LOCAL WEATHER

12, డిసెంబర్ 2012, బుధవారం

కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!!



తెల్లారింది.....పొద్దున్నే కాఫీ తాగుతూ పేపరు చదువుదామంటే ఇంకా రాలేదు......సరె అలా పడక్కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తుండగా............, పేపరు వేసే వాడు గేటు తీసుకొని వచ్చి పేపరు చేతిలో పెట్టి వెళ్ళాడు......పేపరు తీయగానే పైనే పేద్ద హెడ్ లైను "దొండకాయలు కేవలం రెండు డాలర్లకే"....క్రింద చదవటం మొదలు పెడితే......ఇదీ  న్యూస్........

"దేశంలోని మొత్తం దొండకాయలను కిలో ఆరు రూపాయలిచ్చి,  రైతుల దగ్గర FDI  కొనుగోలు చేసింది. వీటిని కిలో  కేవలం రెండు డాలర్లకే ప్రజలకి ఇవ్వటానికి FDI  ఏర్పాట్లు చేసింది.....FDI  కొన్న దొండకాయలలో చాలా భాగం, వీరి అమెరికా, జపాన్, యూరప్పు బ్రాంచీలకి పంపించాలని నిర్ణయించారు.... అక్కడైతే ఇంకా ఎక్కువ లాభం దొరికే అవకాశం ఉన్నది అని.... FDI  వర్గాలు వెల్లడించినాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆర్ధిక వేత్త మాట్లాడుతూ....  తాము FDI లని  అనుమతించటం వల్లనే దొండ రైతులకి  కిలోకి నాలుగు నుండి ఐదు రూపాయల వరకూ లాభం వచ్చిందని ఉద్ఘాటించారు....... ప్రధాన ప్రతిపక్షాలు మాట్లాడుతో, అసలు ఇది తమ పనే అనీ, దీనికి పాలక పక్షం వారు కుట్రతో అడ్డం పడటం వలన ముందరగా చెయ్య లేకపోయ్యామని....ఆక్రోశించారు....... దీనికి సంబంధించి,  మేధావి వర్గం వారు హర్షం ప్రకటించారు.....ఈ విధంగా మన దేశం వారెవరైనా రైతులకి గిట్టుబాటు ధర కల్పించారా అని ప్రశ్నించారు......."

మొత్తం మీద  FDI  పుణ్యాన  దొండకాయ న్యూస్ పేపరు హెడ్ లైనులో  పడింది..... అని అనుకుంటూ అలా బయటకు వెళ్లాను.   షాపుల దగ్గరా.....కొన్ని మొబైల్  వేనుల దగ్గరా బారులు తీరిన జనం కనిపించారు.....ఏమిటి సంగతి..... అని కనిపించిన వాణ్ణి అడిగితే "మీరు టీవీలు చూడరా ఏమిటీ"   అని కసురుకొని,  "దొండకాయలు కేవలం కిలో. 100/- రుపాయలకే ఇస్తున్నారిక్కడా" అని ఆవేశంగా చెప్పి, లైనులొ తోసుకొంటూ ముందుకు వెళ్ళిపోయాడు......తనకి కిలో అయినా దొండకాయలు దొరుకుతాయో లేదో అన్న ఆదుర్దాతో.......

ఎమిటో కదా అని,  దగ్గరలో ఉన్న షోరూములో టివీ చూద్దును కదా......."పేద్ద పేద్ద సినిమా తారలూ, బ్రహ్మాండమైన సెట్టింగులు మధ్య పేద్ద దొండకాయ బొమ్మ పెట్టి ఉన్నది....." .దాని ముందర నుంచొని, తారలు రకరకాలైన భంగిమలతో డాన్సులు చేస్తూ దొండకాయ వంక చూపిస్తూ ఏదో అంటున్నారు....అదేమిటో ఆ మ్యుజిక్కు  హొరులో వినపడలేదు. కానీ..., "లిమిటెడ్ స్టాక్" అనే మాట ఒక్కటే గట్టిగా వినపడింది........  అది  "దొండకాయ మీద ప్రకటన"  అన్న సంగతి అర్ధమైయింది. అవును మరి, అది FDI   [వ్రాయటానికి వీలుగా విదేశీ ఇన్వెస్టర్లందరినీ ఒకటే  FDI అని వ్రాయటం జరిగింది]  వారి ప్రకటన......ఈ మాత్రం  లేకపోతే ఎలా....?? 

దొండకాయకి ప్రకటనా..... అని అనుకోవల్సిన అవసరం లేదు....ఒక బ్లేడుతో, బనియన్‌తొ ఆత్మ విశ్వాసం......చిన్న చాక్లెట్టుకి కోట్ల రూపాయల ప్రకటనలూ......రూపాయ షాంపూ పేకెట్టుకి పెద్ద సుపర్ స్టార్లూ ......10/- రుపాయల కూల్ డ్రింకు కోసం మేడల మీద నుండీ కార్ల మీద నుండీ దూకటం...... కేవలం "బాడీ స్ప్రే కోసం కట్టుకొన్న వాడిని కాకుండా పక్కింటి వాడి మిద మోజు పడే యురోపియన్ ఇల్లాలిని, భారతీయ ఇల్లాలుగా ప్రకటనలో చూపించటంలాంటివి"  వస్తూనే ఉన్నాయి కదా... ఇలాంటివి అంటించినది యూరప్పు మార్కెట్టు వారే......  వాటికి అయ్యే ఖర్చుని మనమే పెట్టుకొంటున్నాము..... అలాగే నిత్యావసరాలకీ ప్రకటనలూ తప్పవు.... ఆ ఖర్చులు కూడా మనమే పెట్టుకోక తప్పదు...... "పది పైసల లాభానికి యూరప్పు వారు భారత్ వరకూ రావాలిసిన పని లేదుగా"....!!!  అప్పుడు  అనిపించింది...... "పేపర్లో హెడ్ లైను అనుకొన్నది, ప్రకటన అన్నమాట"......దాని క్రింద ఉన్నదే వార్త అనీ.........  ఏమిటో ఏది వార్తో, ఏది ప్రకటనో తెలియకుండా పోయిందనుకొంటూ  ఇంటి దారి పట్టాను.......


జనాలు తగ్గారు......దొండకాయలు అన్నీ అయిపోయినట్లున్నాయి అని అనుకుంటూ వస్తుంటే, ఇందాక కసురుకొన్నాయన  విచారంగా మొహం పెట్టి ఎదురు పడ్డాడు..... ఎమిటి ఏమయిందండీ...అడిగితే.....

నాకు దొండకాయ అంటే చాలా ఇష్టం అండీ.....అందుకనే నాకున్న పొలమంతా దొండ పాదులనే పెంచి సాగు చేసుకొంటున్నాను అన్నాడు విచారంగా......  

ఒహ్!! నువ్వు దొండ రైతువా....మరి నీ పంటకు  మంచి రేటు పలికిందిటగా టీవీల్లోనూ, పేపర్లోనూ తెగ వార్తలొచ్చేస్తున్నాయి.....అయినా నీకు విచారం దేనికని అడిగితే.....   

ఆ అవునండీ ఎప్పుడూ లేనంతగా కిలోకి ఆర్రుప్పాయ్యలకి ఇచ్చాను....."సంవత్సరం మొత్తం కాసినవన్ని ఇచ్చే  అగ్రిమెంటు  ప్రకారం నా పొలంలో పండిన  అన్ని దొండకాయలనూ FDI వారు దగ్గర ఉండి మరి కోసుకొని" వెళ్ళిపోయ్యరు. 

మరైతే విచారం దేనికీ,  అయితే డబ్బులివ్వలేదన్నమాట.....అన్నాను అనుమానంగా............  

లేదండీ,  నెలరోజుల ముందరే,  సంవత్సరానికి సంబంధించిన మొత్తం   ఇచ్చేశారు...... 

మరెందుకు విచారం.... 

"ఆ ఏమీ లేదు నాకిష్టమైన దొండకాయ కూర తిందామని కష్టపడి లైన్లో నుంచున్నా దొరకలేదు"....పైగా ఇంకో "నెలరోజుల దాకా దొరకవట"..... మన దేశం కోట అయిపోయిందిట; ఉన్నవన్నీ బయట దేశాలకి పంపించేశారుట....... ఇందాక  మీతో మాట్లాడి టైం  వేస్టు  చెయ్యటం వల్లనే దొరకలే  అని విచారపడుతూ తనదారిన తాను పొయ్యాడు...... దొండ రైతు....

అదేమిటి తన పొలంలో  మళ్లీ  కాసిన కాయలు తినొచ్చు కదా, దొండకాయలు  అంటే కాస్తూనే ఉంటాయి కదా........!!! అనుకొని........ అంతలోనే ఆయన చెప్పిన  అగ్రిమెంటు విషయం  గుర్తొచ్చింది.......... "ఎఫ్.డి.ఐయ్యా   మజాకానా"............ఇంతకీ, ఆ రైతుకి FDI వాళ్ళ మీదకన్నా నా మీదే కోపం కనపడింది.... కేవలం నాతొ  మాట్లాడి టైం వేస్టు  చెయ్యటం వల్లనే తనకిష్టమైన దొండకాయ దొరకలేదని........   ఆ రైతుని అనుకోని ఏం లాభం,  ఒకరినొకరు మాట్లాడ కుండా ఉండేంత పనికిమాలిన బిజీని   ప్రజలకి  సృష్టించటమే కదా మన ప్రభుత్వం వారి ఉద్దేశం కూడా అనుకుంటుండగానే  ముఖాన ఎదో పడినట్లైంది.... గభాల్న మెలుకువ వచ్చింది..........ఆ పడినది   ఈ రోజు న్యూస్ పేపర్.......... "అంటే ఇందాకటిది అంతా కల అన్నమాట"......... లేకపోతె పేపరు వాడు గేటు తీసుకొచ్చి పేపర్ని చేతిలో పెట్టటం ఏమిటి.......... అనుకొని పేపర్ హెడ్ లైను చూసాను.........  ఏమున్నదీ   మన వాళ్ళలో  మన వాళ్ళు కొట్టుకొని[???]............. FDI  బిల్లుని  ఆమోదించేశారు.  పాత కాలం పాలకుల కధే ....  అప్పుడు  రాజులు,  నవాబులు ప్రవర్తించినట్లే, ఇప్పడు రాజకీయ పార్టీల వారు  ప్రవర్తించారు......మళ్లీ చరిత్ర    పునరావృతమేనా......???

పేపరు వాడు పేపరు చేతికివ్వటం కల అయినా మిగిలినది మటుకూ  కల అయ్యే అవకాశం ఉన్నదా....... ఏమో ముందు ముందు ఇంతకన్నా గొప్పగా  ఏం   ఉంటుంది.........ఇప్పటికి ఉన్న దేశీయ మాల్స్ ఎక్కువ స్టాక్ నిల్వచేయ్య టం వల్లే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటినాయి......ఇక విదేశీ  ఇన్వెస్టర్లు డబ్బు వెదజల్లటం మొదలైతే,  ఇప్పుడు ఎక్కువ ధరలో అయినా దొరికే సామాన్య వస్తువులు [ముఖ్యంగా తిండికి సంబంధించివి] దొరకని పరిస్థితి ఏర్పడుతుంది...........చట్టాన్ని అతిక్రమించటానికి  "రూపాయలకే   ఎగబడే   సంబంధిత  ఉద్యోగులు,  డాలర్ దెబ్బకి సామాన్య జనాల ముఖాలు  చూస్తారా"........??? అందుకనే,  భయం...... "బయట వాళ్ళకన్నా .......వాళ్ళని రానిచ్చిన మన వాళ్ళని చూసే.........!!!"

ఇది భారతదేశ చరిత్రలో   బయట దేశాల  వాళ్ళు   మనకి కీడు ఎలా చేసారో.........  మన వాళ్ళు ఎలా లొంగి  పోయి ఉన్నారో.......మన పాలకుల దౌర్బల్యం వలన దేశ పరిస్థతి ఎలా ఉంటూ వచ్చిందో ........ దాని బట్టే వ్రాశాను.......  ఏ ఇజాలకి  ప్రభవితం కాకుండా ఉన్నదేదో వ్రాశానని  అనుకొంటున్నాను..... ఇలా ఎందుకన్నానంటే, యురప్పు వారిని విమర్శిస్తే కమ్యునిస్టు అయినట్లు, ఎర్ర వాళ్ళని తిడితే అమెరికనిష్టు అనుకుంటున్నారే కానీ...... "మధ్యలో భారతీయత  అనేది ఒకటున్నదన్న సంగతి మరిచిపోతున్నారు"...............

ఏది ఏమైన  FDI ల   గోలని భారత  ప్రజలు సీరియస్సుగా తిసుకోన్నట్లుగా కనపడటం లేదు......... "మన ప్రజలు చాలా సున్నితమైన వారు".... ఏదైనా తమకి గుచ్చుకొనే వరకూ దానిని పట్టించుకోరు.....  లోకల్ మాల్స్ వచ్చి పెద్ద ఎత్తున సరుకులు నిల్వ చేసినప్పుడు ధరలు పెరుగుతాయన్న గోలని ఎవరూ పట్టించుకోలేదు..... బియ్యం, పప్పులూ, కూరల ధరలు పెరిగిన తరవాత ఇప్పుడు అనుకొని ఏమి లాభం......?  చెతులు కాలిన తరవాత.....   అలాగే  చిల్లర  వ్యాపారంలో  విదేశీ పెట్టుబడులు కాని,  మరేదైనా కాని దేశం మీద దాడి చేసినా, అది  తమ దాకా వచ్చిన తరవాత కానీ,  మన వారికి చలనం కలగదు.........!!!!! 


నమస్తే 


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

శత్రువులను రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నారా.......???[FDI--PART..I]

 కిలో దొండకాయలు కేవలం 2 డాలర్లు మాత్రమే .....!!!! [FDI --PART...3]

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

పైన వ్రాసినది మరీ  సీరియస్సు అనుకొంటే .....ప్రక్కనే ఉన్న "TRANSLATE"  నొక్కి అందులో ఇంగ్లిషు కాని మరేదైనా భాష కాని సెలెక్ట్ చేసి ఆ "భయంకరానువాదాన్ని"   చదివి ఆనందించండి. 


బొమ్మ మిక్సింగ్ చేసింది కేఆర్కే 

2 కామెంట్‌లు:

  1. చక్కగా వ్రాసారండి.

    ఈ నాటి భారతీయులలోని 90 శాతం వారి గురించి , ఈ మధ్య ఒకాయన కామెంట్ చేసారు కదా ! నిజమేనేమో? అనిపిస్తోందండి.

    రిప్లయితొలగించండి
  2. anrd గారు స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి