LOCAL WEATHER

27, ఆగస్టు 2015, గురువారం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీది ప్రతిపక్ష పాత్రా....???

ఐదు కోట్ల జనాభా ఉన్న ఓ రాష్త్రం ఇలా తలా తోకా లేకుండా అల్లాడుతుంటే...ఇలాంటి సమయములో ఆదుకోవాలిసిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు, కేవలం ప్రెక్షక పాత్ర పోషించినా పరవాలేదు...అయితే, దానికి మించి అనేక పనులకి అడ్డుపడుతూ ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు... అదేదో తమ పరిధి కానట్లుగా కేంద్ర ప్రభుత్వాధినేత మొడీ గారు ప్రవర్తిస్తున్నారు...ఓ ప్రక్కన కాంగ్రెస్సుతో జత కలిసి రాష్ట్రాన్ని విడదీసి...ఈ రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికిన వారు, ఈ రోజున "ఏ సహాయం చేస్తే మరెవరికో పెరొస్తుందో" అన్న పనికి మాలిన ఆలొచనలతో...రాష్ట్రానికి రావాలిసినవి రాకుండా అడ్డుపడుతూ...రాష్ట్రాన్ని మరింత సంక్షొభంలోనికి నెడుతున్నారు....వీరు అధికార పార్టికి మిత్రులులాగా కాకుండా కక్షగట్టిన ప్రతిపక్షం లాగా  ప్రవర్తిస్తున్నారు.....

ఇప్పుడు మన రాష్ట్రంలొ జరిగే పరిణామాలని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది... తెలుగుదేశం పార్టీకి శత్రువు కాంగ్రెస్ అనుకుంటే...ఆ  పార్టీ వ్యక్తులందరూ జరిగిన ఎలక్షన్లొ చక్కగా తెలుగుదేశానికి సహకరించారు...  అయితే, ఎన్నికల అనంతరం ఎంతో సహకారం లభిస్తుందన్న బీజేపీ నుండి మటుకూ అవమానకరమైన భావనలే ఎదురవుతున్నాయి....ఎప్పుడైతే కేంద్రంలో మరో పార్టీ అవసరం లేకుండా స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో...అప్పటి నుండీ బీజేపీ శ్రేణుల ప్రవర్తన....ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...మారిపోయింది. ఒంటరిగా నుంచుంటే కనీసం ఇండిపెండెంట్లకి వచ్చేనన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీ వారు... చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు...తమ మాటే నెగ్గాలనే విపరీత ప్రవర్తనలు చేస్తున్నారు... దీని వలన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బందేమిటో మనకి అకవసరం లేదు.... అయితే, వీరి వల్ల రాజధాని లేకుండా ఏర్పడిన ఈ రాష్ట్రం మటుకూ మరింత ఇబ్బందులలో పడుతోంది.... ఈ పరిస్థితిని  బీజేపీ లోకల్ నాయకులు దృష్టిలో పెట్టుకోవటం లేదు ....వారి ఆలొచనలన్నీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిపారెయ్యాలనే కోణంలోనే తిరుగుతున్నాయి...వీరికి అలా అనుకోవటమే కాదు...కనీసం కలగనే అర్హత కూడా లేదని వారి లోకల్ నాయకులకి తెలుసును. ఎందుకంటే... వారుగానీ ఏ పార్టీ సహకారం లేకుండా నుంచుంటే....ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఇండిపెండెంట్లకి వచ్చినన్ని ఓట్లు కూడా రావు....

 రాష్ట్రానికి చెందినా విశాల హృదయం కలిగిన బిజెపి ఒక నేత సంగతి...
Inline image 1


ఫోటో కర్టేసి: సాక్షి 

ఈ వెంకయ్య గారు లేకుంటే మన రాష్ట్రానికి దిక్కు లేదంట....
ఈయనగారు లేకపోతే రాష్ట్రానికి నిధులు రావంట.... 
ఒక్క మాటలో అదే వెంకయ్యగారి మాటలో చెప్పాలంటే....
వెంకయ్య లేకపోతే దిక్కు లేదంట.... 
మరి మోడీ గారికి కూడా మనస్సులో ఇదే ఉన్నదా... 
కేవలం వెంకయ్య మొహమాటంతోనే మన రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారా....???
పైగా వెంకయ్యని విమర్శిస్తే నిధులు రావు అని ఓ బ్లాక్ మెయిల్ బెదిరింపు.....
ఫోటో కర్టేసి: ఈనాడు 

మరో నేత బిజెపికి సంబంధించిన విశాఖ ఎంపి
కొత్త రైల్వే జోన్ విషయంలో  పట్టుదలగా తిసుకుంటున్నారే గానీ..
సమస్య గురించి  తెలియటం లేదు...ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందినది...
పైగా ఆ అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలు సీమాంధ్రులు కంటే...
ఒరిస్సా-ఛత్తీస్ ఘర్-బెంగాలి యువతే కొట్టేసింది...
ఇక అక్కడ రైల్వే జోన్ వస్తే,  
ఆ ప్రయోజనం సీమాంధ్ర ప్రజలకి దక్కదు... 
అయినా, 
బిజెపి ఎంపి ఆ విషయాన్ని 
తెలుగుదేశం పార్టీ మీద ఒక ఆధిపత్య ధోరణినిగానే చూస్తున్నారు....
ఆ రైల్వే జోన్ విజయవాడ-గుంటూరు లేక గుంతకల్లులో పెట్టినట్లయితే 
సీమాద్రులందరికి అందుబాటులో ఉండటమే కాకుండా...
ఇక్కడి వారికే ఉద్యోగావకాశాలు దక్కుతాయి....
ఇప్పటికే ఏపి ఎక్స్ ప్రెస్సును దేశంలో ఎక్కడా లేనట్లుగా 
రాజధాని నుండి బయలుదేరే రైలుని 
విశాఖ నుండి నడిపి భువనేశ్వరు వారి చేతులలో పడేశారు...
ఇదంతా చూస్తుంటే...
అన్నీ మేమే చేశాం అని అనిపించుకుని  
ఎదో  సాధిద్దాం అన్న దుగ్ధ బిజెపిలో కనపడుతోంది...
అందుకే, CM వెళ్లి  అడిగితే...
నేను తిరుపతి వచ్చినప్పుడు ప్రకటన చేస్తాను అని సమాధానం వచ్చింది....
అదేదో ఇప్పుడే  చెప్పవచ్చును కదా.... 
అలా చెపితే తెలుగుదేశానికీ పెరోస్తుందనీ వీరి బాధ....
ఇలా  చేస్తుండటం వల్లనే  
ఏపిలో ఇప్పటికే బిజెపికి ఉన్న  కాస్తో కూస్తో ఉన్న పేరు...
మంచిగా  మారక ముందే  చెడ్డ పేరుగా  అయ్యింది....
కాబట్టి, 
ఇప్పటికైనా బిజెపి వారు  ఆధిపత్య ధోరణితో అడ్డు పడకుండా కళ్ళు తెరిస్తే మంచిది....  

ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షానికి... రాష్ట్ర  ప్రయోజనం కన్నా....తాము  ఎన్నికల్లో  కొద్ది తేడాలో ఓడిపోయామన్న కసే ఎక్కువగా కనపడుతున్నది...అధికారపక్షం వారు చేసే ప్రతీ పనిని అడ్డగోలుగా అడ్డుకోవడమేగానీ...దానికి పరిష్కార మార్గాన్ని మడుకు చూపించటం లేదు... కేవలం రాష్ట్రమే కాదు-దేశమే కాదు మొత్తం ప్రపంచంలో భూసేకరణ అనేది  చెయ్యకుండా ఎటువంటి ప్రాజక్టు రాదు అని వీరికి తెలియదా ... అంతదాకా ఎందుకు...వీరికి సంబంధించిన వారు.... అనేక ప్రాజెక్టులకి మూలం  అయిన వై ఎస్ ఆర్ గారు భూసేకరణ చెయ్యకుండానే అన్ని  అభివృద్ధి పనులు చేపట్టారా....???  తెలుసు...అయినాకూడా వీరు ప్రజలని రెచ్చగొట్టే ధోరణిలోనే ఉన్నారు....వీరికి కావాలిసింది...ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవటం...తాము అధికారంలోనికి రావటం తప్పిస్తే వేరే ఆలోచన లేదు....రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది....ఇటువంటి సమయంలో అనవసర రాజకీయాలు కూడదు అనే మెచ్యురిటి కనపడటం లేదు...

కర్టేసి: ఈనాడు-శ్రీధర్ 

ఈ విధంగా కొత్త రాష్త్రం ఏర్పడి సంవత్సరంన్నర అయినా కూడా...రాష్ట్రానికి కావాలిసినవి, అటు దిల్లి నుండి కానీ...ఇటు ఉమ్మడి రాజధాని  నుండిగానీ.. రాబట్టుకో లేక చతికలపడిపోయారు అధికార-ప్రతిపక్ష నాయకులు ... వీరికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తమ రాజకీయాలే ముఖ్యమైపోయాయి...ఒకరు అవునన్నది మరొకరు కాదంటం, ఒకరిపై మరొకరు బురద జల్లుకోవటం...ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి....దానికి వారి పార్టీల నాయకులు...కొందరు కార్యకర్తలు చక్కటి సహకారాన్ని అంధించటం... ఇలాంటి పనుల్లో నిమజ్ఞమైన వీరు... రాష్ట్ర ప్రజలకి...ముఖ్యంగా విద్యార్ధులకి సంబంధించిన విషయాలని ప్రక్క రాష్ట్రం వారు ప్రక్కదోవ పట్టిస్తుంటే పట్టించుకోవటం లేదు...అలాగే  రాష్ట్ర ప్రభుత్వానికి రావాలిసిన ఆస్తుల పంపకం పై కూడా దృష్టి పెట్టటంలేదు.... ఎంత సేపు తమ పగలూ-ప్రతీకారాలు-ఆధిపత్యాలే గానీ, ప్రజల బాబోగుల సంగతి వారికి పట్టటం లేదు......

వీళ్ళు ఇలా ఉంటే....ఉమ్మడి గవర్నరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది... ఆయన ఉమ్మడి గవర్నరుగా కాకుండా కేవలం ప్రక్క రాష్త్ర గవర్నరుగానే వ్యవ్యహరిస్తున్నాడు...ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ప్రభుత్వం గుర్తింపులేని ఒక సంస్థ మాత్రమే....ఇటువంటి ధోరణిలో ఉన్న ఆ అరవాయన సీమాంధ్రుల అసలు కష్టాలని ఎలా పట్టించుకుంటారు.... కావాలంటే తిరుపతి ఓ యాభైసార్లు రమ్మనకుండానే వస్తారుగానీ....

కాబట్టి, అర్హతలు-అవినీతి ఆరోపణలు-ఆధిపత్యాలు లాంటివి ప్రక్కట పెట్టి, ముందర రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఓ దారిలో పెట్టి.... తలకాయలేని రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి...కావాలంటే అప్పుడు అందులో పడి ఏ రాజకీయం కావాలంటే అది చేసుకోవచ్చును కదా... అప్పుడు అది... ఇప్పుడు జరిగే వీధి నాటకం లాగా కాకుండా కాస్తంత మర్యాదగా ఉంటుంది కదా... రాజధాని అంటే ఏ రాజకీయ పార్టీ సొంత సోత్తో కాదు కదా... అందుకని దాని కోసం రాష్ట్రంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "రసకందాయ రాజకీయాలు" మాని...కలసి కట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పడే వరకూ కొట్టుకుని చావకుండా ఉంటే....హైదరాబాదు నాటకాల టివీల వారు ఏడ్చినా...ప్రజలు మటుకూ సంతోషిస్తారు.....

ఈ సందర్భంగా హైదరాబాదు మీడియా గురించి "కోస్త లైఫ్లో"  వచ్చిన  కధనం....

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి