జై తెలుగోడా.... తెలుగు వారికి సందేశంరామాయణ కాలంలో... దశరధుడికి పిల్లలు పుట్టకపోతే, యజ్ఞం చేసినప్పుడూ రెండు ఫలాలు వచ్చినాయట. ఆయనకి ఉన్నదేమో కౌసల్యా, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు...వచ్చిందేమో రెండే పళ్ళు... ఒకటి పెద్ద భార్యకూ, రెండవది రెండవ భార్యకూ ఇచ్చాడు...ఆ పుచ్చుకున్న ఇద్దరు భార్యలూ తమకిచ్చిన కాయలో సగాం తాము ఉంచుకొని, మిగిలినది సుమిత్రకి ఇచ్చారు... దానితో ఆవిడకి రెండు ముక్కలు... అనగా ఒక "పూర్తి ఫలం" దక్కింది...మిగిలిన ఇద్దరికీ ఒక్కొక్కరు పుడితే, మూడవ భార్యకు కవల పిల్లలు పుట్టారు...ఇదీ కధ...
సాక్షి పేపర్లో వేసిన ఈ ఫోటో చాలా బాగున్నది...
పోయిన తెలంగాణా[హైదరాబాదు]ని
విజయవాడ కవర్ చేస్తుందనే భావనని చూపించారు....[కర్టేసి:సాక్షి]
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కర్నూలూ, విశాఖ, విజయవాడలు పోటీపడినాయి... వీటితోబాటూ మరికొన్ని కూడా పోటీపడినాయి అనుకోండి...అవి కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం... అందరిదీ ఒకటే మాట ... "తమ ఊరే రాజధానిగా చెయ్యాలి" అని, దేనికవే పోటీపడినాయి కానీ... మరొక దానిని కలుపుకోవాలని ఎవరూ అనుకోకపోయినా... అనుకోకుండానే అందరూ మానశికంగా విజయవాడనే కలిపేసుకున్నారు...
కర్టేసి:గూగుల్ మేప్
ఎలాగంటే...విశాఖలో పెట్టమన్న విశాఖ వాసులు రాజధాని అక్కడే పెట్టాలనీ...ఏ కర్నూలులోనో పెడితే చాలా దూరం అయిపొతుందని అన్నారు...అలాగే కర్నూలు వాళ్ళు కూడా తమకు రాజధాని హక్కు అనీ... మరెక్కడా పెట్టకూడదని చెపుతూనే... విశాఖలో పెడితే తమకి దూరం అవుతుందని కుండ బ్రద్దలుకొట్టి మరీ చెప్పారు... ఇదే కధ మిగిలిన అన్ని ఊళ్ళదీనూ...ఒక్క విజయవాడ తప్పిస్తే. విజయవాడ వాళ్ళే కాదు...దీనికి చుట్టూ ఉన్న ఊళ్ళ వాళ్ళే కాదు...చుట్టూ జిల్లాల వారు కూడా విజయవాడ కేపిటల్ అయితే తమకి మాత్రమే కాదు రాష్ట్రం మొత్తానికీ అందుబాటులో ఉంటుందనే భావననే ప్రచారం చేశారు...
దీని ప్రకారం, ప్రతీ వాళ్ళూ తమ దగ్గరున్న మూడు నాలుగు ఓట్లలో
మొదటిది తమ ఊరికి వేసుకొన్నా...
రెండవ ఓటుని విజయవాడకే వేసేశారు...
విజయవాడ ఓట్లు విజయవాడకే పడగా...
మిగిలిన అన్ని చోట్లా రెండవ ఓటు విజయవాడకే పడింది.
దానితో నూతన ఆంధ్రప్రదేశ్‌నకు రాజధానిగా విజయవాడే ఎన్నికయ్యింది...
ఇదంతా బాగానే ఉన్నది...
ఎవరికి వారు తమ ఊరు కాలేదని అనుకున్నా...
కనీసం దగ్గరలో/అందుబాటులో ఉన్న ఊరు అయ్యిందని సంతోషించారు...
కొంత అసంతృప్తిగా ఉన్నాప్పటికీ...
అయితే,
ఇలా జనం కొట్టుకోబోతే మాకేమిటి లాభం అనుకున్నారేమో మన టివీ వారు...
రాజధాని ప్రకటన కన్నా,
దాని మీద విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారు...
ముఖ్యంగా టీవీ 9 మరియూ మరొక టీవీ వారు
"తమని తెలంగాణాలో నిషేధించటం సరైన నిర్ణయమే" అని నిరూపించుకున్నారు,..
రాయలసీమలో/విశాఖలో నిరసనలు వెల్లువెత్తాయనీ...
విజయవాడలో హర్షం ప్రకటించారనే రెచ్చగొట్టే ధోరణిలోనే తమ న్యూసుని ఎగ్జిబిట్ చేశారు...
మిగిలిన ప్రదేశాలలో ఏమోగానీ...విజయవాడలో ప్రత్యేకించి ఈ విషయం మీద శ్రద్ద పెట్టకపోగా...రాజధాని అయితే ఎన్ని బాధలు పడాలిరా దెవుడా అనే మాటే వినపడింది...ఇది కేవలం రాష్ట్రానికి సెంటర్లో ఉండటమే ఇక్కడి వారి నెత్తికొచ్చింది. కాబట్టి, రాజధాని సంతోషం ఇప్పటికే ఇక్కడ ఉన్నవారికి పెద్దగా లేదు. దానికి కారణం ... పెద్ద నగరంలో ఉండవలసిన సౌకర్యాలే కాదు, పల్లెటూళ్ళో ఉండే సౌకర్యాలు కూడా ఉండటం విజయవాడ విశేషం... అంటే ముంబాయి, ఢిల్లీ లాంటి నగరాలలో దొరికే అన్ని రకాల వస్తువులూ, సౌకర్యాలతోబాటూ, పల్లెల్లో అతి తక్కువ ధరల్లో దొరికే కూరలూ, మంచి పాలూ పెరుగూ ఇలా ఒకటేమిటీ అన్నీ చౌకగా దొరుకుతాయి.... అందుకనే విజయవాడలో ఎటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా కూడా, పూర్తి ఆంధ్రప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరం అయినది. దీని పైనున్న రెండు పెద్ద నగరాలైన హైదరాబాదు, విశాఖలలో కూడా దొరకనంత చౌకగా ఇక్కడ అన్నీ దొరికేవి... దొరికేవి అని ఎందుకంటే... ఇప్పుడు రాజధాని రేసులో ఉన్నప్పుడే...పైన చెప్పుకున్న అనేక సౌకర్యాలూ ఒక్కొక్కటిగా కనుమరుగు అవుతూ వస్తున్నాయి... ఇక రాజధానిగా ప్రకటించటించగానే... మన పరిస్థితి ఏమిటా అని విజయవాడలో ఇప్పటికే ఉన్న పౌరుల బాధమొదలైయ్యింది...
అప్పుడే అవ్వాలిసింది...
ఇక విమర్శల విషయానికొస్తే,
విజయవాడని నిర్ణయించినది కుల రాజకీయమే అని...
అయితే, 1953లో జరిగింది కూడా అదే కదా...
విజయవాడలో రాజధానిని పెడితే అక్కడి ఒక కులం వారి వలన
మన రాజకీయం సాగదు అనీ,
[దానికి కమ్మ్యునిస్టుల రంగేసి]
తమ ప్రాబల్యం ఉన్న కర్నూలులోనే పెట్టారు...
కానీ, ఇప్పుడు ఆ సీను రివర్సు అయ్యింది...
రాజధానిని నిర్ణయించేవారు తారుమారు అయ్యారు...
ఫలితం కూడా తారుమారు అయ్యింది..
అంతేగానీ కొత్తగా జరిగిందేమీ లేదు.
ఇప్పుడు అయ్యింది....
రాజధానిని ప్రకటించేశారు...ప్రకటించిన వారికి రాష్ట్రంలోనే కాదు...దేశాన్ని నడిపే ఢిల్లీలోను ప్రాబల్యం ఉన్నది. కాబట్టి సభలో హుందాగా వ్యవహరిద్దాము... "ఇప్పుడు చూపించే దృశ్యాలని దశాబ్దాలపాటు చూస్తారు" అని అనుకోకుండా, సభలొ రాజధాని ప్రకటన సమయంలో ప్రతిపక్షం ఎంత గొడవ చెయ్యాలొ అంతా చేసిపారేసింది...ప్రతిపక్షం...గొడవ చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్న ధ్యాసేగానీ, ఫలానా చోట పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టాలి అనే విషయాలపై శ్రద్ద పెట్టలేదు... పైగా ప్రకటన అవ్వంగానే.... ఈ రాజధాని ప్రకటనని ఆహ్వానిస్తున్నామని...కేవలం తమకి చెప్పకుండా పెట్టకూడదనే అభ్యంతరం చెప్పామని... "ఇంతగోడవ ప్రజల కోసం కాదు, కేవలం రాజకీయం కోసమే అన్న విధాన"... ప్రతిపక్షం వారు తమ గొడవ వెనుక ఉన్న అంతరార్ధాన్ని వివరించేశారు...
ఇక అధికార పక్షం విషయానికొస్తే... మేము అన్ని విధాలా బలంగా ఉన్నాము ఒకరికి చెప్పేదేమున్నది...అన్న చందాన...ఆ పార్టీలోని మంత్రులే కాకుండా ఏం.ఎల్.ఏ.ల దగ్గర నుండి కార్యకర్తలుదాకా అందరూ అసలు విషయాన్ని నెల రోజుల నుండే పైకి చెప్పేశారేగానీ, ప్రకటన చేసే ముందర రోజు అయినా, ప్రతిపక్ష నేతని పిలిచి "ఇదీ విషయం ... రేపు మేము ప్రకటన చేస్తున్నాము...మీ మద్దతు ఇవ్వండి" అని ఉంటే.. ప్రకటన చేసే టైములో ప్రశాంతంగా పద్దతిగా ఉండి...ఆ దృశ్యాన్ని మళ్ళి మళ్ళి చూసే వారికి ఎటువంటి బాధ కలగాకుండా ఉండేది కదా...!!!
పెళ్ళిలో గొడవ జరిగితే, తరతరాలుగా గుర్తు ఉంచుకొని, ఆ కుటుంబంలో గొడవలకి అది మూలం ఎలా అవుతుందో ... అలాగే, ఈ గొడవ ప్రభావం మన రాష్ట్ర భవితవ్యంపై ఉండకుండా...మళ్ళీ మళ్ళీ కెలుక్కోకుండా...ఇకనైనా అధికార ప్రతిపక్షాలు తాము సంయమనంగా ఉండి...ప్రజల మధ్య సంయమనం ఉండేట్లుగా చేస్తే, మన ఆంధ్రప్రదేశ్ త్వరలోనే అభివృద్ధి చెందుతుంది.
@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@
ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@
ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి