LOCAL WEATHER

30, మే 2014, శుక్రవారం

పేరులో... 'నేమున్నది....!!!


వెనుకటికి ఒక పేద్ద కుటుంబంలొ పుట్టిన పిల్లాడికి భారసాల చేస్తుండగా...ఎవరికి వారు తమ పేరు ఉండాలని "వీర వెంకట శివ శాయి భిమ శంకర  క్రిష్ణ  వర ప్రసాదు"....లాంటి పేరెట్టేసి, ఆనక ఆ ఆనందంలొ గాట్టిగా భోజనం చేసి...పొతూ పొతూ "హై బుజ్జీ టాటా" అని ఒకరు, "ఒరే చిట్టీ వెళ్ళొస్తాంరా" అని మరొకరూ...రకరాకాలైన ముద్దు పేర్లెట్టి పిలిచారే కాని, అసలు పేరుతో ఒక్కరూ పిలవలేదు. 

అలాగే..."షమ్షాబాదు  విమానాశ్రయానికి పేరు మారుస్తారుష" అని అనంగానే... దాని అసలు పేరు షంషాబాదుయేమో అని అనేసుకునేరు... దాని పేరు రాజివ్ గాంధి విమానాశ్రయంట.... దీనికి మన ఎంటివోడు పేరెట్టేయ్యాలని చాలామందికి తహ తహ లాడింది... దాంతో అగ్గి రాజుకుంది... అసలే అక్కడ అంతర్జాతీయ చట్టాలు కూడా చెల్లవు... అలాంటి ప్రాంతంలో మరొక ప్రాంతపు తెలుగుదేశం నేత పేరా.... ఇప్పటికే ఒకాయన అనేసాడు...అది ప్రక్కరాష్టం పార్టీ అని...దానికి తమ ప్రాంతంలో చోటు లేదని... మరి కాంగ్రెస్సు-బిజెపిలు ఏ ప్రాంతపు పార్టిలో ఆయనకే తెలియాలి. అయితే గియితే "ఇప్పుడు ఆంధ్రలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆంధ్రావి కావు...వాటి హెడ్ ఆఫీసులు ప్రక్క రాష్ట్రాలలో ఉండటమే కాదు...వాటి హెడ్ నాయకుల ఓట్లు కూడా ఆంధ్రలో లేవు"...

సరే విషయంలోనికి వస్తే...పేరు మార్చటం మీద ప్రాంతీయ నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతూ మరొక ప్రాంతపు నేత పేరు పెడితే, మేము మా ప్రాంతంలో ఉన్న అన్ని పేర్లనీ మార్చేస్తాము అని అంటున్నారు... ఇంతకీ రాజివ్ గాంధి  ఆ ప్రాంతానికి చెందిన వారా అంటే కాదు... మరేమిటి సమస్యా... అన్న దమ్ములు కొట్టుకున్నప్పుడు "ఏదైనా సరే తమ వారికి కాకుండా ఎవడికి పోయినా సరె పరవాలేదు" అని అనుకున్నట్లే, రాజివ్ గాంధి పేరున్నా మరే పేరున్నా పరవాలేదు... 

అయితే, ఈ గోల ఎలా ఉన్నా...ఇప్పటికే ఉన్న పేరుతో కాకుండా దానిని "షంషాబాదు విమానాశ్రయం" అని పిలుస్తున్నప్పుడు... అక్కడ బోర్డు మీద ఏ పేరుంటే ఏమున్నది కనుక...  అనవసర అల్లరి తప్ప.

కొసమెరుపేమంటే , ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కానీ, మరే ప్రజా సమస్యలలో కానీ కనపడకుండా ఉన్న జీవచ్చవం అయిన ఆంద్ర కాంగ్రెస్సు నాయకత్వం వెంటనే స్పందించి...పేరుని మార్చటాన్ని తీవ్రంగా ఖండించి పారేసింది. ఏమి స్వామీ భక్తీ...


@@@@@@@@@@@@@@@



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి