"అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" అనేది సామెత...అత్త సొమ్ము అల్లుడి దానం చేసినా... అది తన స్వంత ప్రయోజనం కోసం చేసినట్లు సామెతలో కూడా చెప్పలేదు..ఆ సామెతని మించి పొయ్యారు మన బాబుగారు...తన స్వప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అధికారాల్ని దుర్వినియోగం చేసి, తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో ఉన్నారు అయ్యగారు...ఇలాంటి దాని గురించి గురించి ఎన్నికల ముందే[7-3-2014] "సీమాంధ్రకు ముంచుకొస్తున్న అసలైన కష్టం..." [లింకు నొక్కండి] అని వ్రాయటం జరిగింది
బొమ్మ కర్టేసి: సాక్షి
బాబుగారు కరెంటు ఇస్తారుట....వేట్ వదులు కుంటారుట...అసలే లోటు బడ్జెట్టుతో ఉన్న ఏపి ని పట్టించుకోకుండా తన పార్టీ పటిష్టం చెయ్యటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు బాబుగారు......ఎవరి బాబుగాడి సొమ్ము...అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు...."సొమ్ము ఆంధ్రాది..సోకులు తెలుగుదేశం పార్టీకా"... టి.ఆర్.ఎస్ ది కూడా తెలుగుదేశం స్కూలేనంట...బహుశా అందుకనే ఇక్కడి ముఖ్యమంత్రి అయి కూడా... సీమాంధ్రకీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు...అక్కడి నుండి ఏమీ అడగనవసరం లేదు...[అడిగే టైములో మీరందరూ విదేశీయానంలో బిజీగా ఉన్నారనుకోండి...]ఇక్కడివి పోకుండా చూడండి చాలు... చూడబోతే...మీకు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండకుండా అక్కడ ప్రతిపక్ష నేతగా ఉంటేనే బాగున్నట్లుంది....
కనీసం విభజన చట్టాన్ని చూడనుకూడా చూడకుండానే
ముఖ్యమంత్రిగా అయిన తరవాతే
జై రాం రమేష్‌గారి దగ్గర చట్టం ప్రతిని
తెచ్చుకున్నారు మన బాబు గారు...
పైగా ఆంధ్రాకి ఎవరో అన్యాయం చేస్తున్నారుట...వారి సంగతి సరే వాళ్ళు బయటివారు; పైగా మార్వారీ వ్యాపార వేత్తలు, లాభం లేనిదే ఏమీ చెయ్యరు...మరి అయ్యా బాబుగారు మీరు చేసిందేమిటి...దిల్లికి పోయినప్పుడల్లా...తెలుగు రాష్ట్రాలకి న్యాయం అంటిరి....అది ఏ రాష్ట్రమో తెలియక అసలుకే మోసం వచ్చింది...అయినా ప్రక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దాని గోల మీకేల...బాబూ... ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అడిగితే వాళ్లకి తప్పించుకునేందుకు సాకు దొరకదు...
బాబుగారు... కనీసం తన రాష్ట్రం పిల్లల చదువులకి కూడా సహకరించని అక్కడి ప్రభుత్వంతో స్నేహానికి ఎందుకు తాపత్రయ పడుతున్నారు...? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇల్లు వాకిలి లేకుండా, ప్రభుత్వ నిర్వాహణకే డబ్బులు లేక అల్లాడుతుంటే , మీరు వరాలు ఇతరులకి ఇవ్వటం ఏమిటి...? ఇది ఎలా ఉన్నదంటే స్వంత దేశంలో ఖర్చు పెట్టాలంటే లెక్కలు చెప్పే ప్రధానమంత్రి-ఆర్ధిక మంత్రులు నేపాలు-బురిండి లాంటి దేశాలకు వేల కోట్లు దానం చేసినట్లు ఉన్నది...వారికి మీకు తేడా ఏమున్నది... అదీకాక తమ రాష్ట్రం ధనవంతపు రాష్ట్రం అని ఆ ముఖ్యమంత్రే అంటుంటే...బాగోలేని ఆంధ్రప్రదేశ్ వంక చూడకుండా స్వప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలని నాశనం చేస్తున్నారు ... మనసొక చోట...మనువొక చోట అన్నట్లున్నది ఈయనగారిని చూస్తే...ఇలాగే పనిచేస్తే రెండికి చెడ్డ రేవడిలా..ప్రతిపక్షానికి కూడా పనికిరాని పార్టిగా మిగిలిపోతారు...
చివరిగా "తెలుగు రాష్ట్రాల" బిజేపి వారికి...మీకేం కావాలో అడగండి.. అంతేగాని మరొకళ్ళకి ఇవ్వద్దు అనే దిక్కుమాలిన రాజకీయం చెయ్యకండి...అది రాజకీయ కనీస మర్యాద కూడా లేని వాళ్ళు చేసే పని...కాంగ్రెస్సు ఎలాంటి రాజకీయం చేసినా... ఇప్పుడు మీరు చేసే రాజకీయం ముందర దిగదుడుపే...ఇదే మీకు మొదటి అవకాశం...దీనిని దుర్వినియోగం చేసుకుంటే...ఇదే చివరి అవకాశం అవుతుంది... దేశ ప్రజలు మీ పార్టీ మీద ప్రేమతో మీకు ఓటు వెయ్యలేదు..మీ మోడీ గారిని చూసి ఓటు వెయ్యలేదు...కాంగ్రెస్ రాజకీయం నచ్చక వేరే దిక్కులేక మీ మాటల వలలో పడి మిమ్మల్ని కేంద్రంలో నిలబెట్టింది... సరిగా నిలబడి సరియిన అడుగులు వేస్తే సరి; లేకపోతే మళ్ళా ప్రతిపక్ష పార్టీగా...బాధ్యతలేని మాటలు మాట్లాడుతూ హాయిగా గడిపెయ్యచ్చు...బహుశా మీకు అదే బాగుంటుందేమో....
రాజకీయాలు మానండి...
పార్టీల భవిష్యత్తు కోసం కాదు
దేశ భవిష్యత్తు గురించి పనిచెయ్యండి...
@@@@@@@@@@@@@@@@@
జై హింద్
@@@@@@@@@@@@@@@@@@
కర్టేసి: ఇందులో బొమ్మలన్నీ సాక్షి-ఈనాడు-టీవీ 9 లోనివి
@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@
ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివే...
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి