానిలో నుండి మాత్రమే
దేవుని దర్శనం చేయమనటం...
మరొకటేమిటంటే,
కొందరికైతే ఎలా వచ్చినా బయటి దర్శనమే దిక్కు....
కొందరికైతే ఎలా వచ్చినా బయటి దర్శనమే దిక్కు....
బహుశా దీనివల్లన్నేమో
ఆ రాష్టంలో మత మార్పిడుల ద్వారా ఇతర మతస్తులు ఎక్కవ అయ్యారు....
నిజమే దేవాలయాలకి వెళ్ళేప్పుడు డ్రస్ కోడ్ అవసరమే
కానీ...
అది అతిగా ఉండకూడదు.
ఇక్కడి దేవాలయాలలో ఇన్ని కట్టుబాట్లు పెట్టి, భక్తులు హుండీ ద్వారా సమర్పించిన ఆదాయాన్ని
ప్రభుత్వం కొట్టేస్తుంటే మాత్రం నోరెత్తరు... పోనీ ఈ డబ్బులని కేరళాలోని ఆలయాలకి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం వాడతారా అంటే వాడరు. శబరిమలకి ఎంత ఆదాయం వస్తుందంటే కేరళా బడ్జెట్టే దాని మీద ఆధార పడి ఉంటుంది. సరే ప్రజా శ్రేయస్సు మంచిదే.... కానీ, స్వంతంగా చెయ్యగలిగినంత డబ్బు ఉన్నప్పటికీ...శబరిమలకి పైకి ఎక్కే మార్గాన్ని సరి చెయ్యటానికి బ్రాంది విస్కిల వ్యాపారాలున్న
విజయమాల్యగారి సౌజన్యంతో పూర్తీ చెయ్యవలసిన ఖర్మపట్టటం......
మనని బాధిస్తుంది.
విషయంలోనికి వస్తే...
చాలా మంది
దేవుని గురించి ఆలోచనని
స్వార్ధ ప్రయోజనాలకి ముడిపెట్టటం ద్వారా
స్వార్ధ ప్రయోజనాలకి ముడిపెట్టటం ద్వారా
దేవునికి దగ్గరకి వెళుతున్నామని అనుకుంటూనే
ఆయనకి దూరమైపోతున్నారు...
చాలా మంది చెప్పే ఆచారాలు,
ఎటువంటి మతగ్రంధలలోను ప్రస్తావించబడవు...
ఎటువంటి మతగ్రంధలలోను ప్రస్తావించబడవు...
కనీసం అవి ఎవరు చెప్పారో కూడా తెలియదు...
ఎవరికీ తోచిన అంతరార్ధం వారు చెప్పేస్తూ,
భక్తీ అనేది కేవలం వ్యక్తిగతం అన్నట్లుగా చేసేస్తున్నారు.
అలా చెయ్యచ్చా... ఇలా చెయ్యచ్చా...
అని రకరకాలైన ప్రశ్నలని పుట్టించేకన్నా...
అని రకరకాలైన ప్రశ్నలని పుట్టించేకన్నా...
"మనం చేసే దాని వల్లన
ఎవరికైనా/వేటికైనా ఇబ్బంది కలుగుతోందా"
ఎవరికైనా/వేటికైనా ఇబ్బంది కలుగుతోందా"
అని మాత్రం ఆలోచిస్తే చాలు...
అలా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా
అందరిని ప్రేమించగలిగితే
అదే
నిజమైన భక్తీ...
అదే
నిజమైన భక్తీ...
సర్వే జనా సుఖినో భవంతు
@@@@@@@@@@@@@@@
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి